Home » Dr c. ananda ramam » Neeru Pallamerugu


    "ఏం చెయ్యను? నేను మాత్రం కుసుమని తలుచుకోని క్షణం ఉందనుకొన్నావా? ఆ ఉద్యోగంలో నువ్వేగా ప్రవేశపెట్టావు? ఏం తెలియనివాడిలా అడుగుతున్నావే? ఇంతకూ డాక్టర్లు ఏమంటున్నారు? ఇదివరకటికంటే ఇంప్రూవ్ మెంట్ కనిపిస్తోంది కదూ! కాస్త కాస్త వినగలుగుతోంది కదూ!"
    ఆరాటంగా అడిగింది చంద్ర.
    "చెవుడూ, మూగ ఎలాగైనా పోవచ్చునేమో, కాని...." ఆగిపోయి నిట్టూర్చాడు సూర్యం, చంద్ర, సూర్యం ముఖంలోకి ఒకసారి చూసి ఇంకేమీ ప్రశ్నించకుండా చెమ్మగిల్లిన కళ్ళతో కుసుమను మరింత దగ్గరగా లాక్కుని హృదయానికి హత్తుకొంది."మనోమాలిన్యం, బ్రోతల్ హౌస్ లో చంద్ర, వి.డి. కేసు." చంద్రనూ కుసుమనూ చూస్తోన్న తులసి మనసులో ఆలోచనలు ఈగల్లా ముసురుకుంటున్నాయి.
    కృష్ణారావు తులసిని చూసి, "తులసిగారు కూడా వచ్చారే! అయితే మీకు అంతా తెలుసా?" అన్నాడు బోళాగా. "కృష్ణా!....." అన్నాడు మందలింపుగా సూర్యం. కృష్ణారావు బుద్ధిగా చటుక్కున నోరు మూసుకున్నాడు. చంద్ర తులసిని చూసి పలకరింపుగా నవ్వి "మీ చెయ్యి ఎలా ఉంది? స్పెషలిస్ట్ కెవరికయినా చూపించుకున్నారా?" అంది.
    తులసి సమాధానం చెప్పలేదు. ముభావంగా ముఖం చిట్లించుకొంది. చంద్ర కృష్ణారావునీ, సూర్యాన్నీ మార్చి మార్చి చూసింది. కృష్ణారావు ఒక చవట నవ్వు నవ్వాడు. సూర్యం ముఖం తిప్పుకున్నాడు.
    చంద్ర కుసుమ చెయ్యి పట్టుకొని, "కుసుమా! దా తల్లీ! మనం వీళ్ళమధ్య ఉండొద్దు. మనిద్దరం అలా అలా అలా వెళ్ళిపోదాం! నాకు నువ్వూ, నీకు నేనూ, మనకింకెవరూ వద్దు" అని కుసుమ చెయ్యి పట్టుకొని బయటకు తీసుకుపోయింది.
    సూర్యం కావాలని భయం నటిస్తూ, చంద్రా! నీకు పుణ్యం ఉంటుంది. కుసుమను తీసుకొని పారిపోకు. అది లేకపోతే నేను బ్రతకలేను" అన్నాడు.
    చంద్ర ఆగిపోయి నిరసనగా, "పో! అన్నీ అబద్ధాలు!" అంది ఈసడింపుగా.
    "నిజం చంద్రా! దానికోసం నేను చెయ్యగలిగినదంతా చేస్తూ, నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకొంటున్నానే కొద్దిపాటి సంతృప్తితోనే బ్రతకగలుగుతున్నాను."
    "నిజమే. అయితే, నువ్వూ నాతో వచ్చెయ్యి."
    "నేను నీతో రాను. కుసుమనూ నీతో పంపను. కుసుమ నాతోనే ఉంటుంది. నేనే ఎంతో బాగా పెంచుతాను."
    అతి శ్రద్ధగా ఈ సంభాషణ అంతా వింటున్న తులసికి మెదడు మొద్దుబారిపోయింది. "ఇంక చాలు! నోరు మూసుకోండి. ఎవరూ మాట్లాడకండి" అని అరవాలనిపించింది.
    పెదిమలు పళ్ళమధ్య బిగబట్టి కూచుంది. తులసిని చూసిన కృష్ణారావు, "తులసిగారు ఎలాగో అయిపోతున్నారు. ఆవిడ ఈ మధ్య స్థిమితంగా లేరు" అన్నాడు. సూర్యం కూడా తులసిని చూసి, "ఇంక నువ్వు వెళ్ళిపో తులసి. పాపం! చాలా శ్రమపడ్డావు. థాంక్యూ ఫర్ ది విజిట్" అన్నాడు.
    "మాతో రండి_మిమ్మల్ని మీ ఇంటిదగ్గర దింపేస్తాను" అన్నాడు కృష్ణారావు.
    "థాంక్యూ! మీరు వెళ్ళండి. నేను బస్ లో వస్తానులెండి" అంది.
    కృష్ణారావు ఏదో అనబోతుండగా చంద్ర అడ్డుకొని, "ఎంత పిచ్చివాడివి కృష్ణా! తులసి నేనుండగా నీతో ఎందుకొస్తుందీ? ఒక్కడివీ అయితే వస్తుందిగాని" అంది దీర్ఘాలు తీస్తూ.
    కృష్ణారావు తను హోటల్ కీ, సినిమాకీ తీసికెళ్ళినట్టు చంద్రకి చెప్పేశాడా? అది ఆధారంగా చంద్ర తననిప్పుడు అవమానిస్తోందా? అవమానంతో, రోషంతో తులసి శరీరంలోంచి ఆవిరులు రాసాగాయి.
    "ఊరుకో చంద్రా!" అన్నాడు ఇబ్బందిగా.
    "ఊరుకోమంటున్నావా? నువ్వొక భోళా శంకరయ్యవి. దానికి తోడు నీ కారూ, గీరూ, వ్యవహారం అంతా పెద్ద కోటీశ్వరుడిలా ఉంటావు. ఏ కులమింటి పతివ్రతామ తల్లి అయినా నిన్ను బుట్టలో వేసుకొంటే నా గతి ఏం కావాలి?" అంది చంద్ర వెటకారంగా.
    తులసి ముఖం పాలిపోయింది. తాను నిలబడ్డ భూమి కంపిస్తున్నట్లుగా అనిపించసాగింది.
    "చంద్రా!" అన్నాడు సూర్యం మందలింపుగా. గిరగిర కన్నీళ్ళు తిరుగుతుండగా చివ్వున తలెత్తి, "నేను చాలా అమానుషంగా ప్రవర్తిస్తున్నాను కదూ! ఎందుకో తెలుసా? నేను కూడా ఒక మనిషినే కనుక! మనుష్యులందరికీ అమానుషంగా ప్రవర్తించే హక్కు ఉంది." అంటూ చరచర నడిచి కారులో కూచుని, "ఏయ్ కృష్ణా! నన్ను వెంటనే తీసుకుపో. లేకపోతే మరొకడితో పోతాను. నిన్నే నమ్ముకు కూచోవటానికి నేను పతివ్రతల జాతిలో దాన్ని కాను" అని అరిచింది. కృష్ణ అదిరిపడి, "వచ్చేస్తున్నాను, నువ్వు అంతపనీ చెయ్యగలవు" అని పరుగెత్తికెళ్ళి కారు స్టార్టు చేశాడు. తననే చూస్తున్న కుసుమను చూసి చెయ్యి ఊపి, "మళ్ళీ వస్తాను తల్లీ! హాయిగా ఆడుకో! సుఖంగా ఉండు" అంది చంద్ర. కారు సాగిపోయింది. అటే చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్న కుసుమని దగ్గరగా తీసుకుని కళ్ళు తుడిచాడు సూర్యం.
    "ఇంక నేను వెళతాను" అని బయలుదేరింది తులసి. సరే అన్నట్లు తల ఊపాడు సూర్యం. తులసి పర్స్ లో బస్ ఛార్జీలకు కూడా డబ్బులులేవు. సూర్యాన్ని అడిగి తీసుకోవచ్చుననే ధైర్యంతో వచ్చింది. ఆ పరిస్థితుల్లో సూర్యాన్ని అడగటానికి మనసొప్పక మొండి ధైర్యంతో ముందుకు కదిలింది. కళ్ళు తిరుగుతున్నట్లుగా అయి కళ్ళముందు చీకట్లు కమ్మసాగాయి. ముందుకు నడుస్తున్న తులసిని కుసుమ పరుగెత్తుకుంటూ వచ్చి గట్టిగా చెయ్యి పట్టుకుని ఆపు చేసింది. తులసి చీదరించుకుంటూ ఆ చేతిని విదిలించుకుంది. కుసుమ చటుక్కున దూరంగా జరిగి చేత్తో ముందున్న గొయ్యిని చూపించింది. అప్పుడు జరిగినదేమిటో అర్థమయింది తులసికి. చూచుకోకుండా నడుస్తూ ముందున్న గోతిలో తను పడబోతుంటే ఆ ప్రదేశంలో బాగా పరిచయమున్న కుసుమ పరుగెత్తుకొచ్చి చెయ్యి పట్టుకుని ఆపుచేసింది. లేకపోతే ఆ గోతిలో పడి రెండు కళ్ళు విరగ్గొట్టుకునేది. కుసుమ వైపు చూసింది. బెదురుగా ముందున్న గోతిని మళ్ళీ చేత్తో చూపించింది. కుసుమ మనుష్యుల విదిలింపులకు అలవాటుపడిపోయిన దానిలా తులసి విదిలింపును సహనంతో స్వీకరించి, బెదురుతోనే ఏదో పెద్ద అపరాధం చేసిన దానిలా బెదిరిపోతూ, ఆ అపరాధానికి సంజాయిషీలా ఎదురుగా ఉన్న గోతిని చూపిస్తోంది బేలగా. ఆ చూపులను ఎదుర్కోలేకపోయింది తులసి. గిరుక్కున తల తిప్పుకుని ముందుకు నడిచింది. బస్ స్టాప్ కు చేరుకున్నాక కూడా కుసుమ చూపులు తులసి హృదయాన్ని చీలుస్తూ వెంటాడుతూనే ఉన్నాయి. బేలగా, నిస్సహాయంగా చూపుడు వేలితో ముందున్న గోతిని చూపిస్తోన్న ఆ పిల్లను ఒక్కసారి అభిమానంగా అనునయించాలని ఎంతగానో ఆరాటపడింది మనసు. కానీ, నిలబడ్డ చోటినుంచి ఒక్క అడుగైనా వెనక్కు వేయలేకపోయింది. బస్ వచ్చింది. మొండి ధైర్యంతో టికెట్ కొనకుండా బస్ లో కూచుంది. తులసి అదృష్టం బాగుండి రష్ కొంచెం ఎక్కువగానే ఉంది. కండక్టర్ తులసి దగ్గరకువచ్చి టికెట్ అనగానే, బింకంగా చేత్తో వెనకవైపు చూపించింది. తులసి వేషభాషల్ని చూసి టికెట్ కండక్టర్ సందేహించకుండా ముందుకు సాగిపోయాడు. తులసి మనసులోని సర్వ చైతన్యమూ తులసి కెదురుతిరిగి, "ఛీ! ఛీ!" అని ఛీత్కారాలు చేసింది.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra