Home » Dr c. ananda ramam » రేపటి మహిళ


    అంతలో నవ్వేస్తూ, "మీరు నాకు థాంక్స్ చెప్పాలి. నేను మిమ్మల్ని వొదిలి వెళ్ళిపోబట్టే మీరు మృదులని పెళ్ళి చేసుకోగలిగారు. మృదుల చాలా మంచిది."
    "అవును. మీకు మనసారా థాంక్స్ చెపుతున్నాను. ఐయామ్ లక్కీ" మరోసారి చిన్నబోయింది దేవకి మొహం.
    "నా ఆత్మాభిమానం గాయపడ్డా సరే మిమ్మల్నొదిలి వెళ్ళాక ఒక్కరోజైనా సుఖంగా- శాంతిగా లేనని ఒప్పేసుకుంటున్నాను."
    ఇబ్బందిగా కదిలాడు భాగవతార్.
    "చిత్రమైనది జీవితం. డబ్బుకోసం ఆశపడి మీతో ఎంగేజ్ మెంట్ బ్రేక్ చేసుకొని ఫ్లెమింగ్ వెంట వెళ్ళిపోయాను. ఇప్పుడు ఫ్లెమింగ్ అవసరాలకి డబ్బు సంపాదించడం కోసం మిమ్మల్నే ఆశ్రయించవలసి వచ్చింది. థాంక్స్ నాకోసం యీ పార్టీ ఏర్పాటు చేసినందుకు"
    "థాంక్స్ అనవసరం, మీకోసం ఈ పార్టీ నేనేర్పాటు చెయ్యలేదు."
    మరోసారి చిన్నబోయింది. "ఏమి ప్రిన్సిఫుల్స్ ఇతనివి. ఇంతటి సరళమైన వ్యక్తి నా చేజేతులా ఒదులుకొని ఫ్లెమింగ్ ని ఆశ్రయించింది.
    "పోనీండి నాకోసం కాదు. మీ మృదుల కోసమే- మృదుల మీద మీకెంత ప్రేమాభిమానాలున్నా- ఎంత విశ్వాసమున్నా- ఆమెని ఫ్లెమింగ్ దగ్గిరకి రానీయకండి. మృదుల బలహీనురాలని కాదు. నాకు తెలుసు మృదుల ఎంత ఖచ్చితమైన మనిషో. కాని ఫ్లెమింగ్ తో సాన్నిహిత్యం ప్రమాదకరమైనది. ఎవరిని- ఎప్పుడు ఏ వూబిలోకి తోస్తాడో ఊహించలేము. అతడికి ఈ లోకంలో తన ప్రయోగాలు తప్ప మరేదీ ముఖ్యం కాదు."
    ఉలిక్కిపడ్డాడు భాగవతార్. ఆ ఉలికిపాటుతో దేవకి మాటల్లో మొదటి భాగాన్ని పట్టించుకోలేదు.
    "ఎక్కడుంది మృదుల ఇప్పుడు?" ఆరాటంగా అడిగాడు.
"ఇక్కడికే వస్తానంది. మీరిద్దరూ కలిసిరాలేదా?"
    మాట్లాడలేదు భాగవతార్. జరిగిందంతా దేవకితో చెప్పడం అతనికిష్టం లేకపోయింది. లేచి నిలబడి, "ఇంక వెళతాను" అన్నాడు.
    "కూర్చోండి. మరోకందుకు కూడా మీరు నాకు థాంక్స్ చెప్పాలి." ఎలాగైనా అతనితో మరికొంతసేపు గడపాలన్నట్లుగా వుంది దేవకి ధోరణి.
    "దేనికి?"
    "మృదుల మిమ్మల్ని పెళ్ళి చేసుకోవడానికి కారణం నేనే. మీదెంత మంచి మనసో- మీ ప్రిన్సిఫుల్స్ ఎలాంటివో- ఎదుటి వ్యక్తుల్ని మీరెంత గాఢంగా ప్రేమించగలరో- ఇవన్నీ మృదులకి ఎన్నోసార్లు వర్ణించి వర్ణించి చెప్పాను. బహుశః డబ్బుమీది ఆశతో మీకు దూరమైపోయినా, మనసులోంచి మిమ్మల్ని దూరం చేసుకోలేక నా మనసుకి సన్నిహితంగా వచ్చిన మృదులతో ఎప్పుడూ మీ మాటలే చెప్పేదాన్నేమో? అవన్నీ విని విని మృదుల, "నాకు అలాంటి వ్యక్తినే పెళ్ళి చేసుకోవాలని ఉంది." అనేది. అందుకే పనిగట్టుకుని మీ పాటకచ్చేరీ కొచ్చింది. శాస్త్రీయ సంగీతంలో - ఆమెకి అంత పెద్ద ఇంట్రస్టు ఉండేదికాదు అదివరలో."
    భాగవతార్ కళ్ళముందు మబ్బుతెర విడిపోయినట్లయింది. మృదుల పనిగట్టుకుని తన దగ్గిరకొచ్చి, తనంతట తానే పెళ్ళి ప్రసక్తి తెచ్చి- పెళ్ళి చేసుకోవడానికి కారణం ఏమిటాని ఎన్నోసార్లు జుట్టు పీక్కున్నాడు. ఇదన్నమాట కారణం. అతని ముఖం పున్నమి చంద్రుడిలా వెలిగిపోయింది. పట్టరాని ఆనందంతో తనని తను మరిచిపోయి దేవకి రెండు చేతులూ పట్టుకుని, "థాంక్యూ, థాంక్యూ వెరీమచ్" అన్నాడు. ఆ మరుక్షణమే అతని చేతులమీద గట్టి అరచేతి దెబ్బ కత్తి దెబ్బలా పడింది. దేవకిని వెదుక్కుంటూ వచ్చిన ప్లెమింగ్ దెబ్బ అది. భాగవతార్ బిత్తరపోయి చూసాడు. ఫ్లెమింగ్ గుడ్లురిమి. "బిహేవ్ యువర్ సెల్ఫ్" అని దేవకిని చెయ్యి పట్టుకుని ఎవరో వి.ఐ.పి. దగ్గరికి బరబర యీడ్చుకుపోయాడు. బిజినెస్ మేగ్నెట్స్ కి, వి.ఐ.పి. లకి దేవకిని పరిచయం చేసి వాళ్ళతో దేవకి ఎంత సరదాగా మాట్లాడినా చిరునవ్వుతో ఆనందించే ఫ్లెమింగ్. తనకిష్టం లేకుండా దేవకి ఎవరితో మాట్లాడినా ఏమాత్రం సహించడు. దౌర్జన్యంగానైనా సరే దేవకిని తన చెప్పుచేతల్లో ఉంచుకొంటాడు.
    "పాశ్చాత్యులు మనకంటే గొప్ప సంస్కారవంతులని- అక్కడి ఆడవాళ్ళకి ఎంతో స్వాతంత్ర్యముంటుందని ఏదో భ్రమలో ఉంటాం. ఇదీ లోపలి బండారం" అని ఉస్సూరంది దేవకి ఎన్నోసార్లు. నిస్సహాయంగా ప్లెమింగ్ వెంట బలిపశువులా వెళ్ళిపోతూ ఒక్కసారి వెనక్కి తిరిగి దీనంగా భాగవతార్ ని చూసింది. మాటల్లో దేవకి చెప్పిన సంగతుల కంటె ఎన్నెన్నో చెప్పాయి ఆ చూపులు.
    భాగవతార్ అక్కణ్నుంచి కదలి జనం మధ్యకొచ్చాడు. అతడి చూపులు మృదులనే వెతుకుతున్నాయి. ఒక్కొక్కరూ చేతుల్లో గ్లాసుల్తో భాగవతార్ దగ్గరకొచ్చి "థాంక్స్ ఫర్ ది గ్రాండ్ పార్టీ", అంటూంటే ఏం చెప్పాలో అర్ధం కావడంలేదు భాగవతార్ కి. అతడు తారసపడినప్పుడూ గుర్రున చూస్తోంది చూడామణి. మొహం తప్పించుకు తిరుగుతున్నాడు కేశవనాద్. ఆ దంపతుల దగ్గిరకెళ్ళి రెండుచేతులూ జోడించి-
    "నావల్ల పెద్ద తప్పు జరిగిపోయింది, నన్ను క్షమించి మృదులెక్కడుందో చెప్పండి. ఇంకెప్పుడూ ఆమెని పల్లెత్తుమాట అనను. ఏ చిన్న కష్టమూ రానీయను. నా మృదుల జాడ నాకు చెప్పండి." అని ప్రాధేయపడాలనిపించింది. కాని చూడామణి మొహం చూస్తుంటే అతనికడుగు ముందుకు పడటం లేదు. దూరాన రాజభూషణం కనిపించాడు. "హల్లో అంటూ సమీపించిన భాగవతార్ కి షేక్ హాండ్ ఇచ్చి, "ఏమిటి? ఎన్నడూ లేనిది ఇంత గ్రాండ్ గా ఏర్పాటు చేశారు?" అన్నాడు. భాగవతార్ తడబడుతూ "నే....నే....నేను కాదు" అన్నాడు రాజభూషణం గట్టిగా నవ్వి.
    "మీరు కాదూ! అయితే మృదుల ఏర్పాటుచేసిందన్నమాట ఈ పార్టీ అంతా! ఆవిడకి ఇలాంటి పార్టీలు అవసరమేలెండి. ఇంతకీ ఏదీ ఆవిడగారు? ఇంకా ఎవర్నయినా వి.ఐ.పి.లని పికప్ చేసుకొని రావడంలో లేటవుతోందా?" అన్నాడు విషపునవ్వుతో.
    అతడి వాగ్భాణాలు భాగవతార్ మనసుని గుచ్చాయి. వాటిల్లో విషం అతడి మనసుని భగభగలాడించింది. ఇలాంటి కుచ్చితుణ్ణి వెనకేసుకొని మృదులతో పోట్లాడాడు తను. కోర్టుకేసులో తన పలుకుబడినంతా ఉపయోగించుకుని రేప్ జరగలేదు గనక జరిమానా చెల్లించి బయటపడ్డాడు. ఏమాత్రం సిగ్గులేకుండా గర్వంగా తిరుగుతున్నాడు. ఛీ. ఛీ. ఇలాంటివాళ్ళని గౌరవించి వీళ్ళ వెనకాల తిరిగి ఎంత పెద్ద పొరపాటు చేశాడు తను? మృదులను కలుసుకోగానే ఇక జన్మలో రాజభూషణం మొహం చూడనని చెప్పాలి. మృదుల సంతోషిస్తుంది. మరెవరో పిలిస్తే అక్కడికెళ్ళిపోయాడు రాజభూషణం. వెళ్తూ, వెళ్తూ భాగవతార్ వైపు చూసి వెటకారంగా నవ్వి మరీ వెళ్ళాడు. ఆ నవ్వు భాగవతార్ కి బాధకలిగించలేదు కాని, రాజభూషణం మీది కోపాన్ని మరింతెక్కువ చేసింది. ఎవరెవరో వస్తున్నారు. భాగవతార్ కి థాంక్స్ చెప్తున్నారు. కాని అతడెదురు చూస్తున్న మృదులమాత్రం కనిపించలేదు. అంతలో దేవకి డాన్స్ ప్రారంభమైంది. వచ్చిన వాళ్ళంతా ఆమె డాన్స్ చూడ్డంలో మునిగిపోయారు. అక్కడుండలేకపోయాడు భాగవతార్. ఎంట్రెన్స్ ప్రక్కన వెయిటింగు హాల్లో సోఫాలో కూర్చున్నాడు. అతనికి అక్కడుండాలని లేదు. కేవలం మృదుల ఒస్తుందనే ఆశతోనే ఆ ప్రదేశం ఒదలలేకపోతున్నాడు. లోపల్నుంచి ఈలలు, చప్పట్లు వినిపిస్తున్నాయి. డాన్స్ మంచి రసపట్టులో సాగుతున్నట్లుంది. డాన్స్ హల్లో ఉండి డాన్స్ చూస్తూన్నపుడు అంతగా తెలియలేదు కాని ఇప్పుడు బయట ఉండి, ఈలలు, చప్పట్లు వింటూంటే అవి ఎంత ఆటవికంగా- అనాగరికంగా ఉన్నాయో అర్ధంకాసాగింది. ఈ రకమైన సంస్కృతి నంత ఆధునికత పేర మీరామోదించగలరు. కాని నేను జీన్స్ వేసుకోవడం మాత్రమే అసభ్యమనిపిస్తోందా మీకు." అని మృదుల నిలదీయడం గుర్తొచ్చింది. తనను పెళ్ళి చేసుకోకముందు ఎప్పుడూ ఇలాంటి పార్టీలలో కనపడలేదు. చూడామణి, కేశవనాద్ లను కూడా ఈ రకమైన పార్టీలలో చూడ్డం ఇదే మొదటిసారి.
    ఎవరో మొరటుగా ఉన్న మొగవాడు రిసెప్షన్ కౌంటర్ దగ్గరకొచ్చి రిసెప్షన్ క్లర్క్ తో ఏదో చెప్పాడు. రిసెప్షన్ క్లర్క్ హోటల్ బాయ్ ని డాన్స్ హాల్లోకి పంపించాడు. మరో రెండు నిమిషాలకి రాజభూషణం బయటికొచ్చాడు. మొరటు మనిషికి సైగచేసి హోటల్ బయటికి వచ్చాడు. భాగవతార్ సాధారణంగా ఇలాంటివి పట్టించుకొనే రకం కాదు. గాని రెస్ట్ లెస్ గా ఉండడంవల్ల ఇది గమనించాడు. ఏదో విశేషముందని కూడా అనిపించిందతనికి తను కూర్చున్న చోటునుంచి. తెర ఒత్తిగించి బయటికి చూసాడు. రోడ్డుమీద మొరటు మనిషి రాజభూషణం మాట్లాడుకుంటున్నారు. మామూలు పరిస్థితుల్లో అయితే రాజభూషణం రోడ్డుమీద నిలబడి అలాంటి సామాన్య వ్యక్తితో అంత సన్నిహితంగా మాట్లాడడు. వాళ్ళు నెమ్మదిగా మాట్లాడుతున్నా, శ్రద్దగా వింటూన్న భాగవతార్ కి వాళ్ళ మాటలు వినబడుతున్నాయి.   
    "మోసం జరిగిపోయింది సారీ! మీరు మృదులమీద ఒక కన్నేసి ఉంచమన్నారు. అలాగే ఆవిణ్ణి ఫాలో అవుతున్నాను. ఇవాళ మృదుల మరెవడితోనో మన లేబ్ కొచ్చింది. ఇద్దరూ ఘూర్ఖానికొట్టి పడేసారు. లోపలికెళ్ళారు. ఎవరెవరో అమ్మాయిల్ని వేన్ లో ఎక్కడికో తీసుకుపోయారు. మళ్ళీ లేబ్ కేవచ్చారు. ఈ సంగతి మీకు చెప్దామని గంటనించి ట్రై చేస్తున్నాను. నాకు ఇన్విటేషన్ లేదని గేటుదగ్గిర ఘూర్ఖ లోపలికి రానీయలేదు. ఎలాగో వాడికి లంచంపెట్టి ఇంత సేపటికి మీకు కబురందీయగలిగాను."
    రాజభూషణం కనుబొమ్మలు ముడిపడ్డాయి. "అది ఇప్పుడు లేబ్ లోనే వుందా? కర్కశంగా అడిగాడు.
    "నేనొచ్చేసరికి ఉంది. నేనొచ్చి గంటయింది."
    "నువ్వునడు. నేనిప్పుడే మనవాళ్ళని పంపిస్తాను."
    రాజభూషణం మళ్ళీ లోపలికి రాకుండా పార్క్ చేసిన తనకారు దగ్గిరకెళ్ళి డ్రైవింగ్ సీటులో కూర్చుని కారు స్టార్ట్ చేసాడు. అంతావిన్న భాగవతార్ కి లేబ్ ఏమిటో, మృదుల మరొకడితో అక్కడికెళ్ళడమేమిటో అందుకు రాజభూషణం ఖంగారు పడడమెందుకో అర్ధంకాలేదు. మృదులతో వున్న మరోవ్యక్తి "ఎవరా" అని ఆలోచించే దశలో లేదు భాగవతార్ మనసు. అతనికొక విషయం స్పష్టంగా అర్ధమైంది. మృదుల మళ్ళీ ఏదో సాహసం చేస్తోంది. ఆమెని రాజభూషణం ఎదుర్కోబోతున్నాడు. రాజభూషణమేమిటో ఇప్పుడతనికి బాగా తెలిసిపోయింది. మృదులని వెంటనే కాపాడుకోవాలి. కాని లేబ్ ఏమిటో, అదెక్కడుందో తనకెలా తెలుస్తుంది? అది చెప్పగలిగిన వ్యక్తి దేవకి ఒక్కర్తే. డాన్స్ హాల్లోకి నడిచాడు. కేబరే డాన్స్ మంచి రసపట్టులో ఉంది. దేవకి ప్రదర్శిస్తూన్న హావభావాలకి ఆమె ఒంపుసొంపులకి జనం ముగ్ధులై తన్మయత్వంతో చూస్తున్నారు. ఎప్పటిలాగే తప్ప తాగేసి ఒకే రకంగా తల అటూ ఇటూ ఊగిస్తున్నాడు ప్లెమింగ్. వెనకముందు లాలోచించకుండా గభాల్న డాన్స్ ఫ్లోర్ కొచ్చేసి దేవకి చెయ్యిపట్టుకుని "మీ లేబెక్కడుంది?" అన్నాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra