బిందురేఖ చూస్తూనే బిందురేఖగారూ! మి పేరు గీతలోంచి చుక్కలోంచి లాగేశాను" అన్నాడు అబ్బులు.
" మి బుర్ర నిజంగా బ్రిలియంట్ బుర్ర" అని బిందురేఖ మెచ్చుకుంది.
జయచిత్ర అడిగిన మిదట ఉదయం జరిగింది చెప్పింది బిందురేఖ.
జయచిత్రతో మాట్లాడాలని ఒకటే యిదైపోతున్న వ్యాకరణ " మా అబ్బులు మహా మేధావిలెండి. పజిల్స్ సాల్వ్ చేయటంలో, కధలు చెప్పటంలో ఆటలాడటంలో అమ్మాయిలను ఢీకొనడంలో" అన్నాడు.
జయచిత్ర కిల కిలా నవ్వింది.
" పోరా!" అంటూ సిగ్గుపడ్డాడు అబ్బులు.
ఆ తర్వాత జయచిత్ర, బిందురేఖ, వుఆకర్ణ, అబ్బులు బోలెడు విషయాలు మాట్లాడుకున్నారు. కబ్యుర్లు పెరుగుతున్నాయేగాని తరగటం లేదు.
" కధలు బాహా చెపుతారని మి మితృడంటున్నాడు. ఓ మంచి కధ చెప్పండి" అంది బిందురేఖ అబ్బులితో.
" మి అభిమాన రచయితల రచయిత్రుల పేర్లు చెప్పండి" అన్నాడు అబ్బులు.
జయచిత్ర బిందురేఖ వరసపెట్టి అరడజనుమంది రైటర్స్ పేర్లు చెప్పారు.
ఉహూ లాభంలేదు. మిరు పెద్దవాళ్ళని పెట్టుకున్నారు. నా కధలేం నచ్చుతాయి.
నానన్నీ కాశీమజిలీ, అల్లావుద్దీన్ అద్భుతదీపం, అరేబియన్ నైట్స్, అపూర్వ చింతామణి అలాంటి కధలు చదివిన వాడిని అవే చెప్పగలిగన వాడిని" అన్నాడు అబ్బులు.
" బుల్లిబ్బాయ్" అంటూ నవ్వింది బిందురేఖ.
" కాశీమజలీ కధలు చాలా ప్రసిద్ధి కదండీ, నేన్నోక్కటీ చదవలేదు. అదే చెప్పండి" అంది జయచిత్ర.
" అనగనగా ఓ రాజు అవెం బాగుంటాయండి" అంటూ అడ్డు వచ్చాడు వ్యాకర్ణ.
" వింటేనే కదా తెలిసేది..." అంటూ కొట్టేసింది జయచిత్ర.
" కరెక్ట్, కరెక్ట్" అంది బిందురేఖ.
ఆముదం తగినట్లు ముఖంపెట్టి- " మి యిష్టం" అన్నాడు వ్యాకర్ణ.
" మొదలెట్టేస్తున్నా!" అని అబ్బులు కధ మొదలు పెట్టాడు.
" అనగనగా ఓ అవంతీపురం..."
" అనగనగా దేనికి? అవంతీపురం అనండి చాలు" అంది బిందురేఖ అడ్డుతగిలి.
" సరే,ఓ అవంతీపురం వుంది అవంతీపురం రాజుగారి పేరు రుద్రసింగు. ఆయనకీ ఒక్కతే కూతురు పేరు హిమబిందు." అబ్బులు బిందురేఖ వైపు ఓ కొంటెచూపు పారేసి అన్నాడు.
బిందురేఖ మూతి మూడు వంకరలు తిప్పింది.
అబ్బులు భూతద్దాలు సవరించుకొని కధ సాగించాడు.
" హిమబిందు అందాల సుందరి. అపురూప సౌందర్యవతి. హిమబిందు పెదవులు దొండపళ్ళు. ముక్కు సూదిలా సూటిగా వుంటుంది, ఆల్చిప్పలంత కళ్ళు, ద్నిమ్మగింజల వంటి పలువరుస.
ముట్టకుంటే కందిపోయే శరీరం, బంగారు వన్నె ఛాయ, నేలను జీరాడు కురులు, పిడికెట్లో యిమిడి పోయే నడుం, ఏడు మల్లెపూల ఎత్తు, గంధర్వ కాంతలు దిగతుడువు..."
" ఆగండాగండి. ఒక్కమాటలో ఆమె అపురూప సౌందర్యబ్వతి అని చెప్పారు కదా!
ఈ వర్ణ నేమిటి? ఆవిడగారి నడుం ఓ అంగుళం అయి వుంటుంది. లేకపోతే పిడికెట్లోకి ఎలా సరిపోతుంది? ఏడు మల్లెపూల ఎత్తు. అంటే తూకం అంటే అయిదు పైసలు బిళ్ళ బరువన్నమాట.
ఈవిడిగారి తలనీలాలు నేలను పారాడుతున్నాయా? శరీరం కన్నా జుట్టే ఎక్కువలాగుంది. క్రితం జన్మలో సవరాలు కట్టేదయీ వుంటుంది. లేకేపోతే దెయ్యమై వుంటుంది."అంది బిందురేఖ.


