Home » Suryadevara rammohan rao » Premaku Pettubadi Kavali


    "అలాగేనండీ" అంటూ లోపలికి వెళ్ళిపోయాడతను.

 

    
                                                                 *    *    *

 

    డాబామీద చిన్నగది. రాత్రి పదకొండుగంటల దాటింది నిద్ర పట్టడం లేదు మధుకి.

 

    కాసేపు పాత పేపర్లు, పుస్తకాలు తిరగేసి, బయటికొచ్చి పిట్టగోడ మీద కూర్చుని ఆకాశంవైపు, నక్షత్రాల వేపూ చూస్తున్నాడు. గాలి చల్లగా వుంది. మసక వెన్నెలలో ఏలూరు కాలువ మెరుస్తోంది. దూరంగా రైల్వేస్టేషన్. బండిలో వెళ్ళిపోతున్న మనుషులు బొమ్మల్లా కనిపిస్తున్నారు.

 

    కొంచెం, కొంచెం కాలేజీ వాతావరణంలో ఇటీవల కాలంలో చోటు చేసుకున్న మార్పులూ, కుర్రవాళ్ళ మనస్తత్వంలో వికృత ధోరణులూ అర్థమవుతున్నాయి.

 

    అన్విత విషయంలో రవి, రమణ, షాజహాన్ తదితరుల చర్చల్లో దొర్లిన వికృత భావానికి మరొక సమయంలో అయితే, వాళ్ళని చితక కొట్టేసేవాడు. వాళ్ళకు స్త్రీ విలువ తెలీదు. ప్రేమకూ, ఆరాధనకూ, మోహానికీ, పెళ్ళికీ మధ్య వున్న విలువ తెలీదు.

 

    మోడ్రస్ సొసైటీలో విలువలు సన్నగిల్లుతున్నాయి. స్త్రీ భోగ వస్తువు. కొన్ని శతాబ్దాల క్రితం కూడా స్త్రీ భోగవస్తువే! కానీ అప్పటికీ, ఇప్పటికీ వ్యత్యాసం ఏమిటి? ఇది ఆకర్షణ యుగం. యాంత్రిక యుగం. అనుబంధం, ఆత్మీయత పూలలో దారంలా వుంటుంది. ఎంతమందికి ఆ సూత్రం విలువ తెలుసా? రేపు అన్విత ఏర్పాటు చేసే పార్టీకి తను వెళ్ళాలా వద్దా.....?

 

    అన్విత తనతో మాట్లాడినా, మాట్లాడకపొయినా, ఆమె భావాలు తనకు నచ్చకపొయినా, అన్వితను కళ్ళార చూడటం కోసమైనా తను వెళతాడు.

 

    అన్వితను తను ఆరాధిస్తున్నాడా?

 

    ప్రేమిస్తున్నాడా.....?

 

    ఏమో? ఆ ప్రశ్నకు జవాబు మధు దగ్గరలేదు. కానీ ప్రశ్నలు మాత్రం పదే పదే తన మెదడులో మెరుస్తున్నాయి. ప్లష్ అండ్ బ్లడ్ తో సంబంధం లేకుండా, మనసుల్లో ప్రేమని పండించుకునేవాళ్లు నేటి ఆధునిక యుగంలో అరుదైపోతున్నారేమో!

 

    ఒక స్త్రీ గురించి ఆమె ప్రేమేయం లేకుండా ఎంత దారుణంగా మాట్లాడుకుంటున్నారు.

 

 

                                              *    *    *

 

        అడవిలో ఎవరూ వెయ్యని విత్తనం-

 

    చిన్న మొలకలా ఎదిగి, లేత ఆకుల్ని పొదుగుకుని పచ్చని ప్రకృతిలో పరవశానికి లోనైనట్లు, మధుకిరణ్ మనసు నిండా అన్విత నిండిపోతోంది. తను అన్వితను ప్రేమిస్తున్నాడు- లేదంటే తనలో ఈ భావోద్వేగం ఎందుకు చోటు చేసుకుంటుంది?

 

    అంతమాత్రం చేత  అన్వితను తనని ప్రేమించాలని లేదుగా..... ప్రేమ ఎక్కడబడితే అక్కడా, ఎప్పుడు పడితే అప్పుడూ దొరికేది కాదేమో......? ముందు తన మనసు నిండా ప్రేమను నింపుకుని, ఇతరుల ప్రేమకోసం నిజాయితీగా, నిర్భయంగా ప్రయత్నించాలేమో?

 

    తన మనసులోని మనసును పంచుకోవడానికి ఏ ఒక్క  స్నేహితుడూ లేనందుకు బాధపడుతున్నాడు మధు.

 

    ఒక్కొక్కప్పుడు బాధ, సంతోషాన్నిస్తుంది. అలాంటి సంతోషంతోనే నిద్రలోకి జారుకున్నాడతను. ఆ సమయానికి కొన్ని క్షణాలముందు బాల్య స్నేహితుడు గుర్తుకు వచ్చాడు. వాడు ఏలూరులోనే వుండాలి. ఎక్కడున్నాడో రేపు కనుక్కోవాలి అనుకున్నాడు మధు.

 

    
                                           *    *    *

 

    సాయంత్రం ఆరుగంటలైంది.

 

    రైల్వేస్టేషన్ కి రెండు కిలోమీటర్ల దూరంలో కొత్తగా మెరుస్తున్న పోష్ కాలనీ అది.....

 

    ఆ కాలనీలో లేత బ్రౌన్ కలర్ బిల్డింగ్, ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన పోకచెట్ల మధ్య కొత్తగా మెరుస్తోంది. కొంచెం దూరంలో స్విమ్మింగ్ ఫూల్, విశాలమైన గేటు..... ఆ తర్వాత గార్డెన్..... పోర్టికో..... పోర్టికోలో తోకాడించుకుంటూ తిరుగుతున్న డాబర్ మెన్ కున్న రెండంతస్తుల బిల్డింగ్ అది. బాల్కనీలోకి వచ్చింది అన్విత.

 

    ఫారిన్ షాంపూ ఘుమఘుమలతో మెరుస్తున్న నాజూకైన జుట్టు గాలికి ఎగురుతోంది. బెంగాలీ అద్దకం కుర్తా, పైజామాలో గంధపు బొమ్మలా మెరిసిపోతోంది అన్విత.

 

    పనిమనిషి ఎదురుగా వచ్చి "టేబుల్ మీద అన్నయే పెట్టేశానమ్మా" అని చెప్పి కిందకు వెళ్ళిపోయింది.

 

    "బేబీ" ఆ పిలుపుకి తలతిప్పి చూసింది అన్విత. రూమ్ లోంచి బయటికొచ్చింది అన్విత నాన్నమ్మ అన్నపూర్ణమ్మ.

 

    "లేడీస్ వెల్ ఫేర్ అసోసియేషన్ వాళ్ళు మీటింగ్ పెట్టారు. చీఫ్ గెస్ట్ గా వెళుతున్నాను. టూ అవర్స్ లో వచ్చేస్తాను" అంటూ మెట్లవేపు నడిచిందామె.

 

    "నాన్నమ్మా! మీ మీటింగ్స్ వల్ల ఎవరికి వుపయోగమో చెప్పు...... మీ ఫోటోల్ని పత్రికల్లో వేయించుకోవడానికి కాకపొతే....." అన్విత నవ్వుతూ అంది.

 

    "నీకు తెలియదులేవే. ఉమెన్ లిబ్ ఇండియాలోకి ఇంకా పూర్తిగా రాలేదు. దాని కాన్సెప్ట్ నీలాంటివాళ్ళకి ఇప్పట్లో అర్థం కాదులే. చూడు బేబీ! మహిళల మీద ఏ రకంగానైనా దౌర్జన్యం చేసే మగవాళ్ళ వ్యవస్థను రూపుమాపడం మా లక్ష్యం. బాధిత మహిళలకు సహాయాన్నందించటం మా బాధ్యత" ఆవేశంగా అంది నాన్నమ్మ.

 

    గట్టిగా నవ్వేసింది నాన్నమ్మ మాటలకు  అన్విత.

 

    "టీనేజ్ వయసులో ఏ అమ్మాయి అయినా ఆవేశపడి ప్లకార్డులు పట్టుకుని తిరిగితే ఒక అర్థం ఉంటుంది. అరవై ఏళ్ళ వయసులో ఉమెన్ లిబ్ జిందాబాద్...... అంటూ నువ్వూ , నీలాంటి వయసులోని బామ్మలందరూ తిరిగితే ఎంత ఫన్నీగా వుంటుందో తెలుసా?" నవ్వుతూనే అంది అన్విత.

 

    "నీలాంటి వాళ్ళకన్నీ ఫన్నీగానే వుంటాయి. మా పోరాటం ఆంధ్రదేశంలోని పురుషుల మీద కాదు పిచ్చిమొగమా... ఇక్కడి పురుషులకి ఆడవాళ్ళమీద దౌర్యన్యాలు ఎన్నిరకాలుగా చెయ్యాలో ఏం తెల్సు. మా పోరాటం ప్రపంచ పురుషుల దుర్మార్గులమీద..... వారి నయవంచన మీద. నీకేం అర్థం కాదు. నేనివాళ మాట్లాడుతాను. రేపు పేపర్ లో చూసి తెల్సుకో, మీ ఫ్రెండ్స్ కి ఏదో పార్టీ ఇస్తానన్నావ్. పార్టీ జరుగుతుండగా వచ్చేస్తాలే" అంటూ మేడ దిగి, కారెక్కి స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ బయటికెళ్ళి పోయింది అన్నపూర్ణమ్మ.

 

    "పిచ్చి నాన్నమ్మ...." మనసులోనే అనుకుంది అన్విత.

 

    
                                           *    *    *

 

    వెలుతురును పక్కకు తోసేసి, ప్రపంచాన్ని నెమ్మదిగా చీకటి ఆక్రమించుకుంటోంది.

 

    కొత్తగా పరిచయమైన క్లాస్ మేట్స్ విమల, కళ్యాణి ముందుగా వచ్చారు. ఆ తరువాత రవి బ్యాచ్ వరుసగా వెహికిల్స్ మీద వచ్చారు. వాళ్ళందర్నీ స్వయంగా ఇన్ వైట్ చేసింది అన్విత.

 

    ఆ పోష్ బిల్డింగ్ ను, అందులో కళాత్మకంగా తీర్చిదిద్దిన యాంటిక్ డెకరేటివ్ పీసెస్ ని, ఫర్నీచర్ ని చూడగానే కళ్ళు తిరిగాయి కుర్రాళ్ళందరికీ.

 

    హాలు మధ్యలో వున్న పాలరాతి అమ్మాయి శిల్పాన్ని చూపెడుతూ-

 

    "ఒకసారి మా డాడీతో ప్యారీస్ వెళ్ళినప్పుడు కొన్నాను. బావుంది కదూ అంది చిరుగర్వంగా అన్విత.

 

    "నీలాగే" అనబోయి వూరుకున్నాడు రవి.

 

    "కమాన్" అంటూ ఇంటి వెనక లాన్ వైపు నడిచింది అన్విత.

 

    అక్కడ వరుసగా నాలుగైదు అందమైన కేన్ టేబుల్స్, చెయిర్స్ వున్నాయి. పార్టీకి సరిపోయే కాంతితో వెలుగుతున్న దీపాలు చుక్కల్లా చక్కగా వున్నాయి. కొంచెం దూరంలో ఆర్టిఫిషియాల్ వాటర్ ఫాల్.

 

    అన్వితను మెచ్చుకోవాలో, ఆమె టేస్ట్ ని మెచ్చుకోవాలో తెలీక అందరూ కంగారుపడిపోతున్నారు. 'వెరీగుడ్.... ఎంత బావుందో..... బ్యూటీఫుల్' పొడిపొడిగా కామెంట్ చేస్తున్నారు.

 

    "మైడియర్ ఫ్రెండ్స్! బీ ఫ్రీ హియర్..... బిహేవ్ యాజ్ యూ లైక్.... ఇన్ ఎనీ బడీ వాంట్స్ హాట్.... రాయల్ ఛాలెంజ్ ఆర్ పీటర్ స్కాట్ ....... రెడీ..... ఒకే ఫ్రెండ్స్..... టేక్ యువర్ సీట్స్...." అందమైన ఇంగ్లీషు ఆమె మాటల్లో మరింత అందాన్ని సంతరించుకుంది. తనే అందరికీ మొదట చిల్డ్ బీర్  సర్వ్  చేసింది అన్విత.

 

    ఆడపిల్లలు కూడా సంకోచించకుండా బీర్ గ్లాసుల్ని అందుకున్నారు.

 

    "దట్స్ స్పిరిట్" అని మెచ్చుకుంది అన్విత.

 

    "ఐ థింక్...... ఉయ్ మిస్ డ్ సమ్ బడీ...... హు ఈజ్ దట్...." అని అడిగింది అందరివేపూ చూస్తూ అన్విత.

 

    "మధు..... మధుకిరణ్.....హిమేకమ్...." అన్నాడు రవి.

 

    "అతను కొంచెం మూడీ అనుకుంటాను" అందామె రవి, సీటు ఎదురుగా కూర్చుని షాంపైన్ గ్లాసు అందుకుంటూ.

 

    "ఛీర్స్."

 

    "గోలగోలగా వుంది వ్యవహారం.

 

    కబుర్లు, కాలేజీ ముచ్చట్లు, హాస్టల్ వార్డన్ పిసినారితనాలు..... అన్విత చెప్పే ఢిల్లీ కబుర్లు, కబుర్లు వింటూ, తమ ఏలూరి ముచ్చట్లు చెపుతున్నారు.

 

    సరిగ్గా ఆ సమయంలో ఎందుకో గేట్ వేపు చూసి అన్విత అక్కడో మనిషి నిలబడ్డం చూసి-

 

    "జస్ట్ ఏ మినిట్" అని మెయిన్ గేట్ వేపు వెళ్లింది.

 

    మెయిన్ గేట్ దగ్గర బిడియంగా నిలబడిన మధుకిరణ్ వేపు చూసి ఒక్కక్షణం ఆశ్చర్యపోయింది.

 

    "ఏవిటి.... ఎంతసేపైంది వచ్చి.....?" అడిగింది అన్విత.

 

    "జస్ట్..... ఇప్పుడే....." నసుగుతున్నట్లుగా అన్నాడు మధు.

 

    "లోనికి రావచ్చు గదా.... మన ఫ్రెండ్స్ అందరూ వచ్చేశారు. మీరే."

 

    "కొంచెం లేటయింది" సంజాయిషీ యిస్తున్నట్లుగా అన్నాడు మధు.

 

    "ఫర్లేదు..... రండి....." ఎర్రటి లిప్ స్టిక్ పెదాల్లోంచి, విరిసిన గులాబీ పువ్వులా కన్పించిన చిరునవ్వువేపు, ఆ చిరునవ్వుపైన మిలమిల్లాడుతున్న నల్లటి కనుబొమలవేపు, ఆ కనుబొమల మధ్య తీర్చిదిద్దుకున్న దీపం ఆకారంలోని బొట్టువేపు, నీలాల కురులవేపు కన్నార్పకుండా చూస్తున్నాడు మధు.

 

    "ప్లీజ్ కమిన్."

 

    "ఒన్ సెకండ్."

 

    "ఎందుకు........!" అన్నట్టు ఆశ్చర్యంగా చూసింది అన్విత.

 

    "ఇఫ్ యూ డోంట్ మైండ్" అంటూ అంతవరకూ తన చేతుల్లో వున్న గులాబీ ప్లవర్ బొకేని ఆమె చేతులకు అందించాడతను.

 

    ఆ సమయంలో ఆమె మునివేళ్ళు సన్నగా, సుతారంగా అతని వేళ్ళను తాకాయి.

 

    అనంతరాగలీనమైన స్పందన అది. ఆ స్పందన మధుకే తెల్సు.

 

    ఆ పుష్పగుచ్ఛంవేపు ఒకసారి చూసి "థాంక్స్" అని మామూలుగా అనేసి-

 

    "రండి" లోనికి నడిచింది అన్విత.

 

    గులాబీపూల అందాన్ని మెచ్చుకుని తనని మరింతగా పొగుడుతుందని ఆశించిన మధు కొంచెం నిరాశకు గురయ్యాడు.

 

    ఎన్ని పూలు అందుబాటులో వున్నా, ఏ ఆడపిల్లయినా గులాబీ పూలని ప్రేమిస్తుంది. అవి సూర్యకాంతం పువ్వుల్లాంటి హైబ్రీడ్ గులాబీలు, మూడుగంటలసేపు సిటీ అంతా వెతికి, వెతికి కొన్నాడతను.

 

    "మా గార్డెన్ లో ట్వంటీఫైవ్ వెరైటీ స్  ఆఫ్ గులాబీలున్నాయి. ఈ అమెరికన్ బ్రీడ్ గులాబీల్ని చూడండి" అంటూ అక్కడున్న గులాబీ మొక్కల్నీ చూబెడుతూ ముందుకు నడిచింది అన్విత.

 

    అన్విత టేబుల్స్ మధ్యకు నడిచి, తన కుర్చీ పక్కనున్న టీపాయ్ మీద మధు ఇచ్చిన పూలగుచ్ఛాన్ని పెట్టేసి-

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra