Home » Vasundhara » ఆడపడుచు

    "ఆలోచించి చూడు. నీకే కనబడుతుంది సంస్కారం!"   
    "నాకేం కనబడ్డం లేదు...పరాయి ఆడవాళ్ళతో హోటళ్ళలో కులికే మీ బాస్ లో సంస్కారాన్నెలా చూడగలను?" అందిముక్త.   
    "శ్రీకృష్ణుడు గోపికలను వస్త్రాపహరణం చేస్తే అది రాసలీల అయింది. శ్రీకృష్ణుడుదేవుడయ్యాడు. నా బాస్ నాకు దేవుడు-" అన్నాడు గౌతమ్.   
    "కానీ - ఆయనలో వేరే దురుద్దేశ్యముందేమో ఆలోచించారా?   
    "వేరే దురుద్దేశ్యమంటే?  
    "ఆయన పనిగట్టుకుని అజంతా ఇంటర్నేషనల్ గురించి మీకెందుకు చెప్పాడు? అది తప్పుగాదని మీ దగ్గరెందుకు సమర్ధించాడు?"
    "ఎందుకో చెప్పానుగా-అదాయన సంస్కారం..."
    "సంస్కారంకాక దురుద్దేశ్యమేం కనబడలేదా మీకు!"
    "నీకేదైనా కనబడిందా?"
    "నేను మీ సంగతడిగాను..."
    "నా సంగతి నేను చెప్పాను. నీసంగతి చెప్పు..."
    "ఈయన కెలా చెప్పేది?" అనుకుంది ముక్త. మనసులో ఆమెకు రవంత అనుమానం కూడా వచ్చింది. భర్తకు నిజంగా అసలు విషయం స్పురించలేదా, నటిస్తున్నాడా అని!
                                             9
    "హలో!" అంది ముక్త భయపడుతూనే.
    "స్వీట్ వాయిస్..."
    ఆ గొంతు ముక్త గుర్తుపట్టి-" ఎందుకు మీరిలా మాటిమాటికీ ఫోన్ చేసి నన్ను వేధిస్తారు?" అంది.
    "నాలో వేదన ఉంది...." అన్నాడు భానుప్రకాష్.
    "ప్లీజ్ - ఇక  మీదట ఇలా ఫోన్ చేయొద్దు..."
    "నువ్వు నన్ను కలుసుకొంటానంటే ఫోన్ చేయడం మానేస్తాను..."
    "కలుసుకోవడమెందుకు?"
    "నీ భర్త ప్రగతి కోసం"
    "నా భర్తకీ ప్రగతి చాలు...."
    "ఆమాట అతడిని చెప్పమను..."
    "మిమ్మల్నతడు తెలుసుకోలేక పోతున్నాడు. తెలుసుకో గలిగిన రోజున ఏమైనాజరుగుతుంది!"
    "నన్నతడు తెలుసుకున్నాడు. నువ్వే అతణ్ణి తెలుసుకోలేక పోతున్నావు..." ఫోన్లో నవ్వాడు భానుప్రకాష్.
    "అంటే?"
    "ఇంకా నీకు నీ భర్త ఉద్దేశ్యం తెలియలేదంటే అతడు నీ దగ్గర నటిస్తూండి ఉండాలి. లేదా నువ్వు నాతో అబద్దం చెబుతూండాలి..."
    ముక్తకు చాలా ఉక్రోషం వచ్చింది.-"ఇక్కడ ముసుగులో గుద్దులాటఅనవసరం. ఈరోజు నేను నా భర్తతో మాట్లాడి అసలు విషయం తేల్చేస్తాను..." అంది.
    "అందులో ప్రమాదముంది...." అన్నాడు భానుప్రకాష్.
    ఫోన్ లో అతడు వివరిస్తూంటే ముక్తకు మతి పోయినట్లయింది.
    జరుగుతున్నది గౌతమ్ కి తెలుసు. తన పరవు కాపాడు కోడం కోసం అతడు తెలియనట్లు నటిస్తున్నాడు. ముక్త నిలదీసి అడిగితే తనకేమి తెలియదనే అంటాడతడు. పైగా యింతకాలం నాకెందుకు చెప్పలేదంటాడు. నీ ప్రోత్సాహం లేకుండానే వ్యవహారమింతవరకూ వచ్చిందా అంటాడు అక్కణ్ణించి మాట మాటికీ భార్య ననుమానించడం ప్రారంభించి ఆమెకు జీవితంనరకం చేస్తాడు. అంత వరకూ గౌతమ్ మనిషిని చూసిన ముక్త ఇక మీదట రాక్షసున్ని చూస్తుంది.
    "అలా ఎన్నటికీ జరగదు...." అంది ముక్త.
    "ఎందుకు జరగదు? అసహాయుడైన మనిషి తన కంటే అసహాయుల్ని వెతుక్కుని వేధిస్తాడు. వివాహిత స్త్రీకి మించిన అసహాయులు మన దేశంలో ఎక్కడా ఉండరు..." అన్నాడు భానుప్రకాష్.
    ముక్త ఆలోచనలో పడింది.
    "నా మాట విను ముక్తా! ఇందులో నువ్వు చేస్తున్న తప్పేమీ లేదు. నువ్వు తప్పను కుంటున్నావు కాబట్టి  అది తప్పయింది. తప్పు కాదని అనుకో అప్పుడు సమాజంలో నీస్థాయి తప్పు చేసినా ఎవరు వేలెత్తి చూపలేని ఎత్తుకు చేరుకుంటుంది. ఈ ప్రసక్తి నీ భర్త ముందు తీసుకురాకు. అతడు తనకేమీ తెలియనట్లే ఊరుకుంటాడు అతడిని నిలదీశావా - నీకేమీ ప్రయోజనముండదు. వ్యవహారం నీకే ఎదురు తిరుగుతుంది..."
    "మీరు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు..."
    "లేదు. మధ్యతరగతి బలహీనతలు నీలోంచి తొలగించాలని ప్రయత్నిస్తున్నాను. అదీ నీ మంచికే!"
    "నామంచి గురించి మీ కెందుకు?"
    "నాకు నువ్వు నచ్చడం నీ అదృష్టం...."
    "ఏమైనా నేనిది భరించలేను. వారితో మాట్లాడతాను...."
    "బాగా ఆలోచించుకో. అందువల్ల ఎదురయ్యే ప్రమాదానికి నువ్వు తట్టుకోలేవు. భర్త నిరసనను ఏ స్త్రీకూడా భరించలేదని నాకు తెలుసు. నీ భర్తపై నీ కింకా నమ్మకముంటే - అది పోగొట్టడానికి గట్టి ఋజువు చూపగలను. అందుకు నువ్వో పని చేయాలి. నాలుగు రోజుల్లో నీ భర్త కో టూరు ప్రోగ్రాముంటుంది. కూడా నువ్వూ వెళ్ళొచ్చు. రాననకు. అతడితో బయల్దేరివెళ్ళి తర్వాతేంజరుగుతుందో చూడు..."
    ముక్త ఆలోచనలో పడింది.
    అవతల ఫోన్ క్లిక్ మంది.
                                                                           10
    గౌతమ్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు.
    "బాస్ చాలా మంచివాడు. ఇలాంటి గౌరవం మనకరుదుగా లభిస్తుంది..." అన్నాడతను.
    మర్నాడే గౌతమ్ టూర్లో ఒక పట్టణం చేరుకోవలసి ఉంది. ప్రయాణం కంపెనీ కార్లో. మకాం కంపెనీ గెస్ట్ హౌస్ లో కూడా అతడు భార్యను కూడా తీసుకుని వెళ్ళొచ్చు.
    "కొత్తగా పెళ్ళయిన వాళ్ళం. ఇంకా పిల్లలులేరు. బాస్ మనకిది హనీమూన్ ట్రిప్పనుకోమన్నాడు..."
    నిట్టూర్చింది ముక్త.
    "ఇంతమంచి విశేషం నీకేమీ ఆనందం కలిగించడం లేదా?"
    "లేదండీ - పంకజం మాటలు నన్ను భయపెడుతున్నాయి..."
    "ఎందుకు?"
    "మీ బాస్ ప్రవర్తన మంచిది కాదని మీకు తెలుసు. ఇదంతా ఆయనెందుకు చేస్తున్నట్లు?"
    "ముక్తా! మన సుఖం మనం చూసుకోవాలి. ఆయన ప్రవర్తనతో మనకేం పని?"
    "పంకజమంటుందీ - ఈ రోజుల్లో మగాళ్ళుకూడా బరితెగించారనీ - డబ్బు కోసం భార్యల్ని దాసుల కప్పుజెబుతారనీ...
    "అలాంటి వాళ్ళు లేకపోలేదు."
    తటపటాయిస్తూనే- "మీరూ అలాంటి వాళ్ళే  నంటుందామె-" అంది ముక్త   
    గౌతమ్ ముందులిక్కిపడ్డాడు. తర్వాత- "ఏమన్నావ్?" అన్నాడు. అతడి మాట నీరసంగా వచ్చింది.
    ముక్త మాట్లాడలేదు.
    "ఒకసారి ఆ పంకజాన్ని పిలు. ఏకిపారేస్తాను...."
    "వద్దులెండి. ఆపని నేనే చేశాను..."  
    "అసలా పంకజాని కాంత ధైర్య మెలాగొచ్చింది?"
    "మనింట్లో ఫోనుందని ఏడుపు. మీలాంటి చిన్న ఉద్యోగుల కిలాంటి సదుపాయాలుత్తినే రావుట..."
    గౌతమ్ ఆవేశపడ్డాడు - "ఆ పంకజం భర్త - ఆమెనలాగు పయోగించుకుంటున్నాడేమో అనలేక పోయావా?"
    "అన్నానండీ - ఆమె చలించలేదు. పంకజం అందంగా ఉండదు. తన భర్తకలాంటి దురూహలు లేవు కాబట్టే తన మంచితనాన్ని చూసి ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడంటుందామె..."
    "తనకందంలేదని అందమైన వాళ్ళంటే అసూయన్నమాట..."
    "అందమైన భార్యలు-భర్తల ప్రగతికి సోపానాలు....అంటుందామె!"
    ఆవేశంలో గౌతమ్ గొంతు వణికింది- "ఇలా మాట్లాడే మనిషి నొక్క క్షణం కూడా భరించ కూడను. నేనేవెళ్ళినిలదీస్తానో రోజు..."
    "అలాంటి వాళ్ళతో నోట్లో నోరు పెట్టి లాభం లేదండీ. ఊరూ వాడా ఏకంచేస్తారు..." అంది ముక్త.
    గౌతమ్ కొద్ది క్షణాలాయాసపడి- "బాస్టర్డ్...బగ్గర్..." అన్నాడు.
    "ఎందుకండీ ఆమెను తిట్టడం? నేను మిమ్మల్ని నమ్ముతున్నాగా?" అంది ముక్త భర్త వంక ఆప్యాయంగా చూస్తూ.
    "నువ్వు నమ్మడం దాకా బాగానే ఉంది. కానీ అసలనుమానమంటూ ఎందుకు రావాలి?" అన్నాడు గౌతమ్ ఉక్రోషంగా.
    "అదిసరే- అసలు సంగతి తెలిస్తే మీరింకా మండిపడతారు..."
    "ఏమిటది?"
    "పంకజం అంటుందీ - అజంతా ఇంటర్నేషనల్ గురించి మీ భర్తకు చెప్పి చూడు. అతడిక్కోపం రాదు సరిగదా- వారందర్నీ సమర్ధిస్తాడు. నీ భర్త బాస్ ప్రవర్తన మంచిది కాదను. అతడు దాన్నీ సమర్దిస్తాడు. అంటే అర్ధం నీ భర్త కూడా అలాంటి వాడేనని..."
    "ఇదంతా ఎందుకు చెబుతున్నావు?" అన్నాడు గౌతమ్ అనుమానంగా.
    "ఆమె చెప్పిందంతా విని ఊరుకోవడం తప్ప నాకు మీ మీదే అనుమానమూ లేదని చెప్పడానికి. నేనేం చెప్పినా భయం మీ బాస్ గురించే తప్ప మీ గురించికాదు. మీరే చెప్పండి. మీ బాస్ కన్ను మీ భార్య మీద పడితే ఏం చేస్తారు?"
    "అలాజరగదు...."
    "జరిగితే ఏం చేస్తారో చెప్పండి...."
    "ఆ పంకజం నీ బుర్ర పాడు చేసి లేని పోని సందేహాలు కలిగిస్తోంది. అలా జరగదని నేనంటున్నాగా?"
    "జరుగుతుందని నేననడంలేదు. జరిగితే ఏం చేస్తారూ అంటున్నాను..."  
    గౌతమ్ కళ్ళెర్ర బడ్డాయి. మనిషి ఆవేశంతో ఊగాడు.
    ముక్త అతడినే పరీక్షగా చూస్తూ - "ఇది నిజమైన ఆవేశమే! నటన కాదు...." అనుకుంది.
    గౌతమ్ ఇంకా ఆవేశంతో ఊగుతూనే ఉన్నాడు.
    "చెప్పండీ!" అంది ముక్త.
    గౌతమ్ ఏదో చెప్పబోయి - "ఎందుకులే - గోడలకు చెవులుంటాయ్ -" అన్నాడు.
    ముక్త ఉత్సాహం చల్లారి పోయింది.
    ఆమె ఆలోచనలో పడింది.
    ఏం జరుగుతుందిప్పుడు?
    గౌతమ్ ఆమెను సమీపించి దగ్గరగా తీసుకుని - "ముక్తా! కొన్ని ప్రశ్నలు వేసి నన్ను వేధించకు. నేను పిరికివాణ్ణి. కానీ నా పిరికితనం సమాజానికి భయపడి పారిపోయేలా చేయకు. సమాజం బలానికెదురు తిరక్కుండా చేస్తుంది. నా పిరికితనమే నాకు రక్ష. నా ప్రగతికి సోపానం. అయితే యిదంతా ఎందుకనుకుంటున్నావ్? నీకోసం....నిన్ను సుఖపెట్టడంకోసం....నిన్ను సంతోషంగా ఉంచడంకోసం...సుఖసంతోషాలతో నువ్వు నాదానివిగానే ఉండాలి. నువ్వు నాదానివికాక మరేమైనా అయితే.....నేనేంచేస్తానో తెలియదుకానీ ఏమైపోతానో తెలుసు. ముక్తా! నువ్వు చెప్పింది జరిగితే నేను పిచ్చివాడినైపోతాను...." అన్నాడు.
    ముక్తకతడి శరీరం చల్లగా తగుల్తోంది.....
    అతడు నటిస్తున్నాడో నిజం చెబుతున్నాడో ఆమెకు తెలియలేదు. కానీ -"నా వల్ల మీకన్యాయం జరుగదు...." అని మనసులో అనుకొందామె.
                                            11
    మర్నాడాఫీసుకు వెడుతూ - "సాయంత్రం నాలుగింటికి కార్లో వస్తాను. సామాను సర్ది రెడీగా ఉండు. ఆలస్యంచేస్తే బాగుండదు...." అన్నాడు గౌతమ్.
    అతడు వెళ్ళిపోగానే సంధ్యకు ఫోన్ చేసిందామె.
    సంధ్య యింట్లో లేదు. రాత్రిదాకా రాదని తెలిసింది.
    ముక్త భయపడింది. తన ప్రయాణం గురించి సంధ్యకు చెప్పాలనుకుందామె. అప్పుడు సంధ్య భర్త విషయంలో జాగ్రత్త పడుతుంది.
    ఈ టూరు గురించామెకు బెంగగానే ఉంది.
    ఎంత చెప్పినా గౌతమ్ కర్ధంకాదు. అతడు వేరే లోకంలో ఉన్నాడు.
    "ముక్తా!  నువ్వు చెప్పింది జరిగితే నేను పిచ్చివాడినైపోతాను-" అన్న భర్త మాటలామెను కలవర పెడుతున్నాయి
    పన్నెండు గంటలకు ముక్తకు ఫోన్ వచ్చింది భానుప్రకాష్ నుంచి!  
    "ముక్తా! టూరుకు వస్తున్నావుకదూ! వస్తావని నాకు తెలుసు. రానన్నా నీ భర్త నిన్నొప్పించగలడని నా నమ్మకం...."  
    "వస్తున్నాను. ఇప్పుడేం జరుగుతుంది?"
    "తినబోతూ కూరరుచి అడగడమెందుకు?"
    ఫోన్ క్లిక్ మంది.
    ఫోన్ వచ్చేక ముక్త భయం పెరిగింది.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra