Home » Dr c. ananda ramam » రేపటి మహిళ


    "నిజంగా, నిజంగా నాకూ సరిగ్గా తెలియదు. కుసాయిగుడాలో ప్లెమింగ్ లేబ్ దగ్గర ఏదో జరుగుతోంది. నేవెళ్ళాలి".
    జనం మధ్యలోంచి దూసుకుని వెళ్ళిపోయాడు. భాగవతార్ చివరిమాటలు వినగానే "నా లేబ్" అని పిచ్చివాడిలా అరిచాడు ప్లెమింగ్. జనంలో కలవరం. ప్లెమింగ్ తను కూడా జనంలోంచి తప్పించుకుని పారిపోవడానికి చూస్తూంటే కేశవనాద్ అతడి రెండుచేతులూ విరిచిపట్టుకుని, "ముందు మేనేజర్ టో చెప్పి పోలీసులకి ఫోన్ చేయించు. నే చెప్పమన్నానని చెప్పు." అన్నాడు భార్యతో. పోలీస్ పేరు వినగానే ప్లెమింగ్ దెబ్బతిన్న క్రూరమృగంలాగ అరుస్తూ "వొద్దు-వొద్దు పోలీసులని పిలవొద్దు. ఆ నరకం నేను భరించలేను. నన్ను చంపేయండి." అని బావురుమని ఏడ్చాడు. ఆ దృశ్యం చూడలేక రెండు చేతులతో ముఖం కప్పుకుంది దేవకి.
    "ఏయి దేవకీ!! నీ వొంపు సొంపులు చూపించు. వీళ్ళందర్నీ ఖుషీ చెయ్యి. ఎలాగో నచ్చ చెప్పు, ఏదో ఒకటి చేసేసెయి. పోలీసులు రాకుండా చూడు. నో నో!! నో! ఐ డోంట్ వాంట్ పోలీస్. ఐయామ్ నాట్ గోయింగ్ బాక్ టు జైలు, వదలండి. నరికేస్తా చంపేస్తా- ప్లీజ్ వదలండి. మీరిప్పటికీ చావకుండా బతికేలా మందు కనిపెట్టి మీకిస్తాను. ఎప్పటికీ ముసలాళ్ళు కాకుండా నిత్య యవ్వనంలో వుండి ఆడవాళ్ళతో మజా చేసుకునే మంచి మంచి మందులిస్తాను. నన్నొదిలేయండి. దేవకీ! నన్నొదలమని చెప్పు."
    దేవకి ముఖం మీద చేతులు తీయలేదు. పిచ్చివాడిలా అరుస్తోన్న ప్లెమింగ్ మాటల్లో విషం ఆమె మనస్సుని నిలువునా దహిస్తోంది. దుఃఖం - బాధ- సిగ్గు- అవమానం అన్నీ అణుఅణువునా కాలుస్తోంటే తనపేరాశలకు ఫలితంగా ఏం జరిగితే అది జరగనీ అన్నట్లు నిర్లిప్తంగా వుండిపోయింది. అంతటి దిగుల్లోనూ మృదుల తెలివితేటలు, చాకచక్యం ఆమెకు ఆశ్చర్యం కలిగించాయి. మృదుల కూడా ఈ ఊబిలోకి వస్తోందేమోనని భయపడింది తను. మొత్తం వ్యూహాన్నే చెల్లాచెదరు చేస్తోంది మృదుల- రాజభూషణాన్ని ఎదుర్కోగలదా? ఎదుర్కొంటుందేమో?
    కేశవనాద్ లాంటి వ్యక్తి పూనుకోవడంతో పోలీసులు వెంటనే రంగంలో కొచ్చారు. పోలీసు కేసులు- సాక్ష్యాలు- గొడవలు అంటే ఎవరికీ యిష్టముండదు. కాని కేశవనాద్ స్వయంగా పూనుకోవడంవల్ల ప్లెమింగ్ పిచ్చి అరుపులతో న్యూసెన్స్ గా తయారవడం వల్ల పోలీసులకి ప్లెమింగ్ ని అప్పజెప్పేసి చేతులు దులుపుకోవడమే మంచిదనుకున్నారు.
    వికృతంగా అరుస్తూ పిడికిళ్ళు బిగించి తన్ని పట్టుకున్న వారి పొట్టల్లో గుద్దడానికి ప్రయత్నిస్తూన్న ప్లెమింగ్ చేతులకి సంకెళ్ళువేసారు పోలీసులు. ప్లెమింగ్ అరిచాడు. ఏడ్చాడు. బతిమాలాడుకుంటాడు. చివరికి, "అదిగో దాన్ని కూడా పట్టుకోండి. అది కూడా నాతో రావలసిందే! నన్ను జైలుకి పంపి తన మాజీ ప్రియుడితో కులుకుదామనుకుంటోంది" అన్నాడు అక్కసుగా.
    వర్షాకాలపు ఎండలాంటి నవ్వువచ్చింది దేవకి పెదవులమీదికి. లేచి నిలబడి "నేనూ వస్తున్నాను. చేతులకి సంకెళ్ళు వేసిన ప్లెమింగ్ చేతులు పట్టుకుని, "భయపడకు. నా మాజీ ప్రియుడితో సుఖపడే రాత నాకు లేదు. జైల్లో నీపక్కనే వుండి నువ్వనుభవించిన నరకయాతనలన్నీ చూస్తూ,- అవసరమైతే పంచుకుంటూ నీ సహధర్మచారిణౌవుతాను." అంది.
                                                                    *    *    *
    తన కారులో కుసాయిగూడా చేరుకున్నాక ప్లెమింగ్ ఇల్లు కనుక్కోవడం కష్టం కాలేదు భాగవతార్ కి. ఇంటి తలుపులన్నీ బార్లా తీసుకున్నాయి. జనంలేరు. వస్తువులన్నీ చిందరవందరగా ఉన్నాయి. ఎవరో దొంగలుపడి అన్నీ చెల్లాచెదురు చేసి పారిపోయిన తరువాత ఏ ఇల్లయిన ఎలా ఉంటుందో అలా వుందాయిల్లు. భాగవతార్ కి మతి తోచలేదు. అతనికి మిగిలిన విషయాలేవీ పట్టలేదు. మృదులెక్కడుందో అది మాత్రమే తెలుసుకోవాలి. ఆ యిల్లంతా తిరుగుతోంటే మూలుగు వినిపించింది. అటువైపు వెళ్ళాడు. గదిలో మంచానికి కట్టిపడేసి వున్న నడివయసు స్త్రీ కనిపించింది.
    "దాహం....దాహం" అంది డాక్టర్ సాగంధి ఇచ్చిన మత్తుమందులోంచి అప్పుడప్పుడే బయట పడుతోందావిడ. భాగవతార్ ఆవిడకి మంచి నీళ్ళందించి "మృదుల ఎక్కడుందో తెలుసా?" అడిగాడు ఆరాటంగా. ఇంకా పూర్తిగా తెలివిలోకి రాని ఆవిడ, తనకి అభిమానంగా మంచినీళ్ళందించిన వ్యక్తి తన తాలూకు వాడేననుకుంది.
    "బోంబే.... ఎయిర్ పోర్ట్ .... మృదుల.... నాంచారమ్మ...." అని మళ్ళీ మైకంలోకి జారిపోయింది.
    వెంటనే ఎయిర్ పోర్ట్ కి బయలుదేరాడు భాగవతార్.
                        *    *    *
    రాజభూషణం తన మనుష్యులతో  ప్లెమింగ్ లేబ్ కొచ్చాడు. అప్పటికే మహావీర్, మృదుల, సాగంధి అక్కడ్నుంచి వెళ్ళిపోయారు. వొంటి మీద తెలివి లేకుండా వున్న ఘూర్ఖాని ఏదైనా ప్రైవేట్ నర్సింగ్ హోంలో చేర్పించమని తన మనుష్యులలో ఒకడికప్పగించాడు.
    తెలివిలేకుండా పడివున్న నడివయసు స్త్రీ చచ్చిపోయిందని భ్రమపడ్డారు. మొట్టమొదట మహావీర్ దగ్గిరున్న ఫైల్స్ ,ఫోటోలు దక్కించుకోవాలి. ఆ తొందరలో ఆవిడ్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు.
                                                                          *    *    *
    భాగవతార్ తన కారెప్పుడూ స్లోగానే పోనిస్తాడు. స్పీడ్ గా డ్రైవ్ చెయ్యడమంటే అతనికి భయం. అందుకే డ్రైవింగ్ వచ్చినా డ్రైవర్ ని పెట్టుకున్నాడు. ఎన్నడూ అలవాటు లేనిది రేష్ గా డ్రైవ్ చేస్తున్నాడు కారుని. హైదరాబాద్ లో నట్ట నడివీధుల్లో- చివరికి రాజభవన్ రోడ్డులో సైతం యధేచ్చగా తిరిగే ఆవులు- గేదెలు అతడి కారు కడ్డంవస్తూ అతడ్ని తికమక పెట్టేస్తున్నాయి. తొందరగా మృదులని కలుసుకొనే ప్రయత్నంలో కారు నడుపుతూన్న భాగవతార్ సంగీత్ టాకీస్ దగ్గిర రెడ్ సిగ్నల్ చూసుకోకుండా కారుని ముందు కురికించాడు. వెంటనే విజిల్ వేసి ఆపాడు పోలీసు. భాగవతార్ బిక్కమొహం వేసి "కావాలంటే నంబర్ అవీ నోట్ చేసుకోండి. తరువాత కోర్టు కొస్తాను. ముందు అర్జెంట్ గా వెళ్ళాలి" అని ప్రాదేయపడ్డాడు.
    "అదేం కుదరదు. నడు పోలీసు స్టేషనుకి" అని దబాయించాడు భాగవతార్ ఆరాటం కనిపెట్టిన పోలీస్. భాగవతార్ కి ట్రాఫిక్ రూల్స్ సరిగ్గా తెలియవు. స్వయంగా డ్రైవ్ చెయ్యడం చాలా తక్కువ. నిజానికి పోలీసుకి అప్పటికప్పుడు స్టేషన్ కి రమ్మనే అధికారం లేదు.
    "అయితే స్టేషన్ కి రావలసిందేనా. అవతల నాకర్జెంట్ పని వుంది." అంటూ బుద్ధిగా కారు వెనక్కి తిప్పబోయాడు. వొళ్ళు మండిపోయింది పోలీసుకి. ముందుకొచ్చి, కారువిండోలోంచి తలపెట్టి "ఇంత పీనాసోడి వేంటయ్యా. ఓ పాతిక రూపాయలు చేతిలో పెట్టలేవూ" అన్నాడు ఇంకా దబాయింపుగా. భాగవతార్ పరమానందంగా పర్సులోంచి ఇరవై అయిదు రూపాయలు తీసి పోలీసు చేతిలో పడేసి కారు ముందుకురికించాడు.
    ఇరవై అయిదు అడిగితే పదేనా ఇయ్యకపోతాడా అని అనుకున్నాడు పోలీసు. పాతికా చేతిలో పడేసరికి యాభై ఎందుకడగలేదాని బాధపడ్డాడు.
    పట్టపగలు నట్టనడివీధిలో పబ్లిక్ గా జరుగుతున్న ఈ అవినీతికి ఆశ్చర్యపోయాడు భాగవతార్. ఇలాంటివన్నీ ఆలోచించడానికి టైమ్ లేదు. సంగీత్ టాకీస్ దాటి వై. యమ్.సి.ఎ. చౌరస్తా మీదుగా రాజభవన్ రోడ్డు వేపు ఉరికించాడు కారుని. ఆ రోడ్లమీద అంతగా రద్దీ వుండదు. అంచేత కారు శరవేగంగా దూసుకుపోతున్నా ఏ ఇబ్బందీరాలేదు.
    ఎయిర్ పోర్ట్ బయట వరసగా కార్లు, స్కూటర్లు పార్క్ చేసి వున్నాయి. ఇదివరలో ప్రయాణీకులకి సెండాఫ్ ఇయ్యడానికొచ్చిన వాళ్ళని కూడా ఏరోడ్రోమ్ బిల్డింగ్ లోపలికి రానిచ్చేవారు. చుట్టాలు స్నేహితులు, ప్లేన్ టేకాఫ్ చేసేవరకూ వుండి, అద్దాల తలుపుల ఇవతల్నించే విమానం ఎక్కబోయే ప్రయాణీకులకి వీడ్కోలు చెప్పడానికవకాశముండేది. ఇప్పుడు సెక్యూరిటీ ఏర్పాట్లు కారణంగా ప్రయాణీకులు తప్ప మిగిలిన వాళ్ళని లోపలికి రానివ్వడం లేదు. విధిలేక ఎయిర్ పోర్ట్ బయటే కారు పార్క్ చేసి గేటు దగ్గిర నిలబడి లోపలి ప్రయాణికుల్ని పరిశీలించసాగేడు. తనలాగే మృదులకూడా బయటే వుండచ్చు అన్న వూహ అతనికి రాలేదు. మృదుల తను కూడా బొంబాయి వెళుతోందో, సెండాఫ్ ఇయ్యడానికొచ్చిందో అతనికి తెలియదు. మృదుల బయటే వుంది. సాగంధి లోపలికి వెళ్ళిపోగానే టాక్సీ మాట్లాడుకుని అందులో కూర్చుని యధాలాపంగా ఎయిర్ పోర్ట్ వైపు చూసింది. బయటినుంచి లోపలికి తొంగి చూస్తూ భాగవతార్ కనిపించాడు. 
    "అవతార్!" అని పిలిచింది. ఆ పిలుపుకి అటు తిరిగిన భాగవతార్ టాక్సీలో డ్రైవింగ్ సీటులో వున్న రాజభూషణం మనిషిని గుర్తించాడు. అంతలోనే టాక్సీ ముందుకు కదిలింది. వెనుకసీటులో విండోలోంచి చెయ్యి ఊపుతూ ఏదో అంది మృదుల. అది అతనికి వినిపించలేదు. తన కారులో కూర్చుని టాక్సీని అనుసరించాడు. టాక్సీ రైట్ టర్న్ తీసుకుంది. శరవేగంతో నడుపుతున్నాడు డ్రైవర్. రాజభూషణం ఇంటికే టాక్సీ వెళ్తూన్నట్లు అర్ధమైంది భాగవతార్ కి. ఈ విషయం మృదులకి తెలుసా? తెలియదా? ఆమెని మోసంచేసి తీసుకెళుతున్నారా- తనంతట తను వెళుతుందా? తనకోసం పొంచి ఉన్న ప్రమాదం మృదులకెలా చెప్పాలి. సాధ్యమైనంత స్పీడ్ పెంచాడు భాగవతార్. సైకిల్ వాలా ఏమాత్రం చెయ్యిచూపకుండా రోడ్డుని అటునించి ఇటు క్రాస్ చేస్తూ భాగవతార్ కారుని గుద్దేసాడు. భాగవతార్ సడన్ బ్రేక్ వేసాడు.
    సైకిల్ వాలా సైకిల్ తో సహా కిందపడ్డాడు కాని పెద్దగా దెబ్బలేం తగల్లేదు. జంట నగరాల్లో కొందరికి కావాలని కార్లకి అడ్డుపడడం, పెద్దగా దెబ్బలేమీ తగలకపోయినా ఏక్సిడెంట్ అయిందని గోలపెట్టి కారు యజమానుల దగ్గిర ఎంతోకొంత నష్టపరిహారం వసూలు చెయ్యడం- చాలా మామూలైపోయింది. కిందపడ్డ సైకిల్ వాలా లేచి దుమ్ము దులుపుకొని కారుకడ్డంగా నిలబడి, "పద పోలీస్ స్టేషన్ కి. నా సైకిల్ లైట్ విరిగిపోయింది. కంటిమీద దెబ్బతగిలింది- కన్ను కనపడ్డంలేదు" అని అరవడం మొదలుపెట్టాడు. చుట్టుప్రక్కల రీక్షావాళ్ళూ, ఆంధ్రాలో ప్రతీ చౌరస్తా దగ్గిర విలాసంగా తిరిగే ముష్టివాళ్ళు- భాగవతార్ కారుని చుట్టుముట్టేసారు. సైకిల్ వాలాకి వత్తాసుగా. మిగిలిన ఏ విషయంలోను ఐకమత్యం లేకపోయినా, ఇలాంటి విషయాల్లో వాళ్ళల్లో వాళ్ళకా కట్టువుంది. గుంపులోంచి టాక్సీ ఎటువెళ్తోందో చూడడానికి విశ్వప్రయత్నం చేసాడు భాగవతార్. కాని సాధ్యం కాలేదు. అతడి చుట్టూ జనం దడికట్టేసారు. ఆ గొడవంతా ఎలాగో పరిష్కరించుకుని సైకిల్ వాలా చేతిలో వందరూపాయలు పెట్టి మళ్ళీ కారు డ్రైవింగ్ సీటులో కూర్చునేసరికి మృదుల ఎక్కిన టాక్సీ కనపడలేదు.  

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra