Home » Suryadevara rammohan rao » జనవరి 5

   

       కనుక.....మీరు తయారుచేసే రడీమేడ్ బట్టలు చండాలంగా, దరిద్రంగా, రఫ్ గా, మొరటుగా ఉండాలి. ఎంత అస్తవ్యస్తంగా ఉంటే అంత మంచిది. బట్ వాటి ఫినిషింగ్, ప్యాకింగ్, పబ్లిసిటీ మాత్రం బాగా ఉండాలి.
   
    మీరు తయారుచేసే ఫ్యాంట్స్ కి, షర్ట్స్ కి భయంకరమైన పేర్లు పెట్టాలి. బఫెలో బ్రాండ్ జీన్ ఫాంట్ ఎంత పాపులర్ అయిందో మీకు తెలిసే వుంటుంది" అన్నాడు విమల్ చెప్పటం ముగిస్తూ.
   
    మేఖల విమల్ కేసి విస్తుపోయి చూసింది.
   
    ఆమె ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ "థాంక్యూ ఫర్ యువర్ ఎడ్వయిజ్. నేను నా కంపెనీకి పెట్టిన పేరు ఎలిఫెంట్....బాగుందా...." అంది.
   
    "బాగుపడే లక్షణాలున్నాయి" అన్నాడు విమల్.
   
    ఇతనసలు ఒక్కసారన్నా నవ్వగా, ఎవరైనా ఈ లోకంలో చూసుంటారా? అనుకుంటూ తన వేనిటీ బ్యాగ్ లోంచి ఒక వందనోటు తీసి "అడ్వాన్స్....మరియు మీకు బోణి" అంటూ అందించింది.
   
    "థాంక్యూ" అన్నాడతను.
   
    ఆమె వెళ్ళిపోయింది.
   
                                       *    *    *    *    *
   
    కేంద్ర ఆర్ధికమంత్రి పర్సనల్ ఛాంబర్....న్యూఢిల్లీ....అక్బర్ రోడ్....
   
    సమయం రాత్రి ఎనిమిది గంటలు.
   
    మంత్రి పేరు ఆర్యభట్టు...
   
    ఆయనకు దాదాపు అరవై ఐదు సంవత్సరాలుంటాయి.
   
    గతంలో ఆయన బెనారస్ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్ ప్రొఫెసర్ గా చేసి రిటైరయ్యాడు.
   
    రాజకీయ పునరావాస ప్రాతిపదికపై కాక, కేవలం ఆయనకున్న అపార అనుభవం ఆధారంగా కేంద్రమంత్రి మండలిలోకి ఆర్ధికమంత్రిగా తీసుకోబడ్డాడు. ఆయన రాజ్యసభ సభ్యుడు.
   
    ఆర్ధిక శాస్త్రంలో అతను చేసిన అపారకృషిని, వెలువరించిన వ్యాసాల్ని, బుక్స్ ని ఆధారం చేసుకుని నోబుల్ కమిటీ వారు నోబుల్ బహుమతి ఇవ్వటం జరిగింది.
   
    అతనే నియోజక వర్గపు మనిషి కాదు.
   
    విశ్వమానవ శ్రేయస్సుకోరే మానవతావాది, అభ్యుదయ వాది.
   
    ఆయన ఆలోచనా విధానాలు అంత సులభంగా ఎవరికీ అర్ధంకావు. ఆయన అసలే అర్ధంకాడు. గొప్ప మేధావి. ఆయన ఆలోచనలెప్పుడూ దేశ పేదరికంపైనే పరిభ్రమిస్తుంటాయి. దాన్ని రూపు మాపే పథకాల గురించే ఆయన నిరంతరం శ్రమిస్తుంటారు.
   
    తన చేతిలో అధికారమున్నది, తనను కేంద్రం మంత్రి మండలిలోకి తీసుకున్న నాయకుడ్ని పొగిడేందుకు కాదని, తన ఆస్తుల్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచుకునేందుకు కాదని, అధికారంలో వుండగానే తన బిడ్డల పెళ్ళిళ్ళు చేసి కోట్లాది రూపాయల బహుమతుల్ని రాబట్టుకోవటం కోసం కాదని, ఆయన దృఢవిశ్వాసం తన శాఖ పనుల్ని గాలికొదిలేసి తమ పార్టీ అధికారంలో లేని రాష్ట్రాలకు వెళ్ళి అవాకులు, చెవాకులు పెలతానికి కూడా కాదని ఆయన విశ్వాసం. పార్టీలు, పదవులు శాశ్వతం కాదు, ప్రజలకు చేసే మేలే శాశ్వతమని భావించే గొప్ప మనిషి.
   
    ఆయన ఇప్పుడు తన అఫిషియల్ రెసిడెన్స్ లోవున్నా తన ఛాంబర్ లో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు.
   
    అంతలో ఆయన పెద్దకొడుకు అక్కడకు వచ్చాడు.
   
    అయినా ఆయన ఏకాగ్రత చెదిరిపోలేదు.
   
    "నాన్నగారు...." ఆ యువకుడు తండ్రి నుద్దేశించి పిలిచాడు.
   
    ఆ యువకుడి చేతిలో ఓ ఫైల్ వుంది. ఆ ఫైల్ ని సర్దుకుంటూ తిరిగి పిలిచాడు.
   
    ఆయన కుర్చీ క్షణకాలం కదిలింది.
   
    "నేను నా వ్యాపారంలో బాగా దెబ్బ తిన్నాను. నా వాటాకి బురద గుంటలతో నిండివున్న అడవిలాంటి వెయ్యెకరాల భూమి వచ్చింది. దాన్ని ఏం చేయాలో..... ఎలా బాగు చేసుకోవాలో అర్ధం కావడంలేదు. అందుకని" ఆ యువకుడు నసిగాడు.
   
    ఆయనకు విషయం అర్ధమయిపోయింది.
   
    "దీన్ని ఏదో విధంగా కేష్ చేసుకోలేకపోతే నేను అప్పుల పాలవుతాను.... అందుకని."
   
    "వూ అందుకని?"
   
    "అక్కడో ఫ్యాక్టరీ పెట్టాలని.....అక్కడ పెడితే లాభదాయకమని మీరు ఓ మాటంటే, దాన్ని ప్రభుత్వం, ఖరీదు చేస్తుంది. ఎకరం పదివేలకు అమ్ముకోగలిగినా నా సమస్య తీరిపోతుంది" అర్ధిస్తున్నట్లుగా అన్నాడా యువకుడు.
   
    మంత్రి ఆర్యభట్టు నిర్ణయం కోసం ఆయన భార్య, కోడలు ఛాంబర్ కర్టెన్ చాటునుంచి ఆతృతగా ఎదురు చూస్తున్నారని ఆయనకు తెలీదు.
   
    "ఈ దేశంలో చాలామంది యువకులు దారి తెరువులేక అలలదిపోతున్నారు. కొందరు ఏవేవో వ్యాపారాలు పెట్టుకొని మల్టీ నేషనల్ కంపెనీల పోటీకి తట్టుకోలేక నష్టపోయి రోడ్లెక్కేసారు. వాళ్ళెవరూ ఇలా నా దగ్గరకు వచ్చి అడగలేదే? నువ్వే వచ్చి ఎలా అడగగలుగుతున్నావు? వాళ్ళకులేని, నీకున్న అర్హత లేమిటి....?' ఆయన కంఠం గంభీరంగా వుంది.
   
    తండ్రి ఎలాంటి వాడన్నది ఆ యువకుడికి సూచాయగా తెలిసినా, మరీ అంత సూటి ప్రశ్న వేస్తాడని ఊహించలేదు.
   
    అందుకే ఓ క్షణం ఆ యువకుడు కలవర పడ్డాడు. తిరిగి అంతలోనే తేరుకున్నాడు.
   
    "నేను మీ కన్నకొడుకుని కనుక అడిగాను. కొడుకు గురించి ఏ తండ్రయినా పట్టించుకోవాలి గనుక అడిగాను తప్పంటారా....?" ఆ యువకుడు ధైర్యాన్ని కూడగట్టుకుంటూ అడిగాడు.
   
    ఆయన తన ఈజీ చైర్లోంచి లేచాడు.
   
    నెమ్మదిగా పచార్లు చేస్తూ ఒకింత సేపు మౌనంగా వుండిపోయాడు.
   
    "సమాధానం చెప్పండి నాన్నగారు...." ఆ యువకుడు తండ్రి మౌనంగా వుండటం చూసి మరింత చొరవ తీసుకుంటూ అడిగాడు.
   
    "నాకు మంత్రిపదవిని ప్రైమ్ మినిస్టర్ ఎందుకిచ్చారు? నీకు తండ్రిననా? నాకు తెలివితేటలున్నాయనా? ణ కొడుక్కి కష్టాలొస్తే ఆదుకోమనా? దేశ ప్రజల కష్టాల్ని గట్టెక్కించమనా? ఆహా...... నాకు తెలీక అడుగుతున్నాను. నాకు ఆర్ధికశాస్త్రపు ధర్మ సూక్ష్మాలు తెలుసుగాని.....రక్త సంబంధపు లక్షనాలు తెలీవు. అందుకే అడుగుతున్నాను" అన్నాడాయన నెమ్మదిగా.
   
    "నాది చాలా చిన్న సమస్య. నా సమస్య తీరిపోవటానికి మీ నుంచి ఒక్క మాట చాలు."
   
    "ఒక్క మాటెలా చాలుతుంది."
   
    "మీరు కేంద్రంలో కేబినెట్ ర్యాంక్ మంత్రి గనుక మీ మాటకు అపారమైన పలుకుబడి వుంటుంది కనుక."
   
    "శెభాష్.....నేను పెద్దవాడ్నని, అంతకంటే పెద్ద పదవిలో వున్నానని, నా మాట రాజశాసనమని ఒప్పుకున్నావు. మరలాంటప్పుడు నీకొచ్చిన అతి చిన్న సమస్య గురించి పట్టించుకోవచ్చా? పెద్ద పదవిలో వున్న నేను పెద్ద పెద్ద సమస్యలనే గదా పరిష్కరించాలి? నీకొచ్చిన సమస్య చాలా చిన్నదని నువ్వే చెబుతున్నావు? అలాంటి చిన్న సమస్యను నన్ను పరిష్కరించమంటున్నావంటే అది నన్ను అవమానించటంగానే భావించవచ్చుగా? నా పదవిని కించపరచటంగానే గదా నేను అనుకోవాల్సింది?" ఆర్యభట్టు మాటలకు ఆ యువకుడు షాక్ తిన్నాడు.
   
    ఆ పైన తన తప్పు తెలుసుకున్నాడు.
   
    "నాకు పెద్ద సమస్యే....మీకు చిన్నదవుతుంది" అన్నాడా యువకుడు తడబడుతూ.
   
    "అంటే వ్యక్తుల సమస్యలు ఆయా వ్యక్తులకు పెద్దవే కావచ్చు కానీ దేహానికి, వ్యవస్థకి చిన్నవే గదా....? నేనింకా పెద్ద సమస్యల్నే ఆకళింపు చేసుకోలేక పోతున్నాను. అలాంటప్పుడు నా స్థాయిని మరచి చిన్న సమస్యల్ని పట్టించుకోవచ్చా? కేవలం నిన్ను కన్నానని, నీకు తండ్రినవుతానని ఇంత అన్ డ్యూ ఎడ్వాంటేజ్, తీసుకోవటం తప్పుకదా?" ఆయన మాటలు చాలా సూటిగా ఉన్నాయి.
   
    "ఇండియాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో మంత్రులుగా పనిచేస్తున్న ఏ వ్యక్తి అయినా తన కన్నబిడ్డతో ఇలా మాట్లాడటం జరుగుతుందా?" మంత్రి ఆర్యభట్టు భార్య తన ప్రక్కనే వున్న కోడల్ని అడిగింది తన భర్త ప్రవర్తనకు విస్తుపోయి.
   
    "ఒక్క శాతమైనా ఉంటారా అంటే అనుమానమే నాకు. తాము మంత్రులు కావడమే కాక తమ కొడుకులకు కూడా పదవులు అంటగట్టి ప్రజా ప్రతినిధుల్ని చేసి పదవుల్లోకి తెచ్చేందుకు ఎక్కువ కాలాన్ని కేటాయిస్తారు. తమ కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనుమలు, మనుమరాళ్ళ, పనులకే ప్రాధాన్యత ఇస్తారు, ఇస్తున్నారు, ఇస్తుంటారు. విదేశాల్లో రాజకీయ నాయకులు, రాజకీయ నాయకుల్లాగే బిహేవ్ చేస్తారు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra