Home » Yerramsetti sai » 8 down

    ఏ క్షణాన్నయినా బండికి ఏదొక ప్రమాదం జరగవచ్చని చూస్తున్నాడు.    
    కేవలం కొద్దిక్షణాల్లో ఆరో నెంబర్ ఫ్లాట్ ఫారం మీదకు రావటం, మద్రాస్ డైరెక్షన్ లో వెళ్ళి పోవటంకూడా జరిగిపోయేసరికి ఫ్లాట్ ఫారం మీదున్న ప్రయాణీకులందరూ గగ్గోలెత్తిపోయారు.    
                                                                    * * *
    చంద్రిక పిస్టల్ బాగ్ లో దాచుకుని ఎ.సి.కోచ్ దగ్గరకు వచ్చి నిలబడింది. ఫ్లాట్ ఫారంమీద బండి ఆగగానే దిగి కాఫీ తాగి గార్డు బ్రేక్ దగ్గరకు చేరి నిలబడాలని ఆమె ప్లాన్! అయితే ట్రెయిన్ ఫ్లాట్ ఫారం మీద కొచ్చినాగానీ వేగం తగ్గకపోయేసరికి ఆమెకు ఆశ్చర్యం కలిగింది. కోచెస్ అన్నీ ఆ వేగానికి కిందపదిపోతున్నట్లు ఊగుతున్నాయి. ఆమె డోర్ దగ్గరున్న రాడ్ ని గట్టిగా పట్టుకుంది భయంతో. పెద్ద పెద్ద శబ్దాలు- ఫ్లాట్ ఫారం మీద భయంతో తమ ట్రెయిన్ వంకే చూస్తున్న జనం- మరోపక్క పెద్ద ఎత్తున పోలీస్ బలగం!    
    ఆమె కేమీ అర్ధం కాలేదు.    
    ఆ షాక్నుంచి తేరుకునేలోపలే బండి ప్లాట్ ఫారం దాటి కృష్ణాబ్రిడ్జి వేపు పరుగెడుతోంది. ఆమె ఆశ్చర్యం అణుచుకుంటూ మళ్ళీ కోచ్ లో పరుగెత్తింది. ఎ.సి. కోచ్ అంతా గగ్గోలుగా వుంది. విజయవాడలో దిగాల్సిన పాసెంజర్స్ అందరూ ఏం జరిగిందో అర్ధంకాక టి.టి.యి. చుట్టూ గుమికూడారు.    
    టి.టి.యి. అలారం చైన్ పట్టుకుని గట్టిగా లాగుతూనే వున్నాడింకా.    
    "నాకూ అర్ధం కావటంలేదండీ! విజయవాడలో ఆగకుండా ఇలా వెళ్ళిపోతుందంటే ఎక్కడో ఏదో ఫాల్టు ఉంది. డ్రైవర్, అసిస్టెంట్ నిద్రపోయివుండవచ్చు. లేదా ఇంజన్ లో ఏదయినా ప్రాబ్లం వచ్చి ఉండవచ్చు. అదిగాక పోతే బ్రేక్స్ ఫెయిలయి వుండవచ్చు" చెప్తున్నాడతను.    
    "ఇప్పుడెలా మరి?"   
    "మనమేం చేయగలం! చూద్దాం, నెక్స్ ట్ స్టేషన్ లోనయినా ఆగుతుందేమో."    
                                                                 * * *    
    సరిగ్గా అదేసమయంలో భవానీశంకర్ అదిరిపోయిలేచి నిలబడ్డాడు.    
    "ఇదేమిటి? ట్రెయిన్ ఆగటంలేదు? డ్రయివర్ బ్రెయిన్ చెడిపోయిందా ఏమిటి?" రైల్వేలో ఎక్కువకాలం పనిచేస్తే బ్రెయిన్ చెడిపోతుందని మా ఫ్రెండొకడు మెంటల్ హాస్పిటల్ నుంచి  లెటర్ రాశాడా మధ్య" అన్నాడతను.    
    అప్పటికే ఆ కోచ్ లో అంతా గగ్గోలుగా లేచినిలబడ్డారు. అంతా కోలాహలం! అందరిమొఖాల్లోనూ భయాందోళనలు-అటూ ఇటూ పిచ్చాళ్ళలా పరుగెత్తుతూ కిటికీల్లోనుంచి, డోర్స్ లో నుంచీ చూస్తున్నారు.    
    "డియర్ ఫ్రెండ్స్!" అరిచాడు భవానీశంకర్ సైడ్ బెర్తుమీదెక్కి చివరివరకూ నిలబడ్డ ప్రయాణీకులను చూస్తూ-    
    అంతా సైలెన్సయిపోయారు.    
    "బండి ఎందుకాగలేదో ఎవరికీ తెలియదు. ఇంత స్పీడ్ లో ఇలా వెళ్ళిపోవటం చూస్తుంటే నాకు ఒకటే అనుమానం కలుగుతోంది. అదేమిటంటే బ్రేక్స్ ఫెయిలయిపోవటం లేదా అలాంటిదేదో ఇంకో విపత్కరం ఏమయినా సంభవించిఉండటం-    
    ఎవ్వరూ మాట్లాడటం లేదు.    
    ఏం మాట్లాడాలో ఎవరికీ తెలీటంలేదు.    
    "ఇప్పుడు మన బండికి ఏమయినా ప్రమాదంజరగవచ్చంటారా?" అడిగాడు ఓ గడ్డపతను.    
    "జరగవచ్చు- జరగకపోవచ్చు- కానీ మనం జరగబోతోందనుకునేమన ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ చేపట్టాల్సి వుంటుంది."    
    ఆ మాట వినగానే నలుగురు ఆడాళ్ళు బిగ్గరగా ఏడ్చేయసాగారు.    
    "సైలెన్స్ ప్లీజ్! భారత స్త్రీలు ఏడుపుకి పెద్దింటి పేరన్న విషయం ఫ్రూవ్ చేయాల్సిన అవసరం లేదు సిస్టర్స్!" అన్నాడు భవానీశంకర్    
    "చైన్ కూడా పనిచేయటంలేదు. ఇప్పుడేమిటి చేయటం?" ఎవరో బొంగురుగొంతుతో అడిగాడు.    
    "అలా బొంగురు గొంతుకల్తో'ఇప్పుడేమిటి చేయటం?" అని అరచినంత మాత్రాన ఏమిచెయ్యాలో చెప్పేయటం కష్టం బ్రదర్! ఇవన్నీ తాపీగా ఆలోచించి మాస్టర్ ప్లాన్ వేయాల్సిన విషయాలు! ఇప్పుడు మన కోచ్ లో రైల్వే కి సంబంధించిన కార్మికులెవరయినా ఉంటేచేతులెత్తవలసిందిగా భారత రైల్వే తరపున కోరుతున్నాను."    ఎవ్వరూ చేతులెత్తలేదు.    
    "అయితే- ప్రస్తుతం ఇక్కడున్న వారందరిలోకి రైల్వేస్ గురించి నాకే ఎక్కువ తెలుసునని ఘంటాపధంగా చెపుతున్నాను, ఎందుకంటే నేను చిన్నప్పుడు చాలాకాలం ఓ స్టేషన్ మాస్టర్ గారి ఇంటి పక్కనవాటాలో అద్దెకున్నాను."    
    జయసుధకు అతని వ్యవహారం చాలా సరదా కలిగిస్తోంది.    
    "ముందు మనమేం చేయాలో చెప్పవయ్యా, ఈ సోదంతా దేనికి?" ఎవరో ఒకతను అరిచాడు.    
    భవానీశంకర్ కోపంగా అటువేపు చూశాడు.    
    "ఎవరా మాటంది?"    
    "నేను."    
    "ఇది మొదటి వార్నింగ్ నీకు! బ్రెయిన్ ఉన్నవాళ్ళు క్లిష్టసమయంలో నిర్ణయాలు తీసుకోబోతూంటే లేనివాళ్ళు 'అంతరాయానికి క్షమించాలి' అంటూ టి/వి.వాళ్ళు చేసినట్లు చేయకూడదు. ఈ రెండు వాక్యాల వరకూ ఏమయినా డౌట్స్ వుంటే అడగవచ్చు."    
    "బండి స్లో అయినప్పుడు ఒకరొకరు దూకేస్తే?" ఎవరో సలహా ఇచ్చారు.    
    "ఎవరండి, ఆ అమోఘమయిన సలహా ఇచ్చింది?" అడిగాడు భవానీశంకర్.    
    "నేనే!" ఓ కళ్ళజోడతను చేయిపైకెత్తాడు.    
    "మీకు భార్యా పిల్లలున్నారా ఇంకా?"    
    "ఉన్నారు-"    
    "అందరినీ వదిలించుకున్నాక అలాంటి సలహాలివ్వండి!"    
    అంతా నిశ్శబ్దమయిపోయారు.    
    "ఫర్ యువర్ ఇన్ ఫర్మేషన్ బ్రదర్! ఇలాగే మనంప్రశ్నలు-జవాబులు శీర్షిక మెయింటెయిన్ చేస్తుంటే ఏ క్షణాన్నయినా కొంప మునిగిపోవచ్చు. కొంపంటే నా ఉద్దేశ్యం- మనం ప్రయాణం చేస్తున్న 8 డౌన్ కనుక వీలయినంత త్వరగా మనం ఒక అద్భుతమయిన పరిష్కారం కనుక్కోవాల్సి వుంది. నాకున్న అన్ లిమిటెడ్ నాలెడ్జి ప్రకారం మన గోదావరి ఎక్స్ ప్రెస్ వైజాగ్ రూట్ లో కాకుండా మద్రాస్ రూట్ లోకి వచ్చింది. ఆ కృష్ణానది చూస్తేనే మీకా విషయం అర్ధమవుతుంది. ఇలా ఎందుకు జరిగిందనుకుంటున్నారో, ఏ ఒకరయినా చెప్పగలరా?".    
    ఎవ్వరూ మాట్లాడలేదు.    
    "శభాష్! ఎవ్వరికీ ఏమీ తెలీదని ఋజువయిపోయింది కనుక ఆ కారణాలు కూడా అనెనే ఊహించిమీకు మనం చేస్తున్నాను. వైజాగ్ రూట్లో విజయవాడకుదగ్గర్లో ఉన్న స్టేషన్లు అన్నీ కూడా గోదావరి ఎక్స్ ప్రెస్ వాళ్ళేందుకు దారి ఇవ్వలేని స్థితిలో వుండి వుంటాయి. అంటే గూడ్స్ ట్రెయిన్ లు, లేక ఇతర ఎక్స్ ప్రెస్ లేక పాసెంజర్ ట్రెయిన్స్ అడ్డంకిగా వుండి వుంటాయి, అందుకే మద్రాస్ డైరెక్షన్ లోకి మళ్ళింపబడింది. అక్కడయినా ఏదొక అడ్డంకి రాకపోదన్న నమ్మకం లేదు. అందుకే అదేదో జరిగే లోపలేమనం నా తెలివితేటలుపయోగించిమనల్ని మనం రక్షించుకోవాలి! దయచేసి అందరూవినండి జెంటిల్మెన్, సాధారణంగా ఏ రైలు ప్రమాదంలో నయినా జరిగేదేమిటో మీ అందరికీ తెలుసు - ఇంజన్ వెనుకవున్న కోచీల్లోని ప్రయాణీకులంతా స్మాష్ అయిపోతారు.క్షేమంగా వుండేవారు కేవలం ఆఖరి కోచీల్లో వున్నవారే! అవునా, కాదా?"    
    "అవునవును!" అరిచారందరూ.    
    "కనుక తక్షణం మనసామాన్లతో ఆఖరి కోచీల్లోకి వెళ్ళిపోవాలి మనం-"    
    "అవును! అదే మంచిది!" అరిచాడొకడు.    
    తక్షణం ఆ కోచ్ లో వారందరూ సమానులు తీసుకుని వెనుక కోచీలవేపు నడవసాగారు. అయిదు నిమిషాల్లో ఆ కోచ్ ఖాళీ అయిపోయింది. జయసుధ తండ్రి, బాలక్ కూడా సామాను తీసుకుని నడవసాగారు.    
    "కమాన్ మైడియర్ సినిమా స్టార్! మనంకూడా ఈ కోచ్ వదిలేయటం శ్రేయస్కరం" అన్నాడతను. జయసుధ దగ్గరకు నడుస్తూ.    
    జయసుధ లేవలేదు.    
    "నేనెక్కడున్నా ఒకటే!" అంది నిర్లిప్తంగా.    
    "మనకు ప్రస్తుతం కావల్సింది వేదాంతంకాదు ఓ చిన్ననాటి చెలి, ముందు ప్రాణాలు రక్షించుకోవటం."    
    "ఎంతకాలం రక్షించుకోగలనిలా"    
    "రక్షించుకునే మార్గాలన్నీ మూసుకుపోయేవరకూ!"    
    "ఏ క్షణాన్నయినా చనిపోయే నేను ఇప్పుదు ఏదో ప్రమాదంజరగబోతోందని పారిపోవటం హాస్యాస్పదం కాదూ?"    
    "ఒండర్ ఫుల్ కొశ్చెన్ మైడియర్ ఫ్రెండ్! మీకు కేన్సర్ ఉంది గనుక జీవితం మీద ప్రేమ అనవసరం అని మీ అభిప్రాయం! అవునా?"    
    "అవును!"    
    "కానీ కేన్సర్ వల్ల ఖచ్చితంగా చనిపోవాలి అని ఎవరు చెప్పారు మీకు? తెలుగు సినిమాలే అలాంటి సగం నాలెడ్జిని తెలుగు ప్రజలకు పంచి పెడుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్కసారి ఆ తెలుగు సినిమాల్లో నుంచి బయటకు రండి మైడియర్ ఫ్రెండ్! హీరో హీరోయిన్ కి ఒక్క మంచం మీదే పడుకుని డైరెక్ట్ గా రక్తం ఇచ్చే సీన్ లు, అలా రక్తం ఇచ్చినందుకు హీరో ప్రమాదకరమయిన పరిస్థితిలో అదే హాస్పిటల్లో చేరిన సీన్ లూ, తండ్రి రక్తం కొడుక్కీ, కొడుకు రక్తం తండ్రికి ఇస్తే వాళ్ళు ఠకీమని జబ్బు నుంచి కోలుకుంటారనే సీన్ లూ-కిడ్నీలూ దానం చేయగానే దానగ్రహీత ఆనందంగాలేచి తిరిగే సీన్ లూ-ఇవన్నీ వీధుల్లో జులాయిలుగా తిరిగేపిల్లలు అక్కడే పెరిగి పెద్దవారయి తీసిన సినిమాలు జయసుధాజీ!"

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra