Home » Polkampalli santhadevi » మణిదీపం

    "ముగ్గురు పిల్లలలో ఆమె బయటికి వచ్చి ఎలా బ్రతకగలదు?"

    "కార్మిక కర్షకుల్లో భర్త పోతే పిల్లల్ని తమ రెక్కల కష్టంతో పోషించుకునే ఆడవాళ్ళని నేను చాలామందిని చూశాను."

    "పోషించడం లెక్కకాదు. నాలుగిళ్ళలో పాచిపని చేసి పోషిస్తుంది. ఆమెకూ, ఆమె పిల్లలకూ గౌరవం, భద్రత కూడా ముఖ్యమే కదా? పిల్లలు తండ్రి దగ్గర పెరిగితే గౌరవం వేరు. భర్తను విడిచిన ఆడదాని దగ్గర పెరిగితే అంతా చులకనగా చూస్తారు. మంచి పోషణ, మంచి చరువులు, సమాజంలో గౌరవం కావాలంటే వాళ్ళు తండ్రి దగ్గర పెరగడమే మంచిది కదా?" అర్చన అంది.

    "అవ్వా కావాలి! బువ్వా కావాలి అంటే ఎలా? మనిషికి ఆత్మ గౌరవంకంటే మించినది లేనప్పుడు ఆమె బయటికి వచ్చేయాలి! తన కాళ్ళమీద తను నిలబడి తన పిల్లల్ని పోషించుకోవాలి."

    "హైందవ స్త్రీ అంత తేలిగ్గా తాడు తెంచుకోలేదు కదా? మన స్త్రీలు వివాహబంధానికి యిచ్చే గౌరవం ఎందరి ప్రశంసలతో నోచుకుంటూంది. ముఖ్యంగా, తుమ్మితే విడాకులు, దగ్గితే విడాకులు తీసుకొనే పాశ్చాత్యులు సైతం మన కుటుంబ వ్యవస్థని, వివాహబంధానికి మనం ఇచ్చే ప్రాముఖ్యతనీ హర్షిస్తుంటే_మనమే దాన్ని అధోగతికీడిస్తే ఎలా?"

    "వివాహబంధాన్ని గౌరవించాల్సిందే! కానీ ఎంతవరకు? ఆ బంధమే ఆడదాని మెడకు ఉరితాడుగా మారనంతవరకు! ప్రాణం పోయేంత వరకు ఆ బంధాన్ని పట్టుకు వేలాడమని ఎవరు చెబుతారు? చెప్పారంటే వాళ్ళు గాడిదలనుకోవాలి. ఈ దేశంలో ఆడవాళ్ళు దేశాన్ని రాష్ట్రాల్ని పరిపాలిస్తుంటే ఈ దేశంలో ఒక ఆడది కిరాతకుడయిన భర్తను వదిలించుకొని స్వతంత్రంగా తన బిడ్డల్ని చదివించి పెంచుకోలేదా? ఆ విశ్వాసం అలాంటి ఆడవాళ్ళకి మనం కలిగించాలి. వాళ్ళని అధైర్య పరచకూడదు. నిరుత్సాహపరచకూడదు."

    అర్చన అంది_ "నన్నడిగితే ముందు ఆడకూతుళ్ళను కన్న తల్లిదండ్రుల్లో మార్పు రావాలంటాను. పెళ్ళిచేసి నాలుగక్షింతలు నెత్తిన వేసి పంపిస్తే సరికాదు. అంతా సవ్యంగా వుంటే అవసరం వుండదుగానీ, అత్తిల్లు చెరసాల అయినప్పుడు,ఆ బంధాన్ని తల్లిదంద్రులే భగ్నపరిచి తమ ఆడపిల్లలకు మరో కొత్తబాట, కొత్త జీవితం అందించే సంస్కారం అలవరచుకోవాలి! అంతేగానీ చావైనా బ్రతుకయినా అక్కడే అంటూ సుభాషితాలు చెప్పి తామే తమ పిల్లలకు అత్తవారిల్లు అనే సాలెగూడు నిర్మించి ఇవ్వకూడదు. తిరిగివచ్చే ఆడపిల్లకి పుట్టింట్లో స్థానం యివ్వాలి! ఆమె జీవించే అవకాశం కలిగించాలి! అరుణా! నువ్వేమంటావు?"

    అరుణోదయ కళ్ళు చురుగ్గా మెరిశాయి. "భర్తను విడిచి స్వతంత్రంగా బతకమని చెప్పడం ఒకప్పుడు అభ్యుదయం ఏమోగానీ యిప్పుడు కాదు! స్వతంత్రం పేరుతో ఆమె అష్టకష్టాలు పడాలి! ఇది వదిలిపోయిందే చాలని వాడు టింగ్ రంగా అంటూ మరోదాన్ని పెళ్ళి చేసుకొనో, లేక వుంచుకొనో కులకాలి. మీరు చెప్పే పరిష్కారానికి సరిగ్గా వచ్చే ఫలితమిది. యిన్ని బాధలు పెట్టే మగవాడిని అంత తేలిగ్గా ఎందుకు వదలాలి? ఒక ఆడది అబలగావున్నంతవరకే మగవాడు స్వారీచేస్తాడు. అదిశక్తిగా మారితే అతడి ఆటలు సాగవు. నాకేం దారి అని పల్లవి అంత బేలగా అనుకోవడం ఎందుకు? తనో శక్తిగా విజ్రుంభించితే అతడు ఆగగలడా ఆమె ముందు? తన తప్పేమీ లేకుండా తనను బాధించే హక్కు అతడికి ఎవరిచ్చారు?"

    అరవింద్ చప్పట్లు కొట్టాడు ఆమె వాదనకు ముగ్దుదైనట్లుగా.

    "అలా ప్రశ్నించే అవకాశమే యివ్వడు! ఆడదాన్ని బాధించడం. అధికారం చెలాయించడం తమ జన్మహక్కుగా భావిస్తారు చాలామంది మగవాళ్ళు. ఏం చేసినా మారని పట్టుకొని,నువ్వే పల్లవివైతే ఏం చేస్తావో చెప్పు?" అంది అర్చన.

    "ఏం చేస్తానా? వాడికి పుట్టిన పిల్లల్ని వాడి మెడకే చుట్టి 'ఇహ తల్లీ తండ్రీ నువ్వే అయి పెంచరా' అని చెప్పి బయటపడతాను."

    "తల్లి ప్రేమను అంత తేలిగ్గా చంపుకోగలవా?"

    "ఒక మగాడికి బుద్ది చెప్పడం కోసమైనా చంపుకోగలను."

    "కానీ ఈ కన్న ప్రేమే చాలామంది ఆడవాళ్ళ కాళ్ళకు బంధమైంది తెలుసా?"

    "ఎందుకు తెలియదు? ఆడదాని బలహీనత ఎక్కడో మగాడికి తెలుసు. కాబట్టే దాన్ని ఆధారంగా తీసుకొనే ఆమెను అణగదొక్కుతున్నాడు. తనెన్ని బాధలు పెట్టినా పిల్లల కోసం వుంటుందన్న దైర్యమే లేకపోతే యింతమంది మగవాళ్ళు ఇందరి ఆడవాళ్ళ ఉసురు పోసుకొనేవాళ్ళు కాదు! ఎందరో ఆడవాళ్ళు ఎన్నో బాధలు పడుతూ కూడా కాపురాలు చేస్తున్నారంటే అది పిల్లల కోసమే!"

    "ఆడదాన్ని కట్టివేస్తున్న ఆ సెంటిమెంటే శ్రీరామరక్ష అయ్యి ఎందరో పిల్లల్ని రోడ్డుమీద పడకుండా కాపాడుతోంది! తండ్రి దుర్మార్గుడయి, తల్లి నిరాదరణ చేస్తే ఆ పిల్లల భవిష్యత్తు ఏమిటి?" అడిగింది అర్చన.

    "అందుకే కదా నేను చెప్పేది, కాపురం కూల్చుకోవడం అభ్యుదయం కాదని! యింట్లో ఒక్క మగాడితో నెగ్గలేనిది బయటికి వచ్చి సమాజంతో ఏం నెగ్గుతుంది? వుండి చక్కదిద్దుకోవడమే గొప్ప! అతడికి అణిగి మణిగి అతి విధేయతలు చూపి కాదు. ఆత్మబలంతో అతడిని గెలవాలి! నేను నీకంటే తక్కువేమీ కాదని అడుగడుగునా చెప్పగలగాలి! మన సమాజంలో వున్న ఒక చెడు ఏమిటంటే, ఎవరయినా ఒక స్త్రీ కాపురం చెయ్యలేక వదులుకొంటే తలా ఒక రాయి ఆమె మీద వెయ్యడానికి రెడీ అవుతారేగానీ ఆమె కాపురం సజావుగా సాగడానికి తమ వంతు బాధ్యతను మాత్రం నిర్వహించరు. అవతలి వాళ్ళ సంసార విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదనుకొంటారు. పిల్లనిచ్చిన తల్లిదండ్రులు కూడా జోక్యం చేసుకోరు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra