Home » Dr c. ananda ramam » Cheekati Kadupuna Kanthi

 

    లత తనతో మాట్లాడిన ధోరణిని బట్టీ ఏ విధంగానూ భర్తతో సమాధాన పడగలదని ఊహించ లేకపోయింది .
    లతా రామచంద్రలు మళ్ళీ ఘర్షణ పడవచ్చని కూడా తోచింది. అప్పుడు రామచంద్ర మళ్ళీ తన దగ్గిరకి వస్తాడు.
    ఏం చెప్పాలి అతనికి ? ఏ విధంగా అతడిని అనునయించాలి? ఏ విధంగా అతడి దారుణ దుఃఖాన్ని మరిపించాలి? ఎలా నచ్చ జెప్పితే అతడు లతను క్షమించి ఆదరించగలడు?
    విపరీతమైన ఆందోళనాపురకమైన ఉత్కంఠతో ఏ రోజుకా రోజు రామచంద్ర రాక కోసం ఎదురు చూడ సాగింది వారిజ. నాలుగు రోజులు గడిచినా అతడు రాకపోయే సరికి ముందు ఆశ్చర్యపోయింది. తరువాత సంతోషపడి వుండవచ్చు ననే నిర్ణయించుకుంది. అవును లత, తొందరపాటు మనిషయినా రామచంద్ర నిగ్రహం కల వ్యక్తీ. మంచి చెడ్డలు తెలిసిన వ్యక్తీ. ఎంతో అలవిమాలితేనే కాని లత కన్యాయం చెయ్యదు. తేలిగ్గా నిట్టూర్చింది.
    పలచని అరునకాంతులు చిక్కబడి తూర్పు దిశకు చేరుకుంటున్నాయి. తేలి మబ్బులు నీలి మబ్బులను మచ్చిక చేసుకొంటూ వెన్నాడుతున్నాయి తమలో  కలుపుకోవాలని తాపత్రయ పడుతున్నాయి. ప్రకృతి మొత్తం మత్తు వదిలించు కొంటూనే అవులిస్తోంది.
    ఎంత అందంగా వుందీ ప్రక్రుతి! ఈ ప్రకృతి లో తనూ ఒక భాగంగా లీనమయిపోగాలిగితే? తన ఆలోచనకు తనకే నవోచ్చింది వారిజకు. ప్రకృతిలో ఒక భాగంగా లీనమవటమంటే చచ్చిపోవటం. చచ్చిపోవటం తన కిష్టమా? ఆత్మహత్య ఇష్టమయితే ఏనాడో ఆత్మ హత్య చేసుకునేది. తను కావాలనుకొని ఈ లోకంలోకి రాలేదు. ఇష్టమున్నా, ఇష్టం లేకపోయినా ఏదో ఒకనాడు ఈ లోకం లోంచి వెళ్ళక తప్పదు.
    అలాంటప్పుడు మధ్యలో తన ప్రయత్నమెందుకు? ఈ అరణోదయాలూ, సూర్యాస్తమయాలూ, నల్లని చీకట్లలో తళుకు మనే తారలూ, జగత్తు పై అమృతపు జల్లులు కురిపించే వెన్నెలలూ, ఈ అందాలన్నీ తన కోసం కాదూ? వీటిని వదులుకొని ఎక్కడకు పారిపోవాలి> ఏనాడో ఒకనాడు ఈ విశ్వమే తనను ఆహ్వానిస్తుంది. అప్పుడే సుఖంగా వెళ్ళిపోవచ్చు. ఎందుకు తొందర? ఎంతకూ బద్ధకం వదుల్చుకొని ప్రకృతిని చూసి తూర్పు దిశ కళ్ళెర్ర జేసింది. ఒకసారి ఉలిక్కిపడిన పక్షులన్నీ కలకల నవాయి. ఆ నవులకు ప్రకృతి సమస్తము చైతన్యంతో చిందులు తొక్కింది.
    వాకిలి ఊడ్చి, నీళ్ళు చల్లి, ముగ్గు పెట్టి ఇల్లు శుభ్రం చేసుకుని స్నానం ముగించి వంటకుపక్రమించింది వారిజ. "అమ్మా!" అన్న దీనమైన వీరన్న పిలుపుకు ఉలికిపడి వీదిలోకి వచ్చింది.
    పాలిపోయిన వీరన్న ముఖంలోకి భయంగా చూస్తూ "ఏం జరిగింది వీరన్నా?" అంది.
    వీరన్న వారిజ ముఖంలోకి దీనంగా చూశాడు.
    "బాబుగారు  రోజు రోజుకీ పిచ్చివాడిలా అయిపోతున్నారమ్మా!"
    అదిరిపడింది వారిజ. ఏం మాట్లాడటానికి సాహసించ లేనట్లు కొన్ని క్షణాలు పిచ్చిదానిలా వీరన్న ముఖంలోకి చూసింది. చాలా సేపటికి గొంతు పెగాల్చుకుని ఎలాగో "లత.....లత...." అంది.
    "లతమ్మగారెక్కడమ్మా ! వెళ్ళిపోయారుగా?"
     గిర్రున తల తిరిగింది వారిజకి.
    "వెళ్ళిపోయిందా! ఎందుకు?" పిచ్చిదానిలా అడిగింది .
    తల వంచుకున్నాడు వీరన్న .
    "బాబుగారే రైలెక్కించేశారు. ఎందుకో నాకే తెలియదు. అప్పటి నుండి అలా పరాగ్గానే వున్నారు. పొలం పనులు కూడా పట్టించుకోవటం లేదు. అన్నీ నేనొక్కడినే చూసుకుంటున్నాను అసలోక్కక్క రోజు పొలం మీదకే రావటం లేదు. ఆ ఇంట్లో అలా పడుకుని వుంటారు. తిన్ననాడు తింటారు, లేనినాడు లేదు . మనిషి ఈ రోజులలో ఎంత చిక్కిపోయారో చెప్పినా నమ్మలేరు మీరు....."
    వారిజ హృదయం కలతపడి కరిగి , కళ్ళలోంచి నీరు స్రవించింది.
     బొమ్మలా కుర్చుని  కన్నీళ్లు కారుస్తున్న వారిజను చూస్తూ భయంగా అన్నాడు వీరన్న....."
    "అమ్మా! మీరొక్క సారి బాబుగారి దగ్గిరకు రావాలి. ఆయనను కాస్త మనుష్యులలోకి తేవాలి."
    "నేనా!" విభ్రాంతితో అంది వారిజ.
    "బాబుగారి మీద మీ ప్రభావం ఎంతో మీకు తెలియదా అమ్మా! అయన చేత మీరే పనయినా చేయించగలరు. అయన మనసులో ఎంత దుఖమున్నా మరిపించగలరు. రావాలమ్మా! మీరు రాక తప్పదు  - ఇప్పుడు రాకపోతే తరువాత మీరే బాధపడతారు."
    "వస్తాను వీరన్నా , ఇవాళే వస్తాను - ఎందుకు రాను ?" తనను తను ప్రశ్నించుకుంటున్నట్టు అంది .
     వీరన్న ముఖం వెలిగింది.
    "నాకు తెలుసమ్మా! మీమీదే ఆశ పెట్టుకున్నాను. ఇంక నాకు నిశ్చింత. అయన పొలంలోకి రావటం లేదు. ఇంటి దగ్గరే వుంటారు. వెళ్ళండి..." తెలికపడిన హృదయంతో వెళ్ళిపోయాడు వీరన్న.

                                                          -----------

    రామచంద్ర ఇంటికి బయలుదేరి , సగం దూరం దాకా నడిచిన వారిజ చటుక్కున ఆగిపోయింది. ఏమిటిది? ఏం చేస్తుంది తను? తనక్కడకు వెళ్ళటం వలన ప్రయోజనం ఏమిటి? తను పూనుకుంటే అతని మనసులోని చికాకునంతటిని మరిపించగలదు- నిజమే! కానీ దాని పరిణామమేమిటి? రామచంద్ర తనకు మరింత దగ్గిరవుతాడు! లత పట్ల విముఖత మరింత పెరుగుతుంది.
    తనను వదిలిపోయిన లతనూ, కూడా ఉండి మనోవ్యధనంతా మాయం చేయగలిగిన తననూ మనసులో పోల్చుకుని లత పట్ల అసంతృప్తి మరింత పెంచుకుంటాడు. అదేనా తను చేయవలసింది!
    గిర్రున వెనక్కి ఇంటివైపు మళ్ళింది వారిజా. మళ్ళీ ఆలోచనలు .....అటు లతా, ఇటు తనూ ఇద్దరూ వదిలేస్తే ఏమయి పోవాలి . రామచంద్ర? ఇప్పటికే సగం పిచ్చివాడిలా తయారయ్యట్ట! తిండి మీద ధ్యానం లేదట! అయ్యో! ఎలా వదిలెయ్యగలను అతడ్ని. అతని ఖర్మానికి? మళ్ళీ రామచంద్ర ఇంటికి వైపుకే మళ్ళింది వారిజ.
    లతకు అన్యాయం చేసున్ననేమోనని శంక ఒకవైపూ, తన రామచంద్ర ఏమయిపోతాడోననే బెంగ ఒక వైపూ హృదయాన్ని ఊగిస్తుండగా, అసలేం జరిగిందో అనే ఆందోళన, తిరిగి ఏ నాటికైనా లతా రామచంద్రలు ఒకటవ గలరా అనే ఆవేదనా మనసును కల్లోల పెట్టేస్తుండగా , తనకే సరిగ్గా అర్ధం కాని ఉద్వేగంతో వణికిపోతూ రామచంద్ర ఇంట్లో అడుగు పెట్టింది వారిజ.
    మంచం మీద పడుకుని ఇంటి కప్పు కేసి తదేకంగా చూస్తున్న రామచంద్ర వారిజ అడుగులు చప్పుడు విని వారిజను చూశాడు. ఒక్క క్షణం అతని ముఖం వెలిగింది. అంతలో కఠినంగా మారిపోయింది. విసురుగా మంచం మీంచి లేచి వారిజ ముందు కొచ్చి "ఎందు కొచ్చావ్?" అన్నాడు.
    "మీ కోసం ......" వారిజ అబద్దమడ దల్చుకోలేదు . రేగిపోయిన జుట్టుతో, ఎర్రబడిన కళ్ళతో వడలిపోయి చిక్కిపోయి ఉన్న రామ చంద్రను చూడగానే వారిజకిం కేం విలువలు గుర్తు రాలేదు. అందంగా, ఆనందంగా , ఆరోగ్యంగా తనకు పరిచయమయిన రామచంద్రను ఈ స్థితిలో చూడవలసి వచ్చిందనే ఆవేదన మిగిలింది. తిరిగి అతణ్ణి యధా ప్రకారంగా చెయ్యాలనే తపనే గెల్చింది.
    రామచంద్ర వారిజ భుజం పట్టుకుని గెడ్డం క్రింద చెయ్యేసి ముఖాన్ని విసురుగా పై కెత్తి " ఇలా చూసి చెప్పు నా కళ్ళలోకి చూసి చెప్పు - నా కోసం వచ్చావా?" కఠినంగా అన్నాడు. నీళ్ళు నిండిన కళ్ళతో తీక్షణంగా వున్న రామచంద్ర చూపులను ఎదుర్కొంది వారిజ -
    "అవును - మీ కోసమే వచ్చాను."
    "కాదు - కాదు , మీ చెల్లెలి కోసం వచ్చావు. నాకు మాయమాటలు చెప్పి, మభ్యపెట్టి మళ్ళీ నీ చెల్లెల్ని ఇక్కడికి పిలిపిద్దామని వచ్చావు నా గుండెలు ఆవేదనతో పగిలిపోతున్నా నీకు బాధలేదు. నేను ప్రేమ కోసం ఎలా పరితపిస్తున్ననో నీకక్కర్లేదు. నీకు కావలసింది నీ చెల్లెలి సుఖం! నీ చెల్లెలు హాయిగా ఉంటె చాలు నీకు .అందుకే వచ్చావు ."
    "కాదు!" గట్టిగా అరిచింది వారిజ.
    "కాదు - మా చెల్లెలి కోసం రాలేదు. మీ కోసమే వచ్చాను. ఈ ప్రపంచంలో మీకంటే నా కెవరూ ఎక్కువ కాదు. మీరు తప్ప నాకు కావలసిన వాళ్ళెవరూ లేరు. మీ సుఖం కంటే నాకు కావలసింది లేదు. నన్ను నమ్మండి."
    అతని గుండెల మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది వారిజ. బలంగా ఆమెను అదుముకున్నాడు రామచంద్ర.
    ఏదో పెన్నిధి దాచుకున్నట్లు తన చేతులతో వారిజ శరీరాన్ని చుట్టేశాడు. ఇంకెప్పటికీ విడవలేనట్లు వారిజను చుట్టుకొన్న చేతులు బిగించాడు. ఆమె శిరస్సు పెదవులతో స్పృశిస్తూ "నమ్ముతాను వారిజా! రా! నా దగ్గరకు వచ్చెయ్యి. నువ్వు కావాలి నాకు, ఇంకేం అక్కర్లేదు. మనిద్దరం కలిసి బ్రతుకుదాం . అబ్బా! నీకోసం ఎలా దహించుకు పోతున్నానో తెలుసా? నీ చేతులు నా చేతుల్లో బంధించుకోవాలి.
    నీ నొక్కు నొక్కుల జుట్టుని ఆప్యాయంగా అఘ్రాణించాలి......నీ మెత్తని పెదవులతో ఆడుకోవాలి. నీ పలచని చెక్కిళ్ళలో నా నీడలు చూసుకోవాలి నీ గుండెల్లో సమస్తమూ మరిచి నిద్రపోవాలి . రా వారిజా! నా దగ్గిరికి - నా ఇంట్లోకి- నాలోకి వచ్చెయ్యి! నాకు దూరంగా వుండకు. ఏ విషయమూ గుర్తు చెయ్యను. దేన్నీ గురించి ఆలోచించకు. నూవూ- నేనూ, అంతే! ఇంకేమీ లేదు. ఇంకేమీ అక్కరలేదు" అన్నాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra