Home » Kurumaddali vijayalakshmi » అడుగడుగునా...


    అవంతి ఆలోచిస్తుంటే తలుపుమీద మునివేళ్ళతో తట్టిన చప్పుడు అయింది. ఆలోచనలో వున్న అవంతి అది వినిపించుకోలేదు.

    వారందాకా చంద్ర రానన్నాడు. ఓ వేల ఊరునుంచి అకస్మాత్ గా అతను వస్తే! ఇంక తను చెప్పే  కట్టుకథలు పనిచెయ్యవు. మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు ఇందర్ కూడా మామూలుగా వుండకపోవచ్చు.

    మరోసారి తలుపుమీద చప్పుడు అయింది. ఈ దఫా అవంతి వింది. ఇందర్ అయితే తలుపు ఎందుకు కొడతాడు! అనుకున్న అవంతి ముఖం పాలిపోయినట్లయింది.

    తలుపులు బలంగా నెట్టడంతో భళ్ళున తెరుచుకున్నాయి. "అపర్ణా!" అంటూ ఇందర్ వేగంగా లోపలికి వచ్చాడు.

    అవంతి గబుక్కున లేచి నుంచుంది.

    అవంతికి అయిదడుగుల దూరంలో ఇందర్ ఆగిపోయాడు. ఇందర్ ముఖంలో భయము, ఆశ్చర్యము, ముఖకవళికలు వేగంగా మారిపోయాయి.

    ఇందర్ ముఖంలో మారుతున్న రంగులని అవంతి అవలీలగా పసిగట్టింది. వెంటనే ముఖం పక్కకు తిప్పేసుకుంది.

    ఇందర్ ఓ నిట్టూర్పు విడిచి వెనుతిరిగి వెళ్ళి తలుపువేసి వచ్చాడు. అవంతిని మాట్లాడించే ప్రయత్నం చేయక పక్కగదిలోకి తలొంచుకుని వెళ్ళిపోయాడు.

    ఇందర్ అలా ప్రవర్తించడానికి కారణం వేరే వుంది. తను తొందరపాటుతో చేసిన పనికి సిగ్గుపడి ఆ నిమిషాన ఇందర్ బైటికి పారిపోయాడు. పిచ్చిగా ఆలోచిస్తూ నాలుగు వీధులు తిరిగాడు. ఎంతసేపని తిరుగుతాడు? ఎప్పటికైనా ఇంటికిరాక తప్పదు కదా! అపర్ణ అమాయకురాలు. ఎండ కన్నెరుగని సుకుమారి. బలవంతాన ఇష్టంలేని పెళ్ళి చేస్తుంటే ఇంట్లోంచి పారిపోయి వచ్చింది. అపర్ణ మొదటిరోజు తెగ కలవరించింది. ఈ పెళ్ళి వద్దు. నేను చచ్చిపోతాను. బాబోయ్ పెళ్ళికొడుకు కాదు. రాక్షసుడు....నన్ను కొట్టొద్దు. ఇలా కలవరించడం చూసి బాగా భయపడ్డదని అర్ధం చేసుకున్నాడు. ఆ మర్నాటి నుంచీ తను నవ్వుతూ, నవ్విస్తూ జోక్స్ వేస్తూ మాటలతో కాస్త దగ్గర అయ్యాడు.

    అపర్ణ ఎంతగా భయం చెందింది అంటే మగవాళ్ళంటే నరరూప రాక్షసులనే బలమైన అభిప్రాయంతో వుంది. అపర్ణ భయంకరమైన కలవల్ల ఏడ్చింది. తను వెళ్ళి మంచంమీద కూర్చుని ఆ చనువు తీసుకోడం ఏమిటి? పోనీ అక్కడితో ఆగాడా! అసలే భయం చెందివున్న పిల్ల బాధతో ఇష్టం వచ్చినట్లు వాగిందే అనుకో తన వివేకం ఏమయింది? అమాంతం మీదకు దూకి భల్లూకంలా పట్టేసి....ఆ ఆవేశంలో వళ్ళు మరిచి ఏమేం చేశాడో? అపర్ణ దీనిని ఎలా తీసుకుందో....ఛీ..ఛీ

    ఇలా ఆలోచిస్తూ అవంతిని క్షమాపణ అడగాలని ఇందర్ ఇంటికివచ్చాడు. నెమ్మదిగా బిడియంగా తలుపుతట్టాడు. తలుపుతీయలేదు. అమాయకురాలు ఆత్మహత్య చేసుకుందేమోనన్న భయంకరమైన ఆలోచన వచ్చింది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయక బలంగా తలుపులు తోశాడు. అవి భళ్ళున తెరచుకున్నాయి. లోపలికి పరుగున వచ్చాడు.

    అదీ జరిగింది.

    ఇలా అని తనంతట తానుగా ఇందర్ చెప్పలేకపోయాడు. అవంతి మౌనం వహించింది. చాపమీద దిండువేసుకొని గోడవైపు తిరిగి పడుకుంది.

    ఇందర్ కాఫీ ప్లాస్క్ చూశాడు. అది కడిగి పెట్టివుంది. అది చూసి హాయిగా ఊపిరి పీల్చాడు.

    ఇందర్ చప్పుడు కాకుండా నెమ్మదిగా పని చేసుకోవడం మొదలు పెట్టాడు.

    అవంతి అతని కదలికలు ఆలకిస్తూ పడుకుంది. రోజూ ఇందర్ వంట చేస్తుంటే అవంతి చేతులు కట్టుకొని అతనికి కొద్ది దూరాన నుంచొని "దొండకాయలు, ఉల్లిపాయలు కలిపి వేస్తే ఏమవుతుంది. సగం దొండకాయలు వేగింతరువాత వేయటం ఎందుకు?" లాంటి ప్రశ్నలు వేసేది, అవంతికి చాలా చక్కగా వంటచేయడం వచ్చు. అది తెలియకూడదు కాబట్టి యిలాంటి ప్రశ్నలు వేసేది.

    ఇందర్ ఆ పూట వంట చేశాడు. స్నానం చేసి డ్రస్ వేసుకున్నాడు. యింక అవంతిని పలకరించక తప్పలేదు.

    తను స్నానం చేసి వచ్చి డ్రస్ చేసుకోవటం పూర్తి అయ్యేదాకా ఇందర్ బైట తిరిగి రావాలని అవంతి కండిషన్ పెట్టింది. బాత్ రూమ్ మరీ చిన్నది. అక్కడ బట్టలు ధరించాలంటే తడిసిపోతాయి. అవంతి స్నానం చేసి డ్రస్ అయ్యేదాకా ఇందర్ బైట కెళ్ళి అలా అలా తిరిగి వచ్చేవాడు. ఇప్పుడు ఇందర్ బైటికి వెళితేగాని అవంతి జలకాలాడదు.

    "అపర్ణా! నీవు స్నానం కానిచ్చి బోంచెయ్యి. నేను ఓ గంట ఆగి వస్తాను. నాకోసం కూర్చోనక్కరలేదు" ఇందర్ చెప్పాడు.

    అవంతి ఊ అని కూడా అనలేదు.

    ఇందర్ ఓ నిట్టూర్పు వదిలి "నేను బైట తాళం వేసుకుని వెళుతున్నాను" అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.

    అయిదు నిమిషాలు ఆగి అవంతి లేచింది. కడుపులో ఎలుకలు పరుగెత్తుతున్నాయి. స్నానానికి వెళ్ళేది వెళ్ళక వంట ఏమిచేశాడో చూద్దామని వంట పాత్రలు తీసి చూసింది. కాకరకాయ ఉల్లిపాయ కలిపి వేయించిన వేపుడు. ఘుమ ఘుమ లాడిపోతుంది. కొత్తిమీర టమోటాతో రసం. మామిడికాయ పప్పు.

    "అయ్యయ్యో అన్నీ నా కిష్టమైన వంటకాలే. అతని ముందు హాయిగా ఎలా రోజులా తినగలను!" అనుకుంది అవంతి.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra