Home » Adivishnu » Adi Vishnu Novels 3


    "ప్రేమ దెబ్బలోపడి ఫార్ములాలు మరిచి పోయేనుసార్!"

 

    "ఆల్ రైట్! నీకు సులోచనతో పెళ్ళి జరగాలి అంతేగా!"

 

    "యస్సర్!"

 

    "ఆ పనేదో నేను చేస్తాను!"

 

    "థాంక్యూసార్!"

 

    "నాకింకో పెర్సనల్ ప్రాబ్లమ్ వచ్చి పడింది. అందుకు నువ్వు నాకు సాయపడాలి. నే చెప్పినట్లు చెయ్యాలి!"

 

    "ఒ.కె. సార్! సులోచనతో నా పెళ్ళి జరగాలేగాని, మీరేం చేయమన్నా చేస్తాను సార్. బిలీవ్ మి సార్!"


                                                            *  *  *


    శేషు జయకి పూలసెజ్జా వగైరాలిచ్చి అంటున్నాడు.

 

    "ఇప్పుడు మనం ప్రయోగించబోయేది ఫార్ములా నెంబర్ ట్వంటీత్రి! పూజగదికెళ్ళు. చెప్పింది చెయ్యి గో..."

 

    అంటూ ఆమెని గదిలోంచి బయటకు నెట్టేడు.

 

    -పూజగదిలో జయపూజ చేసుకుంటోంది. శేషు జయా జయా అని పిలుస్తూ ఆ గదిలోకి వెళ్ళబోయేడు.

 

    జయ అమ్మవారివేపు చూస్తూనే అరిచేసింది.

 

    "ఆగండక్కడ! ఎక్కడెక్కడో తిరిగొచ్చిన కాళ్ళతో పూజ గదిలోకి రాకూడదు. వెళ్ళండవతలకి!"

 

    ఆమె కేకలకు వామనరావు కూడా బెదిరిపోయేడు. పేపరు పుచ్చుకుని ఆ గది పరిసరాలకు వచ్చేడు.

 

    శేషు మరింత హీటెక్కిపోయి అరుస్తున్నాడు.

 

    "డేమిట్! బ్లడీ భక్తి ఎక్కువై పోయింది. భర్తకంటే భక్తి ఎక్కువా? ఎక్కడెక్కడో తిరిగొచ్చిన కాళ్ళతో పూజ గదిలోకి రాకూడదట. నో-ఈ రోజు నుంచి పూజా గీజా బంద్!" అంటూ అతను పూజ గదిలోకి వెళ్ళబోయేడు.

 

    అతన్ని అమాంతం పట్టుకుని ఆపేసేడు వామనరావు. చాలా సౌమ్యంగా చెప్పేడు-

 

    "ఆడవాళ్ళు పూజలు చేసేది మన గురించేరా! మన బాగు గురించీ, మన క్షేమం గురించే నాయనా!"

 

    తండ్రి చెయ్యి విదిలించుకుని తండ్రి మీద విరుచుకుపడ్డాడు శేషు.

 

    "నో! నా సేఫ్టీ, నా క్షేమం నాకు బాగా తెలుసు. మొగుడి మీద అధికారం చెలాయించాలనుకుంటోంది జయ. దానికి ఈ పూజొకటి వంక. అయ్ కాంట్ స్పేరిట్! (ఆగి అన్నాడు) నువ్వే చెప్పు నాన్నా! అమ్మ బతికున్న రోజుల్లో ఎప్పుడైనా నీ కాళ్ళకు బ్రేకు లేస్తే ఊరుకున్నావా? డిడ్ యూ స్పేర్ హర్?"

 

    అంటూ అతను మేడ మీదకి విసురుగా వెళ్ళిపోయేడు.

 

    వామనరావు కళ్ళ ముందు గతంనాటి బొమ్మ కనిపించింది. బాధగా 'సుభద్రా' అని గొణుక్కున్నాడు.

 

    జగన్నాధమింట్లో జయ గోళ్ళు కొరుక్కుంటుంటే, సుభద్ర అనునయంగా సలహా యిస్తోంది!

 

    "మగవాడికి ఆవేశం ఎక్కువమ్మా! పూజ గది, స్నానాలగదీ చూసుకోడు. ఆడవాళ్ళం మనమే అణుకువగా వుండాలి. సర్దుకు పోవాలి. రాజీపడాలి!"

 

    జయ బాధగానే అన్నది-

 

    "ఈ సంగతులన్నీ చెప్పడానికి ఆ ఇంట్లో నాకో అత్తగారు కూడా లేదు ఖర్మ!"

 

    సుభద్ర తెల్లబోయింది.


                                      48


    డైనింగ్ టేబిల్ మీద తండ్రీ కొడుకులు కూచుని వున్నారు. బ్రేక్ ఫాస్ట్ టైమ్. జయ ఇద్దరికీ టిఫిన్లు పెట్టింది.

 

    వామనరావు టిఫిన్ తింటూ బహు మెచ్చుకుంటున్నాడు-

 

    "ఓహో...అద్భుతం. పెసరట్టంటే ఇలా వుండాలి. ఉప్మాకూడా జత చేసేవేమో-గొప్ప రుచిగా వుందమ్మా!"

 

    అంత ప్రశంసనూ బూడిద పాలు చేసేసేడు శేషు. ప్లేట్ ని విష్ణుచక్రమల్లె విసిరేస్తూ అన్నాడు-

 

    "ఛీ ఛీ!ఇది పెసరట్టా! (ఇంకో ప్లేటుని కూడా విష్ణుచక్రం చేసి) ఇది ఉప్మానా? ఎవరు చేసింది?"

 

    భయం భయంగా చెప్పింది జయ-

 

    "నేనే చేసేనండి!"

 

    శేషు భయంకరంగా అరిచేడు-

 

    "అందుకే ఇట్లా అఘోరించింది" అంటూ ఇంకో ప్లేటుని కూడా విష్ణు చక్రమల్లె విసిరేసేడు.

 

    భయపడిపోతున్న వామనరావుతో అనునయంగా అన్నది జయ.

 

    "మీరూ రుచి చూసేరుగా మామయ్యా! మీరైనా చెప్పండి."

 

    మేకపోతు గాంభీర్యం వలగబోస్తూ అన్నాడు వామనరావు.


    
    "ఏమిటమ్మా చెప్పేద? ఎంతో బ్రహ్మాండంగా...అద్భుతంగా వుంటేనూ-నా జన్మలో ఇంత రుచికరమైన పదార్థాలు నేనెప్పుడూ తినలేదనుకో!"

 

    శేషు అడ్డంపడ్డాడు.

 

    "నాన్నా" అమ్మ బతికివుంటే నువ్వామాట అనగలిగేవాడివేనా."

 

    వామనరావు అబద్ధమాడేసేడు-

 

    "ఒరే శేషూ-భార్య చేసిన వంటకి వంకలు పెట్టకూడదురా! ఏం చేసినా కళ్ళు మూసుకుని భోంచేయాల్సిందే. అది రూలు! ఆ రోజుల్లో...మీ అమ్మ...ఇప్పుడవన్నీ ఎందుకులే. అమ్మా జయా-ఇంకో ప్లేటు తింటాడు."

 

    శేషు అకస్మాత్తుగా లేచి నించుని అన్నాడు-

 

    "నో నే తినను. అంత రుచిగా వుంటే నువ్వే తిను! (జయతో)

 

    నాన్న తెచ్చిన సంబంధం గదాని కళ్ళు మూసుకు చేసుకున్నందుకు బాగానే బుద్ధి చెబుతున్నావ్!"

 

    "ఒరే శేషూ-తొందరపడుతున్నావ్!" అన్నాడు వామనరావు.

 

    "అవును. తొందరే పడ్డాను. నా పెళ్ళీ, నా భవిష్యత్తూ అన్నీ నీ చేతుల్లోపెట్టి తొందరే పడ్డాను. నా టేస్టుకి తగ్గ అమ్మాయిని ప్రేమించి పెళ్ళిచేసుకుంటే చాలా సుఖపడే వాడ్ని నాన్నా! చాలా సుఖపడేవాణ్ని!" అంటూ అతను వెళ్ళిపోయేడు.

 

    జయ కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది. వామనరావు కడుపు తరుక్కుపోయింది. అతను ఆమెను ఓదార్చే ప్రయత్నంలో అన్నాడు-

 

    "ఊరుకోమ్మా! ఊరుకో! వాడేదో ఆవేశంలో అన్నాడేగాని-నీ మీద ప్రేమలేక కాదు!"

 

    ఏడుస్తూనే అన్నది జయ-

 

    "మీకు తెలీదండీ! ఆయనకు నేనంటే అసలు పడదు."

 

    వామనరావు గంభీరంగా అన్నాడు.

 

    "చూడమ్మా! మీ పెళ్ళి చేసింది నేను. నా చేతులమీదుగా జరిగిన పెళ్ళి సుఖశాంతుల్తో నిండా నూరేళ్ళు వర్ధిల్లాలి. అది రూలమ్మా! పైగా మీరిద్దరూ చిలకాగోరింకల్లా ఉంటే-నువ్వంటే పడదంటావేమిటి?"

 

    ఏడుస్తూనే చెప్పింది.

 

    "చిలకా గోరింకల్లా మేము ఎప్పుడూ లేమండీ! అదంతా నటన! మీరు చేసిన పెళ్ళిలో చిరాకులూ చిటపటలూ వస్తే మీరేమనుకుంటారోనని ఇన్నాళ్ళూ ఆయన నటించేరు. నా బాధ ఎవర్తో చెప్పుకోవాలో...ఎట్లా చెప్పుకోవాలో తెలీకుండా వుంది. చెప్పుకోడానిగ్గానీ, ఓదార్పు పొందడానికి గానీ అత్తగారున్న ఇల్లయినా బావుండేది!"

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra