Home » Palanki venkata ramachandra murthy » రామాయణము


                                    ఇంద్రజిత్తు
    ఇద్రజిత్తు నుండి ఆయుధములు వచ్చుట అగుటతోనే లక్ష్మణుడింద్రాస్త్రమును వానిపై ప్రయోగించినాడు. ఆ అస్త్రము ఇంద్రజిత్తు శిరమును మొండెము నుండి వేరుచేసినది. శిరమొక వైపునకును మొండెమొకవైపునకు పడిపోయినవి.
    కుంభకర్ణుడు రామునిచే చిత్రవధ చేయబడినాడని విని రావణుడు శోకించినాడు  'నిద్రించుచున్న వానిని లేపి మృత్యువున కప్పగించినాను!" అని రోదించినాడు. మేఘనాధుడు దానవేంద్రుని సమక్షమున నిలిచి "తండ్రీ దుఃఖించకుము. నేను నేడా నరులు రామలక్ష్మణులను రణరంగమున నెదుర్కొని వధించి నీకు చింతను బాపెదను" అన్నాడు. రావణుడు తేరుకొని "కుమారా, నీకు విజయము కలుగును గాక!" అని ఆశీర్వదించి వీడ్కొలిపినాడు.
    మేఘనాథుడు తిరిగిపోవుచుండగా మున్ను రావణునకు కలిగిన సంశయములె వానికిని జనించినవి. "రామలక్ష్మణులు మానవమాత్రులు కారా? వీరికొక్క రథము కాని గజము కాని తురగము కాని లేవు; లేకున్ననూ చతురంగ బలసమన్వితమగు దానవ సైన్యమును హడలెత్తించుచున్నారు!... ఈ వానరు లెవ్వరు? కొమ్మపై నుండి కొమ్మకు దాటుచూ, వ్రేలాడు కాయలనూ పండ్లనూ పుణికి పుచ్చుకొని భక్షించు శాఖా మృగములు కారా? ఈ మర్కటులకు రదనములూ, గోళ్లూ, రాళ్లూ, తరు శాఖలూ తక్క వేరొండు ఆయుధములు లేవు. వీరు వాటితోనే దైత్య సేనపై బడి మోది ఎంతరో అసురయోధుల అసువులను పోగొట్టినారు! వనచరులుగా కన్పట్టుచున్న వీరందరెవ్వరు?"
    మేఘనాథునకప్పుడు హఠాత్తుగా ఒక ఆలోచన వచ్చినది. "నా అస్త్ర సంపదలో బ్రహ్మ శిరోనామకాస్త్రము లేదు. ఆ యస్త్రము నార్జించి ఉంచుకొన్నచో రామలక్ష్మణులెంతటి అసాధారణ యోధులైననూ ఆ అస్త్రరాజముతో వారిని వధించి నేడు నేను నా తండ్రికిచ్చిన మాటను నిలబెట్టుకొనగలను"       

    అతడా యోచనతో 'నికుంభిల చైత్యమునకు ('నికుంభిల' అను స్థలమున గల తన యాగశాలకు) పోయినాడు. హోమగుండమున అగ్నిని రగులజేసి మంత్రములు పఠించుచూ హోమములు వేయుట ప్రారంభించినాడు.
    విభీషణుడు హోమగుండము నుండి ఎగయుచున్న పొగను గమనించి, శ్రీరాముని ముందు నిలిచి మేఘనాథుని హోమక్రియను గూర్చి వివరించి "రామప్రభూ వాడు బ్రహ్మశిరోనామకాస్త్ర్రమును పొందినచో మనకు హాని కలిగించును. లక్ష్మణస్వామి వానర సేనతో వెంటనే పోయి వాని హోమక్రియకు విఘ్నము కలిగించి సంహారించవలెను" అన్నాడు.
    శ్రీరాముడు: లక్ష్మణుడు పంపుత ఎందులకు? మాయావి మేఘనాథుని నేనే సమరమున సంహరిం చెదను.
    విభీషణుడు: రామప్రభూ ఇంద్రజిత్తు మరణమునకు చెందిన రహస్యమును తెలిపెదను వినుము. వాడు పన్నెండు సంవత్సరములు నిద్రను వర్జించిన వానిచేతనె వధింపబడును.
    శ్రీ రాముడు : (లక్ష్మణునితో) నన్ను సేవించుటకై వనవాసమున కేతెంచి పన్నెండు వత్సరముల పైననె నిద్రలేకుండ గడిపిన త్యాగమూర్తిని నీవు! వానర సేనతో  పోయి ఇంద్రజిత్తు యాగదీక్షకు విఘ్నము కలిగించి వానిని సంగ్రామమున వధించి లోకమునకు మేలోనరించుము.
    లక్ష్మణుడజ్రునకు నమస్కరించి ప్రదక్షణమా చరించి వానర సైన్యముతో యుద్ధభూమిని ప్రవేశించినాడు. ప్లవంగ యోధులు పాపాణముళతోనూ తరు శాఖలతోనూ పోయి దైత్యసైన్యముపై బడి మోదగా దానవ సైనికులు గాయముల బాధను భరించలేక అక్రందించినారు. వారి ఆర్తనాదములు నికుంభిల మోదగా దానవ సైనికులు గాయముల  బాధను భరించలేక అక్రందించినారు. వారి ఆర్తనాదములు నికుంభిల యందున్న ఇంద్రజిత్తునకు వినపడినవి. వాడింక తన యాగము మాట తలపోయక నికుంభిలను విడిచి అత్యంత వేగమున పోయి దానవ ప్రవేశించినాడు. వానర యోధుల దాడి వలన చెల్లాచెదురైన  సైన్యమును వ్యూహాముగా చేసి దానితో సంగ్రామ రంగమును ప్రవేశించి లక్ష్మణునకేదురుగా నిలిచినాడు.
    లక్ష్మణుడు : దానవేంద్ర నందనా స్వాగతము. అలమును ఆరంభించుము.
    ఇంద్రజిత్తు తూణీరము మున్నాతడు తపము చేసి ఆర్జించిన అస్త్రములతో నిండియున్నది. రావణ పుత్రుడోకొక్క ఆయుధమునే తీసి రామనుజునిపై ప్రయోగించినాడు. రామానుజుడు ఆ వ్రతి అయూధమునూ తన బాణములతో మార్గమధ్యముననే త్రుంచివేసినాడు.
    ఇంద్రజిత్తు అమ్ములపొది ఖాళీ ఐనది. "నేను బ్రహ్మశిరోనామకాస్త్రమును పొందువరకునూ నా హొమక్రియను సాగించుచు' నికుంభల చైతన్యములోనే ఉండిపోవలసినది. తొందరపాటుతో బయల్వేడలి భంగిపడినాను! 'రామ లక్ష్మణులను సంహరించి చింతను బాపెదన' ని జనకునకిచ్చిన మాటను నిలబెట్టుకొనలేకపోయాను!" అని దిగులు చెందినాడు.
    ఇంద్రజిత్తు నుండి ఆయుధములు వచ్చుట అగుటతోనే లక్ష్మణుడింద్రాస్త్రమును వానిపై ప్రయోగించినాడు. ఆ అస్త్రమును ఇంద్రజిత్తు శిరమును మొండెము నుండి వేరుచేసినది. శిరమొక వైపునకును మొండెమొకవైపునకు పడిపోయినవి.
    నింగి నుండి దేవతలు పుష్ప వర్షమును కురిపించినారు. లక్ష్మణుడు విజయోత్సాహముతో అగ్రజుని వద్దకు పోయి నమస్కరించినాడు. శ్రీరాముడానందాభ్ది నోలలాడుచూ అనుజుని కౌగలించుకొన్నాడు.
                                *         *        *

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra