Home » Vasundhara » ఆడపడుచు

    క్రీడారంగంలో ఆటగాళ్ళు యాజమాన్యానికి బానిసలు. రాజకీయ రంగంలో రాజకీయ వాదులు నాయకులకు బానిసలు.
    శతాబ్దాల తరబడి భారతీయులు విదేశీయులకు బానిసలుగా ఉన్నారు. స్వతంత్రం వచ్చేక స్వదేశీయులకు బానిసలయ్యారు.
    "మీరన్నది నిజమే కావచ్చు. కానీ కనీసం నా ముందైనా ఈ నిజం ఒప్పుకోకండి. నాకు తృప్తిగా ఉంటుంది.....!" అంది ముక్త.
    "ఏంచేయమంటావో చెప్పు..." అన్నాడు గౌతమ్.
    "కాసేపు మీ బాస్ ను తిట్టండి-"
    "బాస్ నా?"
    "ఊఁ"
    "ఎందుకు?"
    "నా సంతోషంకోసం!"
    "నా బాస్ ను తిడితే నీకెందుకు సంతోషం?"
    "ఆఫీసులో అతడితో ఎలా ఉంటున్నారో నాకు తెలియదు. ఇంట్లోనైనా అతన్ని తిడితే-అతడికంటే మీరే గొప్పవారనిపిస్తుంది...అధో తృప్తి నాకు..."
    గౌతమ్ ఎద్జో అనబోయి చుట్టూ చూశాడు.
    చిన్న పడకగది. గది మధ్యన మంచం. మంచంపై తనూ, ముక్త...
    పైన సీలింగ్ కు వ్రేలాడుతోంది ఫ్యాన్...
    గది తలుపు గడియ వేసుకున్నారింట్లో ఎవరూ లేకున్నా...
    గదిచుట్టూ గోడలు...
    తిరుగులేని ఏకాంతమది!
    ఆ ఏకాంతంలో తనూ, ముక్తా...
    అక్కడ తనేం చేసినా చూసేవారు లేరు.
    తనేమన్నా వినేవారు లేరు. ఏదీ గోడదాటి పోదు.
    చుట్టూ చూశాడు గౌతమ్. గోడలు కనిపించాయి.
    "తిట్టండీ!" అంది ముక్త.
    "వద్దు..."
    "ఏం? ఇక్కడెవరూ లేరుగా..."
    "ఏమో- గోడలకు చెవులుంటాయంటారు...."
    ముక్తకు కోపం వచ్చి మరోవైపు తిరిగింది. గౌతమ్ ఆమె నడుంమీద చేయి.
    "ముక్తా! నువ్వు పక్కనుండగా ఎవరినో తిట్టి సమయం వృధా చేసుకోలేను. వర్ణిస్తాను...." అన్నాడు,
    ముక్త మాట్లాడలేదు.
    అతడామెను వర్ణించ సాగాడు. తనకంటికామె ఎలా కనబడుతుందో వర్ణిస్తున్నాడతడు.
    ముక్తకు భర్త మాటలు వినబడడం లేదు. ఫోన్లో భానుప్రకాష్-పేరంటంలో తానెలా కనబడిందీ వర్ణిస్తున్నాడు. ఆ మాటలేది ఆమె చెవుల్లో గింగురు మంటున్నాయి.
    భానుప్రకాష్ వర్ణనముందు గౌతమ్ వర్ణనే పేలవంగా ఉంది.
    ముక్త భానుప్రకాష్ కి పరాయి ఆడది. గౌతమ్ కి కట్టుకున్న భార్య, గౌతమ్ వర్ణన పేలవంగా ఉండడానికికదే కారణమా? పరాయి స్త్రీ పుట్టించగల భావావేశం భార్య పుట్టించలేదా?
    లేక- భానుప్రకాష్ బాస్. గౌతమ్ బానిస. తన బానిస మనస్తత్వాన్ని భార్య ముందుకూడా వదిలిపెట్టలేక పోవడంవల్ల ముక్తకు గౌతమ్ వర్ణన పేలవంగా అనిపించిందా?
    లేక....
    ముక్త ఉలిక్కి పడింది.
    గౌతమ్ తనకు కట్టుకున్న భర్త. భానుప్రకాష్ పరాయి మగాడు. అందుకే తనకతడి వర్ణన బాగుందా.
    ఇందులో ఏది నిజం?
    నిజమేదైనప్పటికీ-ఆ రాత్రి తొలిసారిగా ఓ విశేషం తెలుసుకున్నాడు గౌతమ్....అన్ని సమయాల్లోనూ ఆడవాళ్ళు పొగడ్తలకు లొంగరు!
                                                7
    "హలో ముక్తేనా మాట్లాడుతూంది..."
    ముక్త ఆ గొంతును సులభంగా గుర్తుపట్టింది- "ఊఁ"
    "ఇంట్లో వుండవేమోనని భయపడ్డాను...."
    ముక్త మాట్లాడలేదు.
    "గౌతమ్ చాలా ఉత్సాహంగా ఉంటున్నాడాఫీసులో, అతడిలో ఆశలు పెంచేస్తున్నాను. ఇదంతా ఎందుకో తెలుసా?"
    "తెలియదు!"
    "అతన్ని ఎవరెస్ట్ శిఖరాగ్రానికి తీసుకుని వెడతాను. అప్పుడు...."
    "వద్దు...." అంది ముక్త.
 "ఏమిటివద్దు!"   
    "మావారినేమీ చేయొద్దు..."
    "ఏమీ చేయను. అంతా నీలో ఉంది..."
    "నేనేంచేయాలి?"
    "నువ్వేమీ చేయనవసరం లేదు. అభ్యంతర పెట్టకుండా ఉంటే చాలు..." అన్నాడతడు.
    "హద్దుమీరుతున్నారు..."
    "నువ్వుకూడా నన్ను నువ్వను. హద్దులవే తొలగిపోతాయి..."
    "హద్దులు తొలగాలని నేననుకోవడంలేదు..."
       "నీభర్త ఎవరెస్టు శిఖరంవైపు వెడుతున్నాడు..."
    ముక్తకేం చెప్పాలో తెలియలేదు.
    గౌతమ్ ఎవరెస్టు శిఖరంవైపు వెడుతున్నమాట నిజం. కానీ అతడినెలా ఆపాలి?
    "మాట్లాడుముక్తా! ఫోన్ లో విన్నా నీగొంతు తీయగా ఉంటుంది...."
    "మావారికన్యాయం చేయొద్దు..."అందామె.
    "అది నీలో ఉంది..."
    "నన్నూ మావారి కన్యాయం చేయమనొద్దు..." అంది ముక్త.
    "ఆధునిక ప్రపంచం గురించి నీకు  తెలియక పోవడం నా దురదృష్టం...నీ కారణంగానైనా సరే తను పైకి రావాలని నీభర్త అనుకుంటాడు. అది అన్యాయమని నువ్వనుకుంటే నీకు ప్రపంచజ్ఞానం లేదనుకోవాలి..."
    "నాకున్న జ్ఞానం చాలు నాకు...."
    "ఈ ఊళ్ళో అజంతా ఇంటర్నేషనల్ ఉంది. రోజూ మధ్యాహ్నం రెండు గంటలకి ఊళ్ళోని ఆఫీసర్సు కార్లలో అక్కడికి వస్తారు. ఎందుకో తెలుసా?"
    "తెలియదు..."
    "ఎందుకు?"
    "తమ భార్యలనక్కడ దిగవిడిచి వెడతారు..."
    "వారక్కడ హోటల్లో కొన్ని గంటలు గడిపి వెడతారు. ఫలితంగా వారికి కార్లు, బంగళాలు, వైభోగాలు..."
    ముక్త మాట్లాడలేదు.
    "నెలకు రెండుమూడు వేలు తెచ్చే ఆఫీసరు కేవలం జీతంమీ వైభవాన్ని కొనుక్కోలేడు. అందుకే ఇటీవల ఆఫీసర్లు-అందమైన భార్యలనే పెళ్ళిచేసుకుంటున్నారు. వారిని తమ ఆర్ధిక, సాంఘిక ప్రగతికి సోపానాలుగా వాడుకుంటూన్నారు"
    ముక్తకు వళ్ళు జలదరించింది- "నేను నమ్మను" అందామె.
    "నీ నమ్మకంతో పని లేకుండా జరిగిపోతున్న నిజమిది...."
    "అయినా సరే నేను నమ్మను..."
    "ఎందుకని?"
    "మీరు చెప్పారు కాబట్టి!"
    "పోనీ - నీ భర్తను నమ్ముతావుగదా! అతన్నే అడిగి తెలుసుకో..."
    "ఈవిషయమై ఒకరినడగాల్సిన అవసరం. కుతూహలం నాకు లేవు...."
    "అలాగానకు నీ మంచి కోరి చెప్పాను....ఆలోచించుకో..."
    అవతల క్లిక్ మంది.
                                              8
    "ఏమండీ! అజంతా ఇంటర్నేషనల్ గురించి మీకు తెలుసా?" అందిముక్త భర్తతో.
    "అదో స్టార్ హోటలు..."
    "అదికాదు...ఇంకా..."
    "ఇంకా అంటే?"
    తటపటాయిస్తూనే తన సందేహం బైట పెట్టింది ముక్త.
    "ఎవరు చెప్పారు నీకు?" అన్నాడు గౌతమ్ ఆశ్చర్యంగా.
    తడబడింది ముక్త.
    "ఎవరు చెప్పారు?"
    "ఈ వీధిలోనే - పంకజంగారని..."
    పంకజం, ముక్త చాలా అరుదుగా మాట్లాడుతుంటారు. పంకజం నోరు మంచిది కాదని ఆ వీధిలో చెప్పుకుంటారు. అందుకే ఆపేరు చెప్పిందామె.
    గౌతమ్ నిట్టూర్చి__ "నీకిది తెలుసుకోవాలనెందుకనిపించింది?" అన్నాడు.
    "లోకంలో యిలాంటివి కూడా ఉంటాయా అని!"
    "ఉంటాయి-" అన్నాడు గౌతమ్.
    "అంటే యిది నిజమేనా?"
    "ఊఁ"
    "చీ- ..."అంది ముక్త.
    "ఛీ అనడానికిందులో తప్పేముంది?"
    "మీ కిందులో తప్పు అనిపించడం లేదు?"
    "లేదు..."
    "తప్పు అనిపించటం లేదూ?" రెట్టించింది ముక్త.
    "సావధానంగా విను...." అన్నాడు గౌతమ్.
    శీలం అన్నది మనిషి కల్పించు కున్నది. ధర్మం అన్నది బలహీనుడు బలవంతుల్ని శాసించడానికి సృష్టించింది. విదేశాల్లో శీలానికి ప్రాముఖ్యత లేదు. పవిత్రతకు అర్ధం లేదు. ఆ దేశాలు సిరి సంపదలతో తులతూగి పోతున్నాయి. ఏయేదేశాల్లే పవిత్రత పేరిట స్త్రీ అణగ ద్రొక్కబడుతోందో- ఆదేశాలు ప్రగతి సాధించలేకపోతున్నాయి.
    దేశ ప్రగతి మనిషిలో ఉంది. మనిషి ప్రగతి స్త్రీలో ఉంది. స్త్రీ దానికి ప్రాముఖ్యతనూ, పవిత్రతనూ అంత గట్టి-అది కాపాడ్డానికే జీవితాన్నంకితం చేసినంత కాలం మనిషి ప్రగతిని సాధించలేడు.
    అజంతా ఇంటర్నేషనల్ కు తమ భార్యలను తీసుకుని వెడుతున్న ఆ ఆఫీసర్లదృష్టవంతులు. శీలం ప్రాముఖ్యతను తొలగిస్తే వారు చేసిందాంట్లో తప్పేమీ లేదు. వారిప్రగతినెవరూ ఆపనూలేరు.
    "అయితే అలాంటి తప్పు మీరు కూడా చేస్తారా!" అంది ముక్త.
    గౌతమ్ ఉలిక్కిపడి - "నా సంగతి నేనాలోచించ లేదు -" అన్నాడు.
    "ఆలోచించండి-" అంది ముక్త.
    "ఛీ!" అన్నాడు గౌతమ్ అప్రయత్నంగా.
    "మీ విషయంలో ఛీ అనిపించినదితరులకు మంచిదెలాగవుతుంది?" అంది ముక్త భర్తను నిలదీస్తూ.
    "సారీ ముక్తా! నేనెక్కువదూరమాలోచించ లేదు. నువ్వడిగినప్పుడు నేనింకోలా ఆలోచిస్తున్నాను. అసలేం జరిగిందంటే..." అన్నాడు గౌతమ్.
    ఆరోజు ఆఫీసులో భానుప్రకాష్ గౌతమ్ ని పిలిచాడు. మాటల సందర్భంలో అజంతా ఇంటర్నేషనల్ ప్రసక్తి వచ్చింది. ఆయన అక్కడి విశేషాలను సమర్ధించాడు. గౌతమ్ బాస్ అభిప్రాయాలన్నింటితోటీ ఏకీభవించాడు. అవే యింటి దగ్గర రిపీట్ చేశాడు.
    "ఈ అభిప్రాయాలు నావికాదు. నా బాస్ వి..."
    "మీ అభిప్రాయం కూడా చెప్పండి...."
    "ఎందుకు నీకంత పట్టుదల?"
    "ఈ విధంగానైనా మీ బాస్ ను తిడతారని!"
    "నా బాస్ ను తిట్టాలని నీకంత పట్టుదలెందుకు? ఆయన నిన్నేం చేశాడు...?" అన్నాడు గౌతమ్.
    ముక్త తడబడింది. అప్పుడామెకు మళ్ళీ  పంకజం గుర్తు కొచ్చింది.
       పంకజం పేరునే మళ్ళీ ఉపయోగించు కుందామె.
    "అజంతా ఇంటర్నేషనల్ కి మీ బాస్ కూడా ఆడవాళ్ళని రప్పించుకుంటాడట. పంకజం చెప్పింది..."
    గౌతమ్ ముందు తడబడినా తర్వాత తేలికగా నవ్వేసి -"బాస్ చాలా మంచివాడు. ఆయనకు డబ్బుంది కాబట్టి ఏం చేసినాసాగుతుంది. నేనాయనకు జూనియర్నైనా నా దగ్గరెంత చనువుగా ఉంటాడు. తన ప్రవర్తనను తప్పు పట్టి నేనసహ్యించుకుంటానన్న భయం కాబోలు....ఆయన పనిగట్టుకుని రోజు నాదగ్గర ఆ హోటలు ప్రసక్తి తెచ్చి సమర్ధించు కున్నాడు. ఆయనెలాంటివాడైనా ఆరాధన తప్పదు నాకు. అయినా నన్ను కన్విన్స్ చేయాలని చూస్తాడు. గొప్ప సంస్కారం కదూ!" అన్నాడు.
    "ఇదేం సంస్కారం?" అంది ముక్త.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra