Home » Yerramsetti sai » 8 down

    హీరోకి పెళ్ళి రోజుకి ముందురోజు వాష్ బేసిన్ లో రక్తం కక్కుకుంటూంటే తెలుస్తుంది తనకుకాన్సరని! వెంటనే పెళ్ళి పీటలమీద అద్భుతమయిన డ్రామా! తాళికట్టే ముందు ఎవరో ఓ యువతి వస్తుంది.    
    "అన్యాయం! నన్నుపెళ్ళి చేసుకుని ఇప్పుడు ఇంకో పెళ్ళి చేసుకుంటున్నారా? ఇప్పుడు నా గతేమిటి? నాకడుపులో వున్నబిడ్డ గతేమిటి?" అని అరుస్తుంది. హీరోయిన్ హీరోని తిట్టివెళ్ళగొడుతుంది.    
    ఆ పక్కనే నిలబడ్డరంగరాజన్ అనేవాడిదగ్గరకు నడిచి "నువ్వే నా మెడలో తాళికట్టు!" అంటుంది. రంగరాజన్ ఆనందంగా కట్టేస్తాడు. ఇద్దరూ కాశ్మీర్ వెళ్ళి హనీమూన్ లో టెర్రరిస్టులతో పోట్లాడి, మంచిమాటల ద్వారా వారందరిమనసులూ మార్చేసి వాళ్ళు పశ్చాత్తాపంతో దహించుకుపోయేలాచేసి భారత ప్రభుత్వం అవార్డులను గ్రహించి ఇంటికి వచ్చేసరికి పని మనిషి భోరున ఏడుస్తుంది. "ఎందుకేడుస్తున్నావ్! నిజం చెప్పు! నేనులేనప్పుడు కుంకుడుకాయలు కాజేశావ్ కదూ!"    
    "కాదమ్మా చెప్పటానికి నోరు రావటం లేదమ్మా! నేను డబ్బుకి గడ్డితిని దారుణమయిన ద్రోహం చేశానమ్మా!" అంటుంది.    
    "చెప్పకపోతే చెప్పుతీసుకుని పళ్ళు రాలగొడతా!" అంటుంది హీరోయిన్ స్పేర్ చెప్పుతీస్తూ.    
    "మరేం లేదమ్మా! ఆ రోజు ఆ హీరోగారు మీ మెళ్ళో తాళి కడుతున్నప్పుడు ఆయనకు అదివరకే పెళ్ళయిందనీ, తను ఆయన పెళ్ళాన్ననీవచ్చిన సావిత్రి మరెవరోకాదమ్మా! మా చెల్లెలు! అది చెప్పిందంతా అబద్దం! డబ్బుకోసం నాటకమాడి మీ పెళ్ళి చెడగొట్టింది" అంటుంది.    
    "ఓసీ రాక్షసిముండలారా! ఎంతపనిచేశారే! ఈ నాటకమాడమని మీకు డబ్బిచ్చిన ఆ దొంగవెధవ ఎవడు?" అంటూ రంగరాజన్ వేపు అనుమానంగా చూస్తుంది.    
    "ఆ నాటకం ఆడమని డబ్బిచ్చింది ఆ హీరోగారేనమ్మా!"    
    "ఆ!" అంటుంది హీరోయిన్ నిర్ఘాంతపోతూ.        
    "ఎందుకలా చేశాడు నా హీరో?" అంటుందామె.    
    "ఆయనకు కాన్సర్ ఉందమ్మా! మీకీ విషయం చెప్తే గుండెపగిలి ఎగిరిపోతాడని ఇంతనాటకం ఆడించారమ్మా ఆ దేవుడు....." అంటుందామె.    
    "అవును హీరోయినూ! ఆ హీరో నిజంగా దేవుడు" అంటాడు రంగరాజన్.    
    హీరోయిన్ భోరున ఏడుస్తూ తన తాళిబొట్టు తెంపి రంగరాజన్ మొఖాన్న కొట్టి రోడ్లమీద అడ్డదిడ్డంగా పరుగెత్తిదెబ్బలు తగిలించుకుని నిజామ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కి చేరుకుంటుంది.   
    "ఏడీ నా హీరో? చెప్పండి కాకర్ల సుబ్బారావు గారూ! ఎక్కడున్నారునా హీరో" అంటూ ఏడుస్తూ ఒకతనిని చొక్కాపట్టుకుని ఊగించి వేస్తుంది.    
    "కాకర్ల సుబ్బారావుగారు రిజైన్ చేశారమ్మా!"    
    "ఆ! అలాగా! ఇప్పుడు నా హీరోకెవరు దిక్కు? ట్రీట్ మెంట్ ఎవరు చేస్తారు?" ఏడుస్తూ అడుగుతుంది.    
    "చెన్నారెడ్డిగారమ్మా! ఆయన కూడా డాక్టరేగా?"        
    అంతే! ఆమె హిస్టిరియావచ్చినట్లు గిలగిల కొట్టుకుని ఎమర్జెన్సీ వార్డులోకి పరుగెడుతుంది. హీరో అప్పుడే ఇడ్లీ, కొబ్బరి చెట్నీ తిని దగ్గుతుంటాడు. "ఎంతపని చేశారండీ! నాకు ఇంతశిక్ష విధిస్తారా? నాటకం ఆడించి నన్ను మీకు దూరం చేసేస్తారా? మీరు లేకుండా నేను బ్రతకలేనండీ! అవసరమయితే నేనూ కేన్సర్ తెచ్చుకుంటానండీ!" అని హీరో మీదపడి ఏడ్చేస్తుంది.    
    "తప్పు హీరోయిన్! స్త్రీకి తాళి కట్టిన రంగరాజనే దైవం! వెళ్ళి అతనిని సేవించు" అంటాడు.     
    "అలాగా! మరీ విషయం నాకెవరూ చెప్పలేదే!" అంటూ ఇంటికి పరుగెత్తుకుని వెళ్తుంది. అప్పటికే ఆమె తెంపిమీద పారేసిన తాళి తాడుతో తన మెడకు ఉచ్చు బిగించుకుని చనిపోయి వుంటాడు రంగరాజన్. అతని శవంమీదపడి అరగంట ఏడ్చి మళ్ళీ హాస్పిటల్ కొస్తుంది.    
    "ఇక నాకు మీరే దిక్కండీ! రంగరాజన్ దైవసన్నిధి కెళ్ళిపోతున్నాడు" అంటుంది హీరోతో.
    "తప్పు రాధా! భారత స్త్రీకి ఒకేసారి పెళ్లవుతుంది!" అంటాడతను.    
    "అయితే నేను అమెరికా వెళ్ళి గ్రీన్ కార్డ్ తీసుకొస్తానండీ! అప్పుడు మనం మళ్ళీ పెళ్ళి చేసుకోవచ్చు" అంటుంది.    
    "అలాగే రాధా! వెళ్ళిరా!" అంటాడతను. ఆమె అమెరికా వెళ్ళి తిరుగుఫ్లైటులో గ్రీన్ కార్డుతో తిరిగి వచ్చి అతనిపాదాల మీద పడి, బొడ్లోదాచుకున్న తాళితీసి అతని చేతికిస్తుంది. అతను దానిని ఆమె మెడలో కడతాడు.    
    ఆమె అమాంతం కళ్ళుతేలేస్తుంది.    
    "అదేమిటి రాధా! ఎందుకలా ఏమిటో గా అయిపోయావ్?" అంటాడతను.    
    "ఏ దేశం స్త్రీ అయినా భర్తకంటే ముందే భగవంతుడిని చేరుకోవాలని కోరుకుంటుందండీ! అందుకే విమానంలో 'ఎల్టీటియీ' వాళ్ళిచ్చిన సైనెడ్ కాప్సూల్ ఒకటి వేసుకున్నాను" అంటూ కన్నుమూస్తుంది.    
    హీరో భోరున ఏడుస్తాడు.    
    "ఎంత పని చేశావ్ రాధా! నా కసలు కేన్సరే లేదని ఇవాళే డాక్టర్లు చెప్పారు"    
    అంటూ తనూ ప్రాణాలు వదిలేస్తాడు. ఇదే మీ అమ్మగారు తీసేసినిమాలో కథ! కదూ? "ఏకబిగిన చెప్పి అడిగాడు భవానీశంకర్.    
    జయసుధ చాలాసేపటి తర్వాత నవ్వునుంచికోలుకోగలిగింది.    
    "అదేమీ కాదండీ! నాకు నిజంగానే కేన్సర్ ఉందన్నవిషయం నాకు తెలుసు. అయితే ఆ విషయం నాకు తెలిసిపోయిందన్న విషయం మా నాన్నగారికి తెలీదు." భవానీశంకర్ ఉక్కిరిబిక్కిరయ్యాడు.    
    "ఎలా తెలిసింది మీకు?"    
    "ఓ రోజు అర్దరాత్రి ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపించి మెలుకువ వచ్చింది. పక్క గదిలోనుంచి అమ్మ ఏడుస్తున్నట్లు తెలిసింది. లేచిశబ్దం కాకుండా ఆ గది దగ్గరకెళ్ళి నిలబడ్డాను.    
    అమ్మ ఏడుస్తోంటేనాన్న ఓదారుస్తున్నారు.    
    వాళ్ళ మాటల్లో అన్ని విషయాలూ తెలిశాయ్. నాకు వచ్చిన పెళ్ళి సంబంధాలు ఎందుకుపోతున్నాయో కూడానాకు అప్పుడే అర్ధమయింది. నా జీవితానికి ఫుల్ స్టాప్ పడబోతోందని తెలిసింది. అయినా నేను భయపడటంలేదు. ఇందాక చెప్పాను చూశారా? ఎవరికెంత ప్రాప్తమో అంతవరకే అందుకోవాలి! ప్రాప్తం కాని దాన్ని గురించి కలలు కనకూడదు, దుఃఖించకూడదు."    
    సరిగ్గా అప్పుడే 8 డౌన్ అమితమయిన వేగంతో విజయవాడ స్టేషన్ లోకి జొరబడింది.    
                                                                  * * *    
    రాత్రి రెండు గంటలకు జరిగినదంతా ఇంకా కలలాగానే అనిపిస్తోంది అమానుల్లాఖాన్ కి.    
    ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడతను. ఎదురుగ్గా రామచంద్రన్ మొఖం కనిపించిందతనికి.    
    "అమానుల్లాఖాన్ సాబ్! రండి! టైము రెండయింది!" అన్నాడతను రహస్యంగా.    
    అమానుల్లా ఖాన్ ఎ.సి. టూ టయర్ అప్పర్ బెర్తుమీద నుంచి కింద బెర్తుమీదకు తొంగి చూశాడు. తన భార్య రెహానా, కూతురు, కొడుకూ మిగతా మూడు బెర్తులమీదా గాఢనిద్రలో ఉన్నారు. నెమ్మదిగా, శబ్దంకాకుండా బెర్తుమీద నుంచి కిందకు దిగాడతను.    
    కోచ్ లో అందరూ గాఢంగా నిద్రపోతున్నారు.    
    భార్య రెహానావేపు మరోసారి చూశాడతను. అంతకుముందు ఎంతో అందంగా కనిపించే రెహానారూపం ఇప్పుడు చాలా చిరాకు కలిగిస్తోందతనికి. అందుక్కారణం ఏమిటో కూడా అతనికి తెలుసు. దూరదర్శన్ డైరెక్టర్ అయ్యాక టి.వి. సీరియల్ నిర్మాతలు కొంతమంది తనకు ఇంచుమించుగా ప్రతిరోజూ ఎరేంజ్ చేసే అమ్మాయిలు.    
    రోజుకో అందమయిన అమ్మాయి నగరంలోని ఓ అందమయిన ఫ్లాట్ లో తనకోసం ఏర్పాటు చేయబడుతోంటే ఇంకా భార్య ఎందుకు అందంగా వుంటుంది?    
    రామచంద్రన్ తో పాటు ఎ.సి. కోచ్ దాటి ఫస్ట్ క్లాస్ కోచ్ లోకి నడుస్తున్నాడతను.    
    ఎటెండరు, టి.టి.యి.లు అంతా గాఢ నిద్రలో వున్నారు. ఒక ఫస్ట్ క్లాస్ కోచ్ లోని కుపే కంపార్టుమెంట్ దగ్గర ఆగి తలుపు మీద నెమ్మదిగా రెండుసార్లు తట్టాడు రామచంద్రన్ తలుపు నెమ్మదిగా తెరుచుకుంది.    
    లోపలనుంచి డిమ్ లైట్ కాంతిలో కసిగా నవ్వింది విజయ. ఇద్దరూ లోపలకు నడిచారు.    
    రామనాథన్ ఆమెతో తమిళంలో మాట్లాడాడు.    
    "నమస్తే!" అందామె.    
    "నమస్తే" అన్నాడు అమానుల్లా ఖాన్.    
    "ఉకరు" అందామె.    
    "నాకు తమిళం తెల్సిరాదు" అన్నాడతను దూరదర్శన్ ప్రత్యేక తెలుగుప్రసారం చేస్తూ.    
    ఆమెకు అతని భాష అర్ధంకాలేదు.    
    "తెలుంగు తెరీమా?" అడిగాడు రామచంద్రన్.    
    "ఇల్లె-"    
    "ఇంగ్లీష్ తెరీమా?"    
    "ఇల్లె-"            
    "హిందీ తెరిమా?"    
    "ఇల్లె-"    
    "ఉర్దూ తెరీమా?"    
    "ఇల్లె-"    
    రామచంద్రన్ తల కొట్టుకున్నాడు "దీన్ని మన నెక్ స్ట్ టి.వి. సీరియల్లో హీరోయిన్ సేస్తుందాసర్!

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra