Home » Vasireddy seeta devi novels » Rabandulu Ramachilukalu


    శేఖర్ ఆవేశంగా సునంద దగ్గరకు వెళ్ళాడు. ఆమె చేతులు ముఖం మీదనుంచి లాగాడు. సునంద చివ్వున లేచి నిల్చుంది, బెదిరిపోతూ శేఖర్ ముఖంలోకి చూసింది.

 

    నరహరి పళ్ళు నూరాడు. వీరభద్రయ్య వ్యంగ్యంగా నవ్వాడు. అందరూ కుతూహలంగా చూస్తూ కూర్చున్నారు.

 

    "పద! వీళ్లు మనుషులు కారు. రాబందులు. రాబందుల గుంపులో రామచిలుకలు బతకలేవు. పొడిచి పొడిచి చంపుతాయ్!" అన్నాడు జాలిగా శేఖర్.

 

    "వినండయ్యా! వాడి మాటలు వినండి! నోటికి అడ్డూ ఆపూ లేకుండా మాట్లాడేస్తున్నాడు. మనందరం రాబందులమట! అదేమో.... పాపం.... రామచిలుకట.... రామచిలుక.... మరి వాడేమిటో....?" కసిగా అన్నాడు నరహరి.

 

    "గోరువంక!" అందుకున్నాడు వీరభద్రయ్య.

 

    సన్నగా నవ్వులు!

 

    శేఖర్ రక్తం కుతకుతలాడుతోంది. ఒక్క క్షణం అక్కడ నిలబడలేకపోతున్నాడు.

 

    "రా!" అంటూ సునంద చేయిపట్టుకొని బరబరా బయటికి ఈడ్చుకు పోయాడు.

 

    అందరూ నోళ్లు తెరుచుకొని వాళ్లు వెళ్ళినవైపే చూస్తూ వుండిపోయారు.


                                                                       31


    దూరంగా ఎత్తుగా గుడిగోపురం కనిపిస్తూంది. వంతెనక్రింద కాలువ నిండుగా ప్రవహిస్తూంది.

 

    శేఖర్ వంతెన కడ్డీలకు ఆనుకొని గంభీరంగా నిల్చుని వున్నాడు. సునంద వంతెనమీదనుంచి వంగి నీళ్ళలోకి చూస్తూవుంది. ఆమె కళ్ళనుంచి కారుతున్న కన్నీటి చుక్కలు క్రింద కాలవనీళ్ళలోపడి కలిసిపోతున్నాయ్.

 

    "సునందా! నన్ను క్షమించు! ఉద్రేకంలో ఏదోచేశాను" అన్నాడు అపరాధిలా శేఖర్.

 

    సునంద జవాబివ్వలేదు. కళ్ళు తుడుచుకుంది. మళ్ళీ అంతలోకే కళ్ళు నిండాయి.

 

    "అంతమంది మధ్యలో ఆ వీరభద్రయ్యా, నరహరీ నిన్ను అవమానిస్తుంటే చూస్తూ వుండలేకపోయాను" ఓ క్షణం ఆగి "అన్యాయాన్ని చూస్తూ కూర్చోవడం నా చేతకాదు సునందా!"

 

    సునంద మనసు బరువుగా వుంది. దుఃఖంతో కంఠం పూడివుంది. అందుకే సమాధానం ఇవ్వకుండా నీళ్ళలోకి చూస్తూ నిల్చుంది.

 

    శేఖర్, తనను ఆదుకున్నాడు. కాని ఇలాంటి అవమానాలు తను ఇంకా ఎన్ని భరించాలో? శేఖర్ చేసిన పనికి చిలవలు పలవలు కల్పించి తన గురించి కథలు ప్రచారం చేస్తారు. లేనిపోని అపనిందలు వేస్తారు. శేఖర్ తనను అంతమంది మధ్యనుంచి తన చెయ్యిపట్టుకొని లాక్కుని వచ్చాడు. అలా చేసివుండాల్సింది కాదు. ఎందుకలా చేశాడు? నరహరి సభలో అడిగిన ప్రశ్నే ప్రతిఊళ్ళో తనను ఎవరో ఒకరు అడక్కమానరు. తనేం జవాబిస్తుంది? అంత చెప్పినా ఎవరు వినిపించుకుంటారు? ఎవరు అర్ధం చేసుకుంటారు? ఇక తాను ఈ ఉద్యోగం చెయ్యలేదు. మళ్ళీ మరో ఉద్యోగాన్వేషణకు బయలుదేరాలి. జానకిరామయ్య బాబాయిమాట విని ఈ ఉద్యోగంలో చేరకుండా వుంటే ఈనాడు ఇటువంటి అవమానానికి గురి కావాల్సి వచ్చేది కాదు.

 

    శేఖర్ కూ తనకూ వున్న సంబంధం ఏమిటి? మనిషికీ మనిషికీ మధ్యవుండే సంబంధమేనా? అంతేనా? ఎందుకో సునంద మనస్సు కలుక్కుమంది అంతే? అంతకంటే ఏముంటుంది? శేఖర్ ఎక్కడా? అతని అంతస్తు ఎక్కడా? తనెక్కడా!

 

    "ఉద్రేకంతో నేను నిన్ను చెయ్యిపట్టుకొని తీసుకొచ్చాను. ఇక వాళ్ళంతా నీమీద నీలాపనిందలు వేస్తారు. పని కట్టుకొని ప్రచారం చేస్తారు!"

 

    సరిగ్గా తను ఆలోచిస్తున్న మాటల్నే శేఖర్ అంటున్నాడు.

 

    సునంద తలెత్తి శేఖర్ ముఖంలోకి చూసింది. నీరునిండిన కళ్ళతో.

 

    "ఏడుస్తున్నావా సునందా?" శేఖర్ కంఠం బాధగా పలికింది.

 

    "లేదు....లేదు" అంటూ కళ్ళు తుడుచుకుంది.

 

    "నిన్ను అవమానం నుంచి ఆదుకోబోయి అంతకంటే ఎక్కువగానే అవమానించానేమో? పెనం మీదనుంచి తీసి నిప్పుల్లో వేశానుకదూ?" విచారంగా అన్నాడు.

 

    సునందకు ఏం సమాధానం ఇవ్వాలో అర్ధంకాలేదు.

 

    "సునందా ఒకటి చెప్పనా? నా నిర్ణయం నీకు బాధ కలిగిస్తే క్షమించు?"

 

    సునంద మాట్లాడలేదు.

 

    "నిన్ను అపనిందపాలు చెయ్యకుండా వుండాలంటే నాకు ఒకే మార్గం కనిపిస్తోంది.

 

    "ఏమిటి?" అన్నట్టు చూసింది సునంద.

 

    "అదిగో అటుచూడు. ఆ దేవాలయం చూడు. భగవంతుని సాక్షిగా చెప్తున్నాను. నీకు అభ్యంతరం లేకపోతే ఆ భగవంతుని ఎదుట నిన్ను నా భార్యగా స్వీకరిస్తాను" అన్నాడు శేఖర్.

 

    సునంద, శేఖర్ ముఖంలోకి ఓ క్షణం చూసింది.

 

    ఏమిటీ తను వింటున్నది? ఇది నిజమా! లేక తన భ్రమా? శేఖర్ తనను పెళ్ళిచేసుకుంటాడా?

 

    "నీకు అభ్యంతరం లేకపోతేనే?" మళ్ళీ అన్నాడు.

 

    తనకు అభ్యంతరమా? కాని శేఖర్ క్షణిక ఆవేశంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నాడు. ఆ తర్వాత పస్చాత్తాప్పడడం జరిగితే?

 

    "ఏం సునందా? నాకు సమాధానం చెప్పు!"

 

    "నాకోసం ఇంత త్యాగం చేస్తారా? కేవలం నా మీద జాలితో.... నన్ను అపనింద నుంచి కాపాడటానికి.... వద్దు, వద్దు...." అన్నది సునంద.

 

    "త్యాగమా? ఇందులో త్యాగం ఏముంది! నీమీద జాలికాదు.... గౌరవం? అభిమానం.... కాదు. అంతకంటే అతీతమైన భావం ఏదో.... నిన్ను చూసినప్పుడల్లా నా ఆంతర్యం ఏదో అనిర్వచనీయమైన మధుర భావంతో నిండిపోతుంది. బహుశా అది ఆరాధన కావచ్చు" చిన్నగా తనకు తనే చెప్పుకుంటున్నట్టు అన్నాడు శేఖర్.

 

    సునంద ఒక్కసారిగా వంగి శేఖర్ పాదాలను స్పృశించింది.

 

    "ఛ! ఇదేమిటీ? ఇలా కాళ్ళకు మొక్కడం నీలాంటి స్త్రీలు చెయ్యాల్సిన పనికాదు" అంటూ శేఖర్ ఆమెను లేవదీశాడు.

 

    "కాళ్ళకు మొక్కడంలో చిన్నతనం ఏమీలేదు. మనస్సు కృతజ్ఞతతో నిండిపోయినప్పుడు, మనిషి తను నేర్చిన భాషలో ఆ కృతజ్ఞతను తెలియపర్చలేనప్పుడు...." ఆపైన ఏం చెప్పాలో తోచలేదు సునందకు.

 

    శేఖర్ కళ్ళు సంతోషంతో వెలిగిపోయాయి.

 

    "పద! సునందా! గుడికి వెళ్దాం!"
    


    శేఖర్ రెండు అడుగులు వేసి ఆగిపోయాడు_ "గుడికెందుకూ?" అని సునంద ప్రశ్నించడంతో.


    
    "దేవుడి సాక్షిగా...."

 

    " ఆ గుళ్లో దేవుడున్నాడో లేడో నాకు తెలియదు. నా కళ్ళముందే దేవుడు కన్పిస్తూంటే రాళ్ళలో దేవుణ్ణి వెతుక్కుంటూ ఎందుకు వెళ్ళాలి?"

 

    శేఖర్ సునంద ముఖంలోకి చూస్తూ నిలబడ్డాడు.

 

    "మీ నీడే నా గుడి, మీరే నా దేవుడు, ఏ దేవుడి సాక్ష్యాలూ నా కక్కర్లేదు. మనిషే దేవుడై నన్ను కరుణించాడు. ఇంకా నాకు ఆ రాతి దేవుడి సాక్ష్యాలెందుకు?" అన్నది సునంద.

 

    శేఖర్ ఆర్తిగా సునందను గుండెలకు హత్తుకున్నాడు.

 

    దూరంగా గుడిగంటలు విన్పించాయి.

 

    గుడి మీది పావురాల జంట లేచి వినీలాకాశంలోకి ఎగిరింది.

 

    సునందా, శేఖర్ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకున్నారు.

 

    సునంద కళ్ళు సిగ్గుతో కిందకు వాలాయి.

    
                                           32


    ధర్మయ్య వసారాలో నులక మంచంమీద కూర్చుని కొబ్బరితాడు పేనుతున్నాడు. వాకిట్లో అలికిడై తలెత్తి చూశాడు. సునంద శేఖర్ తో ప్రవేశించింది.

 

    ధర్మయ్య చేతిలో కొబ్బరి పీచు, పేనుతూవున్న తాడూ, మంచం మీద పక్కగా పెట్టి, లేచి సంతోషంగా వాళ్ళకు ఎదురు వెళ్ళాడు. వాళ్ళిద్దరూ ధర్మయ్యకు ఎదురుగా నిలబడిపోయారు. సునంద నిల్చున్న తీరూ, తలవంచుకొని సంకోచిస్తూ వుండటమూ చూసిన ధర్మయ్యకు ఏదో అనుమానం కలిగింది. ఇద్దర్నీ మార్చి మార్చి చూశాడు. శేఖర్ వినయంగా నిల్చొని వున్నాడు. ధర్మయ్య ఆశ్చర్యంగా ఆలోచిస్తూ నిలబడిపోయాడు.

 

    ఇది నిజమేనా! తాను ఊహిస్తున్నది నిజమేనా?

 

    సునందా_శేఖర్ వంగి ధర్మయ్య పాదాలకు నమస్కరించారు.

 

    ధర్మయ్య ఊహ వాస్తవం అయింది. ఆనంద పారవశ్యంతో ఇద్దర్ని దీవించాడు.

 

    ఇద్దరూ లేచి నిల్చున్నారు. ఆనందంతో తలమునకలౌతున్న ధర్మయ్యకు మాటలు రావడంలేదు. ఏం చెయ్యాలో తోచడం లేదు. నూతన దంపతులను ఆహ్వానించాలి. కాని ధర్మయ్యకు ఏదో లోపం కన్పించింది. సునంద మెడ కేసి చూశాడు. బోసిగా కన్పించింది.

 

    "తులశమ్మా! తులశమ్మా!" కేకలు పెట్టాడు ధర్మయ్య.

 

    "ఏం అన్నయ్యా" అరే సునందా! ఎప్పుడొచ్చావ్! అని పరామర్శిస్తున్న తులశమ్మను మధ్యలో ఆపి,

 

    "తులశమ్మా! త్వరగా పసుపుకొమ్ముకట్టిన ఓ పసుపుతాడు తీసుకురా" అన్నాడు సంతోషంతో, ఉక్కిరి బిక్కిరైపోతూ.

 

    తులశమ్మ ఇద్దర్నీ చూసింది. అర్ధం చేసుకుంది. సంతోషంగా

 

    "ఇప్పుడే తెస్తాను" అంటూ వెనక్కు తిరిగింది తులశమ్మ.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra