Home » Suryadevara rammohan rao » స్టార్ వార్స్

    మరొక పత్రిక పట్టణంలోని నీటి ఎద్దడిని బయట పెడితే, వేరొక పత్రిక పరిశ్రమలవల్ల _ మరుగువల్ల ఏ విధంగా పట్టాన జీవితం కలుషితమవుతున్నదీ, అంటువ్యాధులు ప్రబలుతున్నదీ బయట పెట్టింది. దీనితో ప్రజలలో అందోళన బయల్దేరింది.

    పెరుగుతున్న ఇంటి అద్దెలు_

    తరుగుతున్న జీవిత వనరులు_

    నానాటికీ తీసికట్టవుతున్న రోడ్లు_

    రోజురోజుకీ తీవ్రమవుతున్నా నీటి ఎద్దడి, గృహవసతి_

    అయూర్దాయాన్ని కబళిస్తున్న కాలుష్యం_

    ప్రశాంత జీవితాన్ని భగ్నం చేస్తున్నా రణగొణ ధ్వనులు_

    పరిశ్రమలు, విద్యాలయాలు నిర్మాణానికి స్థలాలకొరత_

    స్తంభించి పోతున్న టేలికమ్యునికేషన్స్_

    ఒకటేమిటి అన్ని  రంగాలలో ప్రజలు ఎదుర్కోంటున్న ఇబ్బందుల్ని పత్రికలు బయటపెట్టాయి.
 
    ప్రజల సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలన్న దృక్పథం తప్ప ప్రభుత్వంపట్ల, ఏ పత్రికకూ వ్యతిరేక భావంలేదు . పాథకుల ఆదరణ కోసం పత్రికల్ని పోటీ పడ్డాయి. అయితే ఇఇపరిస్థితి ముఖ్యమంత్రి పీక్కు ఉరితాడు బిగిస్తుందని వారిలో ఏ ఒక్కరూ ఊహించనయినా ఊహించలేదు.

     రీడర్ షిప్పింగ్ పోటీ పడితే_  
 
    ఓటర్స్ కోసం ప్రతిపక్షాలు పోటీ పడ్డాయి! 
    
    కనీస వార్తకి ప్రజలు, రాజీకీయ పార్టీలు ప్రతిస్పదించడంతో ఆ వార్తలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వవలసిన వచ్చింది. చివరకిది ప్రజా ఉద్యమంగా__ ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ముఖ్యమంత్రి వైఫల్యంగా_ రాష్ట్రం పారిశ్రమికంగా వెనక బదాతానికి ముఖ్యమంత్రి ఉదాసీనతగా రంగు పులుముకుంది. సాంఘిక సమస్యల పరిష్కారానికి జరుపుతున్న ఉద్యమం నెమ్మది నెమ్మదిగా ముఖ్యమంత్రి గద్దె దిగాలన్న సోగానులవైపు మొగ్గు చూపసాగింది.
   
                           *    *    *    *   

    "ఈవినింగ్ డైలీ పేపరోకటి అమ్మకానికి వుంది"

    "సంవత్సారానికి ఎంత నష్టం వస్తోంది!"

    చెప్పినవాడు పీటర్!

    అడిగిబ్నవాడు తంబి!!

    మాఫియా  ప్రపంచంలో 'రౌండర్' పాత్ర చాలా కీలక మయింది.

    ఈ రౌండర్ అత్యంత అధినికమైన దుస్తులతో ఖరీదైన హొటళ్ళలో, బార్ లలో కనిపిస్తుంటాడు. ఇతడికి నమ్మకస్తులయిన వారు పోలీసు డిపార్టమెంట్ దగ్గర్నుంచి హొటల్ బాయిస్ వరకు వివిధ స్థాయిలలో వుంటారు. హెరాయిన్, కోకయిన్ తదితర మాదక ద్రవ్యాల అమ్మకాలు, కొనుగోళ్ళు వీరి ద్వారానే జరుగుతుంటాయి. ఎవరి దగ్గర ఏ సరుకు ఎంత వున్నది_ మార్కెట్ డిమాండ్ వీరికి కరతలామలకం . అలాగే పోలీసులు దడి జరిపెముండు, మంచింగ్, మ్యాచ్ బాక్స్ వగైరా సరఫరా చేసే బేరర్స్ దగ్గర్నుంచే ఈ 'రౌండర్స్'ఇన్ ఫర్మేషన్ సేకరించింది.

    తంబి గ్యాంగు కి 'రౌండర్' ఈ పీటర్.

    వాస్తవానికి ఈ పీటర్ స్కూటర్లు, మోటారు సైకిళ్ళు దొంగిలించి దొంగిలించిన నాలుగు గంటలలోపు ఏ భాగానికి ఆ భాగంగా స్పేర్ పార్ట్స్ షాపులో సొమ్ము చేసుకునేవాడు. బజాజ్ స్కూటరుకి మార్కెట్లో ప్రీమియం వుందిగాని పీటర్ దగ్గర 'సీ_బుక్' తో సహా చౌకగా లభిస్తుంది. ఈ దోపీడికూడా చాల గమ్మత్తుగా వుండేది. రెస్టారెంట్ లు పబ్లిక్ పార్కింగ్ ప్లేస్ లనుంచి స్కూటర్లు దొంగిలించటం మామూలే. అంతకుమించి, స్కూటర్లు, మోటారు సైకిళ్ళు అమ్మదలచినవారు పేపర్ లలో క్లాసి ఫైడ్ యాడ్స్ ఇచ్చేవారు. అదీ సిటీ ఎడిషన్స్ లో మాత్రమె ఆ ప్రకటనలు చూసి సిన్సియర్ గా స్టార్ట్ బేరసారాలు చేసేవాడు.'ట్రయల్ చూస్తాను' అని స్కూటర్ స్టార్ట్ చేసేవాడు. అంతే!!

    మరో నలుగు గంటలలో ఆ స్కూటరు సార్ట్స్ మార్కెట్ లో వుండేవి. ఎస్.పి.గా దాస్ రావడంతో పీటర్ పని కష్టమయింది. వారానికి రెండు స్కూటర్లయినా దొంగిలించే పీటర్ పని పెగలక సతమతమవుతుండగా ప్రత్తి రైతుల సహాయ నిధికి సినిమా స్తార్త్స్ క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఆ అవకాశాన్ని జరవిడుచుకో దలచలేదు పీటర్. కాని, లోపలకి వచ్చి_ పోయే వాహనాలకు టోకెన్స్ జారీ చేసి పోలీస్ బండో బస్తు పెట్టాడు ఎస్.పి.దాస్.

    ఆ ఫంక్షనకి తన అనుచరులతో హాజరయిన "తంబి" ముందు జాగ్రత్తగా కార్యక్రమం పూర్తయ్యేలోపునే బయటకు  వచ్చాడు. జీపులో వచ్చినవాడు మోటారు సైకిల్ మెడ వెళ్ళడానికి పార్కింగ్ ప్లేస్ కి వచ్చాడు. జీపులో వచ్చినవాడు మోటారు సైకిల్ స్టార్ట్ చేసి బయలు దేరడానికి సిద్దంగా వున్నాడుపీటర్.విషయం అర్ధం చేసుకున్న తంబి అతడికి అసలు విషయం చెప్పాడు. "సారీ" చెప్పి మరో స్కూటరు సొంతం జేసుకున్నాడు. కాని, పోలీసుల కళ్ళుగప్పి  ఎలా పారిపోవడమా? అని ఆలోచిస్తున్నా అతడి భావాల్ని అర్ధం జేసుకున్న తంబి అతడికి సహకరించాడు. ఆ స్టేడియంలో చాలా షామియానాలున్నాయి. ఒక షామియానకు నిప్పు పెట్టాడు. అ మాత్రం గందరగోళం చాలు- పీటర్ స్కూటరుతో తప్పించుకోవడానికి! అలా ఏర్పడిన పరిచయం అతడ్ని "రౌండర్" గా మార్చింది.

    "తంబి! పేరు వ్యాపారం మనకెందుకు? మన వ్యాపారం మనం జేసుకుమ్తే చాలు, పైగా మొన్న బోట్ మీద సముద్రం మీదకి వేల్లడమేమిటి? ఆ ఆడపిల్లకి అంత చనువేమ్దుకు ఇస్తున్నావ్?" అనడిగాడు జానీ.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra