సర్వత్రా చీకటి. చిన్నక్క ముఖం వివర్ణమయిందో మరి అధమస్థితికి దిగజారిందో తెలియదు.

    "నాయనా! ఇదేమిటి?" అని అంది కంపిత స్వరంతో.

    "చిన్నక్కా! నువ్వొచ్చావు, నాకదే చాలు" అని, ఆమె ఒడిలో అతను చల్లగా కళ్ళు మూసుకున్నాడు.

                                                10

    వారం రోజులు గడిచాయి. వద్దు, నాకొద్దు అని వారిస్తున్నా లక్ష్యం చేయకుండా చిన్నక్క తమ్ముడికి నద్రాహారాలు మాని సపర్యలు చేసింది. చివరకు జ్వరం తగ్గిపోయింది. కాలుకూడా మామూలుగా స్వాధీనంలోకి వచ్చింది.

    ఎనిమిదోరోజు ఉదయం అతను మంచంమీదనుంచి లేచి నెమ్మదిగా అటూఇటూ తిరుగుతున్నాడు. లోపలనుంచి కాఫీ తీసుకువస్తున్న ఆమె చూసి నవ్వి "ఇహ ఇవాల్టినుంచి తిరగటం ప్రారంభిస్తావా?" అనడిగింది.

    అతను విస్మితుడైనాడు. వచ్చాక ఆమె ముఖంలో నవ్వు చూడటం ఇదే ప్రధమం. కాఫీ త్రాగుతూ "నీకింకా అన్యాయం చెయ్యలేను. బావ సపర్యలతోనే చిక్కిశల్యమైనావు. నీ జీవితమంతా ఇలా గడపటం సంభవించినా దిగులు పడేటట్లు లేనట్లుంది. ఇవ్వాళనుంచి మంచంమీదనుండి లేవకుండా శుభ్రంగా తిని ఆరోగ్యం కాపాడుకోవాలి. చూడు, ఈ స్థితిలో నిన్ను చూడటానికి ఎలానో వుంది" అన్నాడు.

    ఆమె ఈ మాటల్ని వినిపించుకోక "ఆరోజు రాత్రి చాలా భయపడిపోయావనుకుంటాను? మేలుకునే వున్నావన్నమాట తెల్లవార్లూనూ" అంది.

    హఠాత్తుగా అతని ముఖంనిండా నీలిమేఘాలు ఆవరించాయి. ఎలానో గొంతు పెగుల్చుకుని 'అవును. నీవు రాకపోతే నేను ఏమయివుండేవాడ్నో?' అన్నాడు. కానీ ఆ మాటమీద అతనికి శ్రద్ధలేదు. అతని మనసు మరియొకటి ఆలోచిస్తోంది. ఆమె సంసారంలోకి ప్రవేశించాక ఇంతవరకూ ఇంత ఆకస్మికంగా పుట్టింటికి వచ్చిందిలేదు. అదీగాక రాత్రివేళ ఒంటరిగా బయల్దేరి వచ్చింది. వచ్చినప్పటినుంచీ వదనం వాడిపోయింది. కానీ ఏమయినా సరే ఈ విషయం ఆమెముందు ఎత్తకూడదనుకున్నాడు. ఆమె గంభీరహృదయి. అందులో లోతులు కనుక్కోదలచి ఇప్పుడు పూర్తిగా పరాజితుడైనాడు. అసమాన ప్రజ్ఞావంతురాలు. ఈ ప్రజ్ఞముందు తనుగానీ, బావగానీ కరిగి ముద్దయిపోవలసిందే. ఆమెను శాసించే హక్కు ఎవరికి వుంది? కానీ ఈ ఆలోచనకూడా అతనికి ఊరట కలిగించలేదు. ఎంతయినా ఆమె అబలకదా అన్న సంశయం అనుకోకుండా వచ్చి పీడిస్తోంది.

    మరికొన్ని రోజులు గడిచాయి. అతను ఎంత మొత్తుకున్నా ఆమె ఇంటి పనిపాటల్లో జోక్యం కలిగించుకోకుండా వుండటంలేదు. ఆ పనిపాటలు లేకపోతే మసలలేనన్నట్లుగా వున్న ఆమె ప్రవర్తన అతన్ని దిగ్భ్రాంతిపరుస్తోంది. అతనుకూడా ఎక్కడకూ కదలకుండా ఇంట్లో కూర్చునేవాడు. ఆమెతో ఆ కబురూ ఈ కబురూ చెబుతూ వుండేవాడు. చెబుతూ ఏదయినా భావచిహ్నాలు దొరకకపోతవా అని చాటుగా పరిశీలించేవాడు. ఈ జీవితం చాలా నూతనంగా ఉంది. చిన్నక్క చిన్నప్పటినుంచీ తిరిగి జీవిస్తున్నట్లుగా వుంది. ఒక్కోసారి ఏకాంతంగా కూర్చునేది. అప్పుడు తమ్ముడైనా సరే దరిజేరినా గమనించని ఏకాగ్రతలో చరించేది. రవి కుమిలాడు. పొంచి పొంచి పసిగట్టేవాడు. గంటల తరబడి ఆమె అచలనంగా కూర్చుండిపోవటం చూసి "ఈ రహస్యం ఛేదించగలనా? ఈమె భగ్నహృదయురాలు కాలేదు కదా?" అని అలమటించేవాడు. కానీ ఈసారి ఆమె ఏనాడూ ఒక కన్నీటిబొట్టుకూడా విడువలేదు. ఇది దేనికి సూచన? కన్నీళ్ళు కారిస్తే అది దుర్భలమైన సంక్షోభానికి చిహ్నం. ఇదిగో- తను పూర్తిగా అసమర్ధుడు ఇందు నిజాలు కనుక్కోవటానికి.

    ఒకొక్కప్పుడు ఎందుకో తన దగ్గరకువచ్చి "రవీ! పిలిచావా?" అని అడిగేది ఆదరంగా.

    తను వాస్తవానికి పిలవలేదు. అయినా క్లిశితమైన మానసాన్ని కుదురబరచుకుని "అవును! ఇవేళ తీపి ఏం చేయటానికి సంకల్పించావు? మైసూర్ పాక్ నాకు ఇష్టం. అది చేయించవా?" అనేవాడు.

    "అయ్యో! చేయించటమేం ఖర్మ నాయనా! నా చేతులతో స్వయంగా చేసి పెడతాను."

    తర్వాత చాలాసేపటికి లోపలినుంచి "రవీ! రా నాయనా!" అని పిలుపు వచ్చింది.

    "ఇవేళ బంగాళాదుంపలు వండారే?" అనేవాడు భోజనాలముందు కూర్చుని.

    "అవును. అవంటే నీకెంతో అప్యాయంకదూ?"   

    చప్పున అతని నేత్రాలు చెమ్మగిల్లేవి. చిన్నతనాన! ఆ రోజులు వేరు, గడిచిపోయినవెప్పుడూ మధురమైనవే. కష్టాలుకూడిన అనుభవమైనా సరే. కొన్నాళ్ళు గడిచిపోయాక ఇతరులకు వర్ణించేటప్పుడు అందులో ఏదో ఆనందం వెలసినట్లు అనుభూతి కలుగుతుంది. ఇలా చూసుకుంటే జీవితం ఎప్పుడూ ఆనందమయమే. పాత్రలు ఎప్పుడూ తరచబడకూడదు. పైపై అందాలు పొరలించుకుని, చిరకాలంనుంచి అనుశ్రితంగా వస్తున్న ఆ కవచాన్ని దానికి సమన్వయం చేసుకుంటే ఈ దేహం ఓ ఆనందనిలయం. ఓటమి తటస్థిస్తే యమకూపం.

    ఇప్పుడు స్వేచ్ఛ, అధికారాలు చెలాయించేందుకు ఎవరూ రారు. రారన్న విశ్వాసం ప్రబలుతోంది. ఇది నూతనం, అధునాతనం. తనూ, చిన్నక్కా... ఈ రెండు పసిహృదయాలు కావలసినంతసేపు ఆడుకుని, అలసిపోయాక నిశ్చింతగా నిద్రపోతాయి. ఎవరూ "అయ్యో!" అని ఓ కన్నీటికణం రాల్చకపోయినా దిగుల్లేదు. ఆమెకోసం తను త్యాగానికి దిగబడ్డాడు. ఆ త్యాగం వ్యర్ధమైంది. తనకోసం ఆమె ఇప్పుడు అవతరించింది. అనుక్షణం ఒక హాయి, ఏవో బంధాలు అప్పుడప్పుడూ వికటాట్టహాసం చేస్తూ మీదికి ఉరుకుతున్న దృశ్యం కళ్ళముందు మెదిలేది. భయావహుడై గట్టిగా కళ్ళు మూసుకునేవాడు.  

    కొంతసేపు గడిచాక కళ్ళు తెరిచాక ఏమీ వుండేది కాదు. అంతా నిర్మలత్వం. కానీ ఏకాంతంలో వున్నప్పుడు ఆమెను పలకరించడానికి అతను ఎప్పుడూ జంకకుండా వుండలేదు.

    ఒకరోజు మధ్యాహ్నం రవి నిద్రనుంచి లేచి కూర్చున్నాడు. కళ్ళు నులుముకుని చూశాక ఎదురుగా కుర్చీలో చిన్నక్క కూర్చునివుంది. తనవంక చూడటంలేదు. తనవంక చూడటంలేదు.

    "చిన్నక్కా!" అని పిలిచాడు.

    ఆమె ఉలికిపడి "రవీ!" అంది.

    ఇవేళ చిన్నక్కరూపం విస్మయపాటుని కలిగిస్తోంది. ఒకప్పుడు అతి సుందరమైన విప్పారిత ఆమె ముఖబింబం ఈ మధ్య అనేక కారణాలచేత సడలి వుండటంచేత జీర్ణరేఖలు, శీర్ణరేఖలు మాత్రమే ప్రస్ఫుటమై ప్రతిబింబించేవి. ఈనాడు కొంత విరుద్ధంగా జరుగుతోంది. అమానుషాలనేవేవో అతిక్రమించి వచ్చిన దృఢత్వం ఆమెలో విశ్వసనీయంగా కానవచ్చింది. అదీగాక ఏదో కాంతి నేత్రాంచలాలలో పొటమరించింది. చిన్నక్క సుదీర్ఘంగా అతన్ని చూసి అంది "నిన్ను ఇప్పుడు ఓ విషయం అడుగుదామని వచ్చాను."

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra