Home » Dr c. ananda ramam » Aathmabali


    సంకుచిత స్వభావునిగా, నిత్యశంకితునిగా రావును అసహ్యించుకున్నా, అతని నారాధించే తన మనసును మరలించలేకపోయింది శోభ.
    అతనిలో సుగుణాలే ఉన్నాయో, లోపాలే ఉన్నాయో, తనను అభిమానించాడో, లేక అవమానించాడో? వీటికన్నింటికీ అతీతంగా శోభ మనసూ, శరీరమూ, ఆత్మా- సుషుప్తావస్థలో సహితమూ రావు స్మరణతోనే నిండిపోయాయి. చిన్నారి ఆశ విచిత్రంగా తన మనసులో చోటు చేసుకుంది. ఈ లోకంలో ఎక్కడా లభ్యంకాని ఏదో ఆత్మీయత ఆ పసిహృదయం దగ్గిర లభ్యమవుతోంది. ఈ లోకంలో 'నా' అని చెప్పుకోగలిగింది ఒక ఆశను మాత్రమేననిపిస్తూంది. మిగిలినవన్నీ పైపై అనుబంధాలు - హృదయాన్ని స్పృశించేవి కావు.
    "మీరు కూడా మా అమ్మలాగా నన్ను విడిచిపెట్టెయ్యకండి టీచర్! రోజూ రారూ!" అని బేలగా అడిగే ఆశను చూసి దగ్గిర దగ్గిర నెలరోజులవుతుంది.
    రోజూ తనకోసం గులాబీ పూవులు కోసి ఉంచుతుంది. తను వచ్చినా, రాకపోయినా, ఆ పువ్వులు ప్రత్యేకంగా తీసి ఉంచటం మానదు. అవన్నీ ఎండిపోయి ఉంటాయి. తన కళ్ళలో నీళ్ళలాగా.
    తనకోసం ఎదురుచూసిన ఆ అందమైన కళ్ళలో దిగులు నిండుకొంటుంది. వయసుకి మించిన గాంభీర్యంతో ఏదేదో ఆలోచించుకుంటుంది. టీచర్ కు తనమీద ప్రేమలేదని అనుకొంటుంది. అమ్మో! అలా అనుకోకూడదు. తనకు ఆశ కావాలి. రావుతో తన అనుబంధానికీ, దీనికీ ఏ సంబంధమూ లేదు. రావు తన నసహ్యించుకోని, తనను దూరం చెయ్యనీ. తనుమాత్రం ఆశతో అనుబంధాన్ని తెంపుకోలేదు.
    మళ్ళీ డబ్బు కావాలి. చచ్చినా మూర్తి నడక్కూడదు. రావునెలా అడగాలి? అందులోనూ ఈ పరిస్థితులలో! సరోజిని గుర్తుకొచ్చింది.
    రాక రాక వచ్చిన శోభను సరోజిని ఆప్యాయంగా ఆహ్వానించింది.
    "ఎన్నాళ్ళకు కనిపించావు శోభా! ఏవిఁటిలా పాడయిపోయావ్! మొహంలో కళాకాంతులు లేవు."
    వ్యాకులపాటుతో శోభను చూస్తూ అంది సరోజిని. శోభ గుండెలు ఆవేదనతో బరువెక్కి ఉన్నాయి. ఎన్నడూ సరోజినితో వ్యక్తిగత విషయాలు వివరించే అలవాటులేకపోయినా, ప్రభాకరం జబ్బూ, ఆర్ధికమైన ఇబ్బందీ, మూర్తిని అడగటం, అతడు రావుకు చెప్పటం, రావుకూ తనకూ అపార్ధాలూ అన్నీ చెప్పింది.
    శోభ చెప్తుండగా భాస్కరరావు వచ్చాడు. అతడు వచ్చాడని ఆపలేదు శోభ.
    అంతా విన్న సరోజిని బరువుగా నిట్టూర్చింది.
    "పైకి ఎంతో విశాలహృదయుడిలా, సంస్కారిలా, పరోపకారిలా మాట్లాడే మూర్తి ఇంతటి క్షుద్రుడని అనుకోలేదు."
    "అతడు అలాంటివాడని నాకు తెలుసు. ఒకసారి అనుభవమయింది. తగిన పరాభవం నేనే చేశాను. ఆ తరువాత నాతో మాట్లాడడనుకున్నాను. కాని పశ్చాత్తాపపడినట్లు నటిస్తూ "జరిగింది మరచిపొండి. మనం స్నేహితులుగా ఉందాం" అన్నాడు. ఆ తరువాత అతను చాలా సరళంగా వ్యవహరించాడు. మొదట్లో నన్నపార్థం చేసుకుని అలా ప్రవర్తించాడనీ, తరువాత నన్నర్థం చేసుకుని స్నేహభావంతో మసలుతున్నాడనీ అనుకున్నాను. మనసులో ఇంత విషం దాచుకున్నాడని అనుమానించలేదు."
    భాస్కరరావు కల్పించుకొన్నాడు.
    "మూర్తి సంగతి నాకు బాగా తెలుసు. మీరిద్దరూ స్నేహంగా ఉంటున్నప్పుడు కల్పించుకోవటమెందుకని కొంతా. మీ ఉద్దేశం సరిగా తెలియక మరికొంతా. మీకేం చెప్పలేదు."
    "మూర్తి ఏదో చెప్పాడనే అనుకుందాం. రావుగారు నమ్మెయ్యటమేనా?"
    భాస్కరరావు అదొక మాదిరిగా నవ్వాడు.
    "నమ్మకంగా కథలు చెప్పటంలో మూర్తి చాలా ప్రజ్ఞకలవాడు. అదీగాక రావుగారికి మీపట్ల స్నేహభావానికి మించిన ఆత్మీయభావం ఉందేమో? అందుకనే తనను కాక మరొకరిని మీరు సహాయం కోరటం ఆయనను బాధించి ఉండచ్చు. దెబ్బతిన్న మనసు స్థిమితంగా ఆలోచించలేకపోవటం సహజం."
    శోభ గతుక్కుమని తల వంచుకుంది. ఆమె ముఖం ఎర్రగా అయింది. సరోజినీ, భాస్కరరావులు ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. కొంతసేపటికి శోభ తలెత్తి "సరోజినీ! అన్నయ్య జబ్బు మూలంగా ఖర్చెక్కువయింది. కొంత డబ్బు సర్దగలవా? సాధ్యమైనంత త్వరలో ఇచ్చేస్తాను" అంది.
    "దానికింతగా సంకోచించాలా?" అంటూ సరోజిని వెంటనే నూరు రూపాయలిచ్చి "చాలా?" అంది.
    "చాలు! నీ సహాయాన్ని మరిచిపోలేను."
    "నా సహాయాన్ని మరిచిపోలేవు. కాని, మా ఇంటినిమాత్రం మరిచిపోతావు."
    స్నేహపూర్వకమైన సరోజిని నిష్ఠూరానికి శోభ నవ్వింది.
    "ఏమీ అనుకోకు సరూ! ఇదివరకు ఉమ ఇల్లు సమర్ధించుకునేది. అన్నయ్య బయట వ్యవహారాలు చూసుకునేవాడు. ప్రస్తుతం అన్నయ్య జబ్బుపడ్డాడు. ఉమ అత్తవారింటికెళ్ళింది. ఆ రెండు బాధ్యతలూ నామీద పడ్డాయి. అందుకని ఎక్కడకూ కదలలేకపోతున్నాను. వస్తాను." అంటూ లేచింది శోభ.
    "మీరు ఏమీ అనుకోకపోతే ఒక్కమాట..." సందేహంగా అన్నాడు భాస్కరరావు.
    "ఏవిఁటి?"
    "నాకు రావుగారూ, మూర్తీ ఇద్దరూ తెలుసు. రావుది చాలా కచ్చితమైన స్వభావం. మీరు అనవసరంగా అభిమానపడక రావుకన్నీ వివరంగా చెప్పెయ్యండి. మూర్తితో మీకున్న అనుబంధం కూడా స్పష్టం చేసెయ్యండి. అంతటితో మీ మధ్య అపార్ధాలన్నీ మాసిపోతాయి."
    శోభ తలవంచుకుని వింది. ఆమెకూ భాస్కరరావు చెప్పిందే ఉత్తమమని తోచింది. తన జీవిత సర్వస్వంగా భావించిన రావు దగ్గిర పంతాలూ రోషాలూ ఏవిఁటి? శాంతంగా అన్నీ వివరించాలి. రావు తప్పక అర్థంచేసుకోగలడు.
    ఈ నిర్ణయంతో శోభకు వెనుకటి నీరసమంతా నశించి కొండంత ఉత్సాహం వచ్చింది. వెంటనే రిక్షాలో రావు ఇంటికెళ్ళింది. రావు లేడు. ఆప్యాయంగా ఎదురొచ్చిన ఆశను గాఢంగా కౌగిలించుకుంది. అన్నిరోజులు రానందుకు ఆశ వేసిన నిష్ఠూరాలన్నీ చిరునవ్వుతో సహించింది. హాయిగా గొంతువిప్పి పాడింది. ఆశ బొమ్మలా వింటూ కూర్చుంది.
    గుమ్మంలో అడుగుపెడుతున్న రావునుచూసి పాట ఆపింది శోభ.
    "ఆపేశావేం? నీపాట నేను వినకూడదా?"
    ఆర్ద్రస్వరంతో అన్నాడు రావు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra