Home » Dr c. ananda ramam » Cheekati Kadupuna Kanthi

 

    రైల్లో కూర్చున్నాక ఆమె గొంతు పెగల్చుకొని అంది ......" ఎవరో ఒకరు సర్దుకుపోతేనే సంసారాలు సాగవు ....... కాస్త నువయినా సర్దుకుపో బాబూ?'
    ఈ మాటలంటుంటే బాధతో కళ్యాణి మనసు మూలిగింది. తన కొడుకుది సహజంగా సర్దుకుపోయే తత్వమే ఇంకా సర్దుకు పొమ్మని చెప్పటమేమిటి? రామచంద్ర ఏ సంధనమూ చెప్పలేదు. బాధగా తల వంచుకున్నాడు. అతని ముఖంలో స్పష్టంగా ప్రతి ఫలించిన వేదన కళ్యాణి హృదయాన్ని కోసింది. రైలు కదిలింది.

                                                       ----------


    ఉపాధ్యాయిని జీవితానికి అలవాటు పడిపోయింది వారిజ. తన విద్యార్ధిను లందరి మీదా మాతృత్వపు మమకారాన్ని కురిపిస్తుంది. అందుకే వాళ్ళకు కూడా వారిజ అంటే ప్రాణం కొంతమంది స్కూల్ అయిపోయాక కూడా వారిజ ఇంటికి వస్తారు. వారిజ దగ్గర పాటలు నేర్చుకుంటారు. పాడించు కొంటారు. పాడతారు. ఇప్పుడసలు వారిజకు ఏ చికాకులూ కలగటం లేదు. ఆశలు లేవు. అందుకని భయాలు లేవు. ప్రత్యేకించి కొంత మంది మీద మమతలు లేవు. అందుకని సమస్యలు లేవు.
    మొత్తం సృష్టి మీదే ఏదో వల్లమాలిన ప్రేమ, అందుకని ఎక్కడ చూసినా ఆనందమే కనిపిస్తుంది.
    రామచంద్ర ఆమెకు గుర్తుకు రాని క్షణం ఉండదు. కాని, ఆ స్మృతి లో ఆవేదన లేదు. విరహం లేదు. తన ఈ జీవనాని కంతకూ ఆధార భూతమయిన ఏదో ఆ నిర్వచానీయానందం ఆ స్మృతి లోనూ ఆమె కను భూతమవుతుంది.
    నలుగురు పిల్లలు చుట్టూ కూర్చుని ఉండగా ఒక పిల్ల ఏదో పాడుతోంటే వింటోంది వారిజ. అకస్మాత్తుగా వచ్చాడు రామచంద్ర. ఏం మాట్లాడకుండా వారిజ ఎదురు గుండా కూర్చున్నాడు. పాట పడుతున్న పిల్ల పాట ఆపేసింది. మిగిలిన వాళ్ళు తెల్లబోయి చూస్తున్నారు. ఏదో ఉన్మాదంలో ఉన్నట్లు రామచంద్ర ముఖం చూసి భయంతో తల్లడిల్లింది వారిజ హృదయం.
    "ఇవాళ్టికి మీరంతా వెళ్ళిపొండి" అంది పిల్లలతో .
     పిల్లలంతా బిలబిల లాడుతూ వెళ్ళిపోయారు.
    "ఏంటిలా మీరు ......."
     వారిజ మాటలు పూర్తీ కాకుండానే వారిజను బలంగా కౌగలించుకున్నాడు రామచంద్ర. సంవత్సరాల తరబడి మనసులో పాతిపెట్టిన ప్రేమ ఒక్కసారి ఉదృతంగా పొంగింది. కసితీరా నలిపేశాడు. పెదవుల మీద, కళ్ళ మీద, చెక్కిళ్ళ మీద, శిరస్సు మీద ఉన్మాదంగా ముద్దుల వర్షం కురిపించేస్తున్నాడు. వదిలించుకోవాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు వారిజకు. చివరకు అతి ప్రయత్నం మీద రొప్పుతూ విడిపించుకొని దూరంగా జరిగి "ఏమిటిది? మీకు మతిపోయిందా?" అంది కోపంగా.
    "పోయింది. నేనే వదిలేశాను . మతీ, సుతీ అన్నీను. వేగిపోతున్నాను. అలా దూరంగా ఉండకు. "ఇలారా! దగ్గిరగా. నాలో ఒదిగిపో నీకోసం ఎలా అలమటించి పోతున్నానో చూడు. రా వారిజా ! నా వారిజా! నాలోకి రా!"
    "మీ విలువలు......"
    "మన్ను! నాకు విలువలక్కర్లేదు , అనందం కావాలి. మూర్ఖురాలైన పతివ్రత అక్కరలేదు, నా మనసులో చికాకులన్నీ మరిపించే ప్రియురాలు కావాలి. మంచి చెడూ అక్కర్లేదు, అన్నింటికి అతీతమయిన ప్రేమ కావాలి."
    మళ్ళీ బలంగా వారిజను దగ్గరకు లాక్కున్నాడు. అదిమేసుకుంటున్నాడు  తనలోకి , శక్తి నంతా ఉపయోగించి దూరంగా జరిగింది వారిజ.
    "మీరేనా ఇలా మాట్లాడుతుంది? ఏదో ఒకటి రెండు లోపాలున్నంత మాత్రాన కట్టుకున్న భార్యను వదిలి ఇలా......"
    "ఒకటి ... రెండు లోపాలా? అది పరమ మూర్ఖురాలు . దానినసలు మనిషిగా చూడటమే నాకు చేతకావటం లేదు. ఇంకా భార్యగా ఎలా ప్రేమించగలను? నా వల్ల కాదు వారిజ! నువు కావాలి. నువన్నట్లు నీ ప్రేమానుభావం నాకుండటం వల్లనే తనని మరింత అసహ్యించుకుంటున్నానేమో! అయితే కానియ్యి. నువు కావాలి. నీ ప్రేమ కావాలి. అందుకోసం విలువల్ని వదులుకుంటాను. పరువు ప్రతిష్టలు పోయినా సరే సహిస్తాను. నరకానికి వెళ్ళవలసి వస్తే వెళతాను. రా వారిజ ఇంక కాదనకు."
    వణికిపోతూ మరింత దూరంగా జరిగింది వారిజ. రామచంద్ర కళ్ళలోని ఎర్ర జీరలు భరించలేకపోయింది. ఆమె కాళ్ళ కింది భూమి వణుకుతోంది. "ఏమిటీ ఆవేశం? మీ విచక్షణా జ్ఞానమంతా ఏమయింది? నేను మిఠాయినే! కాని ఎంతో మంది ఎంగిలి చేసి చెత్త కుండీలో పారేసిన మిఠాయిని. కుళ్ళూ, దుమ్మూ, చెత్తా, పెంటా అంటుకున్న మిఠాయిని. మిఠాయిలో మాధుర్యానికి ఆశపడి ఈ హైన్యమంతా సహిస్తారా అంత చండాలము అంటించుకొన్న ఆ దరిద్రపు మిఠాయి కన్నా ఊరగాయ మెతుకులయినా యింట్లో ఇల్లాలు శుచిగా వడ్డించినది నయం కదా!"
    "అబ్బా! ఇట్లాంటి ఉపమానాలతో నా ప్రాణాలెందుకు తీస్తావు వారిజ! ఇంట్లో తినేవాళ్ళకి ఊరగాయ మెతుకులే ప్రాప్తమంటావా?"
    "అంటం లేదు , కొందరు దురదృష్ట వంతులకు ఇంట్లోనే మధుర పదార్హాలు లభిస్తాయి. మీ అదృష్టం అంత గొప్పది కాదు, కానీ , పూర్తిగా దురదృష్ట వంతులు కారు మీరు. కొంత ప్రయత్నిస్తే........"
    "ప్రయత్నం - ప్రయత్నం నీకెలా చెపితే అర్ధమవుతుంది. ఎంత ప్రయత్నం చేసి విసిగిపోయి చివరికి ఈ దశకు వచ్చానో నువేలా అర్ధం చేసుకోగలవు అశాంతితో, నిద్రపట్టక, ఇంటి ముందు పూల మొక్కలకు నా గోడు చెప్పుకుంటోన్న రాత్రుల్లో నువ్వు నన్ను చూశావా? గుండెలు ముక్కలు ముక్కలవుతున్నా చిరునవుతో - లత విషయం వివరించి చెప్పాలని ప్రయత్నిస్తుండటం నువేరుగుదువా? ఆ మూర్ఖత్వాన్ని మమకాతంతో కరిగించాలని, ఆ శిలను నా ప్రేమతో స్పందింప చెయ్యాలనీ, లౌకిక సుఖాలు తప్ప మరొకటి తెలియని ఆ దౌర్భాగ్యురాలికి అలౌకిక మాధుర్యాలు రుచి చూపించాలని నేను పడ్డ తాపత్రయంలో వెయ్యో వంతు నువు ఊహించగలవా? లాభం లేదు వారిజా నా వల్ల కాదు, ఎంత అశాంతిని భరించే శక్తి నాకింక లేదు. నాకు పిచ్చెక్కి పోతుంది. ఏ మూల నుండైనా సమాశ్వాసన దొరకకపోతే నేను భరించలేను. నీకంటే బాగా నన్ను సమాశ్వాసించగలిగేవాళ్ళేవరు? చెప్పు వారిజా! నీకూ నామీద ప్రేమ పోయిందా? నేనంత దౌర్భాగ్యుడినా? ప్రేమింపబడే అర్హత నాకసలు లేదా?"

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra