Previous Page Next Page 
టు హెల్ విత్ లవ్ పేజి 11


    "మాకు ఎంతద్రోహం చేశావ్?"
    "తప్పునాది కాదు. వదిలెయ్యండి!"
    అతను వదల్లేదు.
    "మరెవరిది?"
    "నాతో వచ్చిన మార్వాడీ గాళ్ ది"
    "ఆ అమ్మాయి తప్పేమిటి?"
    "తీరా అక్కడికొచ్చాక గొడవ చేసింది. కనీసం ముగ్గురు కంపెనీ లేందే తనకిష్టంలేదని."
    "మైగాడ్!"
    "ప్రోగ్రాం కాన్సిల్ చేసుకుని వెళ్ళిపోబోతూంటే మీ ఎడిటర్ గాళ్ ఫ్రెండ్ కనిపించింది. మీరు స్విమ్మింగ్ కెళ్ళివచ్చేలోపల ఆమె స్నేహం చేసుకుంది. మా మార్వాడి అమ్మాయి.
    వెంటనే కాటేజ్ ఖాళీచేసి ముగ్గురం శామిర్ పెట్ గెస్ట్ హవుస్ కెళ్ళిపోయాం."
    సురేష్ కాలర్ వదిలేశాడతను.
    తరువాత కుర్చీలో వాలిపోయి ఉప్పెనలా నవ్వసాగాడు. సురేష్ భుజంమీద చరుస్తూ "అప్పటినుంచి నన్ను గుర్తు పెట్టుకున్నావంటే చాలా ఆశ్చర్యంగా వుంది."
    "గిల్టీ కాంపస్! అమ్మాయిల విషయంలో మాత్రం నేనెవరినీ మర్చిపోను"
    "గాడ్స్ గిఫ్ట్?" నవ్వాపుకుంటూ అడిగాడు.
    "నేచర్స్ గిఫ్ట్ సార్!'
    అతనులేచి చుట్టూ తిరిగి సురేష్ దగ్గర కొచ్చాడు.
    "నన్ను 'సార్' అనటం మానేసెయ్!"
    "ఆర్ యూ షూర్?"
    "కొయట్ షూర్! అయ్ థింక్ వుయ్ కెన్ బి బెస్ట్ ఫ్రెండ్స్."
    "ఇన్ స్పైట్ ఆఫ్ గాళ్స్."
    సురేష్ తో కరచాలనం చేశాడతను.
    "జాబ్ లో ఎప్పుడు చేరుతున్నావ్?"
    "ఓ వారం తర్వాత......"
    "ఎందుకని"
    "మా గాళ్ ఫ్రెండ్ ని వాళ్ళక్క ఇంటి దగ్గర డ్రాప్ చేసి రావాలి...."
    "ఏ వూరు?"
    "వైజాగ్ లో పెద్దిలు.....నర్సాపూర్ లో చిన్నిల్లు."
    "అంటే?"
    "ఆమె భర్తకు మొదటి ఫామిలీ వైజాగ్. రెండో ఫామిలీ......మా గాళ్ ఫ్రెండ్ సిస్టర్ అన్నమాట. నర్సాపూర్ లో అఫీషియల్ రెసిడెన్స్. అనఫిషియల్లీ.....డూయూ ఫాలో".
    "కొంచెం కన్ ఫ్యూజన్ గా వుంది బైదిబై-మీ గాళ్ ఫ్రెండ్ ని ఎక్కడికో తీసుకెళ్తున్నావట! ఎందుకు?"
    "నేనేకాదుపాపాయికి రెస్పాన్సిబుల్? ఎట్.....లీస్ట్ దటీజ్ వాట్ శీ సేస్..."
    "అంటే మా గాళ్ ఫ్రెండ్ ప్రెగ్నెంట్. డెలివరీకి వెళ్తోంది."
    అతను అదిరిపడ్డాడు.
    "మైగాడ్! ఇంకా గాళ్ ఫ్రెండేమిటి? పెళ్ళిచేసుకోలేదా?"
    "అది కూడా మా ఎజెండాలో వుంది! పాపాయిని స్కూల్లో చేర్చేలోగా డెసిషన్ తీసుకుంటాం."
    సురేష్ భుజం మళ్ళీ విరిగింది.
    అతను కుర్చీలో  కూలబడ్డాడు నవ్వాపుకోలేక.
    "ఇంత గందరగోళం కథ నేనెక్కడా చూళ్ళేదు, వినలేదు!"
    కౌంటర్ లో కూర్చున్న అమ్మాయిని పరిచయం చేశాడతను.
    "మీట్ హేమా దర్శన్-హి ఈజ్ సురేష్, న్యూ సూపర్ వైజర్"
    "హలో! హౌ డూ యూ డూ?" చిరునవ్వుతో అడిగిందామె.
    "కొంచెం వెరయిటీగా వుంటాను-పదండి వెళదాం!"
    "ఎక్కడికీ?" తెల్లబోతూ అడిగింది.
    "మా ఇంటికీ!"
    ఆమె పర్సనల్ మేనేజర్ వేపు చూసింది అయోమయంగా అతను నవ్వాపుకోటానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు.
    "షి ఈజ్ వెరీ ఫాస్ట్ యూనో.....ఫాస్టర్ దెన్ ఆలాఫ్ అజ్." బయటికొచ్చేస్తూంటే అడిగాడతను.
    "హేమా దర్శన్ పక్కన కూర్చున్న బ్లూడ్రెస్ అమ్మాయిని చూశావా?"
    "అసలు మిగతా వాళ్ళవేపు చూడనేలేదు. ఆ అమ్మాయిని తప్పిస్తే"
    "ఆ అమ్మాయి చాలా డేంజరస్!"
    "అంటే?"
    "వైజాగ్ నుండి వచ్చింది. అమెరికా గాళ్స్ కంటే ఎక్కువ ఫాస్ట్! దానికంటే ముఖ్యంమనీ! షి ఈజ్ మాడ్ ఆఫ్టర్ మనీ! నాకు కొన్ని కంప్లయింట్స్ వచ్చాయ్ గానీ అయామ్ నాట్ షూర్!"
    "ఎలాంటి కంప్లయింట్స్?" కుతూహలంగా అడిగాడు.
    అతను నవ్వి సురేష్ భుజంవిరగ్గొట్టాడు మళ్ళీ.
    "ఇంత ఎక్కువక్యూరియాసిటీని హోటల్ మానేజ్ మెంట్ లైక్ చేయదు. కనుక బి స్లో మిస్టర్!"
    "థాంక్యూ! అయ్ విల్ బి స్లో! స్లో అండ్ స్టడీ"
    రిసెప్షన్ కౌంటర్ దగ్గరకొచ్చేశారు.
    మళ్ళీ కరచాలనం చేశాడతను సురేష్ తో.
    "ఓ వారం తర్వాత కలుసుకుంటాను మిస్టర్....." పేరు కోసం తడుముకున్నాడు సురేష్.
    "చందన్--విజయ్ చందన్!"
    "విజయ్ చందన్! వెరీ గుడ్ నేమ్!"
    "అయ్ థింక్ అయ్ కెన్ ఎంజాయ్ యువర్ కంపెనీ" నవ్వుతూ అన్నాడు.
    "అయ్ థింక్ అయ్ కెన్ ఎంజాయ్ యువర్ రిసిప్షనిస్ట్' కంపెనీ......"
    అతను సురేష్ భుజంమీదలాగి కొట్టాడు గట్టిగా నవ్వుతూ.
    "అన్నట్లునాదో చిన్న కోరిక! మీభార్య భుజం ఓసారి చూడాలని వుంది."
    అతని పెదాలమీద నవ్వు ఆరిపోయింది.
    "వ్వాట్?"
    "మీకు సంతోషం వచ్చినప్పుడల్లా ఆమె భుజం మీద కొట్టి కొట్టి  కమిలిపోయి వుంటుందేమోనని...."
    మళ్ళీ విరగబడి నవ్వాడతను. ఈసారి మరింత గట్టిగాకొట్టాడు సురేష్ భుజంమీద.
    ఇంటికొచ్చేసరికి తులసి బట్టలు ఇస్త్రీ చేస్తోంది.

 Previous Page Next Page