Home » Dr. dasaradhi rangacharya » Dasarathi Rangacharya Rachanalu - 7


                                    సరస్వతి

    ఈ చౌరస్తా మీదనే నా గౌరవ మర్యాదలూ, వలపూ ముక్కలు ముక్కలయి పోయాయి. ఆ ముక్కల్ని వెదకడంలో నా వేళ్లు రక్తసిక్తములు అయినాయి.
    ఆ పాత స్మృతులు నా మెదడును రక్తపంకిలం చేస్తున్నాయి. నా జీవితపు వెలుగుల దొంతరను ఎంచుతున్నాను- ఎకనామిక్స్ నోట్సు రాస్తున్నాను.
    ఆనాడు నా కుడికన్ను అదేపనిగా అదురుతూంది. సూర్యుడు ఎన్నడూ లేనంతగా వెలిగిపోతున్నాడు-కప్పులో గూళ్ళు పెట్టుకున్న పిచ్చుకలు కిచకిచమని సందేశాలు ఇస్తున్నాయి. పిచ్చుకతో నాకు చక్కని స్నేహం. అది నా చిరిగినా బట్టల్ని చూచి నవ్వదు-అవహేళన చేయదు. అందువల్ల అలాంటి స్నేహం నాకు. అవి చాలా గడ్డు రోజులు. అతి కష్టంగా కాలం గడుస్తూంది. అందుకే ఆ రోజుల్లో మంచి ఆలోచనలు వచ్చేవి. నేను బి.ఏ. పాసవుతాను. అప్పుడు నా జీతం పెరుగుతుంది. అంత డబ్బు ఎలా ఖర్చుచేయడం - అలాంటి ఆలోచనలు వచ్చేవి.
    ఈలోగా పిచ్చుక కిచకిచమన్నది. స్వాగతం పలికింది. రాస్తున్న నోట్ బుక్ మూశాను. తల పైకెత్తి చూచాను. గద్దువ మీద ఏదో వేడిగా పడ్డది. చేత్తో తాకి చూచాను- పిట్ట రెట్ట వేసింది.
    చేపలు వేపుతున్నారని నా ముక్కు పసికట్టింది. చేపలు రుచికరములు. అవి వేగుచున్నాయి. అయినా నాకు అందుబాటులో లేవు. నేనూ మొండివాణ్ణి. వేన్నీళ్ళ నెపంతో వంటింట్లో దూరాను. చలి కాగుడని పొయ్యి ఊదడం సాగించాను. మా పిన్ని తెలివైంది. వెంటనే వారించింది. వాకిట్లో కట్టెలు పడిఉన్నాయి-వాటిని కొట్టమని ఆజ్ఞాపించింది. బొగ్గును పాలల్లో ముంచి తీయండి. అయినా మా పిన్నిలాంటి రంగురాదు. నేను కట్టెలు కొట్టడంలో పడిపోయాను. చాలా చురుగ్గా పనిచేస్తున్నాను. దగ్గు వచ్చింది. లెక్కచేయలేదు. చేతులకు బొబ్బలు వచ్చాయి. చూచుకోలేదు. క్షణంలో కర్రలు చీల్చిపారేశాను. చేపల వేపుడు వాసన అంతపనీ చేయించింది. ఇహ నీరసించిపోయాను. వంటింటివరకు వెళ్ళే ధైర్యం లేకపోయింది. అయినా నాకెందుకో ఒక ఆశ చెలరేగింది-పిన్ని నాకివ్వాళ చేపలు పెడుతుందని!
    నా ఆలోచనలకు అంతులేదు. అవి సాగుతూనే ఉన్నాయి. వయసు ముప్పై అయిదే. అయినా కంటిచూపు పోయింది. వెంట్రుకల నలుపు పోయింది. మెరిసే పళ్లు రాలాయి. చూస్తేచాలు జనం జోకర్ని చూచినట్లు నవ్వుతారు. మరి ఈ మనిషి నవ్వాలంటేనో? అబ్బా చాలా బొమ్మలు కావలసివస్తాయి.
    ఇంతలో చప్పుళ్లు వినిపించాయి-అనేక ఇంజన్లు షంటింగ్ చేస్తున్నట్లు, యుద్ధం జరుగుతున్నట్లు- బాంబులు పేలుతున్నట్లు, నా గది తలుపు విరుగుతున్నట్లనిపించింది. నేను అదిరిపడ్డాను. లేచి నుంచున్నాను. అమాంతంగా నా కంటివెలుగు తిరిగివచ్చింది. మనసు ఒకచోట నిలిచింది. చూపుకు పిన్ని కనిపించింది. ఆమెకు ఉన్నదే ఒక్క పన్ను. అది బల్లెంలా ఉంది. ఆమె శరీరం భారమైంది. అంత బరువు మోస్తూ అంగలారుస్తూ వస్తూంది.
    నన్ను కొట్టేప్పుడు పిన్ని తన ఒంటి పన్ను ఎన్నడూ ఉపయోగించలేదు. అయినా ఆ పన్నే గుచ్చుకున్నట్లనిపించేది నాకు. అనేకసార్లు మొక్కుకున్నాను-పిన్ని పన్నుపోతే మొత్తం అణాది "బర్ఫీ" తింటానని! అబ్బో! మిడతల దండులా పిన్ని నామీద దాడి చేసింది.
    "అరే! విరల్ ది కొత్త గద బద్దలు కొట్టావు. అంత పెద్ద గద కనిపించలేదూ- కళ్లు చితికిపోయాయా?"
    మళ్ళీ మామూలు కథే. పిన్ని రౌద్ధాళించింది. ఇంట్లోనుంచి వెళ్లిపొమ్మంది. ఎప్పటిలానే నేనది విననట్లు నటించాను. తరవాత కావలసిందే అయింది. పిన్ని నా సామాను ఒక్కొక్కటీ తీసి వీధిలోకి విసిరివేసింది. నేను చౌరస్తాలో కూర్చొని ప్రాణాలకంటే ప్రియం అయిన పుస్తకాలను, గాయం తగిలిన బిడ్డల్ని దుఃఖంలో ఉన్న తల్లి ఓదార్చినట్లు ఓదారుస్తున్నాను. చుట్టుపక్కవాళ్లు కూడి 'తమాషా' చూస్తున్నారు. నన్ను సతాయించడానికి పిల్లలు పుస్తకాలు తీసుకొని పరిగెత్తుతున్నారు. ఆడవాళ్లు నా స్థితిని చూచి చకితులై చూస్తున్నారు. అమ్మాయిలూ వణుకుతున్న నా చేతులను అనుకరిస్తూ జనాన్ని నవ్విస్తున్నారు.
    "సుందరం మామా, పుస్తకం కావాలా?"
    "అరే మామా! మొదలు ఉరుకు. పిన్ని పొరక తెస్తుంది బాదడానికి"
    నేను అదిరిపడ్డాను. దర్వాజా వైపు చూచాను. నాకు అతి ప్రియం అయిన నవల 'కల్పన' కిటికీలోంచి బయలుదేరింది ఒక అమ్మాయికి తాకింది. నేలకూలింది. స్టేజిమీద హాస్యగాడు 'జోక్' విసిరినట్లు అంతా ఫక్కున నవ్వారు. అమ్మాయి ప్రాణాలు పైపైనే పోయాయి. ప్రాణాలు మళ్ళీ తెచ్చుకుంది. చూస్తే నన్ను ఢీకొన్నది.
    "క్షమించు తాతా!"
    అమ్మాయిని తీవ్రంగా చూచాను. అద్దంలో చూచినట్లు చూచాను. ఆ చూపులో అనేక అర్థాలున్నాయి. ముప్పైఅయిదేళ్ళ మనిషి నీకు తాత కాలేడు. నా వెంట్రుకలు నెరిశాయి-నా కళ్ళు ఎప్పుడూ నీరు కారుస్తుంటాయి- పిన్ని కోపానికి నేను గడగడలాడుతుంటాను. అన్నీ నిజమేకాని వీటన్నింటికీ యవ్వనంతో ఏమి సంబంధం? నేను చదువురాని మొద్దును కాను. నావద్ద మెట్రిక్ సర్టిఫికెటుంది. త్వరలో ఎఫ్.ఏ. పాసవుతాను అని ఆ అమ్మాయికి వివరించాలనుకున్నాను. నిజం నమ్మండి.
    ఏం చెయ్యను? ఆ అమ్మాయి పిన్ని ఇంట్లోకి వెళ్ళింది.
    నేను పుస్తకాలు, బట్టలు మూటకట్టుకున్నను. మూట పట్టుకుని ఫుట్ పాత్ మీద కూర్చున్నాను. ఎలా కూర్చున్నాననుకున్నారు-మయూర సింహాసనం మీద కూర్చున్నట్లు! గోడకు ఆనుకొని కూర్చున్నాను. పిన్ని పిలుపుకై నిరీక్షించసాగాను. ఎంచేతంటే, పిన్ని నా సామాను ఎప్పుడూ ఇలాగే పారేస్తుంటుంది. మళ్ళీ ఎవరినైనా పంపుతుంది నన్ను పిలవడానికి. ఆమె పిలవనంపడం ఖాయం. అదీ నా నమ్మకం.
    ఇప్పటి బాధ అది కాదు. నా కుడి కన్ను అదిరింది. అది అబద్ధం ఎందుకు చెప్పింది? అది మోసం ఎందుకు చేసింది?
    కాస్త ఆగండి. నన్ను పరిచయం చేసుకుంటాను. పోనీండి అక్కరలేదు. మీరు నా మాట నమ్మరు. పిన్ని చెప్పిందే నమ్ముతారు. ఆమె మా చెల్లెలు పెళ్ళి కోసం మా నాన్నకు వంద రూపాయలు అప్పు పెట్టింది. మా నాన్న మోసం చేశాడు. పెళ్ళాన్ని తోడుచేసుకొని చచ్చాడు.
    పాపం, పిన్ని ఏడ్చింది. మొత్తుకుంది. తలబాదుకుంది. అలాంటి సమయంలో నేను కనిపించానామెకు. నేనెలా ఉన్నానయా అంటే 'ట్రిమ్'గా ఉన్నాను. పాంటూ, షర్టూ వేసుకున్నాను. కాళ్లకు కొత్త చెప్పులున్నాయి. ఠీవీగా సిగరెట్టు కాలుస్తున్నాను. మీరు నమ్మరు నాకు తెలుసు. కావాలంటే పిన్నినే అడగండి. ఆనాడు ఆమెకు నన్ను గురించి కొన్ని విషయాలు తెలిశాయి. అవి ఏవి? నేను అంట్లుతోముకుంటూ మెట్రిక్ పాసయ్యాను. నేను స్కూల్లో టీచర్ గా ఉన్నాను. నెలకు ఇరవైఅయిదు సంపాదిస్తున్నాను.
    ఇంకేముంది-మా పిన్ని తలదాచుకుంది. మా అమ్మను నరకం నుంచి తప్పించమంది. తనకు నెలకు పది చొప్పున అప్పు తీర్చమంది. అప్పు తీర్చకుంటే మా అమ్మ నరకంలోనే ఉండిపోతుందని బెదిరించింది. ఇహ మా అమ్మ జీవితం అనే నరకాన్ని మృత్యువు అనే స్వర్గం కోసం నిరీక్షిస్తూ గడిపింది. ఇంకా ఆమెను నరకంలో ఉంచడం ఇష్టంలేదు. నెలకు పదిచ్చి మా అమ్మకు స్వర్గం కొనిపెట్టడానికి అంగీకరించాను.
    నాకు పదిహేనే మిగిలాయి. పదిహేనుతో బతకడం అసంభవం. అంటే పిన్నికి పదిరూపాయిలు అందడం లేదని అర్ధం. అందుకే ఆమె నా కుటుంబానికి మరో ఉపకారం తలపెట్టింది. నా పిల్లల నుండి ఇరవై వసూలు చేయొచ్చనుకుంది. నన్ను పోషించే బాధ్యత వహించింది.
    తరవాత ఏమైంది? నా స్థితి చూచి వీధివాళ్లు జాలిపడ్డారు. దూరంగా వెళ్లిపొమ్మన్నారు. మరోవీధికి పారిపొమ్మన్నారు మా పిన్ని బాగా బలిసిపోయింది. కదల్లేదు. నన్ను వెదకడానికి రాలేదు అన్నారు. అయినా నేను పిన్ని ఇల్లు వదల్లేదు. వదిలిఉంటే పిన్ని ఇంట్లోకి సరస్వతి వచ్చివుండేదికాదు.
    పిన్ని చిన్నిచిన్ని సమోసాలు చేయడంలో మొనగత్తె. కూరగాయలు అమ్మడానికి వస్తారా- వాళ్ళ బుట్టలోంచి టమాటాలు కొట్టేస్తుంది. పాల్లో నీళ్లుపోసి అమ్ముతుంది. సరుకులు అమ్మేవాళ్ళతో తగాదా పడుతుంది. ఆమె భర్త లక్షరూపాయల ఆస్తి సహితంగా ఆమెను వదిలి చనిపోయాడు. ఒక కొడుకు యూరప్ వెళ్ళాడు. భారతదేశపు బాట మరిచాడు. అక్కడ పిన్నికి కోడలుందని, కోడలుకు పిల్లలున్నారనీ వినికిడి.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra