Home » Vasireddy seeta devi novels » మానిని మనసు


    "ఇక్కడుంటే ఈ ఊళ్ళో వుంటే మీ ఆయన నన్ను బ్రతకనివ్వడు. ఏదో ఒకరోజు చంపేస్తాడు" అని తెరిచివున్న వాకిలికేసి భయంభయంగా చూసింది.
    "సావిత్రీ! నీకు పిచ్చెక్కినట్టుంది."
    "అయ్యో అనూ! నీకెలా చెప్పడం? మీ ఆయనకు పిచ్చే! అదీ అప్పుడప్పుడు మాత్రమే బయటపడుతూ వుంటుంది."
    "నోరుముయ్"
    "నిజం అనూ!" ఆమె చూపుల్లో బెదురు కన్పిస్తోంది.
    "అబద్ధం నువ్వన్నీ అబద్ధాల్ చెబుతున్నావ్. నువ్వెళ్ళాక ఈ వారం రోజులు ఆయన నన్ను ఒక్కమాట అనలేదు. నేనే నీ మాటలు నమ్మి ఆయనతో మాట్లాడటానికి భయపడుతున్నాను. నీకు పెళ్ళికాలేదు. మా అన్యోన్యత చూసి నీకు ఈర్ష్యగా ఉంది. అందుకే ఇన్ని అబద్ధాలు కల్పించావు."
    "అయ్యో ఎలా చెప్పనే నీకు... నా బాధంతా నువ్వు కూడా చంద్రవదనలా..."
    "మాట్లాడకు దయచేసి వెళ్ళిపో"
    "నిజం అనూ! ఇవ్వాళ ఉదయం మీ ఆయన మా హాస్టల్ కు వచ్చాడు."
    అనసూయ వ్యంగ్యంగా నవ్వింది.
    "ఎన్ని గంటలకు వచ్చారు?"
    "దాదాపు పదకొండు గంటలకు."
    అనసూయ చూస్తూ ఉండిపోయింది.
    "బాయ్ వచ్చి ఎవరో నాకోసం వచ్చారనీ, విజిటర్స్ రూంలో కూర్చుని ఉన్నారనీ చెప్పాడు. అప్పుడే యూనివర్శిటీకి వెళ్ళాలని తయారవుతున్నాను. విజిటర్స్ రూమ్ లోకి వచ్చాను. మీ ఆయన కూచుని ఉన్నాడు. నేను గడపలోనే నిలబడిపోయాను."
    అనసూయ అయోమయంగా చూసింది.
    "అప్పుడు ఆయన ఎలా ఉన్నాడనుకున్నావ్? పిశాచి లాగున్నాడు. కళ్ళు ఎర్రగా ఉన్నాయ్. ఆ రూపం చూస్తూ వణికిపోయాను, అక్కడే నిల్చున్నావేం? నీతో మాట్లాడాలి లోపలకు రా" అన్నాడు.
    అనసూయ పిచ్చిచూపులు చూసింది.
    ఆయన ఆమాట అనగానే నా పై ప్రాణం పైకే పోయిందనుకో. "రా లోపలకు" గద్దించాడు. "గడపదాటి గోడపక్కగా నిలుచున్నాను" ఆగి భయంగా వీధిలోకి చూసింది.
    "ఊఁ చెప్పు"
    "మీ ఆయన వస్తాడేమో!"
    "ఇప్పుడు రాడులే. చెప్పు త్వరగా" ఉద్విగ్నముగ అడిగింది అనసూయ.
    "అనసూయకు ఏం చెప్పావ్?" అన్నాడు. భయంతో బిగుసుకుపోయాను. కంఠం పెగల్లేదు.
    "నీకు పిచ్చెక్కింది. అన్నీ పిచ్చిమాటలు మాట్లాడుతున్నావ్. డాక్టర్ కు చూపించుకో" అన్నాడు.
    అప్పుడు నాకు తిక్కరేగింది.
    "నాకేం పిచ్చిలేదు. నీకే పిచ్చి. నీ మొదటిభార్యను హింసించావ్. చివరకు సజీవదహనం చేశావు. అనసూయను కూడా ఎప్పుడో చంపుతావ్. అది నా ఆరోప్రాణం. అందుకే నీ సంగతంతా దానితో చెప్పేశాను" అన్నాను.
    "యూ స్టుపిడ్! నువ్వు నాతో రా. ఆమెకు నా ముందు చెప్పు ఆ సంగతి" అంటూ లేచాడు.
    "నేను రాను"
    "ఎలా రావో చూస్తాను" అంటూ ముందుకు వచ్చాడు.
    నేను అరుస్తూ బయటికి పరుగుతీశాను.
    హాస్టల్లో వాళ్ళు కొందరు పరిగెత్తుకుంటూ వచ్చారు.
    దాంతో అతను తలవంచుకుని గబగబ వెళ్ళిపోయాడు.
    లేకపోతే నా పీక పిసికేవాడే. అప్పుడు ఎలా వున్నాడనుకున్నావ్. గవదల ఎముకలు ముందుకు వచ్చాయ్, ముఖములో నరాలు తేలాయి. అచ్చంగా సైకో సినీమాలో హీరో ఎవర్నయినా హత్య చెయ్యబోయేముందు ఎలా కన్పించేవాడో అచ్చం అలాగే వున్నాడు.
    అనసూయ బేలగా చూస్తూ వుండిపోయింది. అరచేతుల్లో చెమటలు పోస్తున్నయ్.
    సావిత్రి బిత్తర చూపులు చూస్తున్నది.
    అనసూయ గొంతు పొడారిపోయింది.
    "వెళ్ళేముందు నీకు చెప్పి వెళదామని వచ్చాను. జాగ్రత్తగా ఉండు అనూ లేకపోతే నీకూ ఆ చంద్రవదన గతే పడుతుంది."
    ఆమె చైతన్యం కోల్పోయినట్టు కూచుండిపోయింది.
    "నేను వెళతాను. జాగ్రత్తగా ఉండు. కొన్నిరోజులు మీ అన్నయ్య దగ్గరకు వెళ్ళిపో"
    ఆమె స్థాణువులా ఉండిపోయింది.
    "వెళతాను. బాబోయ్ మీ ఆయన వస్తే నన్ను ప్రాణముతో వదలడు. నువ్వు జాగ్రత్తగా వుండు. రాత్రిళ్ళు ఆదమరచి నిద్రపోకు" అంటూ సావిత్రి ఎవరో వెనకనుంచి తరముతున్నట్టు రోడ్డుమీదకు వెళ్ళిపోయింది.
    అనసూయ ఉంగిపడ్డ గొడ్డులా అసహాయంగా చూస్తూ ఉండిపోయింది.
    ఆమె బుర్ర పనిచెయ్యడం లేదు.
    దాహం వేస్తున్నట్టు అన్పించింది.
    లేచి మంచినీళ్ళు తాగింది.
    శరీరంలోని శక్తినంతా ఎవరో పిచకారీతో లాగేసినట్టు నీరస పడిపోయింది. పక్కనేవున్న సోఫోలో పడుకుంది.
    కళ్ళు మూసుకుంది.
    కళ్ళముందు రమణ వచ్చి నిలుచుని పిచ్చిగా తనను చూస్తున్నట్టు అన్పించింది.
    తృళ్ళిపడి లేచి కూచుంది.
    సాయంత్రం రమణ వచ్చి తలుపుకొట్టాడు.
    ఆమె తలుపుతీసి పక్కకు జరిగింది.
    రమణ భార్యను చూశాడు. ఎగాదిగా చూశాడు. కొత్త వ్యక్తిని చూస్తున్నట్టు చూశాడు.
    అతను అలా చూస్తుంటే ఆమె గుండె దడదడలాడింది.
    "ఏమిటి అనూ అలా వున్నావేం? వంట్లో బాగా లేదా?" భుజంమీద చెయ్యివేశాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra