Home » Mainanpati bhaskar » Bhama Kalapam

 

    అప్పటి దాకా డైస్ మీద ఒక మూలగా నిశ్చలంగా ఉన్న ఆర్కెస్ట్రా, "కంగ్రాచ్యులేషన్స్ అండ్ సెలబ్రేషన్స్!" ఆన్న పాత క్లిప్ రిచర్డ్ పాట అందుకుంది అకస్మాత్తుగా. ఆ ఏర్పాటు ముందే చేసి ఉంచాడు సారధి.


    గొంతు సవరించుకుంది సీత. "సుదీ! మన కుటుంబంలో ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క లైను డామినేట్ చేస్తున్నాం. నేను పాలిటిక్సులో ఉన్నాను. మీ డాడీ ఎక్సైజ్ కాంట్రాక్టరు. మీ బాబాయి వ్యవసాయం చూసుకుంటున్నారు. పోలిస్ సబిన్స్ పెక్టరుగా ఉండే మా తమ్ముణ్ణి మెల్లిగా పోలిస్ కమిషనర్ గా లాక్కొచ్చాం. మీ పెదనాన్నగారు జిల్లా జడ్జి. మన సారధి లాయరు. సొసైటి నంతా మన గుప్పిట్లోకి తెచ్చుకుంటున్నాం, సుదీరా! ఈ హొటల్ బిజినెస్ మొత్తం నీకే. దీనిలో నీకు ఎదురు ఉండదు. తిరుగు ఉండదు"

 

    ఒంగి సీత చెంపను పెదాలతో సున్నితంగా స్పృశించింది సుదీర. "థాంక్స్ మామ్" పరశంగా ఉంది. సుదీర మనసు. సో.......ఇన్నాళ్ళుకు తన కలలు నిజమవుతున్నాయన్నమాట.


    జీవితానికి గమ్యమేమిటో నిర్ణయించుకోవడం , దాన్ని చేరుకోవడానికి అవసరమైన చదువు చదువుకోవడం, ఆ చదువు పూర్తయిన వెంటనే ఇంత భారీ ఎత్తున అమలులో పెట్టడం అందరికి సాధ్యమవుతుందా?

 

    తన ఈడు అమ్మాయిలు చాలామంది ఎంతటి నిరర్ధకమైన చదువులు చదివి, ఆ చదువుకి చేస్తున్న పనికి బొత్తిగా సంబంధం లేని గానుగెద్దు ఉద్యోగాలలో సెటిలయిపోయారో తెలుసు సుదీరకి. సైనులో మాస్టర్స్ డిగ్రీ వున్న సుమతి అకౌంట్స్ దిపర్టుమెంటులో ఎల్టిసి, ఎమ్ కామ్ చదివిన లక్ష్మి ఏదో చిన్న కంపెని తాలూకు పొడక్స్ ని ఇంటింటికి తిరిగి అమ్మే సేల్స్ గర్ల్.


    తను భారీ ఎత్తున హోటల్స్ స్టార్ట్ చెయ్యాలని హైస్కులు రోజుల్లోనే అనుకుంది. అందుకు తగిన చదువు చదివింది. ఇప్పుడు స్టార్ హొటలు తో బిజినెస్ మొదలెడుతోంది. తన జీవిత లక్ష్యాన్ని చేరుకోబోతోంది.


    అయితే, మనసులో ఏ మూలో సన్నగ అసంతృప్తి . అంతేనా జీవితానికి లక్ష్యం వ్యాపారమూ, సంపాదనేనా! అంతే? వేరే అక్కర్లేదా?

 

    ఎందుకు అక్కర్లేదు? జీవిత లక్ష్యం సాధించడంతో బాటు , ఈ జీవితాన్ని తనతో పంచుకుని రసభరితంగా చెయ్యడానికి జంట కావలి.


    కానీ, ఎవరూ?"

 

    కొద్దిక్షణల తరవాత ఆలోచనలో నుంచి బయటపడి, తన ఆస్తిని పరిశీలనగా చూసుకునే యజమాని దృక్పదంతో రెస్టారెంట్ ని పరికించి చూసింది. చెయ్యవలసిన మార్పులని, చేర్పులని మనసులోనే గబగబ నోట్ చేసుకుంది. ఇంటిరియల్ డేకోరేషన్ అంత బాగా లేదు. రెస్టారెంట్ లో ఎరుపు రంగు బాగా సుటవుతుందని అంటారు. ఎరుపు ఆకలిని ప్రేరేపిస్తుందిట. కుర్చీలు మరి సింహాసనాల్లా వున్నాయి. మార్చేసి, అల్ట్రా మోడరన్ ఫర్నిషింగ్ తెప్పించాలి. బేరర్ల యూనిఫారాలు జేబు దగ్గర మాసి వున్నాయి. అది హొటలు ప్రిస్టేజిని దెబ్బ తీస్తుంది. ఒక బేరరు మూలగా నిలబడి పళ్ళు కుట్టుకుంటున్నాడు. చేతులు కడుక్కోకుండా అలానే సర్వ్ చేస్తాడేమో! ఒక బేరరు చాలా మాన్లిగా , పెద్ద పెద్ద మీసాలతో స్మార్టుగా కనబడుతూ చాలా చాకచక్యంగా పనులు చేసుకుపోతున్నాడు. వీళ్ళలో కొంతమందికి ఇంక్రిమెంట్లు ఇవ్వాలి. కొంతమందిని ఇంటికి పంపించేయ్యాలి.


    చిటికే వేసి స్టివార్డ్ ని పిలిచింది.

 

    స్టివార్డ్ వచ్చి వినయంగా వంగి నిలుచున్నాడు. అతనికి తెలుసు. ఈ అమ్మాయి తమ కొత్త యజమానురాలని!


    "వైన్ లిస్ట్ తీసుకురా!" అంది సుదీర. వైన్ లిస్ట్ రాగానే దాన్ని పరిశీలించి, "పింక్ షాంపేన్" తెమ్మంది.


    ట్రేలో బాటిల్సు గ్లాసులు వచ్చాయి.


    "తీసుకోండి డాడ్! మా హొటలు వారి కంప్లిమేంట్స్ తో ఈ షాంపేన్ మీకు ఇవ్వబడుతోంది" అంది నవ్వుతూ.


    చేపకు ఈదడం సహజంగానే వచ్చేసినట్లు ఆ అమ్మాయి అంత త్వరగా తన కొత్త పాత్రకు అలవాటు పడిపోవడం తల్లితండ్రులకి సంతోషం కలిగించింది.

 

    "షాంపేన్ బాగుందో , లేదో చెప్పండి!" అంది సుదీర.


    రత్నాకరరావు గ్లాసు ఎత్తి గబగబా నాలుగు చుక్కలు తాగి, "మంచి సరుకు!" అన్నాడు.


    సారధి తన పెదవుల మీద చిరనవ్వు కనబడకుండా, పేపరు నాప్ కిన్ ను అడ్డం పెట్టుకున్నాడు.


    జాలిగా చూసింది సుదీర. "మై పూర్ డాడీ! షాంపేన్ రుచి చేసేది అలా కాదు. ఇలా! అంటూ గొబ్లేట్ ఎత్తి కొద్దిగా నోట్లో పోసుకుని, మింగకుండా నోట్లోని ద్రవాన్ని అటూ ఇటూ కదిలించింది. తరవాత లేచి వాష్ బేసిన్ దగ్గరికెళ్ళి ఉమ్మేసి వచ్చింది. "షాంపేన్ రుచి చూసేవాళ్ళు అలాగే చేస్తారు డాడీ! నోట్లో పోసుకుని కాసేపు అటూ ఇటూ తిప్పి, తరవాత ఉమ్మేయాలి. ఆఫ్ కోర్స్! కస్టమర్స్ అలా చెయ్యనక్కర్లేదనుకో, నేను యజమానిగా అలా రుచి చూశాను."


    "ఇంతకీ ఎలా వుంది పాపా?" అన్నాడు రత్నాకరరావు ఉత్సాహంగా.


    ముక్కు చిట్లించింది సుదీర. "ఉత్త చెత్త! బార్ లో ఎవరో ఎక్కడో మోసం చేస్తున్నారు. వాళ్ళెవరో కనిపెట్టి తగిలేయ్యాలి."

 

    "డ్రమ్ములో కిరసనాయిలు పోసినట్లు తాగడమే గానీ, మంచి చెడ్డా తెలియక పొయ్యే" అంది సీత సుతారంగా అంటిస్తూ.

 

    "నాటు సారా కాంట్రాక్టరుకి ఫారిన్ సరుకు రుచి ఎట్లా తెలుస్తుంది? ఇంక వదిలేయ్!" అన్నాడు రత్నాకరరావు.


    "మమ్మీ!" అంది సుదీర కొంచెం గారాభము, కొంచెం సిగ్గూ కలిసిన గొంతుతో.

    
    "ఏమిటి పాపా?"

 

    "ఈ హేపీ మూడ్ లోనే నేను కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నాను.'

 

    అందరూ ప్రశ్నార్ధకంగా , చిరునవ్వుతో చూస్తున్నారు.


    "నేను మారేజ్ చేసుకుందామనుకుంటున్నాను మమ్మీ!"

 

    షాంపేన్ గుటక వెయ్యబోయిన సారధికి కోరబోయింది. గుండెలు గుబగుబలాడాయి. సుదీర తన భార్య అయితే బాగుండు! సుదీర తన భార్య అయి తీరాలి అన్న భావం అతనిలో గాడంగా, నిగుడంగా వుంది. ఇంకొంచెం వ్యవధి వుంటే  సుదీర తనని తప్ప మరొకళ్ళను చేసుకోవడానికి వీలులేని  పరిస్థితులు కల్పించి ఉండేవాడే. కానీ, ఇవాళ..........ఇంత అకస్మాత్తుగా .......


    "నేను భరత్ ని పెళ్ళి చేసుకుంటాను మమ్మీ!" అంది సుదీర బింకంగా. తన ప్రకటన కలిగించాబోయే సంచలనం ఎంతటిదో తనకు బాగా తెలుసు.


    చేతిలోని గొబ్లేట్ టేబుల్ మీద పెట్టేసి , నిటార్గా కూర్చున్నాడు రత్నాకరరావు. సారధి బిగుసుకుపోయాడు.

 

    ఒక్క క్షణం సేపు షాక్ తిన్నట్లు చూసినా అందరికంటే ముందే తేరుకుని, మొహాన నవ్వు పులిమేసుకుంది సీత.

 

    ఆమె రాజకీయ నాయకురాలు. అలా కాకుండా నాటకాల్లోనో సినిమాల్లోనో చేరితే, మహానటి' అని బ్రహ్మరధం పట్టి వుండేది ప్రజ.

 

    అయినా, ఆ రెండు వృత్తులకి చెప్పుకో దగ్గ తెడాలేదేమో!

 

    సుధీర అప్పటికి ఇంకా ఆ విషయాన్ని భరత్ కి కూడా చెప్పలేదు. అసలు అతన్ని అడగడం అంత అవసరం అని కూడా అనిపించలేదు తనకి. తన మీద తనకు అపారమైన నమ్మకం ఉంది సుదీరకి.


    "భరత్ ఎవరు?" అన్నాడు రత్నాకరరావు.

 

    "ఆ రోజు మన గార్డెన్ లో డాన్స్ చేశాడే ......అతను."

 

    "వాడా! అని విచారంగా తల వూపాడు రత్నాకరరావు. "వాడు పూటకి గతిలేని వాడు. తల్లి! వాణ్ణి చేసుకుంటే రూపాయకి, అర్దకి తడుముకుంటూ బతకాల్సి వస్తుంది నువ్వు. వద్దమ్మా! నేను నీకోసం చాలా పెద్ద సంబంధాలు చూస్తున్నాను సుదీరా?"

 

    "నిన్ను కోడలిగా చేసుకోవాలన్న ఆలోచన ఉన్నట్లు ఒక మినిస్టరు గారు కూడా చూచాయగా చెప్పారు." అంది సీత.


    "వాళ్ళతో పోలిస్తే ఇతను మర్రి చెట్ల మధ్య వెర్రి మొక్కలాంటి వాడమ్మా!"

 

    "డాడ్!"

 

    "నేనేం చేసినా, నువ్వు సుఖంగా ఉండాలనే తాపత్రయంతోనే చేస్తాను సుదీరా! యాభై లక్షలు పెట్టి ఈ త్రీ స్టార్ హొటలు కొనిచ్చాను నీకు. ఎందుకు? నువ్వు సుఖంగా సంతోషంగా ఉండాలని. అలాగే నీకు కోటి రూపాయలు కుమ్మరించయినా ఫైవ్ స్టార్ పెళ్ళి కొడుకుని తెచ్చి పెళ్ళి చేస్తాను. అంతే గానీ, ఈ కిరాయి కోటిగాడి లాంటి డాన్సరుతో , రెండొందలు, ముడొందలు రూపాయల కోసం కాళ్ళకు గజ్జెలు కట్టుకుని గంతులేసే వాడితో నీ పెళ్ళి ఎలా జరిపించనమ్మా? సుదీ! నువ్వు ఇంక చిన్నపిల్లవు కావు. తెలివిగా ఆలోచించు.


    కాసేపు మౌనంగా ఉండిపోయింది సుదీర. తరువాత తల్లి వైపు తిరిగి ప్రాధేయపూర్వకంగా అంది. "నువ్వయినా చెప్పు మమ్మీ! మీరిద్దరూ తలుచుకుంటే అతన్ని, అతని కుటుంబాన్ని కూడా ధనవంతులని చేసెయ్యడం ఎంత పని?" అంది పొగిడేస్తూ.

 

    అచ్చం రాజకీయవేత్తగా సమ్మోహనంగా నవ్వింది సీత. "డబ్బుదేముందిలే!" అంది తేలిగ్గా. "ఏదో ఒక పద్దతి చూపిస్తే అతను కుప్పలు తెప్పలుగా సంపాదించేస్తాడు. పైగా మరో విషయం ఉంది."


    "ఏమిటి?" అన్నాడు రత్నాకరరావు, భార్య ఆలోచనలు చదవడానికి ప్రయత్నిస్తూ.


    కొంచెం సేపు ఆగి, తరువాత చెప్పింది సీత. "మన కుటుంబం లెక్కలేనంత డబ్బు సంపాదించింది. డబ్బుతో బాటు పరువూ, పవరు కూడా సంపాదించింది. ప్రతి లైనులో, ప్రతి వృత్తిలో కూడా మన వాళ్ళని పైకి తీసుకు వచ్చాం. దురదృష్టవశాత్తూ మన కుటుంబంలో లేని దొక్కటే! అది కళ! కళ డబ్బుతో కోనేద్దామంటే దొరికేది కాదు. పూర్వజన్మ సంస్కారం ఉండి, సంవత్సరాల తరబడి శ్రమపడి, కృషి చేస్తేనే తప్ప అబ్బదు.


    నిర్మొహమాటంగా చెప్పాలంటే మన వాళ్ళలో ఎవరికి కళ మీద అభిరుచిలేదు. మన కుటుంబంలో కూడా కళాకారులున్నారని మనం చెప్పుకోగలగాలంటే భరత్ లా రెడీమేడ్ గా ఉన్న కళాకారుల్ని మనలో కలుపుకోవడం తప్ప గత్యంతరం లేదు.


    పైగా, అతను బావుంటాడు. బుద్దిమంతుడు. అమ్మాయి ఇష్టపడింది. మనకి అభ్యంతరం ఎందుకుండాలో నాకు అర్ధం కావడం లేదు" అంది.


    "థాంక్స్ మమ్మీ! యూ ఆర్ సచ్ ఎ డియర్!" అని వంగి , సీత భుజాల చుట్టూ చేతులేసి ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టింది సుదీర.

 

    "చూద్దాం" అన్నాడు రత్నాకరరావు, ఎటూ తేల్చకుండా.


    "అది మీ రాజకీయ నాయకుల ఉతపదం! నా దగ్గర ఇలాంటి ట్రిక్కులు లాభం లేదు. అటో ఇటో తేల్చి చెప్పండి" అంది సీత.


    "నీ మాట కాదంటే బతకనిస్తావా? అట్టాగే కానీ!"

 

    సీత సుదీరా సంతోషంగా మొహాలు పెట్టారు.

 

    అప్పటిదాకా ఉపిరి బిగబట్టి వాళ్ళ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న సారధికి తీవ్రమైన ఆశాభంగం కలిగింది. ఆ తరువాత చాలాసేపు అతను చలనం లేకుండా కూర్చుండిపోయాడు.


    చిన్నప్పటి నుంచి అనాధగా పెరిగాడు అతను. సీత చేరదీస్తే ఆమె ప్రాపకంలో పెరిగి పెద్దవాడయ్యాడు. ఇన్నాళ్ళకు మళ్ళీ తను ఏకాకినని, దిక్కు లేని వాడినని భావన కలిగింది అతనికి.


    ఆ రాత్రి సారధికి నిద్ర పట్టలేదు. పరుపు మీద అసౌకర్యంగా దొర్లుతూ తన జీవితాన్ని అంతా ఒకసారి గుర్తు తెచ్చుకున్నాడు.

 

    తనని కని పడేసిన వాళ్ళెవరో తనకే తెలియదు. అనాధాశ్రమంలో పెరిగాడు. ఏమి ఇవ్వకపోయినా, అన్నిటి బదులుగా తెలివితేటలు మాత్రం పుష్కలంగా ఇచ్చాడు దేవుడు. చదువులో బ్రిలియంట్ తను.

 

    రత్నాకరరావు సారా వ్యాపారంలోకి దిగి, పాపాలు చేసి, పిపాల కొద్ది డబ్బులు సంపాయించి, ఆ డబ్బుని అన్నిటికన్నా లాభసాటి వ్యాపారం అయిన రాజకీయాల్లోకి మళ్ళించి పవరుగా మార్చుకుని, సీతని పెద్ద పొలిటిషియన్ గా తాయారు చేశాక - ఆ అనాధశరణాలయం వార్షికొత్సవం లో ప్రైజులు డిస్ట్రిబ్యూట్ చెయ్యడానికి ఆహ్వానించారు సీతఃని.

 

    వరసగా నాలుగు ప్రైజులు తీసుకున్న ఒక కుర్రాడు ఆమె దృష్టిని ఆకర్షించాడు. ఇతని కళ్ళల్లో తెలివితేటలు కనబడుతున్నాయి. సూదంటురాళ్ళలా ఉన్నాయి అతని చూపులు. చెంపల మీద కత్తిగాటు లాంటి మచ్చ ఉంది.


    అది కత్తిగాటు కాదని సారధికి మాత్రమే తెలుసు. తన చిన్న కడుపు నిండక, అన్నం మరోమారు వడ్డించమని అడిగితే, అనాధాశరణాలయంలోని వంటవాడు మండిపడి కంచం ఎత్తి మొహాన కొట్టాడు. అంచు కోసుకు పోయి బుగ్గ తెగింది. నీళ్ళ పులుసు కళ్ళలో పడి కన్నీళ్ళు తెప్పించింది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra