Home » Vasireddy seeta devi novels » Rakshasa Needa 2

 

    "అవును ఆ మధ్య ఒక పోలీసు అధికారి స్వయంగా చెప్పారని ఒక పేపర్లో వచ్చింది.":
    "ఏమని?"
    "అదే అనేక కారణాల వల్ల ఇలాంటి హత్య, ఆత్మహత్యల కేసులు - అంటే వరకట్న మరణాలు - పోలీసు రికార్డుల్లో నమోదు కావడం లేదుట. అంతగా నమోదు అయినా ,నిందుతుల్ని శిక్షించడానికి తగిన సాక్ష్యా ధారాలు దొరకడం లేదట. పైగా ఇలాంటి కేసుల్లో హత్యల కంటే ఆత్మహత్యలే ఎక్కువట. నాకూ అలాగే అనిపిస్తుంది. అంటీ! ఈ కేసులో నూటికి డెబ్బయ్ శాతం ఆత్మహత్యలే అనిపిస్తుంది."
    "అదేం కాదు హత్యలే. నూటికి తొంబయి శాతం హత్యలే. నువ్వూ మగాడివేగా? అందుకే అలా అంటున్నావు." ఉక్రోషంగా అన్నది ఇందుమతి.
    "అవునమ్మా ఇందూ. ఇన్ని కేసులు చూసిన మీదట నాకూ అలాగే అనిపిస్తుంది" అన్నది సునంద.
    "ఏమిటమ్మా అలా మాట్లాడుతున్నావ్ నువ్వు కూడా? పోనీయ్ మీరన్నట్లే ఆత్మహత్యలే అనుకుందాం. ఎందుకలా ఆత్మహత్యలు చేసుకుంటూన్నారు? భర్త పెట్టె బాధలు భరించలేకేగా? అత్త దౌర్జన్యాన్ని సహించలేకేగా?"
    "చాలావరకు అంతే కావచ్చు."
    "అంటే వేరే కారణాలు కూడా ఉంటాయని నీ అభిప్రాయమా? ఇందుమతి గౌతమ్ ముఖంలోకి చురుగ్గా చూసింది.
    "ఎందుకుండకూడదూ? వేరే కారణాలు ఎక్కువ లేకపోవచ్చును. అందుకే అంటున్నాను అత్తవారింటి బాధలు భరించలేక పుట్టింటికి వస్తే పుట్టింటివారు ఆడపిల్లను ఆదరించాలని."
    "అవును, అది నేనూ అంగీకరిస్తాను. కొవ్వూరూ తాలూకా లోని ఒక గ్రామంలో ఒక తల్లే ముప్పై ఏళ్ళ కూతుర్ని కాల్చి చంపిందట. ఎందుకో తెలుసా? ఆ అమ్మాయి అత్త ఇంటి బాధలు భరించలేక పుట్టింటికి వచ్చింది. తల్లి అత్తవారింటికి వెళ్ళమని బలవంతం చేసింది. ఆమె భయం తన కూతురు మొగుడ్ని వదిలేసిందని అందరూ అంటారని. మచ్చలేని తన వంశానికి కూతురి వల్ల మచ్చ ఏర్పడుతుందని . అందుకే ఏంతో చెప్పింది. కూతురు వినలేదు. ఒళ్ళు తెలియని కోపంలో కూతుర్ని కాల్చేసింది" అన్నది ఇందుమతి.
    "ఆత్మహత్యలకు అసహాయ స్థితిలోనేగా పాల్పడతారు?"
    "కేవలం అసహయస్థితి అనడానికి కూడా లేదు. ఆ మధ్య హదిఅరాబాద్ లో ఒక విద్యాధికురాలు హుసేన్ సాగర్ లో పడి చనిపోయింది. ఎందుకు? అత్తా ------భర్తా పెట్టె బాధలు భరించలేక. అంతవరకు అంగీకరిస్తాను. ఆ అమ్మాయి బాగా చదువుకున్నది. అభ్యుదయ భావాలు గలది. ఎందరో హితులూ, స్నేహితులు కూడా వున్నారు. తాత్కాలికంగా ఆశ్రయం ఎవరైనా ఇచ్చి ఉండేవారు. ఆ తరవాత ఉద్యోగం చేసుకొని తన కాళ్ళ మీద తానూ నిలబడగలిగేది....."
    "గౌతమ్! ఆ అమ్మాయి అభిమానం గల పిల్ల.....ఎవరింట్లోనో వెళ్ళి తలదాచుకోవడం ఆమె స్వభావానికే విరుద్దం."
    'అంటీ! సరే! మీరు చెప్పింది కరెక్టే. అలాంటప్పుడు ప్రభుత్వం ఎన్నో సేవసదనాలు నిర్వహిస్తుంది. టెంపరరీగా ఏ హోం లోనైనా  ఆశ్రయం తీసుకోవచ్చుగా? చదువుకున్న ఆడవాళ్ళే అత్తింట్లో స్థానం లేకపోతే ఆత్మహత్యకు పూనుకుంటుంటే , మరి సామాన్య ఆడపిల్లలు ఏం చెయ్యగలరు? అందుకే ఆత్మహత్యలకు పూనుకుంటున్నారు" అన్నాడు గౌతమ్.
    "అవును, గౌతమ్ . దానికి కారణం స్త్రీలలో రావల్సినంత చైతన్యం రాకపోవడమే. నువ్వు హత్యల కంటే ఆత్మహత్యలే ఎక్కువ అన్నావు. కాని, నీతో నేను ఏకీభవించలేను. హత్యలన్నీ కూడా ఆత్మహత్యలుగా చిత్రించడం జరుగుతోంది.
    "మాలాంటి వారి చొరవవల్లా, అలజడి వల్లా పోలీసు కొన్ని కేసుల్ని హత్యలుగా నమోదు చేసినా, చివరకు అవి ఆత్మహత్యలుగానే కేసులు మూసెయ్యడం జరుగుతుంది.
    "వనపర్తిలో చనిపోయిన లలితమ్మ కేసునే తీసుకో. కోరిన కట్నం తేలేదని ఆ ఇరవై ఏళ్ళ యువతిని , దయ్యం పట్టిందని హింసించారు. చివరకు విషం ఇచ్చి అత్తా, భర్తా కలిసి చంపినట్లు ఆరోపించడం జరిగింది. అలాగే వరంగల్ జిల్లాలోని చింతపల్లి లో చనిపోయిన రామక్క విషయం తీసుకో. ఆ పిల్ల వయసు పదహారేళ్ళు. పెళ్ళయి అయిదు నెలలో కూడా నిండలేదు. కాలి పారాణి ఆరలేదు. భర్త ఆమెను బావిలోకి తోసి చంపాడని ఫిర్యాదు చెయ్యడం జరిగింది. మరో కేసు చూడు. వనపర్తిలో పద్మమ్మ అనే యువతిని భర్తా, అత్తా మామలు కలిసి అనేక విధాల హింసించారు. పుట్టింటి నుంచి ఇరవై వేలు తీసుకురావాల్సిందిగా నానా హింసలకు గురి చేశారు. చివరకు కిరసనాయిలు పోసి కాల్చి చంపారని ఆరోపణ నమోదు అయింది.
    "కాని, పైన చెప్పిన కేసుల్లో ఎవర్ని నిందితులుగా నిరూపణ చెయ్యడం జరగలేదు. కారణం విచారణలో అవసరం అయిన సాక్ష్యాలూ ఆధారాలూ, దొరక్క పోవడమే. మతిపోతోంది. ఈ దౌర్జన్యాలకు అంతం ఎప్పుడో?" అని సునంద నిట్టూర్చింది.
    "ఎప్పుడా? స్త్రీ తిరగబడినప్పుడు, సీతలూ, సావిత్రులూ ఎదురు తిరిగినప్పుడు....." ఆవేశంగా అన్నది ఇందుమతి.
    "ఈ చావులన్నీ ఏ కుటుంబాల్లో జరుగుతున్నాయి? లక్షలకు లక్షలు కట్నం ఇచ్చే హయ్యర్ మిడిల్ క్లాసులో జరుగుతున్నాయా? రిచ్ క్లాస్ లో అసలు లేవు. ఈ హత్యలూ, ఆత్మహత్యలూ ఎక్కువగా లోయర్ మిడిల్ క్లాసులోనే జరుగుతున్నాయి. ఈ జబ్బు వర్కింగ్ క్లాసులోకి కూడా పాకుతుంది. మన కుటుంబాల్లో అంటే మన అంతస్తులోకి వచ్చే కుటుంబాల్లో కోడళ్ళను అత్తలు బాధ పెడుతున్నట్టు కనిపించదు. వినిపించదు. ఈ కుటుంబాల్లో కోడళ్ళు వచ్చాక అత్తమామలకు ఆ ఇంట్లో గౌరవ ప్రదమైన స్థానం లేకుండా పోతుంది. ఈ కుటుంబాల్లో అత్తల్ని, వెళ్ళ గొట్టిన కోడల్లె ఎక్కువగా ఉంటారు. బాగా చదువుకున్న వాళ్ళూ, పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు  భార్యలకు భయపడటమే కనిపిస్తూ ఉంటుంది. ఎందుచేత? ఈ లోపం ఈ వ్యవస్థలోనే ఉంది ."
    "అలాగని వ్యవస్థ మారేదాకా ఈ అన్యాయాలని చూస్తూ ఊరుకోవాల్సిందేనా?" ఇందుమతి చురుగ్గా చూసింది.
    "అలా అని నేను అనడం లేదు. అరే కబుర్లలో పడి మర్చిపోయాను. పెట్రోల్ డీలర్స్ మీటింగ్ ఉంది. వస్తాను అంటీ!" అంటూ లేచాడు గౌతమ్.
    ఇందుమతి కూడా గౌతమ్ వెనకే వెళ్ళింది గేటు వరకు.
    వాళ్ళను చూస్తూ సునంద ముసిముసిగా నవ్వుకుంది.


                                                         *    *    *

    "ఎవరు కావాలి బాబూ!"
    "మీ పేరు వర్ధనమ్మ కదూ?"
    వర్ధనమ్మ ఆగంతకులను ఆశ్చర్యంగా చూసింది.
    "నా పేరు విశ్వం. ఇతడి పేరు రవి!"
    "అయితే !" అన్నట్టుగా చూసింది.
    "గౌతమ్ మీ అబ్బాయేనా?"
    వర్ధనమ్మ ముఖం పాలిపోయింది. వీడు మళ్ళీ ఏదో నెత్తి మీదకు తెచ్చుకున్నట్టున్నాడు. ఊళ్ళో వాళ్ళ సమస్యలన్నీ వాడికే కావాలి. వాడి మంచితనాన్ని ప్రతివాడు ఉపయోగించుకునే వాడే.
    "మా గౌతమ్ మీకు తెలుసా?"
    "తెలియదు."
    "మరి వాడితో మీకు.....?"
    "చాలా ముఖ్యమైన పని వుండే వచ్చాం."
    "ఏమిటి బాబూ! వాడు మళ్ళీ ఏదైనా చేశాడా?"
    రవీ విశ్వం ముఖ ముఖాలు చూసుకున్నారు.
    "మీవాడు ఎప్పుడూ ఏదైనా చేస్తూ వుంటాడా?"
    "అవును బాబూ! వాడు తనకోసం ఏదీ చెయ్యదు. ఏ స్నేహితుడికో, స్నేహితుడి చెల్లెలకో , తండ్రికో ఏదో అన్యాయం జరిగిందనుకొండి. వీడు అంతా నెత్తినెత్తుకుంటాడు. అది సరే మీరు ఎక్కడ్నుంచి వచ్చారు?"

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra