Home » Kurumaddali vijayalakshmi » రుధిర మందారం

    కావాలని కోరి రుధిర మందారం కేసు నేను తీసుకున్నాను.
    తక్కువ కాలంలో రెండు పెద్ద కేసులని చాకచక్యంగా నిర్వహించినందుకు ఆనంద్ ప్రేమ్ దత్ మనసారా కౌగిలించుకుని అభినందించారు. నా కంతకన్నా ఇంకేం కావాలి.
    రుధిర మందారం కేసు చూడుకోటానికి తిరిగి ఇంటికి వచ్చాను.
    మధ్యలో నేను వెళ్ళిం తరువాత ఈ కేసుని నా కొలిగ్స్ ఇరువురు చేపట్టారు. కేసు ఎక్కడ వేసిన గొంగళి అక్కడ లాగానే పడివుంది.
    కాకపోతే రెండే రెండు పనులు జరిగాయి.
    అద్దె పుస్తకాల షాపు అతన్ని ఎవరో హత్యచేశారు అద్దె పుస్తకాల షాపు అతని పేరు రంగరాజు. ఈ రంగరాజు వీరన్న అనేవాడి భార్యని వుంచుకున్నాడు. ఆ స్త్రీ విషయంలో తరచు రంగరాజు వీరన్న పోట్లాడుకునే వాళ్ళుత. తన భార్యమీద ఎక్కువ ప్రేమవల్ల భార్యని ఏమీ అనలేక వీరన్న బాగా తాగి వచ్చి రంగరాజుని హత్యచేసి పరారయ్యాడని తెలిసిన వాళ్ళు అనుకుంటున్నారు. వీరన్న కోసం పోలీసులు విచారిస్తున్నారు. కథ మామూలే విషయం ఇది కాదు.
    షాక్ నవల వాళ్ళ సీక్రెట్ కోడ్ వల్లింఛి ఎప్పుడైతే నేను తీస్కున్నానో అప్పుడే అతని ఆయువు మూడింది అనుకోవాలి. హత్య వెనుక దాగిన అసలు రహస్యం ఇదే.
    రంగరాజుని హత్యచేసి వీరన్న పరారయ్యాడని కదా ప్రచారం జరుగుతున్నది. హత్య చేయని వీరన్న పారిపోయే అవసరం ఏమిటి? కనుక ఆ ముఠా వాళ్ళు రంగరాజుని తెలివిగా హత్యచేసి అంతకన్నా తెలివిగా వీరన్నని దాచేసి వుంటారు అంతే.
    నేను వూరు వెళ్ళి వచ్చే లోపల మా వాళ్ళు పరిశోధించినంత వరకూ కేసుని వివరంగా చూసుకున్నాను.
    1. బన్నీ అనబడే అందాల సుందరి ప్రాణానికేం అపాయం జరగలేదు. ఈ మధ్య ఇంటి పట్టునే ఉంటున్నది.
    2. శ్యామలరావు భార్యతో తీర్ధయాత్రలకి వెళ్ళాడు.
    3. రంగరాజుని ఎవరో హత్య చేశారు.
    జరిగింది ఇంతే. రుధిర మందారం ముఠా వాళ్ళు పెద్ద గొలుసుతో చిన్న లింకు వూడినట్లు గ్రహించి జాగ్రత్త వహించారు. షాక్ నవల నేను తీసుకోబట్టే వాళ్ళ గొలసులో ఒక లింకు వూడింది. ఆ లింకుని నేను అతికించ గలిగితే నా కళ్ళకి గొలుసు కనపడుతుంది. కనపడటం వరకే కాదు. గొలుసుని, నా గుప్పిట్లో బంధించుతాను.
    ఈ తఫా షాక్ నవలని ఎంతగా తిరగవేసినా చిన్న క్లూ కూడా దొరకలేదు. ఎప్పటిలా ఆరుకి సంబంధించిన అంకెలుగల పేజీల్లో వాళ్ళ రహస్య సమాచారం లేకపోవచ్చు.
    షాక్ నవలని రహస్యంగా మార్కెట్ లోకి పంపారంటే దానిలో గ్యారంటీగా వాళ్ళ రహస్య సమాచారం వున్నట్లేకదా!
    కనుక షాక్ నవలలో రహస్యం వుంది. అది ముందు కనిపెట్టాలి.
    రంగరాజు యొక్క అద్దె పుస్తకాల షాపు మొత్తం గాలించినా షాక్ నవల మరొకటి దొరకలేదు. పైగా అజ్ఞాత రచయిత రాసిన మిగతా నవలలు కూడా లేవు.
    మార్కెట్ మొత్తం మీద అతడి నవలలు మాయం అయ్యాయి. ఎవరిని అడిగినా వకటే సమాధానం. అతడు రాసిన నవలలు కావాలని తీసుకు వెళ్ళారు. తిరిగి వక్కరూ ఇవ్వలేదు. ఏ షాపులోకి షాక్ నవలలు రాలేదు. అడిగితే "ఇంకా ఆ నవల బయటికి రాందే!" అన్న సమాధానం వచ్చింది.
    ఇప్పుడు ఈ కేసుని బయటికి లాగాలంటే డాక్టర్ సుధీర్ మేడ, ఇంటికి తాళం వేసి యాత్రలకు వెళ్ళిన శ్యామలరావు ఈ ఊళ్ళోనే వున్న అందాల సుందరి. నా దృష్టి ఈ మూడు చోట్ల మళ్ళించాలి. అసలు వాళ్ళని వీళ్ళ ద్వారానే పట్టాలి. దొంగ ఎలుకలు కలుగులో దాక్కున్నాయి. కలుగు ముందు మంట పెడితే ఆ వేడికి అన్ని ఎలుకలు బయటికి వస్తాయి.
    నేను ఒక్కరోజు కూడా రెస్టు తీసుకోకుండా డ్యూటీలో చేరాను.
    కొద్దేసేపు షాక్ నవల తిరగవేసి అర్జున్ దగ్గరకు బైలుదేరాను.
    నేను వెళ్ళేసరికి ఆంటీ, పెళ్ళిళ్ళ పేరయ్యతో కబుర్లు చెపుతున్నది.
    అర్జున్ బయటికి వెళ్ళాడని, అరగంటలో వస్తాడని ఆంటీ చెప్పటంతో ఆంటీతో కబుర్లు వేసుకుని కూర్చున్నాను.
    "బాబూ! నీకు పెళ్లి అయిందా!" పెళ్ళిళ్ళ పేరయ్య మధ్యలో కలగజేసుకుని అడిగాడు.
    "నేను హాయిగా వుండటం ఇష్టం లేదా శాస్త్రిగారూ"నవ్వుతూ అడిగాను.
    "హాయిగా వుండటానికే పెళ్ళి చేసుకోటం" గడుసుగా జవాబు ఇచ్చారు శాస్త్రిగారు.
    ఆంటీ పకపక నవ్వింది. "ఇందాక విజయకృష్ణ అని పేరు, వివరాలు ఇచ్చాను చూడండి, ఆ పెళ్ళికొడుకు" అని చెప్పింది. 
    "సరిసరి...కృష్ణార్జునులని చెప్పారు వీళ్ళేనా! అర్జునుని చూడటం అయింది. ఇప్పుడు కృష్ణుడిని చూస్తున్నాను?" శాస్త్రిగారు నశ్యం డబ్బాలోంచి చెంచాడు నశ్యం చేతిలోకి తీసుకుని ఆ చెంచాడు ముక్కులో పోసుకుని అన్నారు.
    నేను గట్టిగా తుమ్మాను.
    "చా నశ్యం మంచి ఘాటుగా వుంటుంది" శాస్త్రిగారు అన్నారు.
    నాకు నవ్వాలో, ఏడవాలో అర్ధంకాలేదు.
    శాస్త్రిగారు ఆంటీ పెళ్ళికూతుళ్ళ కబుర్లలో పడ్డారు.
    వింటూ కూర్చున్నాను.
                                         30
    ఆ రోజు పెళ్ళిళ్ళ పేరయ్యగారి దగ్గర కూర్చుని ఆ కబుర్లు వినటంతో నా మారు వేషానికి మరో కొత్త వేషం దొరికింది.
    ఇంతవరకూ అవసరాలకి ఎన్ని రకాల వేషాలో వేశాను. పెళ్ళిళ్ళ పేరయ్య వేషం మాత్రం వేయలేదు. వాళ్ళు ఎలా మాట్లాడతారో వక్కసారి కూడా చూడకపోవటం ఆ అవసరం రాకపోవటంవల్ల. 

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra