Home » D kameshwari » Tirigi Dorikina Jeevitham


    "సరే, ఆ అమ్మాయిని ముందు లేపి పట్టుకుని బయటికి తీసుకురా. నేను రిక్షాలు మాట్లాడుతాను" అంటూ సామాను దింపించే ప్రయత్నంలో పడ్డాడు.
    సరోజని బలవంతంగా లేవదీసి అర్ధచైతన్యావస్థలో వున్న సరోజని నడిపించుకెళ్ళి రిక్షాలో కూర్చో పెట్టింది ఆమె. కళ్ళు విప్పి "ఎక్కడికి---ఎక్కడికి తీసుకెడుతున్నారు నన్ను" అంది సరోజ.
    "డాక్టరు దగ్గరకు తీసుకేడుతున్నాం అమ్మాయి. అక్కడేధన్నా మందు తీసుకుందువుగాని, ఆయనకీ నర్శింగ్ హోం కూడా వుంది. జ్వరం తగ్గేవరకు రెండు రోజులు అక్కడేవుంటే మంచిది ఏ హోటల్లోనో ఆడపిల్లని వంటరిగా ఎలా వుంటావు. అందులో జ్వరం" అంటూన్న ఆమె మాటలు సగమే అర్ధమయ్యాయి సరోజకి.
    ఆ వూరిలో డాక్టర్ కృష్ణమోహన్ కి మంచి పేరు వుంది. ప్రాక్టీసు పెట్టి మూడేళ్ళే అయినా బాగా నిలదొక్కుకుని రెండు చేతులతో డబ్బుతోపాటు పేరు ఆర్జించాడు. మంచివాడు, నెమ్మదైనవాడు. తెలివైనవాడు, కుర్రాడు. అన్న ప్రశంశలు పోగుచేసుకున్నాడు. దానికి తోడు నర్శింగ్ హోము కూడా ఆరంభించాడేమో మరింత ప్రాక్టీసు పెరిగింది. తండ్రి ప్లీడరు చేసి ఆర్జించి పెట్టిపోయిన ఆస్తికి ఏకైక వారసుడు. లంకంత యిల్లు వుండేది అతనూ తల్లీమాత్రమే! అంచేత యింటిముందు భాగాన్ని ఆస్పత్రి కన్సల్టింగ్ రూంగా మార్చుకున్నాడు. ఇంటికి ఆనుకుని ప్రక్కనే నర్శింగ్ హోమ్ కు బిల్డింగ్ కట్టించాడు.
    ఉదయం ఏడు గంటలకి కాఫీ త్రాగి పేపరుచూస్తున్న కృష్ణమోహన్ కాలింగ్ బెల్ విని లేచి వెళ్ళబోయేంతలో పనిమనిషి వచ్చి ఎవరో పేషంట్లు వచ్చారని చెప్పింది. 'ముందు గది తలుపు తీసి కూర్చోమను. వస్తున్నాను' అన్నాడు వేళకాని వేళల్లో పేషంట్లు రావడం డాక్టరయిన అతనికేం క్రొత్త. నైట్ సూటుతోనే కన్సల్టింగ్ రూము లోకి నడిచాడు.
    సరోజని ఓ బెంచిమీద కూర్చోబెట్టి ఆమె కూర్చుంది. ఆమె భర్త పిల్లలతో సామానుకి కాపలాగ రిక్షా దగ్గిర వుండిపోయాడు. సరోజ నీర్సంగా గోడకి జారపడి కళ్ళుమూసుకుంది.
    కృష్ణమోహన్ గదిలోకి రాగానే "డాక్టరుగారూ, యీ అమ్మాయికి వళ్ళు తెలియని జ్వరమండీ, కాస్త చూడండి పాపం రైల్లో వంటరిగా యీ వూరు వస్తూంది..."
    "మీకే మవుతుంది యీ అమ్మాయి?"
    "అబ్బే మాకేం అవదండి, రైల్లో వస్తూంటే పరిచాయం అయింది. రైల్లో జ్వరంతో తెలివి లేకుండా పడి వుంటే అలా వదిలేయలేక మీ నర్సింగ్ హోమ్ లో చేర్పించి వెడదామని తీసుకు వచ్చాను. ఏదో ఉద్యోగం కోసం వచ్చిందట" అంటూ ఆవిడ తనకు తెల్సింది అప్పగించింది.
    "అలాగా-" అంటూ కృష్ణమోహన్ దగ్గరికి వచ్చి చేయి పట్టుకున్నాడు పల్సు చూడడానికి, స్పర్శకి కళ్ళు విప్పింది సరోజ కృష్ణమోహన్ మొహం చూస్తూనే ఆమె కళ్ళు వెడల్పయ్యాయి. వెంటనే ఒక్క ఉదుట లేచి "బావా" అంటూ కృష్ణమోహన్ గుండెల మీద వ్రాలి పోయి వెక్కి వెక్కి ఏడవటం ఆరంభించింది. 'బావా ఎక్కడికి వెళ్ళిపోయావు యిన్నాళ్ళూ బావా ఏమయిపోయావు-' అంటూ హిస్టీరియా వచ్చిన దానిలా ఏమి టేమిటో అంటూ అలాగే అతని చేతులలో వ్రాలి పోయింది. కృష్ణమోహన్ పట్టుకోకపోతే క్రింద పడి పోయేదే! అతను యీ హఠాత్ సంఘటనకి బిత్తరపోయాడు. సరోజని తీసుకువచ్చిన ఆమె తెల్లపోయింది. చటుక్కున ముందుకు వచ్చి కృష్ణమోహన్ చేతిలో వ్రాలిపోయిన సోర్జని పట్టుకోడానికి అతనికి సాయం చేసింది. ఒక్క క్షణంలో కృష్ణమోహన్ తేరుకుని సరోజ తెలివితప్పిపోయింది అని గ్రహించి "ముందీమెను ఆ బెంచీ మీద పడుకోబెట్టండి" అంటూ సాయంపట్టి సరోజను బెంచీ మీద పడుకోబెట్టాడు. అతని మొఖంలో ఆశ్చర్యం, సందేహం పొడచూపాయి సరోజవంక ఒక్కక్షణం పట్టి పట్టి చూశాయి. అతనికేం అర్ధంగాలేదు. తనని బావా అందేమిటి? తను ఆమెకి బావ ఎలా అయ్యాడు-తనకి తెల్సి నంతవరకు తనని బావా అని పిలిచే వరస బంధువు లెవరూ లేరే! జ్వరతీవ్రతతో ఏదన్నా మాట్లాడడం సంభవమే గాని ప్రత్యేకం బావా అంటూఏడవడం, ఎక్కడికి వెళ్ళావు అంటూ ఏడవడం చిత్రం అన్పించింది. ఆ ఒక్క క్షణంలోనే అతనిలో లక్ష అనుమానాలు శంకలు చోటు చేసుకున్నాయి.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra