ఏమిటో సణుగుతూ వెళ్ళి గబగ బా ముఖం రుద్దేసుకుని పైట చెంగుతో ముఖం వట్టుకుంటు వచ్చింది. ఆమెని చూసి నీరు కారిపోయాడు మాధవ్. పైట మీద రవిక మీద అక్కడక్కడా సబ్బు నీళ్ళు చిమ్మాయ్. కుచ్చేళ్ళు కూడా కొంచెం కొంచెం తడిశాయ్. ఇలాయీవేశంతో నీళ్ళ భామలా వెడితే! భగవాన్!
ఇంకేం చేస్తాడు అతను, మళ్ళీ ఇహ ఏదైనా అంటే అసలే మొండి కేత్తితే అంతా రసాభాసమవుతుందనుకుని నిట్టూర్చి మరేమీ అనకుండా బయటికి వెళ్ళి అప్పటికే కాస్త ఆలస్యమయిందని అనుకుంటున్న వాళ్ళతో "వస్తోంది ఒక్క క్షణం కూర్చోండి" అని చెప్పి గదిలో కెళ్ళి కూర్చున్నాడు నిరాశగా.
ముఖాన కుంకుమదిద్దుకుని అలా అలా తల దువుకుని కుచ్చెళ్లు పైట చెంగు ఓసారి విదుల్చుకుని సరిచేసుకుని హాల్లోకి వచ్చేస్తూ "నమస్తే" అంది అందర్నీ వుద్దేశించి శ్రీదేవి.
వెంటనే అందరూ ఒక్కమ్మడిగా "నమస్తే" అన్నారు బదులుగా.
బాగా నలిగినా మంచి రంగూనాణ్యమూ వున్న చీరతో అలా అలా దువుకుని కొంచెం రేగిరేగని కురులతో తోచి తోచక సర్దుకున్న అలంకారంతో చిరాగ్గా అలా అలా దిద్దుకున్న కుంకుమ బొట్టుతో సహజంగా చాలా అందవతి అయిన శ్రీదేవి వాళ్ల కళ్ళకి అప్పుడు మరీ అందంగా కనిపించింది. ఆమె అలౌకికమైన అందాన్ని చూసి మూర్చ పోయినట్టు అయ్యారు అందరూ ఓ క్షణం సేపు.
ముందుగా తేరుకుని అంది ఆ రెండు జడల అమ్మాయి.
"చూడండి, యీ రోజుల్లో ఆడవాళ్ళకి కాలం గడపటం చాలా కష్టంగా వుంది. ఓ నలుగురు ఆడవాళ్ళు కలిసి మాట్లాడుకోవాలన్నా అడుకోవాలన్నా అంతా ఓచోట కూడటంలేదు, ఎక్కడో టౌన్ కి మూల మీరు మరో మూల ఇంకోహరు. ఇంకోమూల ఇంకొకరు యిలా తలోమూలా వుంటున్నారు చెదురుమదురుగా. పోనీ యిరుగు పొరుగుని కదిలిద్డామంటేమన టెస్ట్ కి జత అయిన వారు దొరకటం కష్టం.
అలా అని యీ వూళ్ళో లేడిస్ కి క్లబ్ అంటూ ఏది ప్రత్యేకంగా లేదు. అందుకని మనమంతా కలిసి ఓ చోట కలుసుకోవటానికి మాట్లాడుకోవటానికి ఏమైన చిన్నచిన్న ఆటలు ఆడుకోవటానికి ఓ కూడలి ఏర్పాటు చేసుకోవాలి మనం.
