Home » Mainanpati bhaskar » రౌడీరాజ్యం


    "ఆ ఆకలి కేకలేనా?" అంది ఆగ్రహంగా నీర్జా.

    "మా ఖర్చులకే డబ్బు సరిపోవట్లేదు! ఇంక అందరి ఆకలీ తీర్చడానికి అన్నదాన సత్రం ఏమన్నా పెట్టుకుని వున్నామా? వెళ్ళు! వెళ్ళి నోర్మూసుకు పడివుండమని అందరికీ నా ఆర్డర్ గా చెప్పు!" అంది కరుస్తున్నట్లు.

    అలవికాని కోపాన్ని అతి కష్టంమీద అణుచుకుని చరచరా నడుస్తూ బయటికి వచ్చేశాడు అఖిల్.

    సెల్లార్ లో వర్కర్స్ అందరూ అతని రాకకోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.

    అతన్ని చూడగానే "ఏమయ్యింది?" అన్నారు అందరూ ఒక్క గొంతుతో.

    "వాళ్ళ తమ్ముడి పెళ్ళికి కోటి రూపాయలు ఖర్చుందిట! అందుకని మన ఆకలి కేకలు వినే ఓపిక లేదుట!" అన్నాడు అఖిల్ ముక్తసరిగా.

    తుపుక్కున ఉమ్మి ఒక బూతుమాట అన్నాడు ఒక వంటవాడు. అని, యింకా అన్నాడు-

    "పెళ్ళి వంటలు మనమేగా చేసేది! వంటకాల్లో విషం కలుపుతా! సర్వనాశనం అయిపోవాలి! ఆ తర్వాత నేను చచ్చినా ఫర్లే!"

    అందరూ అతన్ని సమర్దిస్తున్నట్లు మాట్లాడారు.

    అందరినీ ఆగమని సైగ చేశాడు అఖిల్.

    "న్యాయం కోసం న్యాయంగానే పోట్లాడాలి మనం! నాశనం చెయ్యడం మన ఆశయం కాకూడదు. వీళ్ళని ఎక్కడ నొక్కెయ్యాలో నాకు తెలుసు. ఆ సంగతి నాకొదిలేయండి" అన్నాడు స్థిరంగా.

    అతను ఏం చేయబోతున్నాడో అంతుబట్టనట్లు చూశారు అందరూ!

    నీర్జా తమ్ముడు రాజ్ కుమార్ పెళ్ళి ఇంకా పదిరోజులు ఉందనగానే-

    నీర్జా గ్రూపు హోటళ్ళల్లో బయటివాళ్ళకి రూములు ఇవ్వడం బంద్ అయిపోయింది. వాళ్ళ గ్రూపు తాలూకు అన్ని హోటళ్ళు, ఆ హోటళ్ళలోని అన్ని రూములూ కూడా పెళ్ళికి రాబోయే అతిథుల కోసమే ఖాళీగా వుంచబడ్డాయి.

    ఆ వచ్చే అతిథుల కోసం వేలకొద్దీ ఫ్లయిట్ టిక్కెట్లు లాట్స్ గా బుక్ చేయబడ్డాయి.

    రైలు టిక్కెట్లని కూడా లాటుగా కొనెయ్యడం జరిగింది. లెక్కలేనన్ని లగ్జరీ బస్సులను లీజ్ కి తీసుకున్నారు.

    ఇవన్నీ చాలనట్లు అతిథులని సునాయాసంగా చేరవేయడానికి పెళ్ళి ఏర్పాట్లు మరింత ఎఫిషియంట్ గా చేయడానికిగాను ఒక హెలికాఫ్టర్ ని కూడా అద్దెకి తీసుకోవడం జరిగింది. ఆ హెలికాఫ్టర్ దిగడానికిగాను అప్పటికప్పుడు ఒక హెలిపాడ్ ని కొత్తగా నిర్మించారు.

    అద్దెకు తీసుకున్నప్పటి నుంచి ఆ హెలికాఫ్టర్ నిర్విరామంగా ఆకాశంలో తిరుగుతూనే వుంది.

    కొద్దిరోజుల క్రితం నీర్జా ఛాంబర్స్ లో అఖిల్ వింటుండగానే నీర్జా తరపున ఆమె సెక్రటరీ చెప్పిన పెళ్ళి ఏర్పాట్ల వివరాల్లో అతిశయోక్తి ఏమీలేదు.

    అచ్చంగా అతను చెప్పినట్లే జరిగాయి పెళ్ళి ఏర్పాట్లన్నీ కూడా!

    పెళ్ళి కోసం నిజంగానే ఒక స్టేడియం అద్దెకు తీసుకున్నారు. అందులో నాలుగువైపులా నాలుగు 'మాయాబజార్లు' నిర్మించబడ్డాయి. ఒక బజారు అంతా అమెరికన్ టైప్. ఇంకో బజారు ఇండియన్ టైప్. మరో బజారు చైనా వీధులని గుర్తుకుతెస్తే, చివరి బజారు అరబ్ దేశాల్లోని వీధులని పోలి వుంది.

    ఆ వీధుల్లో ఒక్కొక్క షాపులో ఒక్కొక్క రకం తినుబండారాలు నోరూరేట్టు అమర్చి వున్నాయి. మధ్య మధ్య బార్ లు. వాటిలో ప్రపంచంలో దొరికే ఖరీదైన మధ్యాలన్నిటితోబాటు జపాన్ లో బియ్యంతో చేసే సారా, గోవాలో జీడిమామిడి పండ్లతో చేసే ఫెనీ దగ్గరనుంచి కల్లు, సారా అన్ని రకాల మద్యాలూ స్టాక్ చేసి వున్నాయి.

    అలంకరణ కోసం అవన్నీ అలా షాపుల్లో పెట్టినట్లు పెట్టారుగానీ నిజానికి అన్నీ ఫ్రీనే. వచ్చిన అతిథులు ఆ బజార్లలో తిరుగుతూ తింటూ, తాగుతూ ఖుషీ చేయవచ్చు. ఒక్కొక షాపులో ఒక్కొక్క దేశానికి చెందిన అందమైన ఆడపిల్లలు వుండి చిరునవ్వుతో అతిథులకి అన్నీ అందిస్తారు.

    స్టేడియం నాలుగుమూలలా నాలుగు వేదికలు ఉన్నాయి. వాటిలో నాలుగు రకాల కల్చరల్ ప్రోగ్రామ్స్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

    ఒక వేదిక మీద హార్డ్ రాక్ సంగీతం.

    ఇంకొకవైపు నార్తిండియన్ కథక్, హిందూస్తానీ....

    ఒకవైపు కూచిపూడి, భరతనాట్యం

    మరోవైపు కవి సమ్మేళనం.

    పెళ్ళికి దాదాపు మూడులక్షలమంది అతిథులు వస్తారని అంచనా. (పెళ్ళికి వచ్చే అతిథుల సంఖ్యని నియంత్రిస్తూ ప్రభుత్వం జారీచేసిన గెస్ట్ కంట్రోల్ ఆర్డర్ వుండడానికయితే అమల్లోనే వుంది. కానీ పొరపాటున కూడా ఎవరూ దానిని పాటించరు. ముఖ్యంగా రాజకీయనేత్తలు!"

    స్టేడియం మధ్యలో మేరేజ్ పెండాల్ వుంది.

    ప్రొడ్యూసర్ మెహతా పంపిన సినిమా కార్పెంటర్లు, మౌల్డర్లు కలసి ఆ కళ్యాణ వేదికని జైపూర్ మహారాజుల హవామహల్ నమూనాలో నిర్మించారు.

    ఆ హవామహల్ మధ్యలో నెమలి సింహాసనం మోడల్లో రెండు ఆసనాలు వున్నాయి. వాటిమీద కూర్చుంటారు పెళ్ళికూతురు, పెళ్ళికొడుకూనూ.

    యంగ్ గ్యాంగ్ స్టర్, యూత్ లీడర్ అయిన రాజ్ కుమార్ పెళ్ళికి ఇంత హంగామా చెయ్యవలసిన అవసరం చాలానే వుంది.

    ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఢిల్లీలో అతి ఆడంబరంగా పార్టీలు ఇవ్వడం అనేది ఒక పెద్ద క్రేజ్ అయిపోయింది. ఎవరు ఎంత వృధా వ్యయం చెయ్యగలిగితే అంత గొప్ప అన్న అభిప్రాయం ఏర్పడిపోయింది. అందరిలో కూడా మంచి విషయాల్లో పోటీపడేవాళ్ళు అరుదుగానీ ఇలాంటి మూర్కత్వంలో వంతుకు గంతువేసేవాళ్ళ సంఖ్య తక్కువేమీ కాదు.

    పెళ్ళి ఇంక రేపు అనగా రాజ్ కుమార్ కి పెళ్ళి కట్నాల చదివింపులు మొదలయ్యాయి.

    రాజ్ కుమార్ రాజకీయాల్లో తారాపథానికి దూసుకుపోతున్నవాడని అందరికీ తెలుసు. అతన్ని దువ్వి, మంచి చేసుకోవడానికి అతని పెళ్ళికంటే మరో మహత్తరమైన అవకాశం రాదు.

    చదివింపులంటే డబ్బు రూపేణా కాదు.

    డబ్బుదేముంది. రాజ్ కుమార్ లాంటివాళ్ళు తలచుకుంటే కుక్కని కొట్టినా రాలుతుంది డబ్బు! ఈ 'చదివింపులు' డబ్బుని మించినవి.

    ముందుగా చదివింపులు మొదలుపెట్టింది అతని పార్టీనే.

    అతన్ని ఆ పార్టీ యువజన విభాగానికి అధ్యక్షుడిగా చేశారు.

    అది అంత తక్కువ చదివింపేమీ కాదు.

    రాజ్ కుమార్ ని ఆ తరువాత ఒక కార్పొరేషన్ కి చైర్మన్ గా నియమిస్తున్నట్లు ఒక ప్రకటన వెలువడింది.

    కార్పొరేషన్ చైర్మన్ అంటే కనీసం మూడేళ్ళపాటు కారూ, పెట్రోలూ, ఫోనూ, ఫ్లయిట్సూ, సెక్రటరీ, ఆఫీసు, టీ ఏ, డి.ఏ. ఇవన్నీ ఆకర్షణలేగా!

    వేరొకరి ఇన్ ఫ్లుయెన్స్ వల్ల ఒక బ్యాంకుకి అతన్ని బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ లో మెంబర్ గా వేశారు.

    రెండు కంపెనీలు అతన్ని తమ కంపెనీలకి డైరెక్టర్లలో ఒకడుగా ఉండే ఏర్పాట్లు చేశాయి. పెద్దలంతా హద్దులు మరచి సాష్టాంగ ప్రమాణాలు చేస్తున్న ఈ రాజ్ కుమార్ అసలు ఎవడు?

    పరీక్షలకి కూర్చుంటే పదోక్లాసు పాసవలేనివాడు. అర్హతలనిబట్టి చూస్తే గుమాస్తా ఉద్యోగానికి కూడా పనికిరాని పోరంబోకు గూండా.

    సంస్కారాన్నిబట్టి చూస్తే బురదలలో దొర్లే పంది కూడా అసహ్యించుకునే మనిషి.

    "గాడిద కొడకా" అని ఎవరన్నా కడుపుమండి తిడితే "అయ్యో వీడా నా కొడుకు" అని గాడిద ఏడ్చేటంతటి ఘనుడు.

    రౌడీయిజమే ఆధారంగా రాజకీయాల్లో వచ్చి రోజు రోజుకీ పైకి వచ్చేస్తున్నవాడు.

    ఆ రోజు రాజ్ కుమార్ కి చాలా తృప్తిగా అనిపించింది.

    తనకి ముట్టిన చదివింపులు తృప్తిగా వున్నాయి.

    ఒక పార్టీ పదవి, ఒక కార్పొరేషన్ కి చైర్మన్, ఒక బ్యాంకుకి, రెండు కంపెనీలకి డైరెక్టర్.

    ప్రస్తుతానికి ఇవి చాలు.

    వీటి సాయంతో పరమపద సోపానంలోని పెద్ద నిచ్చెనలు చకచకా ఎక్కెయ్యగలుగుతున్నాడు.

    అతను అలా లాభాలను బేరీజు వేసుకుంటూ వుండగా....అప్పుడు వచ్చింది ఆ ఫోన్ కాల్.


                      *    *    *    *


    అంతకు కొన్ని గంటలముందు_

    నీర్జా హోటల్ సెల్లార్ లో వర్కర్స్ అంతా కూర్చుని వున్నారు.

    కిచెన్ లోని ఎలెక్ట్రిక్ ఓవెన్ లాగా వేడెక్కిపోయి వున్నాయి వాళ్ళ మనసులు.

    వాళ్ళ మధ్య కూర్చుని వున్నాడు అఖిల్.

    తమ కోర్కెల విషయంలో ఇదివరకోసారి ఉద్రేకపడిపోయిన కుక్ మళ్ళీ అప్పుడు-

    "ఎంత ఖర్చు! ఎంత వేస్టు! ఎంత ఆడంబరం! మనం కడుపుకి కూడు కావాలంటే పెట్టడానికి డబ్బుల్లేవంటారు. తగలెయ్యడానికి మాత్రం తయారు. నా మనసు మండిపోతోంది. వంటల్లో విషం కలుపుతా! తర్వాత ఉరికంబం ఎక్కడానికయినా నేను తయ్యార్" అన్నాడు ఆవేశంగా.

    అతని చేతిలో నిజంగానే విషం బాటిల్ వుంది. అఖిల్ ఒక్కసారిగా ముందుకు వంగి ఒడుపుగా ఆ విషం బాటిల్ తను లాక్కుని దాన్ని అందరికీ కనబడేటట్లు ఎత్తిపట్టుకున్నాడు.

    తర్వాత స్థిరంగా చెప్పాడు తను_

    "దయచేసి అందరూ వినండి. ఎవరైనా, ఏ విధంగానయినా సరే, ఎలాంటి విధ్వంసం తలపెట్టినా సరే తక్షణం నేను ఈ విషం తాగి మీ కళ్ళముందే చనిపోతాను. అర్ధమయ్యిందా?"

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra