Home » Kurumaddali vijayalakshmi » రుధిర మందారం

    ఈ వుదయం పాలవాడికి డబ్బు అవసరం అయి ఇంటికి వచ్చాడు. బావమరిది కనపడలేదు. కాసేపు చూసి వెళదాం అని వరండాలోకి వచ్చి కూర్చున్నాడు. లోపల నుంచి ముక్కులు పగిలిపోయే వాసన రావటంతో యదాలాపంగా కిటికీ దగ్గరకు వెళ్ళి కిటికీ తలుపు తోశాడు. కిటికీ లోపల వేసి లేకపోవటంతో భళ్ళున తెరుచుకుంది.
    లోపల నుంచి విపరీతమైన కుళ్ళిన వాసన వచ్చింది. గది మధ్యలో రెండు శవాలు పడివున్నాయి. అది చూస్తూ వెర్రికేకలు వేస్తూ బైటికి పరుగెత్తుకువచ్చాడు. దాంతో నలుగురూ మూగటం మాకు ఫోన్ రావటం జరిగింది అంటూ అర్జున్ వివరించాడు.
    "అర్ధమైంది. శ్యామలరావుని, భార్యని ఆ ముఠా వాళ్ళు పిలిచివుంటారు. రుధిరమందారం ముఠావాళ్ళేవాళ్ళు వాళ్ళ మనిషి శ్యామలరావు ఇంటిముందు నిలబడి శ్యామలరావు నెలరోజులపాటు భార్యతో యాత్రలకెళ్ళినట్లు చెప్పాడు. శ్యామలరావుని ఆ ముఠావాళ్ళు ఎందుకో దారుణంగా బాధలుపెట్టి అమానుషంగా హత్య చేసారు. నెలరోజులు ఎవరూ చూడకపోతే ఆ శవాలు కుళ్ళి కుళ్ళి పూర్తిగా పాడయిపోతాయి అని తలిచి ఈ ఇంట్లోనే పారేశారు. అనుకోకుండా పాలవాడు రావటంతో శవాలు బైటపడ్డాయి. ఈ హత్య జరిగి పూర్తిగా మూడురోజులు కాలేవని నేను భావిస్తున్నాను. ఆ ముఠాలో శ్యామలరావు పాత్ర పెద్దదే అయివుంటుంది. అద్దె పుస్తకాల షాపు అతన్ని శ్యామలరావుని, అతని భార్యని ఆ ముఠాయే హత్య చేసిందని భావిస్తున్నాను. యామైకరెక్టు!"
    "నీ వూహ కరెక్టు విజయ్! వీళ్ళెందుకు ఇలా చేస్తున్నారో చిన్న ఆచూకీ కూడా దొరకలేదు" అర్జున్ అన్నాడు.
    "ముఖాలు ఆనవాలు లేకుండా చెక్కిపడేశారంటే నాకో అనుమానం వస్తున్నది. ఈ రెండు శవాలూ శ్యామలరావు, అతని భార్య అవునో కాదో!"
    "పోని నీమాటే కరెక్టు అనుకుందాం ఇంకొకరి శవాలను ఈ ఇంట్లో పడవేసేపని ఏమిటిట?"
    "కారణం వుందేమో! చెప్పానుగా! నిజం బైటపడ్డనాడు గాని విషయం బైటికిరాదు. నీవూ, నేనూ చేయవలసింది చాలా వుంది"
    "అవును ఏంచేద్దామో చెప్పు." అర్జున్ అడిగాడు.
    ఏం చేయవలసింది ఎలా చేయవలసింది వివరించాను.
    అర్జున్ అంతా విని బాగుంది అన్నాడు.
    "దీప్తి ప్రమాదంలో పడింది" చెప్పాను.
    "వాట్!"   
    "అంతే కాదు మేడ డాక్టర్ సుధీర్ విషయం కూడా అంతే. నేను చూసినప్పుడు దీప్తి మేడలోకి వెళ్ళి వచ్చింది. శ్యామలరావు ఇంట్లోకి వెళ్ళి వచ్చింది. షాక్ నవలని అద్దె పుస్తకాల షాపులో ఇచ్చింది. అద్దె పుస్తకాల షాపు రంగరాజు హత్య చేయబడ్డాడు. శ్యామలరావు భార్య హత్యచేయబడ్డారు. ఇంక మనకు తెలిసిన వాళ్ళు సుధీర్ ,దీప్తి, వీళ్ళ ప్రాణానికి కూడా ప్రమాదం వుందని ఎందుకు భావించరాదు?"
    "ఎస్. మళ్ళీ ఏదో జరిగే లోపల మనం చాకచక్యంగా రుధిరమందారాన్ని బయటకి లాగాలి."
    "లాగ గలమని నాకు నమ్మకం వుంది."
    "గుడ్."
    అర్జున్ తో మరికొద్దిసేపు మాట్లాడి లేచాను.
    నా కోసం రాయల్ వాకిట్లో రెడీగా వుంది.
    రాయల్ ఎక్కాను.
    అర్జున్ నాతోపాటు వాకిలి దాకా వచ్చాడు. అర్జున్ వద్ద శలవు తీసుకున్నాను.
    రాయల్ ని ముందుకు దూకించాను. శరవేగంతో ముందుకు సాగింది.
                                                                                 33
    పెళ్ళిళ్ళ పేరయ్య వేషంలో తరుచు పాండురంగంగారి ఇంటికి వెళ్ళి వస్తున్నాను.
    దీప్తి పెళ్ళి మాట తలపెట్ట వద్దని గట్టిగా చెప్పిందని పాండురంగంగారు చెప్పారు. "మీరు విచారించకండి. తన మీదనే ఈ సంసారం ఆధారపడిందని మీ అమ్మాయికి తెలుసు. తన దోవన తాను పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతే తనంత స్వార్ధపరురాలు మరొకతి ఉండదని అమ్మాయి అభిప్రాయం కావచ్చు. మనం సర్దిచెపుదాము. సోమసుందరంగారి అబ్బాయి రంగూన్ నుంచి రాంగానే ఇరువురి జాతకాలు కలిశాయేమో చూసి కలిస్తే ఆ సంబంధం ఖాయం చేద్దాం అంటూ కమ్మగ కబుర్లు చెప్పేవాడిని.
    పాండురంగంగారు నే చెప్పింది పూర్తిగా నమ్మేవారు.
    ఫలానా పెళ్ళి కొడుకు జాతకం అంటూ ఎవరిదీ లేని జాతకం పుట్టించి తీసుకెళ్ళేవాడిని.
    నేను ఎప్పుడు పాండురంగం గారింటికి వెళ్ళినా దీప్తి బయటకు వెళ్ళిం తర్వాత చూసి వెళ్ళేవాడిని.
    మధ్యాహ్నం పాండురంగం గారింటికి వెళ్ళి దీప్తి జాతకం తీసుకుని బైటకి వచ్చాను. నాది పెళ్ళిళ్ళ పేరయ్య లాంటి వేషం కాబట్టి కారు స్కూటర్ రాయల్ ఎన్ ఫీల్డు లాంటి నా వాహనాలు ఏదీ వాడటం లేదు. కాలి నడకన ఆ వీధి దాటటం వెంటనే రిక్షా ఎక్కటం నేను చేస్తున్న పని.
    పాండురంగంగారి ఇంట్లోంచి బైటకి వచ్చిన నేను చకచక నడుస్తూ ఆ వీధి మలుపు తిరిగాను.
    నా ఆలోచనలన్నీ దీప్తి చుట్టూతా తిరుగుతున్నాయి.
    "ఏమండీ!"
    ఆ పిలుపు వినిపించింది గాని పిలిచింది నన్నే అనుకోలేదు.
    మరోసారి నా వెనుకన దగ్గరగా "ఏమండీ!" అన్న పిలుపు.
    గిరుక్కున వెనుతిరిగి నిర్ఘాంతపోయాను.
    దీప్తి అందాల సుందరి బన్నీ.
    నా నోట మాట రాలేదు. నా ఆలోచనలు పరిపరి విధాల పోతున్నాయి.
    "మిమ్మల్నే పిలిచేది." అంది దీప్తి.
    "నన్నా !"
    "అవును బ్రహ్మశాస్త్రిగారూ!"
    తను ఇంట్లో లేనప్పుడు నేను వచ్చి పోతున్నానని గ్రహించిన దీప్తి తెలివిగా నన్ను పట్టుకుంది. మంచి తెలివికలది. 

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra