Home » Suryadevara rammohan rao » అశ్వభారతం


    నాయర్ కి, శుక్రాచార్యకు చాలాకాలంగా స్నేహం. అలాంటి నాయర్ కి కూడా శుక్రాచార్య అంతరంగం అర్ధం కాదు. నాయర్ కెప్పుడూ శుక్రాచార్య ఒక పజిల్.

    నాయర్ హాల్లోకి వచ్చేసరికి శుక్రాచార్య కనిపించాడు.

    ఆ వేళ....అక్కడ....అలా ఏదో విశేషముందనిపించింది.... శుక్రాచార్యను విష్ చేసి పర్సనల్ రూమ్ లోకి తీసుకెళ్ళాడు.

    "మందులు జాగ్రత్తగా తీసుకొంటున్నావా__?" ఆప్యాయంగా అడిగాడు నాయర్.

    తీసుకుంటున్నట్లు తలూపాడు....

    కాసేపు మౌనం నాయర్ కి తెలుసు. శుక్రాచార్య మాట్లాడతాడని__ అందుకే అలా మౌనం__

    ఐదు నిమిషాలు గడిచాయి.

    అప్పుడు తలెత్తాడు శుక్రాచార్య__బరువైన కనురెప్పల్ని కొద్దిగా పైకి లేపి నాయర్ వేపు చూపాడు....

    "ఆఖరుసారి పరీక్షించి ఇంకెన్నాళ్ళు బతుకుతానో చెప్పగలవా....?"

    తన చావు గురించి కూడా ఎంత నిబ్బరంగా అడగగల స్థయిర్యం.... ఎందరికి ఉంటుందా నిబ్బరం....

    డాక్టర్ అయిన తనకే ఎన్నో చావుల్ని చూసిన తనకే అప్పుడప్పుడూ చావంటే భయం__కాని.... శుక్రాచార్య....

    అసలా పేరే చిత్రమైంది.

    ఆ పేరు తల్లిదండ్రులు పెట్టిందో__తనకై తాను పెట్టుకుందో అర్ధం కాదు__ అడిగినా చెప్పడు.... బహువిచిత్రమైన మనిషి....

    పెళ్ళీడు కొచ్చిన కూతురు, ముసలి భార్య, అద్దె ఇల్లు....ఏమిటీ తని ధైర్యం....?

    "మందులు కరెక్టుగా తీసుకుంటున్నానంటున్నావు గనుక మరో...." ఆగిపోయాడు నాయర్.... కంఠంలో జీర....

    శుక్రాచార్య వేదాంత ధోరణిలో నవ్వాడు. "నా చావు గురించి నాకు భయం లేదు. నా భయమల్లా అది నన్ను కబళించే లోపు నా లక్ష్యాన్ని సాధించగలనా అన్నదే...."

    "అది మర్చిపోలేవా...."

    "మరుపా....? బ్రతికున్నదే. దానికోసం.... ప్రాణాలు నిలబెట్టుకుంటున్నదే దానికోసం....మాట మార్చవద్దు.... ఎన్ని రోజులు....?

    "లక్ష్యదూరాన్ని_చావు గడియని మదింపు చేసుకొంటున్నా...."

    "అవును...."

    "మరో 45 రోజులు"

    "ఇందుకే నీమీద నాకు గౌరవం_అభిమానం__చావునుంచి రక్షించలేకపోయినా. చావు ఎప్పుడో కరక్టుగా చెప్పగలిగితే డాక్టర్ చాలా మేలు చేసినట్లు, ఆ లోపు పూర్తి చేసుకోవాల్సిన పనులు...." మధ్యలో ఆగిపోయాడు.

    చావు నుంచి రక్షించలేకపోయినా. అన్నమాట శుక్రాచార్య వ్యంగ్యంగా అనకపోయినా వైద్యవృత్తికే సవాల్ అనిపించింది. కొద్దిగా అవమానం కూడా ఫీలయ్యాడు.

    "ఇన్నాళ్ళు సాధించలేని లక్ష్యాన్ని ఈ 45 రోజుల్లో సాధించగలననుకుంటున్నావా....?

    నమ్మకం.... రోజులు తెలిసిపోయాయిగా....నా చావు గడువు నన్ను తొందర పెట్టొచ్చేమో....అయినా ఇంతవరకు అసలు వ్యక్తి రంగప్రవేశం జరగలేదు. దానికి ఎల్లుండే ముహూర్తం. రంగప్రవేశం జరిగిన రెండు రోజుల్లో శశాంక తేజ్ దత్తా ఏదో ఒక అపాయంలో ఇరుక్కుంటే పని సుళువవుతుంది....?

    "అది జరుగుతుందని గ్యారంటీ....? పైగా అతనికున్న ఆర్ధిక బలానికి, అంగబలానికి, మామూలు అపాయాల్ని అతను తేలిగ్గా దాటగలడు. ఇప్పటికీ అతను అసాధారణమైన ప్రమాదంలో ఇరుక్కుంటాడని నీకు నీ సిక్త్సు సెన్స్ చెబుతుందా....?"

    "ట్రాష్...."

    "ఏమిటి....?"

    సిక్త్స్ సెన్స్__ట్రాన్స్ లో మాటలు వినిపించటం లాంటివి ట్రాష్ అంటున్నాను. చర్యకు-ప్రతిచర్య-చర్యకు నేను ఈ రాత్రికే ఫోన్ ద్వారా శ్రీకారం చుడతాను. ప్రతిచర్య మొదలవుతుంది. ఆ ప్రతిచర్యను నాకు అనుకూలంగా మార్చుకుంటాను...."

    వణుకుతున్న శుక్రాచార్య పెదవుల వేపు, అనుభవాలతో పండిన నుదుటి మడతల వేపే చూస్తూ ఆలోచిస్తున్నాడు డాక్టర్ నాయర్.

    కేవలం ఒకే ఒక్క అవమానం_అది ఘోరమైందే కావచ్చు.... దాన్ని దశబ్దాలుగా గుర్తుపెట్టుకొని_దాన్నే స్మరిస్తూ _ దానికోసమే బ్రతుకుతూ దానికోసం సర్వస్వం త్యజించి అయినవాళ్ళకు దూరంగా బండరాయిలా మారిపోయి_ పగబట్టిన త్రాచులా నిర్జీవంగా మారిపోయి ప్రతికార జ్వాలల్లో నిత్యం నివురుగప్పిన నిప్పులా బ్రతకటం_ సాధ్యమా? 

    సాధ్యమేననిపిస్తోంది శుక్రాచార్యను చూస్తుంటే.... "ఏమయినా నీ పట్టుదలను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. నీ ప్రతీకారం తీరాలనే కోరుకుంటున్నాను. ఆ సందర్భంలో నీకు నేను పూర్తిగా సహకరిస్తాను.... కానీ నీ కూతురు....త్రివేణి.

    "అందుకే నాతో నా కూతురికి అటాచ్ మెంట్ పెరక్కుండా చూసుకున్నాను. నేనేదో పోతూ పోతూ డబ్బు, ఆస్తి మిగుల్చుతానని ఆమెను భ్రమింపజేయలేదు. ఈ తోడెల్లా లోకంలో ఎలా బ్రతకాలో నేర్పుతూ వచ్చాను. ఆస్తి ఇవ్వటంకన్నా, అదెలా సంపాదించాలో నేర్పడమే గొప్పని నా ఉద్దేశ్యం...." శుక్రాచార్య లేచి నిలబడి పచార్లు చేయటం ప్రారంభించాడు.

    ఇప్పుడేం చేయబోతున్నావు....? నాయర్ ప్రశ్నించాడు.

    శశాంక తేజదత్తా కొడుకు ఒక వ్యక్తి మీద ప్రతీకారంతో ఉన్నాడు. తండ్రి అండతో, మదంతో ఆ వ్యక్తిని మర్డర్ చేయాలని చూస్తున్నాడు. అది జరగటం ఖాయం. కాని దాని ముహూర్తమే తెలియదు. ఆ ముహూర్తాన్ని ముందుకు జరుపగలిగితే మిగతా పనులు ఊపందుకుంటాయి.

    "అదే ఎలా అని?!"

    "ఆ వ్యక్తి రేపు పగలు ఒంటిగంట ప్రాంతంలో అబిడ్స్ లోని దక్కన్ ఆప్టికల్స్ షాప్ కి వస్తున్నట్టు తెలిసింది అంటూ ఆగిపోయి ఫోన్ అందుకున్నాడు.


                               *    *    *


    మిట్ట మధ్యాహ్నం - అబిడ్స్ సెంటర్- రోహిణీకార్తె ఎండను సయితం లెక్కచేయని జన ప్రవాహం_ బ్రతుకుతెరువులో భాగంగా.... అంత ఎండలోనూ షాపింగ్ చేస్తున్న జనం.

    జ పి వో ముందున్న ట్రాఫిక్ కంట్రోల్ వేలాండ్ దగ్గర ట్రాఫిక్ సర్కిల్, కానిస్టేబుల్స్ మరో నలుగురు ట్రాఫిక్ కానిస్టేబుల్స్ అక్కడ కూడా ఏ వింతాటలేదు, ప్రత్యేకతలేదు అప్పటివరకు.

    మరికొద్ది నిముషాల్లో అక్కడో దారుణం జరగబోతుందన్న సంగతి అక్కడున్న ఎవరూ వూహించనిది.

    44 రోజులు మాత్రమే తన బ్రతుకు_

    శుక్రాచార్య అబిడ్స్ లో సిటీబస్ దిగాడు. చుట్టూ చూసాడు. అంతా మామూలుగానే వుంది.

    నెమ్మదిగా అడుగులు వేస్తూ వచ్చి దక్కన్ ఆప్టికల్స్ షాప్ లోకి ఎంటర్ అయ్యాడు....

    టైమ్ చూసుకున్నాడు 12.45....

    మరో పావుగంట ఆగితే_ అనుకున్నది అనుకున్నట్లే జరిగితే_ 16వ నిముషం నుంచే మహాభారత అశ్వ సంగ్రామం మొదలవుతుంది.

    మంచి కళ్ళజోడు ఫ్రేమ్ కోసం వెళుతున్నట్లు నటిస్తూ కాలం వెలిబుచ్చుతున్నాడు భారంగా. ఈ పధకంలో ఎక్కడ పొరపాటు జరిగినా తన జీవితమే వృధా.

    అసలు వస్తాడా....? అనుకున్న టైమ్ కే వస్తాడా! ఆలస్యం చేస్తాడా! ఇతను ఆలస్యం చేస్తే శశాంకతేజ్ దత్తా కొడుకు యర్లీగా వచ్చి వెళ్ళిపోతే? మరలా ఎప్పటికి దొరుకుతుంది ముహుర్తం? అతిసాధారణమైన సంఘటన ద్వారా శశాంక విశ్వాసం పొందటం చాలాకష్టం.... శశాంక విశ్వాసం పొందకపోతే సంగ్రామం మొదలవదు.

    ఎలా....?

    మడమ నుంచి వేలాడే వాచీని చేతిలోకి తీసుకున్నాడు. సెకన్ల ముళ్ళవేపు చూసుకుంటున్నాడు శుక్రాచార్య__ వణుకుతున్న చేతులతో.

    గతంలో ఓ అమ్మాయి విషయంలో శశాంక కొడుకు విశ్వదత్తకు కరీం అనే వ్యక్తికి ఘర్షణ జరగటం. అందులో కరీంని ఎప్పటికైనా చంపుతానని విశ్వదత్త ఛాలెంజ్ చేయటం_ ఆ సమయంకోసం విశ్వదత్త వేటకుక్కలా ఎదురు చూట్టం అంతా శుక్రాచార్య కనుక్కోగలిగాడు కొంత డబ్బు ఖర్చుతో.

    కానీ అప్పటి నుండి కరీం తన జాగ్రత్తలో తనుంటున్నాడు. ఎప్పుడు ఎక్కడికి బయలుదేరినా విశ్వదత్తకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నాడు.

    విశ్వదత్త తండ్రిలాగే మహా కౄరుడు. దేనికి జడవడు_దేన్నీ లెక్క చేయడు. ఆ అహం డబ్బు వలన ,తండ్రి పలుకుబడి వలన వచ్చిందే.

    కోట్లకు కోట్లు పడగలెత్తిన శశాంకకు తన కొడుకు విశ్వదత్త అంటే ప్రాణం.... కొడుకు ఎన్ని ఆకృత్యాలు, అఘాయిత్యాలు చేసినా రక్షించుకుంటూ వస్తున్నాడు.

    తను కూడా ఎన్నో అఘాయిత్యాలు చేసినా చేతికి మట్టి అంటకుండా చూసుకోగల మేధావి....

    అందుకే శుక్రాచార్య దృష్టి ఆవేశపరుడైన అతని కొడుకు మీద పడింది.

    విశ్వదత్త ఎలాంటి ఘోరం చేసినా శశాంక తప్పించగలడు.

    అయితే శుక్రాచార్య ఆలోచనే వేరు__

    విశ్వదత్త తప్పు చేయాలి. దాన్నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ శశాంక కొడుకును రక్షించుకోలేకపోవాలి. అది అంతా పకడ్బందీగా జరగాలి.

    అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆశ్వభరత్ ను రంగంలోకి దింపాలి__ అతని ద్వారా విశ్వదత్తను రక్షించాలి. ఉరిశిక్ష ఖాయమనుకుంటున్న తన కొడుకును రక్షించగలిగిన అశ్వభరత్ ను పూర్తిగా విశ్వసిస్తాడు శశాంక. అదే శుక్రాచార్య పధకం.

    దాని గురించే ఇండియన్ పీనల్ కోడ్ ని ఏడు పదుల వయస్సులో కూడా క్షుణ్ణంగా ఆకలింపు చేసుకున్నాడు చాలా కష్టంమీద.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra