Home » Kommanapalli ganapathi rao » బ్లాక్ మాంబా


    "చాలా బాగానా" లల్లీ కళ్ళలో ఈ మధ్య కాలంలో అతడు చూడని మెరుపులు...

    "తప్పకుండా..."

    "మరి తర్వాత సంవత్సరం..."

    "ఇంకా గ్రాండ్ గా..."

    "ఆ తర్వాత సంవత్సరం."

    "చాలా చాలా గ్రాండ్ గా..."

    "అంటే నూరేళ్ళూనా..." టక్కున అడిగింది లల్లీ... "మమ్మీ చెప్పింది డాడీ...నేను నూరేళ్లు బ్రతుకుతానటగా..."

    మనసును మెలిపెట్టే సంఘర్షణ...ఈ చర్చ ఇక్కడికి ఆగిపోతే బాగుణ్ణనుకుంటున్నాడు. ప్రశాంతతకు నోచుకోని స్థితిలో నలిగిపోతున్న ప్రసన్న లల్లీని చెంపలపై ముద్దుపెట్టుకున్నాడు. "నూరు కాదమ్మా... వెయ్యేళ్ళు..."

    "బాప్ రే" చిత్రంగా కదిలాయి లల్లీ కనుపాపలు "అంతకాలం బ్రతుకుతానా!"

    "తప్పకుండా బ్రతుకుతావమ్మా...నువ్వు లక్ష సంవత్సరాలు బ్రతికేవుంటాయి...చూడు...నీకు..." టాపిక్ మార్చే ప్రయత్నంలా అన్నాడు.

    "నీకు బర్త్ డే కేక్ ఇప్పుడు వెళ్ళి ఆర్డర్ చేసేదా..."

    "ఓ...పెద్దగా వుండాలి...ఎంతంటే నా అంత పెద్దగా మరి... నన్ను తోడు తీసుకెళతావా డాడీ..."

    ఇరుకున పడ్డాడు...ఇప్పుడతను వెళ్ళాలనుకుంటున్నది ఎయిర్ పోర్టుకి. అసలు పార్శిల్ డేవిడ్ ఎందుకు తీసుకువెళ్ళిందీ కస్టమ్స్ ఆఫీసర్ గా అతడికి సంబంధించిన చాలా వివరాలు తెలుసుకుని మరో అరగంటలో డి.జి.పి.కి అందించాలి.

    "ప్రామిస్ చేసావుగా డాడీ...అన్నీ అబద్దాలా..."

    "అది కాదు లల్లీ...మరేమో షాప్ చాలా దూరం...ఎండ ఎక్కువగా వుంది. నువ్వు అలసిపోతావు....." ఉదయం ఇచ్చిన మాట తప్పాడు. "నేను తీసుకొస్తాగా..."

    అప్పుడు చూసాడు సమీపంలో నిలబడ్డ సబితని. ఆమె చూపుల్లో మునుపటి లాలిత్యం లేదు...తను చెప్పే ఏ మాట నమ్మదగ్గది కానట్టు యాంత్రికంగా చూస్తూంది.

    "డాడీ...చాలా పెద్ద పోలీసాఫీసరుగా లల్లీ...ఆయనకి చాలా పనులుంటాయి." దాంపత్య జీవితపు పగుళ్ళని అస్పష్టంగా వేలెత్తి చూపుతున్నట్టు అదోలా నవ్వింది. కేవలం ఒక సంఘటన మూలంగా సబితలో ఇలాంటి మార్పు రావడం అతడూ భరించలేకపోతున్నాడు. బహుశా కొన్నిరోజుల వ్యవధి చిక్కినా కనిపించని ఆమె గాయాన్ని మాన్పే ప్రయత్నం చేసేవాడేమో, కాని ఏదీ...బాధ్యత, కర్తవ్యం అతడ్ని మరింత దూరంగా నెడుతున్నాయి.

    తనను అర్ధం చేసుకోవాల్సిన భార్య మాటలు సాధింపుల్లా కనిపించాయో, లేక తన నిస్సహాయత అతడ్ని కలవరపరిచిందో నిశ్శబ్దంగా బయటికి నడిచాడు.

    సరిగ్గా ఇదే సమయంలో...

    "కారాపు" ఉద్విగ్నంగా అన్నాడు జయేంద్ర...ఎందుకూ అని అడిగేటంత స్థిమితంగా శృతికూడా లేదు...వెంటనే కారాపింది.

    "ఓ అరగంటలో వస్తా...ఇంటికి వెళ్ళు..." ఆమె జవాబుని ఆశించకుండా కుడివేపు ఫుట్ పాత్ దగ్గరికి నడుస్తున్నాడు జయేంద్ర.

    జయేంద్ర వేగంగా నడిచి ఓ పాన్ షాపును చేరుకోవడంగానీ అక్కడ భుజానికి సంచిని తగిలించుకున్న ఓ వృద్ధుడ్ని సమీపించడం గాని శృతి గమనించలేదు. ఒకవేళ గమనించే వుంటే జయేంద్ర జీవితానికి సంబంధించిన రహస్యపు అరల్లో ఓ పుటనైనా చదవగలిగి వుండేది.

    మరో పదినిముషాల్లో ఎపార్ట్ మెంట్స్ ని చేరుకుంది.

    పరుగులాంటి నడకతో మూడో అంతస్థులోని డేవిడ్ ఫ్లాట్ ని దాటుతుండగా లోపలినుంచి డేవిడ్ తల్లి గుండెలార్చే ఏడుపు వినిపించింది.

    క్షణం ఆగింది కాని లోపలికి వెళ్ళే సాహసం చేయలేకపోయింది.

    మరో అరనిముషంలో విశ్వేశ్వరశాస్త్రి ఇంటిలోకి నడిచింది.

    మనిషి జీవితంలో జరిగే చాలా సంఘటనలకి ఆధ్యాత్మికమైన ఓదార్పుని అందించగలిగే విశ్వేశ్వరశాస్త్రిగారిప్పుడు కర్మయోగిలా లేరు...

    నిర్విరామ తపస్సు భగ్నమైన ఓ మహర్షిలా అనిపించారు.

    చేష్టలుడిగినట్టు కూర్చున్న ఆయన నేత్రాల నుంచి నీళ్ళు ఆగకుండా ప్రవహిస్తున్నాయి.

    "బాబాయ్..." శృతి గొంతు ఆర్ద్రంగా పలికింది.

    "నేను ఏడవడం లేదమ్మా...పిలవకుండా మీ అందరి ఇళ్ళ తలుపుల్నితాకే ఆ ఈదురుగాలి ఏమైందో తెలీక నలిగిపోతున్నాను. మృతింజయుడూ అని మురిసిన ఆ గడుగ్గాయి స్మృతులు గుండెరక్తంలో కలకల్లా కలవరపెడుతుంటే ఇదిగో "ఇలా వాడేమయ్యాడూ అని ఎదురు చూస్తున్నాను..."


                       *    *    *    *


    "మిస్టర్ సంఘమిత్ర..."

    దబ్ మన్న చప్పుడుతో కళ్ళు తెరిచాడు ప్రొఫెసర్ సంఘమిత్ర. గదిలోని మసక వెలుతురులో ముందు ఎదురు నిలిచిందెవరో కనిపించలేదు...

    ఓ మూల నిలబడ్డ ప్రదీప్ సక్సేనా వికృతంగా నవ్వుతున్నాడు.

    అదికాదు సంఘమిత్రని ఆ క్షణంలో కలవరపరిచింది.

    ఎదురుగా ఓ పసికందు కళ్ళు నులుముకుంటున్నాడు...

    ఎవరూ...ఎక్కడో చూసినట్టుందే...

    "తాతయ్యా" సంఘమిత్ర మెడని చుట్టేసాడు నానీ. అసలు తనతో తరచూ కబుర్లుచెప్పే సంఘమిత్ర తాతయ్య ఇక్కడెందుకున్నాడూ అని ఆలోచించడం లేదు నానీ... చెప్పుకోడానికి ఒక్క ఆత్మీయుడైనా దక్కినట్టు వెక్కిపడుతూ గబగబా మాటాడేసాడు. "నిన్న స్కూల్లో పామొచ్చిందిగా తాతయ్యా...అందర్నీ చంపేస్తుంటే నేనే బెంచి ఎక్కేసానన్నమాట...ఆ తర్వాత నన్ను ఒక గెడ్డంవాడు ఎత్తుకున్నాడా మరి, తీసుకువచ్చేసాడన్నమాట...అప్పటికే నేను మంచి నానీని అని చెబుతున్నానా... కొట్టాడన్నమాట నోరు ముయ్యమని...అక్కడేమో" విశ్శు తాతయ్య గుర్తుకు రావడంతో కళ్ళలో నీళ్ళు మరింతగా గిర్రున తిరిగాయి. "తాతయ్యకోసం ఏడుస్తానని ఎంత చెప్పినా వినడంలేదన్న మాట...నువ్వయినా చెప్పు తాతయ్య."

    జరిగింది అర్ధమైంది సంఘమిత్రకి.

    కాని ఏం బదులు చెప్పగలడు. ఇక్కడ అడుగుపెట్టిన వాడు అంత సులభంగా తిరిగివెళ్ళలేడనగలడా.... లేక పసివాళ్ళని సైతం మృత్యువుకి ఆహుతి చేయగల ఓ నాగులకోనలో నానీ ఇప్పుడు ఉన్నాడని విశదీకరించగలడా...

    "మిస్టర్ ఓల్డ్ మెన్..." ప్రదీప్ సక్సేనా మొహంపై కిటికీ ఆవలివేపునుంచి ఓ వెలుగురేఖపడి జారిపోయింది. "యు నో...ఎంత చెప్పినా నువ్వు మా దారిలోకి రావడంలేదని చాలా ఆలోచించాక పరిశోధించాక వీడ్నిక్కడికి కిడ్నాప్ చేసుకొచ్చాం...మరేంలేదు. వీడితో నీకు చాలా అటాచ్ మెంటుందని తెలిసింది కాబట్టే ఎలాగూ తప్పదు కాబట్టి ఈ రోజు మృత్యువుకి స్పెషల్ డిష్ గా వీడ్ని తీసుకొచ్చింది."

    నానీకి ఏమిటో అర్ధంకాక తాతయ్య భుజంపై తలవుంచి, ఓరగా చూస్తున్నాడు.

    సంఘమిత్ర శరీరం సన్నగా ప్రకంపిస్తూంది.

    "చెప్పు ఇప్పుడు సిటీలో మారణహోమం సృష్టించే మాంబా కన్నా మా బ్లాక్ మాంబా ముఠాయే చాలా ప్రమాదకరమైనదీ అన్న సత్యాన్ని నువ్వు అంగీకరిస్తే మర్యాదగా మా ప్రపోజల్ కి అంగీకరించానని చెప్పు..."

    "ఇంపాసిబుల్" అసంకల్పితంగా నోరుజారేడు సంఘమిత్ర.

    అంతే...

    రెప్పపాటులో నానీని వెనక్కి లాగిన ప్రదీప్ సక్సేనా పెనుగులాడుతున్న నానీని ద్వారం ఆవలివేపుకు విసిరేసాడు.

    "తాతయ్యా..." ఓ సన్నని ఆర్తనాదం.

    "మిస్టర్ సంఘమిత్ర...నీ ఫార్ములాతో మాకు సహకరించేవరకూ మా ఫార్ములా ఇలా కొనసాగుతూనే వుంటుంది. సో...ఎంజాయ్ ది సీన్..." ప్రదీప్ సక్సేనా హెచ్చరిక ఇంకా పూర్తికానే లేదు.

    ముఠా అనుచరులు నానీని ఆ గదికి అభిముఖంగా వున్న గ్లాస్ కేజ్ లోకి నెట్టేసారు...

    "తా...తా..." నానీ ఆక్రందన సంఘమిత్ర మనసుని తూట్లు చేసింది.

    కిటికీలోనుంచి బయటికి చూసిన సంఘమిత్ర క్షణం అవాక్కయ్యాడు.

    అక్కడ ఎదురుగా కేజ్ లో అయిదడుగుల పొడవున్న ఓ త్రాచు అప్పటికే పడగవిప్పి నోరు తెరిచింది.

    ఆ బుస విషశ్వాసలా కేజ్ ని నింపుతుంటే ఓ మూల నక్కిన నానీ దారుణంగా కంపించిపోతున్నాడు.

    ఇప్పుడు ఏ తాతయ్య కోసం అరవలేదు. అరిస్తే పాము కోపగించుకుంటుందన్న భయమో లేక ఏ తాతయ్యా తనను ఇక రక్షించలేడన్న అపనమ్మకమో వెక్కిపడుతూ ఏడుస్తున్నాడు.

    "అ...మ్మా..." త్రాచు ముందుకు కదులుతుంటే భయంగా కళ్ళు మూసుకుంటూ అమ్మని గుర్తుచేసుకుంటున్నాడు. నానీ దుఃఖం త్రాచుని కదిలించలేదు సరికదా రెచ్చకొట్టింది.


                                                         *    *    *    *

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra