Previous Page Next Page 
గ్రాఫాలజీ పేజి 33

                                 

     A. ఈ సంతకంలో దాదాపు ప్రతి అక్షరాన్నీ గుణింతమో, వత్తో కొట్టివేయటం జరుగుతుంది. అంతే కాకుండా రెండు మూడు అక్షరాల్ని కలిపి గొలుసు వ్రాతలాగా వ్రాసి, మొత్తం సంతకాన్ని ఒకే గొలుసులా కాకుండా మూడు భాగాలుగా విడగొట్టడం జరిగింది. సంతకాన్ని భాగాలుగా విడగొట్టేవారు తమని ప్రపంచం బాగా గుర్తించాలి అన్న అభిప్రాయంతో వుంటారు. ఇది ఇంగ్లీషు సంతకాలకి కూడా వర్తిస్తుంది. వీరిలో సెక్స్ భావనలుకొద్దిగా ఎక్కువ పాలు ఉంటాయని గ్రాఫాలజిస్ట్ లు భావిస్తారు. ఉత్సాహం, ఒక పనిపట్ల ధృఢనిశ్చయము ఇటువంటి వ్యక్తుల్లో గమనించవచ్చు.

     B. అక్షరాలను దారాల్లా  వ్రాస్తూ సంతకాన్ని పూర్తి చేసేవారు లౌక్యులు, టాక్ట్ తెలిసినవారు, మానసిక విశ్లేషణని ఎక్కువ ఉపయోగించేవారు అయి వుంటారు. ఇతర వ్యక్తులతో వీరి సంబంధాలు చాలా బావుంటాయి.

     ఉత్తరమంతా ఏసైజు ఏక్షరాలతో వ్రాస్తారో సంతకం కూడా అదే సైజులో ఉండటం మనం ఇక్కడ గమనిస్తాం. ఇటువంటి సామీప్యత ఉన్నవాళ్లు తమకులేనిదాన్ని బయటవాళ్లకు చూపించటానికి అంతగా ఇష్టపడరు. వీళ్ళు నమ్మకస్తులై వుంటారు.

     C. అక్షరాల్ని గుణింతాల్ని కిందికి దింపి కొట్టివేయటం గానీ, బాగా సాగదీసి కొట్టేయటం గానీ చేసేవారు మూడీ వ్యక్తులై వుంటారు. అయితే వారియొక్క మూడ్ కి ఏ విధమైన హానీ వుండదు.  ఉదాహరణకి, ఏదైనా హోటల్లో భోజనం బాగాలేకపోతే అగ్గిమీద గుగ్గిలమై గొడవ చేసే ఈ వ్యక్తులు ఆ భోజనాన్ని  సర్వ్ చేసిన  వెయిటర్ చిరునవ్వు చిందించి మర్యాద చూపిస్తే వెంటనే అతనిపై ఆప్యాయతని కురిపిస్తారు. అయిదురూపాయలు టిప్పు ఇవ్వటానికి  కూడా వెనుకాడరు.

    ఇటువంటి సంతకాలు ఇంగ్లీషులో వున్నప్పుడు సాధారణంగా 'T'అనే అక్షరం తాలూకు గీతని బాగా సాగదీసి ఆ గీతతో మిగతా అక్షరాలని కొట్టివేసేవారు కూడా  ఈ విభాగంలోకే వస్తారు.

    పై సంతకంలో 'రావు' అనే అక్షరాల్లో 'రా' గుణింతం చివరి భాగాన్ని 'వా' తాలూకు వృత్తానికి సరిచేసి వ్రాయటం గమనించవచ్చు. ఇలాగ ఒక అక్షరం తాలూకు చివరి భాగాన్ని , తరువాతి  అక్షరం తాలూకు మొదటి భాగానికి సరిచేసి వ్రాసేవాళ్లు ఎక్కువ ధైర్యసాహసాలు కలిగిన వారై వుంటారు.  వీరు శారీరకంగా  ఏమాత్రం  దెబ్బతిన్నా తల్లకిందులై పోతారు. అయినా కూడా మొండిపట్టు విడవరు. వీరు పొరపాటున అనారోగ్యంతో మంచం  పట్టారంటే వీరిని కదరకుండా ఉంచటానికి సంకెళ్లు వేసినంత పని చేయాలి. ఎంతో అనారోగ్యం ముంచుకు వస్తేతప్ప  వీరు మంచం ఎక్కటానికి సిద్దపడరు. మానసికంగా కూడా, ఎంతో పెద్దదెబ్బ తగిలితే తప్ప మానసికంగా బెదిరిపోరు.

         

    ఈ సంతకంలో మనం అయిదు రకాలైన విశ్లేషణలని గమనించవచ్చు. A. సంతకం ఎడమవైపు క్రిందకి, కుడివైపు పైకి తేలటంB. మొదటి అక్షరం ఒక్కటి స్పష్టంగా వ్రాసి తరువాత  అక్షరాలన్నీ నిర్లక్ష్యంగా వ్రాసి సంతకం పూర్తి అయిందనిపించటం, C. మిగతా చేతివ్రాత కన్నా అక్షరాలన్నీ చాలా చిన్నసైజులో వుండటం. D. అక్షరాలు ఎడమవైపుకి వంగివుండటం. E. సంతకం చివరిగీత ఎడమ వైపుకి రావటం.

    A. చేతి వ్రాతంతా కాగితానికి తిన్నగా వుండి, సంతకం మాత్రం కుడివైపు లేచి వుంటే ఆ వ్యక్తులు అన్యాయాన్ని  ఎదుర్కోవటానికి ఇష్టపడే మనస్తత్వం కలిగి వుంటారు. సంతకంలో ఏవిధమైన ఆర్ద్రత లేకపోవటం కూడా గమనించవచ్చు. వీరు సాధారణంగా పక్కవాళ్ల పట్ల అవసరమైన దాని కన్నా ఎక్కువ ఆప్యాయతలు ప్రదర్శించకుండా వీలైనంత వరకు మెటీరియలిస్ట్ లుగా ఉంటారు.

    B. పైన చెప్పిన ఉదాహరణల్లో రంగరాజు అనే వ్యక్తి సంతకంలోని అక్షరాలు కుడివైపుకి వంగి వుంటే ఈ సంతకంలో ఎడమవైపు వంగి ఉండటాన్ని గమనించవచ్చు. ఇది తనలో తానే ఇంట్రావర్ట్ గా ప్రవర్తించే విధానాన్ని ఇది తెలియజేస్తుంది.

    C. ఉత్తరంలో మిగతా అక్షరాల కన్నా సంతకంలో అక్షరాలు చిన్నగా ఉండటాన్ని ఆ మనిషి యొక్క అపనమ్మకాన్ని తెలియజేస్తుంది. వీళ్లు సాధారణంగా ప్రతి చిన్న విషయానికి క్షమాపణ చెప్పుకునే మనస్తత్వాన్ని కలిగి వుంటారు. ఒక పనిలోకి ఉత్సాహంగా చొచ్చుకుపోయే గుణాన్ని కలిగి వుండరు.
     D. సంతకంలో కేవలం మొదటి  అక్షరాన్ని పెద్దగా వ్రాసి, మిగతా అక్షరాలన్నీ చిన్నవిగా, అస్పష్టంగా ఏదో సంతకం పూర్తి చేయాలి కాబట్టి చేసేవారు అవతలి వారు చెప్పే  దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వరు. అవతలి వారు చెప్పేది చెబుతూ ఉంటే వీరు వింటున్నట్టు నటిస్తూ తమ ఆలోచనలో మునిగిపోతారు. ఇటువంటి వ్యవహారాలు మనసుకి సంతృప్తినిచ్చినా ఒక్కొసారి ఇబ్బందుల్లో పడేసే ప్రమాదం వుంది.

     ఇటువంటి వ్యక్తులు స్వతంత్రతకు ప్రాధాన్యత ఉన్న ఏ రంగాన్ని ఎన్నుకున్నా రాణిస్తారు. అంతే తప్ప నలుగురితో పాటు నారాయణా అనుకొని ఉండటానికి ఇష్టపడరు. అలా వుంటే వీరికి కూడా అసంతృప్తిగాను, అసహనంగాను వుంటుంది.

     మొదటి అక్షరం సంతకంలో బాగా పెద్దదిగా వున్నవాళ్లు ఏదైనా ఒక వ్యాపారం వారిని ఆకర్షిస్తే వారికున్న పాత అప్పులు మరిచిపోయి, కొత్త అప్పులు చేసి ఆవ్యాపారాన్ని మొదలు పెడతారు. వీరు విజయాన్ని ఎంజాయ్ చేసినంతగా జీవితంలో మరిదేన్నీ చెయ్యరు.

     E. సంతకం చివరగీత పట్ల అభిలాషవున్న వారై వుంటారు. రచన, సాహిత్యం, సంగీతం పట్ల అభిలాషవున్న వారై వుంటారు. లౌక్యాన్ని ఉపయోగించి పనులు జరిపించుకోవటం వీరికిష్టం వుండక పోవటం వల్ల, ఇతరుల వల్ల వీరికి జరగవలసిన పనులు జరగకుండా ఆలస్యమయ్యే ప్రమాదం వుంది.

 Previous Page Next Page