Home » Yandamuri veerendranath » ధ్యేయం


    అవినాష్ ఒక్కక్షణం తండ్రి వెళ్ళిపోతున్న వైపే చూసి, ఆ తర్వాత  విమానాశ్రయంలోకి కదిలాడు.

                                                                   3

    డాక్టర్ ఏం చెప్తాడో అనే భయంతో గుండె వేగంగా కొట్టుకుంటూ వుంటే, బల్లమీద చేతులాన్చి కూర్చుంది నిఖిత.

    "పరిస్థితి ఆందోళనకరంగానే వుంది. మేమిచ్చే ఈ మందులతో రెండు మూడు రోజుల్లో నెమ్మదించవచ్చు కానీ, ఈ నొప్పి ఎప్పుడు విజృంభిస్తుందో చెప్పలేను".

    "దీనికి మరింకే ట్రీట్ మెంట్ లేదా డాక్టర్?"

    "మా దగ్గర లేదు. కానీ, ఈ మధ్య ఒక ప్రైవేట్ నర్శింగ్ హొమ్ వాళ్ళు  విదేశాల నుంచి కొత్త ఎక్విప్ మెంట్ తెప్పించారు. అది ఇవ్వగలిగితే కొన్నాళ్ళపాటు రిలీఫ్ కలగవచ్చు".

    నిఖిత ఆయన దగ్గర పూర్తి వివరాలు  తీసుకొని  బయటికొచ్చింది. అవినాష్ కనబడిన సంతోషం  ఇప్పుడామెకి లేదు.

    ఆమె మెట్లు దిగుతూ వుండగా "మొత్తానికి నా కొడుకుని పూర్తిగా లొంగదీసుకున్నావన్నమాట" అన్న మాటలు  వినిపించాయి. తలెత్తి చూస్తే శంకరం కనపడ్డాడు. అతడు విమానాశ్రయం  నుంచి సరాసరి నిఖిత దగ్గరికి వచ్చాడు. కోపంతో మనిషి ఊగిపోతున్నాడు. "........అసలు నువ్వు  ఆడదానివేనా? ఉదయం  నువ్వు చేసిన గొడవకి హాస్పిటల్ లో నాభార్య బి.పి. పెరిగి స్పృహలేని పరిస్థితిలో వుంది. ఇప్పుడు  వాడు అలా విమానం దగ్గరనుంచి పరిగెత్తుకొని నీ దగ్గరకు  వచ్చాడు. ఆ విషయం తెలిస్తే వాడి తల్లి గుండాగి చచ్చిపోతుంది. ఇలా మా అందరి  ప్రాణాలు తీసి నువ్వు  ఏం  సుఖపడతావే?" అన్నాడు ఆవేశంగా.

    'నువ్వు చేసిన పైశాచిక పనికి నా తల్లి ఏ స్థితిలో వుందో ఒక్కసారి ఆ గదిలోకి వెళ్ళి చూడు' అనలేదు నిఖిత. ఎదుటివారి ప్రవర్తన, వ్యక్తిత్వం, మనస్తత్వం తనకంటే ఉన్నతస్థితిలో వుంటే, వారినుంచి ఏమి నేర్చుకోవాలో తెలుసుకోవటానికి ప్రయత్నించాలి. అధమ స్థితిలో ఉంటే ఆ స్థితికి దిగజారకుండా చూసుకోవాలి అన్న సంస్కారం ఆమెలో చిన్నప్పటినుంచే వుంది. అందువల్ల అతడి స్థాయికి దిగి ఆమె  మాట్లాడలేదు. ఎమోషనల్ గా మాటలతో గాయపరచి, అవతలివాళ్ళని రెచ్చగొట్టే మనస్తత్వం కాదామెది.

    మొహం మీదకి చిరునవ్వు తెచ్చుకుంది. "మీ భార్య అంతటి ప్రమాదకరమైన స్థితిలో ఆస్పత్రిలో వుంటే మీరు ఈ ఆస్పత్రికి రావటం బాగాలేదు అంకుల్! వెళ్ళి ఆంటీ దగ్గరే వుండండి" అని వేగంగా అక్కణ్నుంచి వెళ్ళిపోయింది.

    ......ఆమె ఇంటికొచ్చేసరికి దశరధ్ ఆమె కోసమే ఎదురుచూస్తున్నాడు. కంగారుగా "ఏమ్మా, ఎలా వుంది". అనడిగాడు.

    "నొప్పి తగ్గింది నాన్నా. మందు బాగానే పనిచేసింది. మంచి నిద్రలో వుంది" పక్కనే వున్న కుర్చీలో కూర్చుంటూ అంది నిఖిత. అలసిపోయిన  కూతురి  మొహంవైపు సానుభూతిగా  చూశాడు దశరధ్. ఎంతో చలాకీగా ఆడుతూ పాడుతూ వుండవలసిన వయసులో ఇన్ని బాధ్యత లేమిటా అన్నట్టు అతని మనసు బాధపడింది అయితే నిఖిత  మొహంలో ఎప్పుడూ  వున్నట్టు  అదే ఆహ్లాదం తాండవిస్తూంది. ఏమాత్రం  టెన్షన్ లేనట్టు  చాలా మామూలుగా "మనం మన ఇంటిమీద మరో యాభైవేలు అప్పు తీసుకోవాలి నాన్నా" అంది. దశరధ్ కి మొదట అర్థంకాలేదు. ప్రశ్నార్థకంగా ఆమెవైపు చూశాడు.

    "ఒక ప్రైవేట్ నర్శింగ్ హొమ్ లో కొత్త ట్రీట్ మెంట్  వచ్చిందట. దానికి యాభైవేల  ఖర్చవుతుంది అన్నాడు డాక్టర్. నేనక్కడినుంచి వస్తున్నాను. మంచి  ఫలితం కూడా లభించవచ్చంటున్నాడు. నాన్నా......అమ్మా బాధ చూడలేకపోతున్నాం కదా! అక్కడ ప్రయత్నిస్తే  బావుంటుందనుకుంటున్నాను".

    "అలాగే" అన్నాడు దశరధ్. "రేపు మార్వాడి దగ్గరకెళ్దాం. ఇప్పటికి పాతికవేలేగా  తీసుకున్నది ఇంటీమీద మరో  యాభైవేలు దొరకడం కష్టం కాదులే".

    నిఖిత కొంచెం తటపటాయించి "అమ్మకి తెలియనివ్వద్దు. తెలిస్తే ఒప్పు కోదు" అంది.

    "అలాగే" అన్నాడు దశరధ్. దశరధ్ కౌసల్యలకి మరే రకమైన ఆస్తీ లేకపోయినా స్వంత ఇల్లంటూ వుండాలిని ఎంతో కష్టపడి పైసా పైసా కూడబెట్టుకొని కట్టుకున్నఇల్లది. మరిచిపోలేని ఎన్నో అనుభూతులు ఆ ఇంటితో తమ తల్లిదండ్రులకి ముడిపడి వున్నాయని నిఖితకి తెలుసు. కానీ అనవసరమైన సెంటి మెంట్ కన్నా అవసరానికి ఎక్కువ ప్రాముఖ్యత నివ్వటం కష్టాల్లో చాలా అవసరమని కూడా ఆమెకి తెలుసు.

    ఆమె తండ్రివైపు చూసింది. తండ్రి కిటికీలోంచి బయటికి చూస్తున్నాడు. అతడి మొహం పాలిపోయి వుంది. ఒక్కసారిగా వృద్ధాప్యం మీదపడ్డట్లు ఇక ఆ వత్తిడికి తాను తట్టుకోలేనట్లు బేలగా చూస్తున్న తండ్రిని గమనిస్తే ఆమెకి జాలివేసింది. ప్రక్కనే నిలబడి తలమీద చెయ్యివేసి రాస్తూ "ఇంకో ఆరు నెల్లయితే అన్నయ్య సంపాదనలో పడతాడు. మంచి జాబ్ ఆఫర్లు వస్తున్నాయి కూడా. కొన్నాళ్ళు కష్టపడిన తర్వాత ఈ అప్పులు తీర్చటం పెద్ద పనేం కాదు. ఈ లోపల అమ్మ ఆరోగ్యం కూడా బాగుపడిపోతుంది. మీరు అనవసరంగా బాధపడకండి నాన్నా" అంది ఓదార్పుగా.

    దశరధ్ తలెత్తి కూతురి మొహంలోకి చూశాడు. కళ్ళల్లో తడిపోర కూతురు గమనిస్తుందేమోనని గుర్తొచ్చి, చప్పున తల దించుకొని బయటికి చూస్తూ "నా బాధ దానికోసం కాదమ్మా, ఎవరికీ ఏ పాపము చేయని మీ అమ్మ అనారోగ్యంతో విలవిల లాడిపోతుంటే చూడలేకపోతున్నాను" అన్నాడు. నిజానికి వెన్నెముక విరిగిన తర్వాత అతడు కూడా కొన్ని రాత్రులు సరిగ్గా పడుకోలేక బాధతో అటూ ఇటూ పొర్లడం నిఖిత గమనిస్తూనే వుంది.

    ఆ అమ్మాయి ఏదో మాట్లాడబోతూ వుండగా బయట కాలింగ్ బెల్ శబ్దం వినిపించింది. ఈ సమయంలో తమ ఇంటికి ఎవరు వచ్చారా అని ఆశ్చర్యపోతూ ఆమె వెళ్ళి తలుపు తీసేసరికి ఎదురుగా రాము నిలబడి వున్నాడు. గత ఆరునెల్లగా అతడు మద్రాసులోనే వుంటున్నాడు. నిఖితని చూడగానే నవ్వుతూ "రెండు రోజులు రెస్ట్ దొరికింది. అమ్మా, నాన్నలని చూడాలనిపించింది" అన్నాడు.

    ఆమె అతనిచేతిలో బ్యాగ్ అందుకుంటూ "మంచిపని చేశావులే. రా లోపలి" అంది.

    ఇద్దరూ లోపలికొస్తుంటే, "ఈ రెంటు రోజులూ అమ్మాకీ, నాన్నకీ అనారోగ్యం తిరగబెట్టకుండా వుండేలా చూడి స్వామీ" అంటూ ప్రార్థించుకుంది. పరిస్థితి ఇంత  దారుణంగా వుందని తెలిస్తే రాము చివరి రోజుల్లో చదువు మానేసి ఉద్యోగంలో చేరిపోతానంటాడని ఆమెకి నిశ్చయంగా తెలుసు. అందుకే యింటి పరిస్థితి అతనికి తెలియనివ్వకుండా జాగ్రత్తపడుతుంది.


                         *    *    *

   
    దశరధ్ ఉద్యోగం చేస్తున్నప్పుడు రామ్ రతన్ సూరత్ నుంచి చీరాలూ అవీ  తెచ్చి ఆఫీసులో ఇన్ స్టాల్ మెంట్స్ లో అమ్మేవాడు. అయిదేళ్ళలో అతను బాగా ఎదిగిపోయాడు. ప్రస్తుతం నగరంలో అతనికి పెద్ద బట్టల దుకాణం వుంది. దాంతోపాటు వడ్డీవ్యాపారం కూడా చేస్తాడు.

    "మరో యాభైవేలు ఇవ్వటానికి నాకేం  అభ్యతరంలేదు దశరధ్ గారు. కాని మా వడ్డీ బ్యాంక్ కన్నా రెట్టింపు. త్వరలో తీరిస్తే ఫరవాలేదు కానీ లేకపోతే అసలుని మించిపోతుంది" అన్నాడు.

    నిఖిత శేఠ్ మనసులో ఆలోచన పసిగట్టినట్టు "మీ ఉద్దేశ్యం ఏమిటో చెప్పండి" అంది.

    "నేనెలాగూ ఆ ఏరియాలో ఇల్లొకటి కనుక్కుందాం అనుకుంటున్నాను. మీ కభ్యంతరం లేకపోతే రేటు చూసుకొని నేనే సేటిల్ చేసేస్తాను. మీకూ వడ్డీ  తప్పుతుంది కదా" అన్నాడతను ఫ్రాంక్ గా. ఇంటింటికీ చీరలమ్మే రోజుల్లో అతనా  కాలనీలో బాగా తిరిగేవాడు. అక్కడి వాతావరణం బాగా నచ్చింది.

    దశరధ్ మొహం మ్లానమైంది. శేఠ్  అన్న మాటల్లో తప్పుకూడా ఏం లేదు. తమ స్థితిని గమనించిన  వారికెవరికైనా 'వడ్డీ ఎలా తీర్చగలడు' అన్న అనుమానం  రాక తప్పదు. కానీ ఆ ఇల్లు అమ్మటం  అన్న ఆలోచనే అతడి గుండెలు బద్దలు చేస్తోంది.

    నిఖితకి తండ్రి మనోస్థితి అర్థమైంది. "అప్పు తీర్చలేం అనిపించినప్పుడు ఆ ఇల్లు అమ్మి మీ అప్పు తీర్చేస్తాం శేఠ్ జీ. ఇప్పుడే అమ్మకాల గురించి మాట్లాడవలసిన అవసరం ఏముంది?" అంది నిక్కచ్చిగా.

    శేఠ్ నిర్లప్తంగా డబ్బు లెక్కబెట్టి వాళ్ళకందించాడు. అది తీసుకొని తండ్రీ కూతుళ్ళిద్దరూ బయటికొచ్చారు.

       
                                                     *    *    *

    వాళ్ళు ఇంటికి చేరుకునేసరికి మహతి బయట గదిలో రాముతో కూర్చుని కబుర్లు చెప్తోంది. నిఖితని చూసి "నీ కోసమే ఎదురుచూస్తున్నాను రా" అని వాళ్ళ కల్పతరువు చెట్టు దగ్గరకు లాక్కుపోయింది.

    "ఈ రోజు నీ నిశ్చితార్థం కదా. ఆ కళలేవీ కనబడటం లేదేం?" అంది నిఖిత నవ్వుతూ.

    "ఆ ఎంగేజ్ మెంట్ అవుతుందో లేదో ఎవరికీ తెలియదు".

    "ఏం?"

    "మావాళ్ళు అయిదు లక్షల కట్నం, బంగారం ఇవ్వటానికి ఒప్పుకున్నారనుకో. నా పేరున వున్న పొలం అమ్మి కారును కొనియ్యమన్నా  'సరే' అన్నారు మావాళ్ళు ఆ తరువాత ఆడపడుచులు గొడవ పెడుతున్నారని ఇంకో పాతికవేలు లాంఛనాలు కావాలని అడిగితే దానికీ ఒప్పుకున్నారు".

    "మరి అన్నిటికీ ఒప్పుకుంటే సమస్యేమిటి?" అడిగింది నిఖిత.

    "వాళ్ళు కొత్తగా కట్టిన శ్రీలక్ష్మి కళ్యాణమంటపంలోనే పెళ్ళి జరిపించ మంటున్నారు. దాని అద్దె రోజుకి పాతికవేలు. మమ్మీకేమో నా గురించి యింకా ఏం ఖర్చు పెట్టాలన్నా అదో వేస్ట్ లా కనిపిస్తోంది. సంబంధం మొత్తం కాన్సిల్ చేస్తానంటోంది. నువ్వే చెప్పు- ఇంత ఖర్చు పెట్టుకుంటున్నప్పుడు ఆ మాత్రం  స్టేటస్ నిలబెట్టుకుంటే నష్టమేముంది? ఆఫ్ట్రాల్ యాభైవేలకోసం అన్నివిధాలా బాగున్న సంబంధం వదులుకుంటామా?"

    "ఆఫ్ట్రాల్ యాభైవేలు" అన్నమాటకి నిఖితకి నవ్వొచ్చింది. అది తన ఇంట్లో ఒక ప్రాణం నిలబెట్టడానికయ్యే ఖర్చు.

    "ఏమిటాలోచిస్తున్నావ్?"

    "అదికాదు మహతీ. పెళ్ళి కాకుండానే ఇన్ని డిమాండ్లు పెడుతున్న వాళ్ళు ఆ తర్వాత ఇంకేం అడుగుతారో అని భయంగా వుంది."

    "పెళ్ళయిన తర్వాత ఇంకెలాగూ అడగలేంకదా అని ముందే అన్నీ కోరుకుంటున్నారు" మహతి పెళ్ళి కాకుండానే వాళ్ళని వెనకేసుకొచ్చింది.

    ఈ లోపల మహతి అంది, "నువ్వు కాస్త మా ఇంటికొచ్చి అమ్మతో చెప్పరాదూ?"

    నిఖిత  తెల్లబోయి "ఏం చెప్పాలి?" అని అడిగింది.

    "ఈ సంబంధం ఎటువంటి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దని చెప్పు. నీ మాటంటే వాళ్ళకి గౌరవం".

    నిఖితకి నవ్వొచ్చింది. "ఇలాంటి విషయాల్లో బయటి వాళ్ళు, ముఖ్యంగా నాలాంటి చిన్నపిల్ల సలహా యిస్తే బాగోదు. ఇంత చిన్న విషయానికే వాళ్ళు పెళ్ళి కాన్సిల్ చేసుకోరులే. నువ్వు అనవసరంగా ఈ విషయాలు మనసులో పెట్టుకుని గాభరాపడకు. అంతా సవ్యంగానే జరుగుతుంది" అని ఆమెకి చెప్పి పంపించేపి, ఇంట్లోకి తిరిగొచ్చింది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra