జీవితంలో నాలుగయిదు సార్లు ఘోరంగా విఫలమయిన తరువాతే వీరు జీవితం గురించి, దాని ఆటుపోటుల గురించి తెలుసుకోవగలుగుతారు. ఈరకం సంతకంలో అక్షరాలు గుండ్రంగా వుంటే, వాళ్లు ఎక్కవ ఆప్యాయత చూపేవాళ్ళై వుంటారు. అంతే కాకుండా రెండు మూడు అక్షరాల తరువాత ఖాళీ వదిలి సంతకాన్ని మరో అక్షరం ద్వారాకానీ, రెండక్షరాల ద్వారా కానీ పూర్తిచేసేవాళ్లు మానసికంగా చాలా ఉన్నతులు, అవతలి వారిని అర్దం చేసుకునే అవగాహన వున్నవాళ్లు అయి వుంటారు.
సంతకాన్ని మొత్తం ఒక వృత్తంతో చుట్టకుండా అందులో ఒక అక్షరాన్ని మాత్రమే సర్కిల్ తో గానీ, సగం సర్కిల్ తో గానీ, పూర్తి చేసేవాళ్లు వాస్తవాన్ని గ్రహించే దృక్పథంలేని వాళ్లై వుంటారు. ఒక పనిని పూర్తి చేసి గానీ వదలని వాళ్లయి వుంటారు.
('శ్రీ కాంతారావు' అనే సంతకాన్ని గమనించండి.)
పై సంతకంలో ముఖ్యంగా మూడు విషయాలని గమనించవచ్చు. (A)అక్షరాలు కుడి వైపుకి వంగి వుండటం. (B) సంతకం పెట్టిన తరువాత ఒక గీత ద్వారా గానీ, రెండు గీతల ద్వారా కానీ ఆ సంతకాన్ని కొట్టి వేయటం. (C) అక్షరాలు కోణాల్లో వుండటం.
A. కుడివైపు అక్షరాలు వంగి వుండటం ఆ వ్యక్తి తనమీద తాను నమ్మకం కలిగి వుండటాన్ని సూచిస్తుంది. అంతే కాకుండా తన యొక్క ఎమోషన్ మీద తనకి కంట్రోల్ లేకపోవటాన్ని కూడా సూచిస్తుంది. వత్తిళ్లకి లొంగిపోయే మనస్తత్వం ఈ సంతకం ద్వారా బయటపడుతుంది. అక్షరాలు అవసరమైన దానికన్నా ఎక్కువ పొడుగుగా వుండటం జీవితంలో ఏదో సాధించాలన్న తపనని సూచిస్తుంది.
తన సంతకాన్ని తనే రెండు గీతల ద్వారా కొట్టి వేయటం రాజకీయ లక్షణాన్ని అవతలి వారిని మొసం చేయాలనే ఉద్దేశాన్ని సూచిస్తుంది.
B. సంతకమంతా పూర్తయిన తరువాత దాన్ని కోడిగుడ్డు ఆకారపు వృత్తం ద్వారాగానీ, గీతద్వారాగానీ, కొట్టవేయటం,ఆ వ్యక్తి యొక్కఆండబరత్వాన్నీ, పదిమందిలో తనో ప్రత్యేకమైన వ్యక్తిగా కనబడాలనే ఉద్దేశాన్నీ, సూచిస్తుంది. ఇటువంటి సంతకాలు పెట్టేవారు సాధారణంగా అహంభావులై వుంటారు. ఆ అహంభావానికి తగిన సామర్ద్యముంటే ఫరవాలేదు కానీ, లేకపోతే మాత్రం అవతలి వాళ్లు వీరిని చూసి నవ్వుకునే ప్రమాదం వుంది.
C. అక్షరాల్లో వుండే కోణాలు ఆ మనిషి యొక్క నిర్ణయాలు తీసుకునే లక్షణాన్ని సూచిస్తుంది. ఇలా సంతకాలు కోణాలతో పెట్టేవారు సాధారణంగా తొందరగా నిర్ణయాలు తీసుకునే సామర్ద్యం కలిగి వుంటారు.
వీరిలో వున్న గొప్పతనం ఏమిటంటే వీరికన్నా బాగా చదువుకున్నవారు, వీరికన్నా గొప్ప తెలివి తేటలున్నవారు ఏదన్నా ఒక సలహా ఇస్తే ఏమీ బాధపడకుండా వీరు దాన్ని అమలు జరిపే వారై వుంటారు.
కపటం, నేర్పరితనం, ముడుచుకుపోయే స్వభావం వీరిలో సాధారణంగా కనపడదు.
ఇళ్లు కట్టే వ్యాపారంనుంచి, కెమెరా ముందు నటించటం వరకు ఏదైనా చేయగల సమర్దత్వం వీరిలో వుంటుంది.
A.సంతకంలో క్రాంతి అనే అక్షరంలో సున్నాని వ్రాయకపోవటం ఈ వ్యక్తి తనమీద తనకున్న నమ్మకాన్న తెలియజేస్తుంది. సంతకంలో మొదటి అక్షరం మాత్రం వ్రాసి, తరువాత కొన్ని అక్షరాలు మానేసి, చివరిలోమళ్లీ పూర్తి అక్షరాలు వ్రాసి సంతకాన్ని పూర్తి చేసేవాళ్లు సాధారణంగా తనని ప్రపంచం ఎక్కు వ గుర్తించాలన్న తపనతో ప్రారంభించి, ఆ పనిని పూర్తి చేయలేని వారై వుంటారు.
B. ఈ సంతకంలో వత్తులు, గుణింతాలు గుండ్రంగా వుండటం గమనించండి. అంతకు ముందు చెప్పిన రంగరాజు అనే సంతకంలో కోణాలుంటే ఈ సంతకంలో అర్దవృత్తాలు గమనించవచ్చు. ఇలా తమ సంతకంలో వత్తుల్ని, గుణింతాల్ని అర్దవృత్తాకారంలో గుండ్రంగా వ్రాసేవారు ప్రతీదాన్ని ఎక్కువ వూహించుకునే మనస్తత్వాన్ని కలిగి వుంటారు. వీరికున్న అసహనం వీరిని అధికశాతం 'మానసిక అనారోగ్యా' నికి గురి చేస్తుంది.
వీరు చేసినంత సమర్దతతో ఇంకెవరో పనులు చేయలేరు. ఒక్కోసారి ఈ అవసరమైనదానికన్నా ఎక్కువగా వున్న ఆత్మ విశ్వాసం సవాలక్ష నష్టాలకి కూడా దారి తీయకపోదు.
వీరికి జీవితంపై ఎక్కువ ఉత్సాహం, తృష్ణ వుంటాయి. అయితే నలుగురిలో ప్రత్యేకంగా చిన్న వయసులోనే గుర్తింపబడాలనుకోవటంతో ఎదురుదెబ్బలుతినే ప్రమాదం కూడా లేకపోలేదు.
C. సంతకంలో ఒక విధమైన లయలేకపోవటం మనిషియొక్క అస్థిర స్వభావాన్ని సూచిస్తుంది. పై సంతకంలో 'క'అనే అక్షరాలు రెండున్నాయి. ఒక అక్షరం కుడివైపుకి, ఇంకొక అక్షరం ఎడమవైపుకి వంగి వుండటం గమనిస్తాం. రెండు రకాల వంపులు ఒకే సంతకంలో వుంటే వారు తమకి కావలసిన విధంగా వాదించగల శక్తి కలిగి వుంటారు. అయితే ఇది తాత్కాలికమైన విజయాన్ని మాత్రమే సాధించగలుగుతుంది.