Home » Suryadevara rammohan rao » అశ్వభారతం


    "తర్వాత వచ్చేముందు రెండు రోజులపాటు అక్కడే వున్నాన్నేను. ఆ గుర్రం ఫోటో ఫ్రింటు వేయించి ఆ అమ్మాయికి ప్రజెంటు చేయడం నాకిప్పటికీ జ్ఞాపకం...." ఆగిపోయాడు అనురాగ్.

    "ఆ అమ్మాయి పేరు.... మోతీ కదూ....?"

    ఇప్పుడు ఆశ్చర్యపోవడం అనురాగ్ వంతయింది.

    "మాతీ....మోతీ.... అవును మోతీయే...." ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ అన్నాడు అనురాగ్.

    అంతలో బేరర్ రెండు ప్లేట్లతో బిర్యాని తెచ్చాడు.

    ఇద్దరూ తింటున్నారు.

    "నాకు తెల్సిన విషయాలివే...." తింటూనే అన్నాడు అనురాగ్.

    తింటూనే దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు సుదర్శన్.

    "నేనమ్ముతున్నాను...." సుదర్శన్ దృఢంగా అన్నాడు.

    తినడం పూర్తయింది.

    అప్పుడు అడిగాడు అనురాగ్ ఓ విషయం.

    "రాయల్ కింగ్ ఫోటోని నేను మోతి కిచ్చాను. ఆ ఫోటో మీచేతికెలా వచ్చింది....?"

    "వచ్చింది. వస్తుంది. ఒళ్ళు బలిసిన వాళ్ళు డబ్బుతో కొవ్వు ఎక్కిన వాళ్ళు ఆడుకునే రాయల్ గేమ్ హార్స్ రేస్. ఏదైనా వస్తుంది." ఏదైనా పోతుంది__" ఒక కట్ త్రోట్ క్రిమినల్ అయిన సుదర్శన్ కి కూడా కొన్నిటిపై తన వృత్తితో సంబంధంలేని నిర్దుష్టమైన అభిప్రాయాలు!!!

    "ఆ అమ్మాయిని కల్సి తీసుకున్నారా? ఆ ఫోటో__? ఆమె ఇప్పుడెక్కడుంది....? ఆయన ఓ ఆడది రేస్ హార్స్ కి బాడీగార్డా....? ఆశ్చర్యంగా వుంది...."

    "ఆ అమ్మాయిని కల్సి తీసుకోలేదు...."

    "మరి....!!!"

    "మోతీ ఆ ఫోటోను ఎవరికీ ఇవ్వలేదు. ఆమెను చంపి ఆ ఫోటోను తీసుకున్నారు...." అనురాగ్ ఉలిక్కిపడ్డాడు. మోతీ చావును నమ్మలేకపోయాడు....అతను అబద్ధం చెప్పడని తెల్సినా ఆ నిజం అతనికి మింగుడు పడడం లేదు.

    "నిజంగానా....?"

    "నిజంగానే...."

    "ఎవరు....!"

    "ఆ ఫోటో అవసరం వున్న వాళ్ళు...."

    "అంటే మీరా....?"

    "కాదు....కాని నీవలనే చచ్చిపోయింది...."

    "అదెలా...."

    "ఆ గుర్రాన్ని నీవు ఫోటో తీశావు. అది ఆ గుర్రం యజమానికి ఇష్టం లేదు. గుర్రం రక్షణకి నియమించిన ఆమె ఆ ఫోటోని తీయనీయకూడదు. తీయనీయగూడదనే నీ ఫిల్మ్ ని కాజేసి ఫాగ్ చేసింది. కాని తప్పు చేసింది. నీవు ఆ పాటికే ఫిల్మ్ ని దాచేసి వుండవచ్చని ఆలోచించాలి__అదామె చేయలేదు. ముందు నిన్ను మందలించిన ఆమె ఆ ఫోటో ఆమెకే నీవు ప్రజంట్ చేస్తే దాన్ని చింపి వుండాల్సింది. ఆ ఫోటో బావుండో, నీవు బావుండో దాన్ని ఆమె దాచుకుంది. అది మరొకరు ఆమె నుంచి తస్కరించారు. ఆ తస్కరించినవారు ఆ విషయం బయటపడేలా చేశారు. అది మోతీ యజమానికి తెలిసింది. ఎంతో రహస్యంగా వుంచాలనుకున్న అతని పథకం మోడీ ద్వారా లీక్ అయింది. అందుకే ఆమె ప్రాణ వాయువుల్ని లీక్ చేశారు...."

    "నాకేం అర్ధం కావడంలేదు. ఒక గుర్రం కోసం ఒక నిండు ప్రాణాన్ని తీస్తారా....?"

    "ఒక రేస్ హార్స్ కోసం ఒక ప్రాణం పోవడం నీకు ఆశ్చర్యం. నాకు పది ప్రాణాలు పోవడం కూడా ఆశ్చర్యమనిపించదు...."

    "నాకంతా అయోమయంగా వుంది...." మోతీచావు అనురాగ్ ని అప్ సెట్ చేసింది.

    "మీకో రహస్యం చెబుతాను.... ఈ కింగ్ హార్స్ చుట్టూ రెండు కోట్ల రూపాయల పందాలు తయారవుతున్నాయి. ఆ గుర్రం చాలా గొప్ప జాతికి, వంశానికి చెందినది...."

    మధ్యలోనే అడ్డొచ్చిన అనురాగ్.

    "గుర్రానికి జాతి వుండవచ్చు కాని వంశమేమిటి....?"

    "పెడిగ్రీ...."

    "అంటే....?"

    "నీవు ఏ జాతి....?"

    "మానవజాతి...."

    "ఏ వంశం....?"

    "వేగుంట...."

    "అంటే....?"

    "మా వంశానికి చెందిన సర్ నేమ్.... ఇంటిపేరు ఇంటి పేరు మీద వంశాన్ని గుర్తిస్తారు...."

    "అవును గదా.... మీ వంశంలో ఎన్ని తరాల గురించి చెప్పగలవు....?"

    "నా గురించి, మా నాన్న గురించి, మా తాత గురించి, ముత్తాత గురించి...."

    "అంతేగదా....మహా అయితే మీ ముత్తాత తండ్రివరకు__లేదంటే మీ తాతకు ముత్తాత వరకు వెళ్ళగలవు. వారి గురించి అతికష్టంమీద సమాచారం ఇవ్వగలవు. అది మీ వంశంలో తరాల వివరాలు రికార్డ్ చేసే అలవాటు వుంటే, అంటే నీనుంచి ఆరు తరాల వెనక్కు. నిన్ను నీ తరాన్ని తీసేస్తే ఐదు తరాల వెనక్కు వెళ్ళగలవు అంతేనా?"

    "కావచ్చు...."

    "మానవజాతిలో వంశపారంపర్యంగా వచ్చే లక్షణాలు తరతరాలకీ సంక్రమించవు. నీ తాత ముత్తాత పెద్ద కవి అయి వుండవచ్చు. నీ తాత తాత పహిల్వాన్ కావచ్చు. నీ తాత తండ్రి స్వాతంత్ర్యయోధుడు కావచ్చు. నీ తాత సంగీత విద్వాంసుడు కావచ్చు. నీ తండ్రి బిజినెస్ మాన్ కావచ్చు. నీవు ఫోటో గ్రాఫర్ వి.

    నీ ముత్తాత ముత్తాత ఏమిటో నీకు తెలియదు. అసలు నీ వంశానికి మూలపురుషుడు ఎవరో తెలియదు.

    స్టాలిన్ కొడుకు కమ్యూనిస్టు కాకపోవచ్చు. మార్క్స్ మనవడు సైంటిస్టు కావచ్చు. చార్లీచాప్లిన్ మనవడు సాడిస్టు కావచ్చు. మహాత్మాగాంధీ మనవళ్ళు__

    లాల్ బహదూర్ శాస్త్రి కొడుకులు__ఏరి వీళ్ళంతా__ఊరూ పేరూ లేకుండా అనామకంగా__

    రాచరికాల కాలంలో రాజు కొడుకు రాజు కావడం కూడా అభిరుచి వలన కాదు. రాచరిక శాసనం ద్వారా__ప్రజల మూర్ఖత్వం ద్వారా వంశ పారంపర్యంగా లభించే పదవులే.

    ఎంతమాత్రం ప్రాముఖ్యంలేని మానవజాతి యొక్క వంశపారంపర్య లక్షణాలు సుస్థిరం కాకపోయినందువల్లే ఎవరి తరానికి వారు బ్రతికేస్తారు__తప్ప గతవంశపు గొప్పలు లేవు. చెప్పుకోరూ- చెప్పినా ప్రయోజనం వుండదు.

    అందుకే దేశ చరిత్రకి కాలవాళిక వుంటుంది, (కాలవాళిక: దేశ, ప్రపంచ చరిత్రల్ని శిధిలంకాని పద్ధతిలో రికార్డు చేసి భూస్థాపితం చేస్తారు. ఇప్పటి తరం నాశనం అయినా, భవిష్యత్ తరాలకు గత చరిత్రను చెప్పే బాధ్యతను ఆ కాళవాళికే తీసుకుంటుంది....ఆ కాళవాళికను భవిష్యత్ తరాలు కనుక్కోగలిగితే, ప్రస్తుతం ఇండియాలో అలాంటిది ఢిల్లీలో వుంది.)

    "కాని ఈ ఆశ్వజాతిలో అట్లాకాదు. కొన్ని పదుల, వందల తరాల వరకు వెనక్కు వెళ్ళవచ్చు. ఉదాహరణకి రాయల్ కింగ్ నే తీసుకుందాం. దాని తండ్రి తల్లి, ఆ తండ్రి తండ్రి ఇలా....20వ శతాబ్దంలోంచి 17వ శతాబ్దం వరకు వెళ్ళవచ్చు. ఏ గుర్రం ఏ రేసులో గెల్చింది....? ఎన్నిసార్లు గెల్చింది....? ఎప్పట్లో గెల్చింది....? ఏ వయసులో ఆ పందెంలో గెల్చింది....? ఎన్ని వందల మీటర్ల పందెంలో పాల్గొంది? ఎన్ని సెకన్లలో, నిమిషాల్లో ఆ పందెం దేనికి చెందిన విన్ పోస్టుని దాటింది....? అది ఆయా పందాల సందర్భాల్లో ఎంత బరువున్న జాకీలను మోసింది....? (జాకీ: గుర్రపుపందేలలో వాటిని పరిగెత్తించే__ ప్రత్యేకమైన శిక్షణ పొందిన వ్యక్తి)

    "ఆ పందేలలో ఎందులోనైనా ఫాల్స్ నైస్ ల్సో పడిపోయిందా?"

    "ఇలాంటివన్ని భద్రంగా రికార్డు చేసి వుంచుతారు. ప్రపంచవ్యాప్తంగా దానికో డైరెక్టరీ మెయిన్ టెన్ చేస్తారు. దీన్నిబట్టే గుర్రాన్ని కొనేవారు- వాటిని పందెంలో పాల్గొనేందుకు అనుమతిని రేస్ క్లబ్ వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు.

    పందెంలో వాటి వేగం, క్రమశిక్షణ, తెలివితేటలు, ఆరోగ్యం లాంటి లక్షణాలు వంశపారంపర్యంగా వస్తుంటాయి...."

    ఎప్పుడూ ఎన్నో పందాలు, గుర్రాలు రేసెస్ అవి వినడం తప్ప వీటి వెనుక ఇంత వెల్ ఆర్గనైజేషన్ వుందని ఊహించలేదు....అనురాగ్ ఎన్నో విషయాలు, మరెన్నో మిస్టరీలు మన పక్కనే జరుగుతున్నా వాటివలన మన జీవితాలు ప్రభావితం అవుతున్నా మనకు తెలియదు. మనకు తెలిసినట్లే అనిపించి, తెలియని మిస్టీరికల్ సొసైటీలో బ్రతుకుతున్నాం.  

    మన పక్కనే జరుగుతున్న చెడు మనల్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేయకపోయినా పరోక్షంగానైనా తప్పదు.

    చెడు వినకు_ చెడు కనకు_ చెడు మాట్లాడకు లాంటి మూడు కోతుల ద్వారా చెప్పే నీతిసూత్రపు భాష్యం మారిపోయింది. కావాలంటే చెడు మాట్లాడకు అంతేగాని చెడు చూడకు- వినకు అనేవి ఎలా సాధ్యం. బ్రతుకున్నదే వాటిమధ్య, పైగా అవి పలాయనవాదులు చెప్పే సూత్రాలే అవుతాయి.

    చెడు చూడాలి_ వినాలి_ వీలైతే దాన్ని ఎదుర్కోవాలి. సూత్రం ప్రకారమైతే రచయితగా నేనీ నవల రాయగూడదు. చెడు చూపిస్తాను, చదివిస్తాను. దాని వెనుక జరిగే ఘోరాలు చెబుతాను. ఆ చెడును మన మధ్య నుంచి ఎలా తొలగించుకోవాలన్నదే నా ప్రధానోద్దేశం. అంతేగాని గుర్రం పందేలు ఆడడం తెలియనివారికి ఎలా ఆడాలో తెలియచెప్పడం కాదు....ఈ నవలా రచయితగా ఇదే నా ప్రధానోద్దేశం....ఈ రచనలో కల్పితాలు, కట్టుకధలు లేవు_)

    దీర్ఘమైన ఆలోచనల్లో అనురాగ్ సుదర్శన్ మాటలకి ఉలిక్కిపడ్డాడు.

    "ఇక అసలు విషయానికొద్దాం. ప్రస్తుతం ఆ గుర్రం ఒక వ్యక్తి దగ్గరుంది. ఆ వ్యక్తి ఆ గుర్రాన్ని ఎక్కడుంచాడో తెలియదు. మరో ఆరునెలల్లో హైదరాబాద్ రేస్ క్లబ్ లో జరగబోయే ఒక ప్రతిష్టాత్మకమైన పందెంలో అది పాల్గొనబోతుంది. అతనికి నా బాస్ ప్రత్యర్ధి నా బాస్ ఆ గుర్రాన్ని షూట్ చేయమని నాకు పురమాయించాడు, లేదనుకో నన్ను షూట్ చేస్తాడు. ఒక కట్ త్రోట్ ప్రొపెషనల్ కిల్లర్ ని అయినా ఇలా మాట్లాడటం ఆశ్చర్యంగా వుంది కదూ. కాని నాకు మనస్సుంది_ బాధ్యతలు తీర్చుకునే ప్రయత్నంలో ఈ వృత్తిలో రాజీ వుంది...."

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra