Previous Page Next Page 
ఋషి పేజి 29


    "మీతో  కొంచెం మాట్లాడాలి_" వినయంగా అన్నాడు అతను  కూర్చోకుండానే . అతని వయస్సు ఇరవ్తే అయిదూ- ఆరూ మధ్య వుండొచ్చు. మాటల్లో సంస్కారం కనబడుతూ వుంది!

    "నాతోనా?"

    "అవును. కొంచెం  అలా బయటకి వస్తారా?"

    ప్రకాశం లేచి అతనితో  కలసి బయటకొచ్చాడు. ఇద్దరూ ఒక చెట్టుకింద నిలబడ్డారు.

    "చెప్పండి" అన్నాడు ప్రకాశం రాఘవరావు ఒకక్షణం  మాట్లాడలేదు. ప్రకాశం విసుగ్గా అతనివ్తెపు చూసేడు. అతను చెప్పటానికి తటపటాయిస్తూ, "మీ మావగారూ...." అంటూ అర్దోక్తిలోనే ఆపుచేసేడు.

    ప్రకాశం ఒక్కసారిగా  కంగారుగా "ఏమ్తెంది? ఏ మ్తెందండి?" అని అడిగేడు.

    అతను జీవంలేని నవ్వొకటి నవ్వి "ఏవికాలేదు -మీరేవి కంగారు  పడకండి-కానీ..." అని మళ్ళి ఆపుచేసేడు.

    ప్రకాశం  అతని చేతులు పట్టుకొని- "మీరేవి సందేహించకండి ఏమ్తెందో చెప్పండి ప్లీజ్ "అన్నాడు.

    "నిన్న రాత్రి మీ మావయ్యని బ్రోతల్ ఆక్టుక్రింద  పట్టుకొన్నారు__"

    ప్రకాశం కళ్ళల్లోకి రక్తం జివ్వున చిమ్మింది. దాదాపు  స్పృహ తప్పినట్టయింది. తనని తను సంబాలించుకొంటూ____"మీరు ....మీరు చెబుతూంది...." అంటూ గొణిగెడు.

    "అవును. నిన్న రాత్రి దాదాపు రెండు గంటల  ప్రాంతంలో ర్తేడింగ్  జరిగింది. అందులో ఆయన్ని పట్టుకొన్నారు" అన్నాడు.

    ప్రకాశం మొహం తెల్లగా పాలిపోయింది.

    "ఎలా? యిప్పడేలా?" అన్నాడు ఏవి  తోచనట్టు. రాఘవరావు అతని భుజంమీద చేయివేసి  "మిరేవి కంగారు పడకండి" అంటూ అనునయించేడు.

    ప్రకాశం కళ్ళు వర్షంచటనికి సిద్దంగా వున్నాయి. ఈ పరిస్ధితిని ఎలా దాటేయాలో అతనికి అర్ధంకాలేదు. రేపొద్దున్న ఈ విషయం అందరికి తేలిస్తే తను యెలా  తలెత్తుకు తిరగ్గలడు?.... ఆయనకేం ఫర్వాలేదు. ఇటువంటి అవమానాలు యెన్ని జరిగినా నవ్వుతూ దులి పేసుకోగలడు. ఈ ఊరు కొత్తకాబట్టి ఆయన సంగతి ఎవరికి  తెలిదు. కాణి ఇంతకుముందున్న వూళ్ళో పక్కింటి మహాలక్ష్మమ్మగారిని చూసి చెయ్యి వూపినందుకు జరిగిన గొడవ  తనెలా మర్చిపోగలడు? చర్విత చరణం.

    "ఇప్పుడెలా?జ్తెల్లో వేస్తారా?"

    "అంతవరకూ రాదులెండి" అన్నాడు రాఘవరావు.

    "మరి..." ఆతృతగా అడిగేడు.

    "పొలిసు స్టేషన్ లో నాకు తిలిసిన ఒకతను వున్నాడు. అసలు అతన్ని కలుసుకోవటానికి  వెళ్ళే మీ మావయ్యని  చూసే  నక్కడ. అతనితో  మాట్లాడేను. మీ మావయ్యని  కేసేవి లేకుండా  విడిపించటం పెద్ద కష్టం కాదు కాని ఓ యాభయి  రూపాయలు ఖర్చవుతాయి అంతే."

    ఏదో పెద్ద బరువు తొలిగిపోయినట్టు ఫిలయ్యేడు ప్రకాశం. కాని అతనికింకో విషయం గుర్తొచ్చింది. ఈ నెలాఖర్లో యాభయి  రూపాయలు  యెక్కడ దొరుకుతాయి? ఈ విషయం  స్పురణకి రాగానే  మళ్ళి అతని  పరిస్ధితి పూర్వంలాగే తయర్తేంది. తనని తను సంబాలించుకొంటూ "రండి లోపలికి వెళ్ళి కూర్చుందాం" అన్నాడు. ఇద్దరూ  లోపలికి వెళ్ళేరు. తన సీట్లో కూర్చొని డబ్బు సంపాదించే మార్గం  గురించీ  ఆలోచించసాగెడు.

    ఒక నిముషం మౌనంగా గడిచింది.

    "నెలాఖరు నా దగ్గరా లేదు" నోచ్చుకోంటున్నట్లు అన్నాడు రాఘవరావు.

    "అబ్బేబ్బే. అసలు మీరింత కష్టం తీసుకొని రావటమే చాలు-" అన్నాడు ప్రకాశం. మళ్ళి నిశ్శబ్దం. "కుమార్ ణి అడిగితేనో" అనుకున్నాడు. అది అంత  మంచిపని కాదనిపించింది. ఎంత  స్నేహితుడ్తెనా  నిన్న కనబడగానే ఈ రోజు అప్ప  ఏమనుకుంటాడు....కాని ఈ వాదన ఎక్కువకాలం నిలవలేదు. కుమార్ ఏమీ అనుకోడు. తనకి తెలుసు. అయినా రేపేలాగో ఫస్టు తిర్చేయ్యోచ్చు.

    ఒక్కక్షణం అంటూ లేచేడు. వెళ్ళి కుమార్ ఇంటికి  ఫోన్  చేసేడు. పొద్దున్నే  వెళ్ళిపోయేడని, యెక్కడికెళ్ళాడో తెలీదని అటు వ్తెపు నుంచి  ఎవరో చెప్పేరు. వాడిపోయిన మొహంతో సీటు దగ్గరికి  వచ్చేసాడు.

    "ఏమ్తెంది?" రాఘవరావు ఆతృతగా అడిగేడు.

    "దోరకలేదు-" అని ఒకక్షణం ఆగి, "ఇప్పుడేం జరుగుతుంది" అని అడిగేడు.

    "ప్తెన్ వెయ్యొచ్చు. కట్టకపోతే జ్తేలు...." అంటూ అర్దో క్తిలోనే  ఆపుచేసేడు.

    ఆఖరి ప్రయత్నం గా  పక్కసిటు క్లర్కుదగ్గరికి వెళ్ళేడు. ప్రకాశాన్ని  ఆహ్వానిస్తూ  అతను "రా! ఇప్పడే నీ సీటు దగ్గరికి వద్దా మనుకుంటున్నాను. నువ్వే వచ్చేవు" అన్నాడు.

    "ఏమిటి సంగతి?" అడిగేడు ప్రకాశం.

    "ఇదిగో ఈయన  చమన్ లాల్  అని-" అంటూ అతని ఎదురుగా  కూర్చొనివున్న ఒకాయాన్ని పరిచయం  చేసేడు. ప్రకాశం అతనికి యాంత్రికంగా విష్ చేసి  మళ్ళి  కో-క్లార్క్  వ్తెపు తిరిగి  రహస్యంగా_ "మీతో చిన్న పని వచ్చింది" అన్నాడు.

    "చెప్పండి-ఫర్లేదు" అన్నాడతను.      

 Previous Page Next Page