నాపేరు అరుణ. నేనిక్కడే ఉమెన్స్ కాలేజిలో బి.ఎస్సి. చదువుతున్నాను; ఆవిడ అరుంధతిగారు, మా కాలేజిలో ఫిజికల్ డిమాన్ స్త్రేటర్; ఈవిడ వసుంధర, ట్రైనింగ్ స్కూలు టీచర్ ఆవిడ ప్రభావతి గారు--ఆ స్కూలు హేడ్మిస్ట్రెస్; ఈవిడ యిక్కడి సమితిలో యస్.పి.ఓ. చింతామణి గారు. ఆ ప్రక్క నున్నావిడ అక్కడే హెల్త్ విజిటర్ చేస్తోన్న కృష్ణవేణి గారు. ఈ అమ్మాయ్ నా క్లాస్ మేట్ కృష్ణ. ఈ అమ్మాయ్ చంద్రకళని ప్రిన్సిపాల్ సర్వవతి గారి అమ్మాయ్ పి.యు.సి. చదువుతోంది. ఈవిడ పి.యు.సి. లో నా క్లాస్ మేట్ రమాప్రియ అని, ఇప్పుడు యం.బి.బి.యస్ చేస్తోంది.
మమెంతా కలసి ఓ లేడిస్ క్లబ్ స్తాపించాలనుకున్నాం. ప్రిన్సిపల్ గారిని అడిగి ప్రస్తుతానికి మా కాలేజిలోనే ఓ రూము ఏర్పాటు చేసుకున్నాం. ఆవిడ ఫారిన్ రిటర్న్ డ్ లెండి. ఇలాంటి వంటే భలే ఉత్సాహం!
క్లబ్ ఏర్పాటు చేసుకున్నాక యిలా తీరిక వేలలల్లో మేమందరమూ కలిసి బయల్దేరి ఎడ్యుకేటెడ్ ఉమేన్సి మెంబెర్స్ గా చేర్చుకుంటున్నాము. ఇష్టమున్న వాళ్ళంతా చేరేస్తున్నారు. దాదాపు ఏబైమంది దాకా చేరారు అప్పుడే.
మొదట ప్రాధమిక సభ్యత్వరుసుమని ఓ పాతిక వసూలు చేస్తున్నాం. దీంతో క్లబ్ కి కావలసిన వన్ని కొంటాం. మేగజైన్స్ అవి తెప్పిస్తాం. తర్వాత నెలనెలా చందా ఓ రూపాయి మాత్రమే.
అంతా అన్నారు కాబట్టి బాగా చదువుకున్న మీరూ యిందులో చేరుతారని ఆశిస్తున్నాము.
బట్టి పట్టినట్టు దాదాపు ఓ లెక్చర్ చెప్పినట్టు చెప్పేసి భారంగా ఉపిరి పిల్చుకుంది అరుణ.
ఆ అమ్మాయి పరిచయం చేస్తుంటే ఒక్కక్కరినే పరీక్షగా చూసింది శ్రీదేవి.
ఆ అమ్మాయి చెప్పటం కాగానే అంది తాపిగా "చూడండి నన్ను క్షమిస్తే ఒక మాట చెబుతాను. నేను యిలాంటి వాటికీ రాలేను. నాకు యింట్లో ఓ క్షణం తీరిక వుండదు. మావారి పనులతో మాబాబు పోషణతో నాకు ఓ నిమిషం కూడా విశ్రాంతి వుండదు."
ఆశ్చర్యపోయి అందా అమ్మాయ్" మీ బాబు అంటే......"
చిన్నగా నవ్వి సిగ్గుగా అంది శ్రీదేవి. "అవునండి మా లాల్లు పోసివస్తున్నాను. చూడండి ఉదయం నించి అబ్బాయి సంగతి చూడటం లోనే యింతయింది, నా కెక్కడి తీరిక!"
అయినా వదలనన్నట్టుగా ఆ అమ్మాయ్ అంది "కానీండి. అంతకంటే ఆనంద మేముంది ఎవరికయినా! అయినా వీలున్నప్పుడే వస్తూవుందురు గాని, రోజు రావాలని ఏమి బలవంతం లేదులెండి. మీ యిష్టం వచ్చినప్పుడే--వారానికో, నెలకో వద్దురు గాని."
జీడిలా అంటుకుని వదలదేమో అనుకుని నిర్మొహమాటంగా అంది శ్రీదేవి "నా కిలాంటి వంటే అసలు యిష్టమలేదులెండి. నా చేత కాదు"
మరీ మొగమాటం లేకుండా అలా అనటంతో సిగ్గుతో కుంచించుకుని పోయిందా అమ్మాయి. తన ఇంతటి వాక్చాతుర్యము, నేర్పూ, యివిడ ముందు వ్యర్ధమయ్యాయే అనే చింతతో, అవమానంతో ముఖమంతా కందగడ్డల్లే చేసుక్కుర్చుంది.
మళ్ళీ ఇంకెవరో ఏదో అనబోతుండగా రోషంగా అంది. "చాల్లెండి ఇక. ఊరికే ఆవిడని విసిగించి మనం శ్రమ ఎందుకు పడాలి? ఇష్టం లేదన్నాక యిహ అంతటితో వదిలెయ్యాలి" అని.
అరుణ అలా అని లేవటంతో అందరూ లేచారు. "వస్తామండి-- నమస్తే" అంది అరుణ.
శ్రీదేవి తను లేచి అంది "నమస్తే మనస్సులో నొచ్చుకోకండి. నా మనస్తత్వమే అంత."
దానికి అరుణ ఏమి అనలేదు.
ఒక్కొక్కరు ఒక్కోలా చూస్తూ బయటికి వెళ్ళిపోయారు.
వాళ్ల దృష్టిలో ఆవిడ డర్టీ క్రీచర్! కల్చెర్ లెస్ ఉమన్, మోడరన్ సొసైటీలో తిరుగులేని పడుచు, ఈ నాటి సాంఘిక వ్యవస్థకి అన్ ఫిట్ మరీ మొహమాటం లేని పల్లెటూరి బైతు.
ఈ భావాలన్నీ వాళ్ల ముఖాల్లో చదివింది శ్రీదేవి. అయినా ఏమి అనలేదు.
అంతా వెళ్ళిపోయాక బయటి తలుపులు చేరవేసి బాత్ రూమ్ వేపు వెళ్ళింది.
ఆ సంభాషణ అంతా విన్న మాధవ సిగ్గుతో కుంచించుకుపోయాడు. బయటికి వచ్చి మళ్ళీ వాళ్ళ ముఖం చూపించ సిగ్గయింది. అతనికి ముఖం చెల్లక అలాగే వుండిపోయాడు. గదిలో.
సాయంకాలం ఆఫీసు నుంచి తిరిగి వచ్చి అలసటగా అలాగే పడక కుర్చీలో వాలిపోయేడు మాధవ్, మెల్లిగా కళ్ళు ముసుకుపోసాగాయ్, భారంగా వున్న మనస్సుతో మౌనంగా వుండిపోయాడు.
బయట గేటు చప్పుడువిని భర్త వచ్చాడనుకుంది శ్రీదేవి. డ్రెస్ మార్చుకుని వచ్చేస్తాడనుకుని ఎదురు చూస్తూ కూర్చుంది వంటింట్లో, టిఫిన్ ప్లేట్లు సర్ది పక్కనే వున్న ప్లాస్కు తీసుకుని వచ్చి దగ్గరగా పెట్టుకుని కప్పు సాసర్ ని కూడా దగ్గరగా తెచ్చుకుని కూర్చుంది.
పది పదిహేను నిమిషాలు గడిచినా మాధవ్ రాకపోవటంతో విసుగ్గా చేతిలో టిఫిన్ ప్లేటు పట్టుకుని గదిలోకి వచ్చింది. అలసట అంతా ప్రస్పుటమయ్యే ముఖంతో కళ్లు మూసుకుని పడుకున్న భర్తని చూడగానే జాలి వేసింది శ్రీదేవికి.
స్టుల్ ని దగ్గరగా లాగి పైన టిఫిన్ ప్లేటు పెట్టి పిలిచింది అతన్ని.