Home » Chandu harshavardhan » లేడీ కమెండో

లిక్కర్ కాబిన్ ముందు జయచంద్ర, సత్యమోహన్ లు కూర్చుని వున్నారు.
"ఆ సూట్ కేస్ విషయం ఏమయినా తెలిసిందా?"
"లేదు బావా.... మనవాళ్ళు ఎంత ప్రయత్నించినా దాని ఆచూకీ తెలియలేదు. మొత్తానికి ఆ హోటల్ లోనే ఏదో జరిగింది. కొన్ని సెకనుల వ్యవధిలో అతను ఆ సూట్ కేస్ ను ఎలా మాయ చేయగలిగాడో ఎంత ఆలోచించినా అర్ధం కావడంలేదు " అన్నాడు సత్యమోహన్.
యిద్దరి ముందు వున్న స్కాచ్ బాటిల్స్ అప్పటికే సగం ఖాళీ అయ్యాయి.
మవునంగా రెండు గ్లాసులూ నింపి ఒకటి సత్యమోహన్ కి ఇచ్చి తను ఒకటి తీసుకున్నాడు.
"మనవాళ్ళని ఆ హోటల్  సిబ్బంది వేషాలలో వుంచాను బావా_ ఏదయినా ప్రయోజనం ఉండడమంటూ జరిగితే వాళ్ళ వలనే ఆ సూట్ కేసు దొరుకుతుంది."
"అదిసరే.... ఏసిపి వీరేష్ విషయం ఎంతవరకు వచ్చింది?"
"అదృష్టం వాడి పక్షాన ఉండబట్టి బతికిపోయాడు బావా... లేదంటే వాడి ఇంటి ముందే అతడి సమాధిని తవ్వడం జరిగేది. ప్రాణాలతో దొరికిన మనవాడి నోరు వీరేష్ తెరిపించక ముందే వాడి నోటిని శాశ్వతంగా మూయించేశాను. మనమే అతనిపై హత్యా ప్రయత్నం చేశామన్న విషయం వీరేష్ తెలిసే అవకాశం లేదు...."
దొంగనోట్ల ముఠా పరిశోధనలో ఎంతవరకు ప్రగతి సాధించాడో తెల్సుకున్నావా" గ్లాసులో మిగిలిపోయిన ద్రవాన్ని ఒక్క గుక్కలో తాగి ప్రశ్నించాడు జయచంద్ర.
"వాళ్ళ ఇన్స్ స్పెక్టర్ చతుర్వేదిని ఎవరు చంపారో తెలుసుకునే ప్రయత్నంలో ఇంకా వున్నాడు. అతనికి మనమీద కూడా సందేహం కలిగింది. ఎందుకంటే నీ ఫోటో చూపించి ఆ రోజు చూసింది ఇతనినేనా అని పాడుపడ్డ స్టూడియో ఎదురుగా వున్న మన ఫోటో స్టూడియో వాడిని ప్రశ్నించాడని తెలిసింది. కానీ వాడు మన మనిషన్న సంగతి వీరేష్ కు తెలియదుగా. అందుకే నీ ఫోటో చూసి నువ్వు కాదని చెప్పాడట...."
"అంటే, అతని విషయంలో మనం మరింత జాగ్రత్తగా వ్యవహరించాలన్నమాట"
"అవును బావా"
మరలా గ్లాసులు నిండాయి.
"వాట్ ఎబవుట్ ధీరజ.... ఏమంటుంన్నది ఆ ఆడపులి"
"ఆమెను అనుక్షణం అనుసరించి వుండేలా మన మనుష్యులను ఏర్పాటు చేశాను. మనకు సంభందించిన ఏ చిన్న వార్త వాళ్ళు ఇద్దరిలో ఎవరికి చేరినా అ మరుక్షణంలోనే ఆ విషయం మనకు తెలిసే ఏర్పాటు చేసి వుంచాను. అదీకాగా ధీరజ విషయంలో నా  మేనల్లుడు గట్టి పట్టుదల మీద వున్నాడు. మనకన్నా ముందే తనే ఏదో ఒకటి చేసినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు....." లాయర్ సత్యమోహన్ నవ్వుతూ అన్నాడు.
"ఎంతయినా వాడు నా కొడుకు కదా.... రాజకీయం వాడికి వెన్నతో పెట్టిన విద్య. ఎత్తుకు పై ఎత్తులు వేయటం ఎలాగో ఉగ్గుపాలతో నేర్పాను. పూర్తిగా నా పరిరక్షణలో పెరిగిన వాడికి నా మేధాశక్తి రాకుండా ఎలా వుంటుందంటావు?" అన్నాడు జయచంద్ర గర్వంగా.
"అవును బావా. అందుకే కదా ఎంత త్వరగా నా ఇంటి అల్లుడ్ని చేసుకుంటానా అని ఎదురు చూస్తున్నది!"
"కొద్దిగా  గొడవలు సద్దుమణిగి ప్రశాంతత చేకూరనీయి.... నీ ఇష్ట ప్రకారమే నీ కూతురుని నా కోడలుగా చేసుకుంటాను. సరేనా?"
జయచంద్ర ఇచ్చిన హామీతో తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు సత్యమోహన్.
ఆ ఇద్దరూ చాలాసేపటి వరకూ గ్లాసుల మీద గ్లాసులు ఖాళీ చేస్తూనే వున్నారు.
   
                    *    *    *    *
ధీరజ నీట్ గా డ్రస్ చేసుకుని హోండామీద గవర్నర్ నివాసానికి బయల్దేరింది.
రెండు రోజుల క్రితమే అపాయింట్ మెంట్ సంపాదించింది ఆమె.
మెయిన్ గేట్ దగ్గరే ఎదురయిన సెక్యూరిటీ ఆఫీసర్ కు ఆమె తన ఐడెంటీని, అపాయింట్ నూ చూపించింది.
సాయత్రం ఐదు గంటలు....
రాష్ట్ర గవర్నర్ పూల తోటలో మనవడు, మనవరాలితో ఆడుకుంటున్నది. ఆ సమయంలో పి.ఏ, ఇద్దరు సెక్యూరిటీ ఆఫీసర్లు కూడా చిన్న పిల్లలతో కలసిపోయి.... చిన్నపిల్లలా ఆటలాడుతున్నారు.
జర్నలిస్టు ధీరజ వచ్చిన విషయం పి.ఏ తో చెప్పాడు అక్కడికి వచ్చిన సెక్యూరిటీ చీఫ్.
పి.ఏ వినయంగా గవర్నర్ కు విన్నవించాడు.
గవర్నర్ చిర్నవ్వుతో ఆమెను పంపమని సైగచేసింది.
ధీరజ గాలికి ఎగిరిన హెయిర్ సరిచేసుకుని కెమేరా, టేప్ రికార్డర్, హ్యాండ్ బ్యాగ్ లతో వచ్చింది.
"గుడ్ ఈవినింగ్ మేడమ్! ధీరజ గొంతులో వినయం, నమ్రతలు మేళవించాయి.
"యూ ఆర్ మిస్ ధీరజ..."
"ఎస్ మేడమ్..."
పిల్లలను తీసుకు వెళ్ళమని పి.ఏ కు చెప్పి ముందుకు కదిలింది గవర్నర్.
పచ్చటి లాన్ మద్యలో నాలుగు గార్డెన్స్ చైర్స్.... టీపాయ్ వేసి వున్నాయి.
ధీరజను కూర్చోమని సైగచేస్తూ తను కూడా కూర్చున్నది.
అంతలో టీ సర్వ్ చేయబడింది.
టీ కప్పులను కూడా తీసుకెళ్ళిపోయాడు. అప్పుడు పెదవి విప్పింది గవర్నర్.
"మిస్ ధీరజా... నేను చేయగల సహాయం ఏమిటో చెప్పండి"
"మేడమ్... ఈ రాష్ట్రంలో ఏ మూల ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్సు ద్వారా తెల్సుకునే వుంటారు.అసమ్మతివర్గం ముఖ్యమంత్రి మీద బాహాటంగా తిరుగుబాటు చేసింది. పార్టీ కీచులాటలవరకే పరిమితమైతే సరిపెట్టుకోవచ్చు కానీ ప్రజల ఆస్థులను నష్టపరచటం, ప్రభుత్వ ఆస్థులను ద్వంస్యం చేయటం.... అరాచకత్వాన్ని ప్రజ్వరిల్ల చేయడం నేడు ఎల్లెడలా విస్తరించి వుంది.
మతకలహాల పేరిట హత్యలు జరుగుతున్నాయి. అయినా పోలీసులు ఎవర్నీ అరెస్టు చేయలేదు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra