"ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది. మన పరిస్థితి" అన్నాడు చిరంజీవి. స్పూర్తి మాట్లాడలేదు.
ప్రొద్దున్న ఏడయింది. లారీడిగి సరాసరి గదికి వచ్చేసేడు చిరంజీవి.
"ఆ అనాధాశ్రమంలో తెలుసుకున్నదల్లా ఏమిటంటే సదరు సుశీలకి ఒక స్నేహితురాలుందనీ_ ఆవిడ పేరు రావన అనీ_ ఆమె ఈ వూళ్ళోనే వుంటుందనీ ..... ఇదిగో అడ్రసు."
స్పూర్తి ఆ అడ్రసు పరికించి "ఇక్కడికి దగ్గరే కదా_వెళ్ళొద్దాం పద" అన్నాడు.
"ఇప్పుడా..." అన్నాడు చిరంజీవి. "ఇంకో మూడు గంటల్లో కోర్టులో వుండకపొతే వారెంట్ యిస్తుంది. కోర్టు. ఎలాగైనా నా చేతులకి సంకెళ్ళు వేసి తీసుకెళ్ళాలని మహా ఉబలాటంగా వున్నాడు ఆ ఇన్ స్పెక్టర్! అతడి కోరికా నేరవేరినట్టు అవుతుందిలే _ పద వెళ్ళొద్దాం" అంటూ కదిలేడు.
ఇద్దరూ ఆ అడ్రసు పట్టుకుని వెళ్ళేసరికి రవణ భర్త ప్యాక్టరీ కి వెళ్ళటానికి తయారవుతున్నాడు. అతడు ఓ ప్యాక్టరీ వర్కరు. సంస్కార పండితుడిలా కనబడ్తున్నాడు.
ఇళ్ళు చిన్నదైనా పోందిగ్గా వుంది.
తాము వచ్చిన పని చెప్పాడు స్పూర్తి.
"మీరు పోలీసులా?" అడిగాడు అతడు. చిరంజీవి తన స్వభావ సిద్దమైన అలవాటుగా అవునూ, కాదూల మధ్య తల అడ్డంగా, నిలువుగా కాకుండా వాలుగా వూపేడు. అతడు లోపల్నుంచి భార్యని పిలిచి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పమని చెప్పి వాళ్ళ దగ్గర సెలవు తీసుకొని ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాడు.
చిరంజీవి రవణవైపు చూసేడు. పైట నిండుగా కప్పుకుని గుమ్మానికి అనుకుని నిల్చుని వుమ్దామే. అనాధాశ్రమం రిజిస్టర్ లో తను వ్రాసింది నిజమే..... ఎన్నో పూలు, కాగితాప్పూలు కాకుండా రక్షింస్తుంది ఆ ఆశ్రమం. వివాహం చేసుకుని, తనదంటూ ఒక యిల్లు ఏర్పరుచుకున్న ఆమె కళ్ళల్లో యిప్పుడిప్పుడే జీవితంపట్ల ధీమా యేర్పడుతున్నట్ట్లుంది. మనుష్యుల పట్ల నమ్మకం కూడా!
"సుశీలకి ఈ మనుష్యులంటే అసహ్యం. ఈ ప్రపంచం అంటే కూడా అసహ్యమే." అమ్తూమ్ది.
"ఎందుకు" స్పూర్తి అడిగేడు.
"ఆమె తల్లిది మరణం కాదనీ _ ఎవరో చంపేశారనీ ఆమె నమ్మకం. ఆవిడ అలా చచ్చిపడివుంటే చూసే నాధుడే లేక మున్సిపాలీటీ వాళ్ళు ఈడ్చే సేరంట. ఆ వయసులో అవన్నీ చూడవలసి రావటం వల్ల __ ఆమె అదో రకంగా తయారైంది.
"మరి తండ్రి?"
"అంతకుముందే చచ్చిపోయాడు. అలా ఒకసారి చెప్పింది. మళ్ళీ ఇంకోసారి_ అతడు తల్లిని పెళ్ళి చేసుకోకుండా మోసం చేసి పారిపోయాడంది. తన మటాల మీద తనకే నిలకడలేదు. అందులో సుశీల్ని తప్పుపట్టటానికి వీల్లేదు. ఇదంతా జరిగినప్పుడు దానికి ఆరేళ్ళు. అంతే."
"సుశీల తల్లి సుశీల దగ్గరే వుండాలి."
"__ పోనీ తల్లి ఫోటో"
వెధవ ప్రశ్న _అన్నట్టూ చూసేడు. స్పూర్తి చిరంజీవి వైపు. ఈ ఫోటోలెందుకు? సుశీల జ్ఞాపకార్ధం గదిలో దండవేసి పెట్టుకోడానికా!
తండ్రి ఫోటో సంగతి కూడా నాకు తెలీదు. కామక్షమ్మ ఇప్పుడెక్కడు౦ది" అని అడిగాడు.
"ఆవిడ చచ్చిపోయి అయిదేళ్ళయింది" అంది.
ఏడ్చినట్టుంది_ అనుకున్నాడు చిరంజీవి.
"మనం పూర్తిగా రాంగ్ ట్రాక్ లో వెళుతున్నాం" అన్నాడు స్పూర్తి.
"ఏం?"
"అర్దరాత్రి సుశీల తలుపు తీసిందీ అంతే వచ్చినవాడు ఈ వూళ్ళో ఈ మధ్య పరిచయమైన స్నేహితుడయి ఉండటానికే ఎక్కువ స్కోఫ్ వుంది. కాబట్టి ఆవిడ తల్లిదండ్రుల పూర్వపు చరిత్ర వెలికి తియ్యటం అనవసరం."
"అవును. అది నిజమే" అన్నట్టూ తల పకించాడు చిరంజీవి.
రవణ కల్పించుకుని "సుశీల్ని రేఫ్ చేసిందేవరో మీకు యింకా తెలీదా" అని అడిగింది. ఇద్దరూ ఆత్రంగా ఒకేసారి "ఎవరు? మీకు తెలుసా?" అడిగారు. ఆమె జవాబు కోసం నరాలు తెగిపోతాయో అన్నంతటెన్షన్!
"ఓ ! మా పేట పేటంతా చెప్పుకున్నారుగా ఆ మధ్య."
"ఎవరు?"
"చిరంజీవి అని__ ఈ వూరేనట" అంది. జవాబు విని జావాకారిపోయాడుస్పూర్త. చిరంజీవ్కి తలతీసుకెళ్ళి ఎక్కడన్నా పెట్టుకోవడం అంటే ఏమిటో అప్పుడు తెలిసింది. స్నేహితుడి పరిస్థితి గమనించి, "ఇక పోదామా" అన్నాడు స్పూర్తి.
నీరసంగా తలూపేడు చిరంజీవి. ఆమెకి కృజ్ఞతలు చెప్పి ఇద్దరూ బైటకోస్తుంటే మళ్ళీ ఏదో జ్ఞాపకం వచ్చినట్టూ వెనకొచ్చి "సుశీల తాలూకు ఫోటోలూ అవీ ఎక్కాడున్నాయి?" అని అడిగాడు.
"ఈ వూళ్ళోనో వుంది కాబట్టి సుశీల ఇంటికి రెండు మూడుసార్లునేనూ వెళ్ళాను. మొన్న సుశీల పోయిందని తెలిసి __ దాని ఫోటో ఏదైనా దైరుకుతుందేమో తెచ్చి పెట్టుకుందామని వెళ్తే ఆ ఇంటి గల ముసలమ్మా అలాటివేమీ లేవు పొమ్మంది. బహూశా ఆ ముసలమ్మే సుశీల చీరల్నీ, బట్టల్నీ కాజేయ్యతానికి అలా అబద్దాలు చెప్పి వుంటుంది అని నేననుకుంటున్నాను."
"అలా కాజేసి ఆవిడ బావుకున్నదీ ఎవీం లేదులెండి"
""ఏం? ఎందుకలా?"


