Home » Kommanapalli ganapathi rao » అరణ్యకాండ

    కేవలం  ఇదే  ఆలోచనతో  సాగుభూమివేపు  నేలకి  చాలా  తక్కువ ఎత్తులో వున్న  ఓ సింధూర వృక్షాన్ని  ఎన్నుకున్నాడు.

    సమతలంగా  వున్న  ప్రదేశంలో  ఆవు  కళేబరంతోపాటు  మేక కూడా  స్పష్టంగా  కనిపించే  ప్రాంతంలో  వున్న  చెట్టు  మాటేయడానికి  అనుకూలంగా  వున్న  మాట  నిజమే  అయినా, ఒకవేళ  చిరుత  మేకకంటే  ముందు  తనను  గమనిస్తే  పర్యవసానం  మరోలా  ఉంటుంది.

    ఈ విషయాన్ని  ముందుగా  ఆలోచించే  పల్లెనుంచి  రెండు  పొడవైన  చేంతాళ్ళని  కూడా  తీసుకొచ్చాడు. పొడవుగా  ఎదిగిన  తుమ్మముళ్ళను  ముళ్ళ  కంచెల్ని  చెట్టు  మొదలుకు  చుట్టూ  కుప్పలుగా  పేర్పించి కొమ్మల ఎత్తువరకూ  వచ్చేక  వాటిని  తాళ్ళతో  కట్టేయమన్నాడు.

    ఇప్పుడు  కేవలం  అతని తల  భాగం  మాత్రమే  బయటికి  కనిపిస్తోంది. ఒకవేళ  చిరుత  అతడిపైకి  లంఘించే  ప్రయత్నం  చేసినా  ముళ్ళు  దాని  శరీరాన్ని  గాయంచేసి  గమనాన్ని  నిరోధిస్తాయి.

    ఉన్న  పరిమిత  కాలంలో  చాలా  తొందరపాటుతో    అలాంటి  నిర్ణయం  తీసుకున్నాడు చైతన్య. ఏ క్రూరమృగాన్నయినా  హతమార్చాలంటే  ప్రత్యేకమయిన  పద్ధతులంటూ లేవు.

    ఒక్కో వేటగాడు  ఒక్కో  సమయంలో  ఒకో రకమైన  నిర్ణయాలు  తీసుకుంటాడు. ఫలితాన్నిబట్టి  తప్ప  నిర్ణయం  సహేతుకమైనదా, నిర్హేతుకమైనదా  అన్నది  తేల్చుకోలేరెవరూ.

    అంతా  పూర్తయ్యేక, చీకటి పడుతుండగా  మేక  నోటికి  బిగించిన  తాడు  విప్పి  పల్లెకి  వెళ్ళిపోయారు  యువకులంతా. చాలా  గట్టిగా  మాట్లాడుకుంటూ  వెళ్ళమని  చైతన్య  చెప్పడంలోని   ఉద్దేశం....ఒకవేళ గిరిజనుల్ని  చిరుత  గమనించినా, క్రమంగా  వారి మాటలు  నిశ్శబ్దంలో  కలిసిపోయేసరికి  తన కార్యక్రమంలోకి  దిగడానికి  సిద్ధపడుతుంది.

    సూర్యుడు  అస్తమించి  గంట దాటింది.

    క్రమంగా  చీకటి  అడవిని  దుప్పటిగా కప్పింది.

    మేక అరుస్తూ  కట్టును లాక్కుని  ప్రయత్నం  చేస్తోంది ఉండి  ఉండి.

    కీచురాళ్ళ  రొదని  మించి  ఎక్కడో హెచ్చరికలా  వదురుపిట్ట కేక పెడుతోంది.

    వేటగాడి  ప్రయత్నంలో  ప్రమాదకరమయిన  మొదటి అధ్యాయం యిదే....

    వేటాడడమా, వేటాడబడడమా  అన్నది ఇక్కడ  తీసుకునే  నిర్ణయాలపైనే  ఆధారపడి   వుంటుంది.

    ఆకాశంలోని  చంద్రుడు  ఇంకా  కాంతిని  పుంజుకోలేదు.

    కళ్ళు  చిట్లించి  చీకటిలోకి  చూస్తున్నాడు చైతన్య.

    అతడు  కూర్చున్న  సింధూరపు  కొమ్మల్లోని  ఓ వడంగ్రి పిట్ట బెదురుగా  రెక్కలు  కొట్టుకుంది. క్రింద  ఏదో జంతువు  కదలికని  సూచిస్తూ.

    డబుల్  బేరల్  గన్ పైకెత్తాడు  కొద్దిగా. రైఫిల్  బుల్లెట్ కన్నా చిరుతలాంటి క్రూరమృగాన్ని  ఉన్నపాటున పరిమార్చగలిగేవి  రావ్వల్లా  విడిపోయే కార్డ్రిడ్జెస్  అన్న  భావంతో  అతడు  డబుల్  బేరల్ గన్ తీసుకొచ్చాడు.

    హటాత్తుగా  అంతటా  నిశ్శబ్దం  ఆవరించింది.

    సంచలనాన్ని  రేపిన  పరిసరాలు  వున్నట్టుండి  అంతే  హఠాత్తుగా  సద్దుమణగడం  వేటగాడి  గుండెలో  ఎంతటి  గగుర్పాటును  రేపేదీ అనుభవ పూర్వకంగా  తప్ప  తెలుసుకోలేని  విషయం.

    ఏదో ప్రమాదాన్ని  పసిగట్టినట్టు  ఉచ్చ్వాస  నిశ్వాసాల్ని  నిగ్రహించుకున్న  చైతన్య  ఒక్క మాటుగా  తను  కూర్చొన్న  చెట్టు ముందుకీ, వెనక్కీ  ఊగడంతో  చుట్టూ  చూశాడు.

    అతడు  ఊహించని  పరిణామ మది.

    చప్పుడు  చేయకుండా  ఎలా  వచ్చిందో, ఏ పక్కనుంచి  వచ్చిందో  మరి....చిరుత  అతడికి  వెనుకగా  చెట్టుకుచుట్టిన  చేంతాడును  నోటితో  పట్టుకుని  ఆవేశంగా  లాగుతోంది.

    ప్రత్యర్ధిని  ఎలాగయినా  మట్టుపెట్టాలన్న  మొండితనాన్ని  ప్రదర్శిస్తున్న  చిరుతని  చూడగానే  సహజంగా  ధైర్యవంతుడైన  చైతన్యకూడా  చేష్టలుడిగి  అటే చూస్తూ  ఉండిపోయాడు.

    చెట్టుకొమ్మకి  ఇరుపక్కలా  కాళ్ళు  ఉంచి  అడవి దిక్కుగా  చూస్తూ కూర్చొన్న  చైతన్య వెనక్కి తిరిగి  తుపాకీ  ఉపయోగించే అవకాశం  లేదు. ఒకవేళ  ప్రయత్నించినా  సరయిన  ఆసరా  లేకుండా  కూర్చొన్న  తను బేలన్స్ తప్పి, ముళ్ళకంచెలపై  పడిపోయే  పరిస్థితిలో  ఉన్నాడు.

    నిముషాలు  క్షణాల్లో  గడిచిపోతున్నాయి. చిరుత అతని  నిస్సహాయ స్థితిని  అవకాశంగా  తీసుకుని  మరింత  ఉధృతంగా, చాలా వయొలెంట్ గా గుర్రుపెడుతూ  బాణాల్లో  పైకి  పొడుచుకుని  వచ్చిన  ముళ్ళ  కంచెల్ని బయటకు లాగుతోంది.

    అదురుతున్న  గుండెతో  వెనక్కి  తిరగాలని  ప్రయత్నిస్తున్నాడతను. సాధ్యం కావడంలేదు.

    చీకటిలో  చాలా  నిబ్బరంగా  వేటాడగలదు  చిరుత. పైగా  అది మనిషి రక్తానికి  అలవాటుపడినది. సమయానికి  ఎటువంటి  సహాయమూ అందని నిర్మానుష్య నిశీధిలో  మనిషి  చాలా బలహీనుడన్న  సత్యానికి  నిదర్శనంలా  చైతన్యలోని  ధైర్యం  పిపీలిక  ప్రమాణానికి  దిగజారిపోతోంది.

    తానెటువంటి  ప్రమాదంలో  చిక్కుకున్నదీ  అతడు  గుర్తించేలోగా  పళ్ళతో  ముళ్ళ  కంచెల్ని  పక్కకు  లాగేసిన  చిరుత  వెనుకగా  అతడిపై  లంఘించడానికి  మార్గాన్ని  సుగమం  చేసుకుంది....అంతే....

    త్రుటిలో  ప్రమాదాన్ని  పసిగట్టిన  చైతన్య  డబుల్  బేరల్ గన్ ను కొమ్మల మధ్యగా  పైకెత్తి  జాగ్రత్తగా  పక్కకు  తిరిగాడు, కాళ్ళు  కదపకుండానే.

    చిరుత  గాండ్రింపుతో  దూరంగా  పల్లెలోని  జనం  గుండె  లుగ్గ పట్టుకుని  ఏం జరుగుతున్నదీ  ఊహించలేని  స్థితిలో  ఎలాంటి  వార్త వినవలసి వస్తుందో  తెలియక  కూర్చొని  వున్నారు.

    ముళ్ళకంచెల  మాటున  నక్కుతూ  తన పనిలో  నిమగ్నమయిన  చిరుత  ఏ క్షణంలో ఏ పక్కనుంచి  పైకి  దుముకుతుందోనన్న  సందిగ్ధంతో  ట్రిగ్గర్ గార్డుపై  వేలినుంచి  కాళ్ళతో  కొమ్మను  బలంగా  అదిమిపట్టి  కూర్చొన్న చైతన్య  హటాత్తుగా  గాండ్రింపు  ఆగిపోవడంతో  ఆలోచనలో పడ్డాడు.

    అతని గుండె వేగంగా  కొట్టుకొంటూంది.

    గురి తప్పని  వేటగాడు  చైతన్య! ఎలాంటి  అంధకారంలోనైనా కేవలం  శబ్దాన్ని  ఆధారం  చేసుకుని  టార్గెట్ ను ఘాట్  చేయగల  ప్రజ్ఞ కలవాడు.

    ఇప్పుడు  హఠాత్తుగా  చిరుత  మౌనం  వహించడంతో  ధైర్యం మరింత సన్నగిల్లింది. సద్దుచేయకుండా  చీకటిలో  నక్కిన  చిరుత_తర్వాత  ఏం చేసేదీ, ఏ పక్క నుంచి  దాడిచేసేదీ  ఏ వేటగాడూ ఊహించలేడు. ఆ నిశ్శబ్దమే చాలా భయంకరమయినది.

    ముళ్ళకంచెలు  చెల్లాచెదురుగా  పడిపోయి  వున్నాయి. ఆ నిశీధిలో  ఏ పక్కనుంచయినా  మీదకి  లంఘించే  కుయుక్తుల్ని  ప్రదర్శిస్తుంది  చిరుత.

    నరాలను  ఉద్రిక్తతతో  నింపే  నిశ్శబ్దం.

    తుపాకీ  మజిల్ ను  ముందునుంచి  బట్ ను  కుడిభుజానికి  ఆనించి ఆ చీకటిలో  ఏ చిన్న  కదలికనయినా  పసిగట్టే ప్రయత్నం  చేస్తున్నాడతను.

    అంతసేపూ  మౌనంగా  వున్న  మేక  అంతలోనే  హఠాత్తుగా అరవడంతో  వెనువెంటనే  తల అటు తిప్పాడు.

    చీకటిలో  ఏదో ఆకారం  అమాంతం  మేకపై  లంఘించి ఒక్క ఉదుటున  దాని మెడను  పట్టుకుని  కట్టుత్రెంచి  మెరుపువేగంతో  లాక్కు పోతుంటే  చిరుత  తనకోపాన్ని  అటు మళ్ళించుకుందని  గ్రహించాడు.

    ఇరుకుగా  వున్న  కొమ్మల  పైనుంచి  తుపాకీ  అటు  తిప్పడానికి కొన్ని  సెకండ్ల వ్యవధి అవసరమైంది. ఎరగా  వాడుకుందామన్న  మేకను  అతడు  కాపాడుకోలేకపోయాడు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra