Home » Merlapaka murali » Maga Bhuddi


    ఇంతకీ నర్శింగ్ హోమ్ పేరు రాయకపోవడంవల్ల ఆమెవరో కనిపెట్టలేకపోయాడు.

 

    అతని కళ్ళనిండా ఆ కొత్త అమ్మాయి! ఆమె ఎలా వుంటుందో వూహించుకుంటున్నాడు. అతను తాత్కాలికంగా రజనీని మరిచిపోయాడు.

 

    లెటర్ ను మళ్ళీ చదవాలనిపించి విప్పాడు.

 

                                               *    *    *    *    *

 

    ఆరోజు ఆదివారం. సాయంకాలం అయిదయింది. అంతవరకు ప్రకాశించిన సూర్యుడు వార్ధక్యంలోకి జారిపోయినట్టు పడమటి కొండల్లో కుంగిపోతున్నాడు. పక్షులు తమ స్థావరాలను వెతుక్కుంటూ సాగిపోతున్నాయి. గాలి అప్పుడే స్నానం చేసి షికారుకు బయల్దేరినట్టు చల్లగా వీస్తోంది. కొండలు చీకటి దుప్పటిని కప్పుకోవడానికి సిద్ధపడుతున్నాయి.

 

    పార్క్ లోకి జనం రావడం మొదలుపెట్టారు. అంతవరకూ తెలియని భయంకరమైన జబ్బుతో బాధపడి ఠక్కున కోలుకొని, నవ్వుతున్నట్టు పార్క్ లో చలనం మొదలయింది. స్పీకర్లలోంచి పాట పుట్టి పార్క్ అంతా ప్రవహిస్తోంది. పోడియం దీపాలు మరికొంతసేపటిలో వెలుగు మాస్క్ లను ముఖాలకు తగిలించుకోనున్నట్టు అప్పుడప్పుడూ వెలిగి ఆరిపోతున్నాయి. సిమెంట్ దిమ్మలు మనుషుల్ని పిలుస్తున్నాయి.

 

    రజని ఎవరికీ కనపడకుండా తన కారును పార్క్ కు దూరంగా పార్క్ చేసి లోపలకు నడిచింది. అప్పటికే శివపార్వతుల విగ్రహం వద్ద సరళ, విమల, సబిత వున్నారు.

 

    రజనీని చూస్తూనే వాళ్ళు తమ మాటలను ఆపి, ఆహ్వానించారు.

 

    రజని మిత్రురాళ్ళను చూసి నిండుగా నవ్వినా ఆ నవ్వులో జీవం లేదు. ఎండిపోయిన కాలువ నిస్తేజంగా పడుకుండిపోయినట్టు ఆమె విగ్రహం ముందు కూర్చుంది. ఆమెను తెలియని భయం వూపేస్తోంది. నరేష్ ఆ లెటర్ ని నమ్మి ఆడపిల్ల మీదున్న యావతో వస్తాడా లేక తన మీదున్న ప్రేమతో ఆ ఆహ్వానాన్ని తిరస్కరిస్తాడా అన్నది ఆమెను పీడిస్తున్న సమస్య.

 

    నరేష్ అందరి మగవాళ్ళలాగే ఆడపిల్ల పిలిస్తే పరుగెత్తుకొస్తాడా? అలా పరుగెత్తికొచ్చేస్తే ఇంక అతను తనను ప్రేమించేదేమిటి? ఆ ప్రేమకూ అర్థం ఏమిటి? ముక్కూ మొఖం తెలియని ఆడపిల్ల బజార్లో కనిపిస్తేనే అష్టవంకర్లు పోయి, దొంగచాటుగా చూసి, చొంగ కార్చుకునే ఈ మగ మహారాజుల్లో నరేష్ కూడా ఒకడేనా? అంతకు మించిన ఆదర్శాలు వుండవా? నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఎవరో లెటర్ రాస్తే రెక్కలు కట్టుకుని ఇక్కడికి వచ్చి వాలుతాడా? ఈ పందెంలో సరళ గెలుస్తుందా? నరేష్ ఇక్కడకు వస్తే ఆ తరువాత తన భవిష్యత్ ఏమిటి? జీవితంలో అతని ముఖం చూడకూడదని గట్టిగా నిశ్చయించుకుంది రజని.

 

    "ఏమిటే అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్? ఓడిపోతాననే భయం పట్టుకుందా?" నవ్వుతూ అడిగినా సరళ మాటల్లో వున్న వ్యంగ్యం రజనీకి ముల్లులా తాకింది.

 

    "ఛీ! అలాంటిదేమీ లేదు" రజని బలవంతంగా నోరు విప్పింది.

 

    "చిత తప్పకుండా ఇక్కడికి వచ్చి తనను వూరించిన డాక్టర్ కోసం పడిగాపులు కాస్తాడే. చివాట్లు పెట్టు చాలు. అంతేకానీ తెగతెంపులు చేసుకోవద్దు" అంది సరళ. మగవాడి బిహేవియర్ ను చిన్నప్పటినుంచి చూస్తున్న ఆమెకు నరేష్ తప్పక వస్తాడన్న నమ్మకం వుంది.  

 

    తను గెలిస్తే తన పేర యాభైవేల రూపాయలు బ్యాంక్ లో డిపాజిట్ అవుతుంది. బ్రహ్మానందం, తనకూ మధ్య కుదిరిన ఒప్పందం అది. మగవాళ్ళల్లో అందరూ శ్రీకృష్ణులేగానీ శ్రీరామచంద్రుళ్ళు లేరు. తనలో లేని సుగుణాన్ని ఎదుటివాళ్ళల్లో చూసి ఆనందించడం జరగదు గానీ, ఆ గుణాలున్న దేవుళ్ళను మాత్రం పూజిస్తారు. అందుకే మహాభారతం కన్నా రామాయణం అంత పాపులర్ అయ్యింది. ఏకపత్నీవ్రతం ఆచరించిన దేవుళ్ళు మరీ ప్రజాదరణ పొందారు. అందుకే చాలా గ్రామాల్లో రామాలయం వుంటుంది గానీ కృష్ణాలయం వుండదు. మరో గంటకల్లా నరేష్ ఇక్కడ ప్రత్యక్షమవుతాడని ఆమెకు భరోసాగా వుంది.

 

    విమల, సబిత, రజనీని సర్దుతున్నారు. నరేష్ వచ్చేస్తాడని వాళ్ళకూ నమ్మకంగానే వుంది. అయితే అతను రాకూడదని విమల, సబిత మాత్రం వీలైనప్పుడల్లా మనసులోనే దేవుడ్ని ప్రార్థిస్తున్నారు.

 

    అంతమందిలో వున్నా రజనీ ఒంటరిగా ఫీలవుతోంది. రకరకాల ఆలోచనలు ఆమెను పీక్కుతింటున్నాయి. క్షణాలు దొర్లిపోతున్నాయి.

 

                            *    *    *    *    *

 

    నరేష్ మబ్బుల రధం మీద ఊరేగుతున్నట్టు ఎగిసెగిసి పడుతున్నాడు.

 

    అయిదుగంటలకల్లా పడకమీద నుంచి లేచి తయారవడం మొదలుపెట్టాడు. రెండుసార్లు సోప్ వేసుకున్నాడు ఒంటికి. ముఖానికైతే నాలుగుసార్లు సోప్ ను పట్టించాడు. చేతిలో స్టెత్ పట్టుకున్న అమ్మాయి కళ్ళ దగ్గరకొచ్చి వూరిస్తుంటే మనసు గంతులేస్తుంది. లోపలనుంచి ఎగదన్నుకోస్తున్న వుత్సాహాన్ని బలవంతంగా అణచుకుంటూ బట్టలేసుకున్నాడు. ప్యాంటు, చొక్కాకు ఇస్త్రీ ముడతలు సరిగ్గా వున్నాయో లేవో చూసుకున్నాడు. క్రాఫ్ ను పది రకాలుగా దువ్వుకుని చివరకు పాత స్టయిలే బావుందని సరిపెట్టుకున్నాడు. చెప్పులను పాత గుడ్డతో బాగా తుడిచిపెట్టుకున్నాడు. వున్న డబ్బులంతా జేబులో వేసుకుని బయల్దేరాడు.  

 

    ఆకాశంలో తేలిపోతున్నట్టు ఒళ్ళు మరీ తేలిగ్గా అనిపించసాగింది. తనను నర్సింగ్ హోమ్ లో చూసి మోహించిన సువర్చలంటే ఎక్కడలేని ప్రేమా పుట్టుకొస్తుంది. ఒళ్ళంతా తూలిపోతుంది. వుత్తరంలోని ప్రతి అక్షరమూ తనపై పెంపుడు చిలకల్లా వాలుతోంది. వుత్తరం అంత అందంగా రాయాలంటే తనమీద బలమైన మోహమే వుండాలని ఎప్పుడో నిర్ధారించుకున్నాడు.   

 

    తామిద్దరూ మొదట కలుసుకోవడం, తొలిసారి మాట్లాడడం, ఇద్దరూ పార్క్ నుంచి అలా నడుస్తూ హోటల్ కెళ్ళి కాఫీ తాగడం.... ఇవన్నీ ఎంత థ్రిల్లింగ్ గా వుంటాయో ఆలోచిస్తూ నడుస్తున్నాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra