అందుకే తీసుకురమ్మంటున్నది" కస్సుమంటూ చెవిలో వూదాడు. ఇలాంటి పి.ఎ.ని భరించేకన్నా ఏ నుయ్యోగొయ్యో చూసుకోవడం మిన్న అన్నట్టుగా.

 

    సుమారు మధ్యాహ్నం రెండుగంటలకి గెస్టుహౌసులోని ఓ హాల్లో మొదలైన ప్రెస్ కాన్ఫరెన్స్ కి అటెండైన అన్ని దినపత్రికల విలేఖర్లూ ఇప్పుడు తమ కెమెరాలతో ఆ 'గోపాలం కొడుకు'ని ఫోటోతీసి పత్రికల్లో వేయడానికి గట్టిగా ప్రి పేరవుతున్నారు.

 

    ఇదిగో అప్పుడు తీసుకొచ్చాడు పియ్యే నానీని... ఎత్తుకుని కాదు... నడిపించుకుని.

 

    తొట్రుపడ్డాడు హోమ్ మినిష్టర్ అప్పారావు.

 

    ఇంకా స్పృహతప్పే వుంటాడన్న నమ్మకంతో అర్జెంటుగా ఓ నాటకం ఆడేద్దామనుకుంటే నానీ మామూలుగా నడిచి రావడంతో నానీ కన్నా తన రాజకీయాన్ని అర్థంచేసుకోలేని పి.ఎ.ని మహా ఉక్రోషంగా చూశాడు.

 

    ఇదేదీ గమనించని పి.ఎ. నానీని అప్పారావు పక్కసీట్లో కూర్చోపెట్టగానే ఫ్లాష్ లైట్స్ వెలిగాయి వరసగా.

 

    నానీ విస్తుపోయి చూస్తున్నాడు అదంతా ఏమిటో అర్థంకాక.

 

    "కుర్రాడు కంగారుపడుతున్నాడు ఇక లోపలికి తీసుకువెళ్ళు" అన్నాడు అప్పారావు గొంతు తడారిపోతుంటే.

 

    "ఒక్కక్షణం సర్" ఓ విలేఖరి అన్నాడు. " అబ్బాయిని కొన్ని ప్రశ్నలడుగుతాం."

 

    "హమ్మమ్మో... వాడసలే షాక్ లో వున్నాడు" చెప్పాడు గట్టిగా అభ్యంతరం చెప్పాడుకాని అప్పటికే నానీ చెబుతానన్నట్టు తలూపేసరికి అప్పారావు గాభరాపడ్డాడు.

 

    "మీ అమ్మ నాన్నలపేర్లు..." మరో విలేఖరి నానీని చూస్తూ అడిగాడు.

 

    "అమ్మ పేరేమో పావని అన్నమాట... నాన్న..."

 

    "గోపాలం" అప్పారావు టక్కున జవాబిచ్చాడు.

 

    "కాదు... చంద్రం" నిజాన్ని నిబ్బరంగా చెప్పాడు నానీ.

 

    "అదేంటీ..." విలేఖర్లు విస్తుపోతుంటే తొట్రుపడిన అప్పారావు "అదేంటంటే... చంద్రగోపాలం... బయటంతా గోపాలం అంటే ఇంటిలో వాళ్ళంతా చంద్రం అంటారు మరేం... అసలు వీళ్ళమ్మగారున్నారే..." మాట మర్చబోతుంటే నానీ జోక్యం చేసుకున్నాడు.

 

    "కాల్చి చంపేశారు."

 

    ఈ జవాబుకి అప్పారావు సైతం అదిరిపడి వెంటనే తేరుకొని గట్టిగా రంకెలు వేశాడు.

 

    "ఎంత దారుణమో చూశారా! కన్నబిడ్డ కళ్ళముందే కాల్చి మరీ చంపితే మనదేశంలో కులవ్యవస్థ ఎంత విలయతాండవం చేస్తున్నదీ మీరు అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ఆ తర్వాత వీళ్ళ నాన్నగార్ని..."  

 

    "కాదు, అసలు మా నాన్న..." నానీ అసహనంగా మరేదో చెప్పబోతుంటే మరోమారు అడ్డంపడిపోయాడు అప్పారావు.

 

    "అవును. వీళ్ళనాన్నే అక్కడనుంచి పారిపోయి వుండకపోతే ఆయన మంటలకి ఆహుతయిపోయేవాడు. అదే పసిబిడ్డ చెప్పబోతున్నది. అలాంటి పైశాచిక చర్యని అడ్డుకునే సాహసం ఎవరికుంటుంది? ఎవరి కుంటుందని నేను మనవి చేస్తున్నాను. కట్టుకున్నదొకపక్క మంటల్లో తగలబడిపోతూంటే కన్నబిడ్డ ఆక్రందన మరోపక్క గోపాలాన్ని మతిభ్రష్టుడ్ని చేశాయి... అలాంటిస్థితిలో..."

 

    ఆ మాటలు నానీకి వినిపించటంలేదు.

 

    నానీ ఇప్పుడు ఆ మాటల్ని వినే స్థితిలోలేడు. ఆ హాలువెనుక కిటికీదగ్గర నిలబడ్డ రాజారావునే గమనిస్తున్నాడు. భయంతో కంపించిపోతున్నాడు .

 

    అప్పారావు అబద్ధాన్ని అదృష్టవశాత్తూ నిజంచేసిన క్షణమదే. తన కులంవాళ్ల చర్యల్ని తన టప్పుడుకూతుర్ని సమర్థించుకోడానికి నానీ మౌనం ఎంత సహకరించిందీ అంటే తన గళాన్ని తారాస్థాయిలోకి పెంచి మరీ మాట్లాడటం మొదలుపెట్టాడు.

 

    "చూడండి... ఆ స్మృతుల్ని మరచిపోలేక పసిబిడ్డ ఎలా వణికిపోతున్నాడో. ఇలా అయితే రేపటిపౌరులు కావలసిన ఇప్పటి బాలలకు రక్షణ ఎక్కడ? క్షణక్షణం మీదపడుతున్న మృత్యువునుంచి ఇక తప్పించుకోలేక అటు తన తల్లి చావుని మరచిపోలేక ఒక గాంధి లేదా ఒక నెహ్రూ కావాల్సిన ఓ పసికందు ఇలా అలమటించిపోతున్నాడూ అని మీరంగీకరిస్తే మీ కళ్ళు నాలాగే చెమర్చక మానవు. అంటే తమకు మనవి చేసేదేంటంటే ఈ విషయంలో నేను మరింత లోతుగా పోయాకగాని ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టనని హామీ ఇస్తూ నా నియోజకవర్గ ప్రజల శాంతిభద్రతలు పూర్తిగా నెలకొన్నాకగాని ఇక్కడనుంచి కదలనని మరోసారి ఉద్ఘాటిస్తూ యీ వార్తని ప్రజలకు నేను అర్జెంటుగా పత్రికలద్వారా తెలియచెప్పమని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను" అమాంతం నానీని పైకెత్తుకున్నాడు. ఆ ఎత్తుకోవడంలో అప్యాయతకన్నా మళ్ళీ ఏమన్నా కూసి తన పరువు పత్రికల పాలు చేస్తాడన్న ఆందోళనే ఎక్కువగా వుంది.

 

    ఓ క్షణంపాటు కెమెరాలకి కన్వీనియంట్ గా ఫోజు పెట్టి ఆ తర్వాత నానీని కిందికిదించి ఇంచుమించు గదిలోకి లాక్కుపోయాడు.

 

    పత్రికా విలేఖర్లు అపూర్వ సత్యంగా ఇదంతా నమ్మి చకచకా రాసుకుపోతున్నా ఇదంతా ఒక సమర్థింపుగా అభూతకల్పనగా భావించింది ఒకే ఒక విలేఖరి.

 

    అతడు రాందేవ్.

 

    వేడివార్తల్ని వెలికితీయడంతో రాజకీయ నాయకుల చీకటిబ్రతుకుల్ని రచ్చకీడ్చడంలో పేరెన్నికగన్న 'నిజం' దినపత్రిక చీఫ్ రిపోర్టర్.

 

    వెళుతున్న నానీని పరిశీలనగా చూస్తూ అనుకున్నాడు "నిజాన్ని నొక్కిపట్టలేవు మిష్టర్ అప్పారావ్... నువ్వు దాచేసిన వాస్తవాన్ని తవ్వడమెలాగో నాకు బాగా తెలుసు."

 

                                     *    *    *

 

    "నాకు తెలీదు" కళ్ళనీళ్ళ పర్యంతమౌతుంటే భయంతో బిగుసుకుపోతూ అంది సరళ. "అసలు నానీమీద నాకు కక్షేమిటి?"

 

    అప్పటికే ఒక గంటనుంచి సరళ, కాంతం, చంద్రాన్ని ప్రశ్నలతో వేధిస్తున్న యశస్వి నెమ్మదిగా సరళని సమీపించాడు. "నీకు తెలీదు, నీ తల్లికి తెలీదు. కాని చాలా అవసరమనిపించే క్షణాల్లో నానీ మాయమైపోయాడు కదూ! పాపం నీకు నానీమీద ఏ కక్షా లేదు ... కదూ?"

 

    తలూపింది వణికిపోతూనే.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra