Previous Page Next Page 
అభిలాష పేజి 36

    మళ్ళీ ఫోన్ క్రింద పెట్టిన చప్పుడు.
   
    బైరాగి మళ్ళీ పైకి వెళ్ళాడు.కొంచెం తటపటాయించిఅర్చనని తట్టి లేపాడు. రెండు నిముషాలకి ఆమె కదిలింది. బలవంతంగా కళ్ళు  విప్పడానికి ప్రయత్నం చేస్తూ "ఊం" అని, పక్కనే నిలబడ్డ బైర్గిని చూసి ఉలిక్కిపడి లేచి కూర్చుంటూ "ఏమిటి" అంది.
   
    బైరాగి అడుగు వెనక్కీ వేసి "అయ్యగారు ఫోనులో వున్నారు__ పిలుస్తున్నారు" అన్నాడు. అమెకింకా నిద్రమత్తు వదలలేదు. మెదడంతా దేనితోనో నొక్కిపేట్టినట్టు వుంది. అసలు ఏ పరిస్థితుల్లో నిద్రపోయిందో మర్చిపోయింది. ఆ మత్తులోనే తలూపుకుంటూ మెట్లు దుగివచ్చి ఫోన్ అందుకొని "హల్లో..." అని, "....ఏం మావయ్యా? ఎక్కడ్నుంచి?" అంది కళ్ళు నులుముకుంటూ.
   
    "నేను మీ మావయ్యను కాను అర్చనగారూ. నాపేరు శర్మ... ఆగండి,ఫోన్ పెట్టెయ్యకండి. మళ్ళీ చెయ్యటానికి న దగ్గర డబ్బులులేవు.  నేను డేత్ సెల్ ముందు పహరా తిరిగే సెంట్రీని. చిరంజీవి గదిముందు నేనే తిరిగేది. చిరంజీవి హంతకుడు కాడు. అత్ద్సలు ఏ హత్యా చెయ్యలేదు" అని తొందర తొందరగా చెప్పేసి "హమ్మయ్య" అనుకున్నాడు. తన బాధ్యత తీరిపోయింది.
   
    చిరంజీవి అన్న పేరు వినబడేసరికి అర్చన నిద్రమత్తు సగం వదలిపోయింది! హత్యా ప్రసక్తి వచ్చేసరికి పూర్తిగా పోయింది.
   
    "ఎవరు నువ్వు__ వివరంగా చెప్పు" అంది ఆత్రంగా.
   
    శర్మ విషయాన్ని కుదించి, అయినా ఆమెకి అర్ధమయ్యేటట్టూ పూర్తిగా చెప్పేడు. తను ఇంటికొచ్చిన సంగతీ, గూర్ఖా అడ్డుపడిన సంగతీ ఉరి దగ్గర పడుతున్న సంగతీ కూడా చెప్పాడు.
   
    విషయం అంతా విన్న అర్చన శిలాలా నిలబడిపోయింది. అవతలనుంచి శర్మ 'హలో హలో' అంటున్నాడు.
   
    "ఎక్కణ్ణుంచి ఫోన్ చేస్తున్నావ్ నువ్వు?"
   
    శర్మ చెప్పాడు.
   
    "వెంటనే రా. ఆటోగానీ __ టాక్సీగానీ  ఏదుంటే అది. ఆలస్యం చేయ్యకు" అని ఫోన్ పెట్టేసి__ గోడకి అనుకోని నిలబడిపోయింది. ఆమె నుదుటిమీద చెమటపట్టింది. చేతివేళ్ళు కంపిస్తున్నాయి. తను ముందు మామూలుగా మారాలి....అదీముఖ్యం... ఒకటి.... రెండు.... మూడు అని లెక్కపెట్టసాగింది. ఎప్పుడు ఉద్వేగపడినా, ఎప్పుడు కోపం వచ్చినా ఆమెకి అలా లెక్క పెట్టటం అలవాటు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు చెదిరిన మనసుని కూడగట్టుకోవటం అవసరం "వంద" పూర్తయ్యేసరికి ఆమె మామూలు మనిషి అయిపోయింది.ఏదో ఒకటి చెయ్యాలి. టైమ్ అయిపోతుందనీ, పరిస్థితి చెయ్యిదాటి పోయిందనీ ఆమెకు తెలుకుడు ఉరికంబం ఎక్కకుండా నిరోధించడం ఎలా? ఆమె గడిలోకీ, బైట వరందాలోకీ పచార్లు చేస్తూ శర్మకోసం ఎదురు చూడసాగింది. మనసులో వువ్వెత్తున ఎగసిపడే కెరటాల్లాంటి ఆలోచనలు! ఎందుకిలా చేసేడు చిరంజీవి? ఇందులో ఏమ్డుకుయిరుకున్నాడు? దేశంలో ఉరిశిక్ష ఏమవుతే అతనికేం? ఒకవైపు అతడిమీద గొంతుదాకా కోపం వస్తూంది.  మరొకవైపు ఈ చేసిందంతా తన మెప్పుకోసమే అనుకుంటే అనందం వేస్తూన్నది. ఏడవాలో నవ్వాలో తెలియని స్థితి ఏది ఏమయినా, శర్మ వచ్చి పూర్తీ వివరాలు చెబుతేగానీ విషయం తెలీదు. ఆమెకి క్షణమో యుగంగా గడుస్తూంది.
   
    అక్కడ శర్మ పరిస్థితి అధ్వాన్నంగా వుంది. జేబులో డబ్బులు లేవు 'ఈ రాత్రంతా న పని పరిగెత్తటంలానే వుంది' అనుకుంటూ అతడు తిరిగి పరుగెత్తడం మొదలుపెట్టాడు.
   
    అతడు ఆ యింటికి చేరుకొనేసరికి మరో పదినిముషాలు పట్టింది. రొప్పుతూ గేటు ముందు నిలబడ్డాడు. ఆ అలికిడికి తొంగిచూసిన గూర్ఖా "నీ కింకేం పన్లేదా? పావులీసుల్నీ పిలవనా" అని అరుస్తున్నాడు. శర్మ ఏదో అనబైఎసరికి వరందాలోంచిఅర్చన కంఠం వినిపించింది, "అతడిని లోపలి పంపించు హర్నమ్ " అని.     
   
    గూర్ఖా ఉలిక్కిపడి అటుచూసి, యాజమానరాలీని గమనించి, నమ్రతగా గేటు తెరిచాడు!
   
    శర్మ ఇంక ఆయాసపడ్తూనే వున్నాడు. అయినా నెమ్మదిగా, వివరంగా అంతా చెప్పాడు. ఆమె జాగ్రత్తగా విన్నది. చిరంజీవి చెప్పినదంతా అక్షరం పొల్లుపోకుండాచెప్పాడు శర్మ. శవంకోసం వెతకటం, దారాసింగ్ అనేవాణ్ణి పట్టుకోవటం, సర్వోత్తమారావు..... చిరంజీవి కలసి ఫోటోలు తీసి శవాన్ని నూతిలో పడేయ్యటం వగైరా.
   
    ఇప్పుడు ఉత్పన్నమైనా ప్రశ్న __"సర్వోత్తమారావు ఏమయ్యారు?" అన్నది.
   
    "మనం ప్రెసిడెంట్ గెస్ట్ హౌస్ కి ఫోన్ చెయ్యాలి" అన్నది అర్చన. "అసలు అంకుల్ అక్కడికి చేరుకున్నారో_ లేదో; ఫోటోల గురించి కూడా అక్కడ తెలుస్తూంది.ఒక మనిషి జేవన్మరణ సమస్య అంటే వాళ్ళూ అంత తేలిగ్గా తీసుకోరు. జవాబు చెప్తారు."
   
    "ఆ పనీ మ్మే చేసేం" అన్నాడు శర్మ. చిరంజీవి రాత్రే ఆ విషయం కనుక్కోమన్నాడు. ప్రెసిడెంట్ దగ్గరికి అయన అసలు వెళ్ళలేదట_ నాలిగింటి ప్రోగ్రాం కాన్సిల్ అయిందట!"
   
    ఏం చెయ్యాలో అర్చానకి పాలుబావుబతం లేదు. ఎవరిమీదో తెలియని కసి. ఈ ప్రపంచం అంతా ఇంత హాయిగా నిద్రపోతుందెం__ అని దానిమీద కోపం .అయినా వీళ్ళిద్దరికీ బుద్ధి వుండోద్దూ __అని ఇంకోవైపు. ఎంచెయ్యాలి? జైలు వార్డెన్ కిగానీ, సూపర్నెండెంకిగానీ చెప్తే లాభం లేదు. తెలిసిన వాళ్ళనేవరైనా పట్టుకుని ప్రెసిడెంట్ కి ఫోన్ చేయించి.ఈ ఒక్కరోజుకి చిరంజీవి ఉరిని వాయిదా వెయ్యమంటే? అంతకంటే హాస్యాశపధం ఇంకొకటి వుండదు. ఎవర్నైనా క్రిమినల్ లాయర్ని సంప్రదించాలన్నాతన దగ్గర కేవలం చిరంజీవి మాటలు తప్ప వేరే రుజువులులేవు. ఇంకో రెండు గంటల్లో ఉరి తీయబోయే వ్యక్తిని _విడుదల చెయ్యటానికిగానీ, ఉరి వాయిదా వెయ్యటానిగానీ ఏ పరిస్థితులుండాలోతనకి తెలీదు. అమెనిఒక్కసారిగా నిరాశానిస్పృహలు ఆవరించినయ్!   

 Previous Page Next Page