ఇంకెక్కడా ఇంకెవరి వంటిమీదా లేవు.
అసలేం జరిగింది?
సాహస్ అలా ఆలోచిస్తూ ఉండగానే అతని మనో నేత్రానికి ఒక విశేషం కనబడింది.
ఏమిటది?
ప్రగతి వున్న క్వార్టర్స్ లోకి దృష్టి సారిస్తే -
హాల్లో ప్రగతి పాలరాతి బొమ్మలాగా కదలిక లేకుండా నిలబడిపోయి వుంది.
కానీ అక్కడ అదృష్టవశాత్తు ఇంకెవ్వరూ లేరు.
అయితే -
అదే టైంలో లోపలికి అడుగుపెట్టాడు ఒక వ్యక్తి.
అతను అచ్చం తనలాగే వున్నాడు.
అవును! అచ్చం తను అంటే సాహస్ లాగే వున్నాడు. అతన్ని చూసినవాళ్ళంతా అతనినే సాహస్ అని అనుకుని తీరవలసిందే.
కానీ చూస్తుంది ఇంకెవరో కాదు.
తను.
అంటే సాహస్.
చూస్తోంది ఇంకో సాహస్ ని.
ఆ ఇంకో సాహస్ ఎంతో సాహసంగా ప్రగతి క్వార్టర్స్ లోకి ప్రవేశిస్తున్నాడు.
ప్రగతి అక్కడ శిలా విగ్రహంలా నిలబడి వుంది.
ఆ ఫేక్ సాహస్ ఆ అమ్మాయిని అలాంటి స్థితిలో చూస్తే -
ఇంకేమైనా వుందా?
కానీ...ఎలా? ఏం చేయాలి?
తక్షణం సాహస్ కి గుర్తువచ్చాయి సింగినాదం, జీలకర్ర మాటలు.
'జపమాల చేతిలో వుంటే చెయ్యలేనిది ఏమిటి?'
జపమాల!
జపమాల అనుకోగానే మళ్ళీ చిన్న ఎలక్ట్రిక్ షాక్ లాంటిది!
జపమాల అనుకోగానే తన బాడీలో ఇంత రియాక్షనా?
ఈ ప్రభావం ఎంతవరకు పనిచేస్తుంది?
నగ్నంగా, నిస్సహాయంగా నిలబడి వున్న ప్రగతి వంటిమీదకి బట్టలు తెప్పించమంటే తెప్పిస్తుందా?
తెప్పిస్తుందా ఈ జపమాల? తెప్పిస్తుందా?
అద్భుతం!
అతను అలా అనుకుంటూ వుండగానే -
అక్కడ -
ప్రగతి క్వార్టర్స్ లోని హాల్లోకి అడుగుపెట్టాడు సాహస్ రూపంలో వున్న కెప్టెన్.
వెంటనే-
అత్యంత ఆశ్చర్యకరంగా -
నగ్నంగా నిలబడి వున్న ప్రగతి వంటిమీదకి ఒక చిన్న చీర వచ్చేసింది.
అది చూసి షాకయినట్టు ఒక్క అడుగు వెనక్కు వేశాడు కెప్టెన్ టూటూ.
వెనక్కి వెళ్ళి కళ్ళు చిట్లించి ప్రగతి వైపు, ఆమె వంటిమీదకి వచ్చిన చీర వైపు చూశాడు.
తను మహా మాయావి.
సంకల్పమాత్రం చేత సమస్తమైన పనులూ చేయగలిగినవాడు.
అలాంటి తన సంకల్పానికి ఇలా అడ్డు తగిలి ఈ ప్రగతి వంటిమీదకి చీర తెప్పించగలిగింది ఎవరు?
ఎవరు?
ఎవరు?
మనసంతా కేంద్రీకరించి చూశాడు కెప్టెన్ టూటూ.
కానీ అతనికి ఎవరూ కనబడలేదు.
తిరిగి ప్రగతి మీదకి తన దృష్టి సారించాడు.
"ఈ అమ్మాయి వంటిమీద బట్టలెందుకు? అనవసరం" అనుకున్నాడు.
వెంటనే -
ప్రగతి వంటిమీద ఉన్న చీర కాస్త జారిపోవడం మొదలుపెట్టింది.
హఠాత్తుగా స్పృహలోకి వచ్చింది ప్రగతి.
గాభరాగా రెండు చేతులతో చీరను పట్టుకుని గుండెల దగ్గర హత్తుకుంది.
దృష్టి ఇంకా తీక్షణంగా ఉంచి చూశాడు కెప్టెన్ టూటూ.
ప్రగతి చీర జారిపోతూనే వుంది.
కంగారుగా, విహ్వలంగా జారిపోతున్న చీరను పట్టుకోవాలని, చుట్టేసుకోవాలని ప్రయత్నం చేస్తోంది ప్రగతి.
దృష్టి ఇంకా తీక్షణం చేశాడు కెప్టెన్ టూటూ.
ఒక్కసారిగా -


