Home » Suryadevara rammohan rao » జనవరి 5

 

      మేఖల ఎయిర్ పోర్ట్ లాంజ్ లోకి వెళ్ళి టైమ్స్ ఆఫ్ ఇండియా డైరీ తీసుకుని, బయటకు వచ్చి ఆటో ఎక్కింది.
   
    విమల్ తెలివి తేటలకు పరీక్ష.....
   
    నెగ్గితే....తను నిలబడిపోగలడు.
   
    తను ఒక ఫైనాన్షియల్ జీనియస్ గా రిజువాయిపోతాడు.
   
    అయితే తనకేమిటి....? అది ఆమెకు తెలియకుండానే ఆమె మనస్సులోంచి ఉద్భవించిన ప్రశ్న......వేగంగా దూసుకుపోతూనే వుంది.....ఆమె ఆలోచనలు అంతకంటే మరీ వేగంగా పరిభ్రమిస్తూనే వున్నాయి.
   
    మనసులో స్వార్ధముంటే తప్ప అవతలి వ్యక్తి గురించి, అతని క్షేమం, అభివృద్ధి గురించి ఆలోచించలేమా?
   
    ఒకవేళ అదే నిజమైతే తనకు తెలీకుండా తనలో ప్రోదిచేసుకున్న ఆ స్వార్ధమేమిటి? దేని గురించి?
   
    తనమీద అతని కున్న అభిప్రాయ మేమిటి అసలు ఏదో ఒక అభిప్రాయమంటూ ఉందా? ఒక అభిప్రాయం ఏర్పడాలంటే కొద్ది సేపయినా ఆలోచించాలి. ఆ ఆలోచనలకు ఇంతకాలాన్ని వెచ్చించాడా? ఆమె ఆలోచనలు తెగకముందే ఆటో విమల్ ఆఫీస్ రూమ్ ముందు ఆగింది. ఆటో ఫేర్ చెల్లించి హడావిడిగా మెట్లెక్కి విమల్ దగ్గరకు వెళ్ళి తన చేతిలో వున్న పేపర్ ని అందించి ఫ్రంట్ పేజీలో ఉన్న బాక్స్ అయిటమ్ ని చూపించింది.
   
    విమల్ ముందుగా బాక్స్ అయిటమ్ ని చూడకుండా ఆమెకేసి చూశాడు. ఆపై చప్పున చూపుల్ని మరల్చుకుని బాక్స్ అయిటమ్ కేసి చూసాడు.
   
    దాన్ని చదవటం పూర్తి చేస్తూనే తలెత్తి మేఖల కేసి కృతజ్ఞతగా చూశాడు.
   
    ఆమెకి అతను తన కళ్ళ ద్వారా తెలియపరచిన భావం అర్ధమయింది.
   
    తను తిరిగి ఆ బాక్స్ అయిటమ్ ని ఒకటికి నాలుగుసార్లు చదువుకున్నాడు.
   
    "వాట్ నెక్స్ట్....?" అంది మేఖల.
   
    కొద్దిక్షణాలు మౌనంగా వుంది. ఆ తర్వాత అన్నాడు.
   
    "మనం ఢిల్లీ వెళ్ళటం....."
   
    ఆమె కొద్ది క్షణాలు అర్ధం కానట్లు చూసింది.
   
    'మనం' అన్న పదమే ఆమెకి అర్ధంకాలేదు.
   
                       *    *    *    *    *
   
    "ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉందని అనటం కేవలం స్త్రీ జాతిని మంచి చేసుకోవటానికే ఆడాళ్ళను పొగిడితె కాని మగాడి అవసరాలు తీరవు. ఆడాళ్ళను ఆకాశానికి ఎత్తనిదే రాజకీయ నాయకుడైనా నిలబడలేడు. ఆడాళ్ళ కోసమే ఈ సినిమా అనందే సినిమా ఆడదు. ఆకలీ పొగడ్తలకు లొంగిపోయే స్త్రీజాతి నాశనమవుతోంది. ఈ తరహా పొగడ్తల మూలంగానే స్త్రీ జాతిలో ఆత్మవంచన చోటు చేసుకుంటుంది.
   
    నిజంగా ఈ ప్రపంచంలో ప్రతి మగవాడి విజయం వెనుకా స్త్రీ వుందా....?
   
    ఉండగలదా....? వుందనుకుంటే మగవాడి అపజయం వెనుక ఎవరుంటారు.
   
    తిరిగి మగవాడేనా.....?
   
    మరి స్త్రీ ప్రతి విజయం వెనుకా ఎవరుంటారు....? స్త్రీనా? పురుషుడా?
   
    స్త్రీకి కావాలని ప్రత్యేకంగా ప్రాముఖ్యం ఇవ్వటం మూలంగా అంతకు మునుపు స్త్రీ అణగదొక్కబడిందనే విషయాన్ని పరోక్షంగా గుర్తు చేసినట్లు కాదా?
   
    ఫలానా మగవాడి విజయం వెనుక స్త్రీ వుందని, ఫలానా మగవాడి విజయం వెనుక మగవాడే వున్నాడని - ఫలానా స్త్రీ విజయం వెనుక స్త్రీయే వుందని లేదా పురుషుడున్నాడని చెప్పాలి.
   
    ఏది ఏమైనా ఈ సమస్యను నా మీద, నా తెలివితేటల మీద నమ్మకంతో నా దృష్టిని తెచ్చినందుకు కృతజ్ఞతలు. నేను ఈ సమస్యను పరిష్కరించగలిగితే గొప్ప విజయం సాధించగలిగినట్లే-అప్పుడు ణ అవిజయం వెనుక మీరున్నట్లే....." వేగంగా వెళుతున్న ఆంద్రప్రదేశ్ ఎక్స్ ప్రెస్ సెకండ్ క్లాస్ బోగీలో విండో ప్రక్కగా కూచున్న విమల్ తన ప్రక్కనే వున్న మేఖల నుద్దేశించి అన్నాడు.
   
    చల్లని ఈదురుగాలి విండోలోంచి లోపలకు జొరబడి ఆమె అందమైన కురులతో, అలవోకగా ఆమె ఎదను కప్పేసిన పైటతో ఆడుకుంటోంది.
   
    "ముక్కుసూటిగా వెళ్ళటం తెలుసు. మరీ ఇంత ఏక్యురేట్ గా వెళ్ళటాన్ని మీలోనే చూస్తున్నాను. మీరు నూటికి నూరుశాతం కరెక్టు....." అంది మోముకి అడ్డుపడుతున్న కురుల్ని సర్దుకుంటూ!   
   
    తాము రైలెక్కి అప్పటికి ఐదుగంటలయింది.
   
    అప్పటినుంచి ఇప్పటివరకు కనీసం కాఫీ అయినా అడగలేదు. కాని తను మాత్రం ఆకలికి ఉండలేకపోతోంది. ట్రైన్ స్లో అవటం గమనించి మేఖల విండోలోంచి బయటకు చూసింది.
   
    దూరంగా నక్షత్ర మండలంలా వెలుగుల తోరణం కనిపించింది. మరికొద్ది సేపటికి ట్రైన్ ఆ స్టేషన్ లో ఆగింది.
   
    మేఖల ట్రైన్ దిగి ఆమ్లెట్, బ్రెడ్ పీసెస్ రెండు పార్సిల్స్ కట్టించుకొని తిరిగి ట్రైన్ లోకి వచ్చింది.
   
    కనీసం ట్రైన్ కూడా ఆగినట్లు తెలియదా....?
   
    చిత్రమైన మనిషి.....అని మనస్సులో అనుకుంటూ వెళ్ళి ఒక పార్శిల్ ని అతని కందించింది.
   
    ట్రైన్ తిరిగి బయలుదేరింది.
   
    అప్పుడు సమయం రాత్రి పదకొండు గంటలు.
   
    ఆకలి తీరగానే అతనికి నిద్ర ముంచుకొచ్చింది.
   
    ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు.
   
    రెండు బెర్తులు ఒక దాని క్రింద ఒకటి ఎలాట్ అవటంతో మధ్య లోని బెర్త్ ని లేపి, చెయిన్స్ కి జాయింట్ చేయకుంటే పడుకోవటం కష్టం. కానీలోపే విమల్ నిద్రలోకి జారుకున్నాడు. అతని వేపోసారి చూసింది. అతను గాఢ నిద్రలో వున్నాడు. ఎలా....? తను నిద్రపోవాలంటే విమల్ ని నిద్రలేపాలి. అలా చేయాలనిపించలేదామెకు.
   
    అలాగే ఆలోచిస్తూ ముందుకొస్తున్న నిద్రను తరిమికొడుతూ ఉండి పోయింది.
   
    మరికొద్ది సేపటికి అతను నిద్రలోనే అనీజీగా ఫీలవుతూ ఆమె భుజం మీదకు ఒరిగిపోయాడు.
   
    వూహించని ఆ పరిణామానికి ఆమె కరంట్ షాక్ కొట్టినట్లుగా వులిక్కిపడింది.
   
    అది అతను స్పృహలో ఉండి చేసిన పని కాదు. ఎలా అతన్ని తననుంచి దూరంగా వుంచటం....? ఆమె ఆలోచిస్తుండగానే అతను ఆమె భుజం మీదనుంచి మెల్లగా జారిపోయి ఆమె ఒడిలోకి చేరుకున్నాడు.
   
    ఆమె శరీరమంతా ఝల్లుమంది.
   
    గతంలో ఎప్పుడూ అనుభవంలోకి రాని అనుభూతి ఆమెను వివశురాల్ని చేసింది.
   
    ఎప్పుడూ ఎరగని పరాయి మగాడి స్పర్శ....ఎక్కడెక్కడికో తీసుకెళుతున్న స్పర్శ....
   
    ఆమెకి మరో విషయంలో ఆశ్చర్యం కలిగింది-అదే మరో మగాడయితే తను అంతసేపు ఏ చర్యా తీసుకోకుండా వుండేదా? ఆగ్రహించకుండా ఆగిపోయేదా?....
   
    లేదేమో.....మరి?!
   
    ఇతనిపై అలాంటి చర్య తనలోంచి అసంకల్పితంగానే పుట్టుకురావాలి. రాలేదంటే తను ఇతనిపై ఇష్టాన్ని పెంచుకున్నట్లా....?
   
    రైల్వే ట్రాక్ సరిగ్గా లేని కారణాన ట్రైన్ ఓ ప్రక్కకు కొద్దిగా ఒరిగిపోయి వెళుతోంది. దాని మూలంగా విమల్ క్రమంగా ఆమె ఒళ్లోంచి జారిపోతున్నాడు.
   
    అదామె చూసుకోలేదు.
   
    "అమ్మా..... జాగ్రత్త.... మీ హజ్బెండ్ జారిపోతున్నాడు" అంటూ సడన్ గా మాటలు వినిపించడంతో మేఖల ఉలిక్కిపడి తేరుకుని అసంకల్పితంగానే విమల్ తలను ఒడిలోకి తీసుకుంది.
   
    ఆపైన ఎదురుగా ఉన్న బెర్త్కేసి చూసింది.
   
    దానిమీద నడివయస్కురాలు పడుకొని తనకేసే చూస్తూ కనిపించింది.
   
    ఎప్పుడూ లేచి మేఖల ఒకింత సిగ్గుపడింది.
   
    ఆమెకేం చేయాలో కొద్ది క్షణాలు అర్ధం కాలేదు. అతని తల తన శరీరంలోని అతి సున్నితమైన స్థలాల్లో తాకుతుంది.
   
    తాకినప్పుడల్లా దాగిన స్త్రీ పరమైన కోర్కెలు పురివిప్పి ఉవ్వెత్తున లేవబోతున్నాయి.
   
    కంపార్ట్ మెంటంతా నిశ్శబ్దంతో జోగుతోంది.

    ఆమెకి కంటిమీద కునుకు ఎగిరిపోయింది.
   
    కలవరపాటు పెరిగింది.
   
    అక్కడ పర్చుకున్న నిశ్శబ్దం, ఆపై అతని స్పర్శ, నీ ఒడి నా స్వంతం అన్నట్లు అతను పడుకున్న తీరు, అవన్నీ ఆమెలో సరికొత్త ఆలోచనలకు ఊపిరి పోశాయి.
   
    పొసెసివ్ నెస్..... నాది.... నా స్వంతం..... నా వాడు....నాకే స్వంతం అనే సరికొత్త భావన ఆమెలో తొలిసారి ప్రోది చేసుకునే ప్రయత్నం చేస్తోంది.
   
                         *    *    *    *    *

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra