Home » Yerramsetti sai » 8 down

     జయసుధ నవ్వేసింది.        
    "మా నాన్నగారికి ఉద్యోగంచేస్తేనే గడుస్తుందనే ప్రాబ్లమ్ లేదు! అందుకే వుద్యోగం గురించి ఆయన పెద్దగా పట్టించుకోలేదు" అందామె.    
    "అవును బాబూ! పెద్దలు ఇచ్చిన ఆస్తితో జీవితంగడిచిపోయింది. నా పిల్లలిద్దరూ కూడరోడ్డున పడాల్సిన అవసరం లేకుండా గడిచిపోతుంది"    
    "అయితే మరి మీరింకా అలాంటిపెద్ద పెద్ద డైలాగులు ఎందుకు వుపయోగిస్తున్నారు? జీవితం ఎదురు తిరిగింది, డబ్బు పరిహసించింది. పెద్ద దెబ్బతగిలింది-లాంటివి"    
    "చెప్తాను, సమయం వచ్చినప్పుడు"    
    "నాన్నా! అనుకోకుండా చాలాకాలానికి మేమిద్దరం కలుసుకున్నాంనాన్నా! కైకలూరులో చదువుకునేప్పుడు మేము ఎంత స్నేహంగా వుండే వాళ్ళమో మీకు తెలీదు"    
    "తెలుసమ్మా!"    
    ఆమె ఆశ్చర్యపోయింది.    
    "తెలుసా?"    
    "అవును"    
    "ఎలా తెలుసు నాన్నా? నేనెప్పుడూ చెప్పలేదుగా మీకా విషయం?"    
    "తెల్లారు జామునుంచీ మీరు మాట్లాడుతోన్న మాటలన్నీ విన్నానమ్మా!"  
    జయసుధ సిగ్గుపడిపోయింది. ఆ అవస్తనుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలో తెలియలేదు.    
    "నేనిప్పుడే బాత్ రూమ్ కెళ్ళివస్తాను" అంటూ లేచి వెళ్ళిపోయింది.    
    "మా జయసుధకు చాలా పెళ్ళి సంబంధాలు వచ్చాయ్ బాబూ! కానీ వాటిల్లో ఏ ఒక్కటీ కూడా దానికి నచ్చలేదు! ఈ మధ్య దానికి నచ్చిన సంబంధాలు కొన్నివచ్చాయి కానీ నేను వప్పుకోలేదు."    
    భవానీశంకర్ ఆశ్చర్యపోయాడు.    
    "అదేమిటి? మీకెందుకు నచ్చలేదు?"    
    "నేను చేసుకున్న ఖర్మవల్ల! జయసుధా నువ్వూ మాటల్లో చాలా దూరం ప్రయాణంచటం గమనించాను. అందుకనే మీ ఆశలు అల్లుకోకముందే నిన్ను హెచ్చరించాలని దిగి వచ్చాను-".    
    "అంటే జయసుధకు ఇదివరకే పెళ్ళయింది, ఆమె ఇదివరకే వేరొకరికి మనసిచ్చింది, వివాహం నిశ్చయమయిపోయిందిలాంటి కథ లున్నాయా?"    
    "అది కాదు బాబూ! అలాంటి కధలున్నా లెక్కచేసేరకాన్ని కాదు నేను." అంటూ ముందుకు వంగి రహస్యంగా చెప్పాడు. "జయసుధకు కాన్సర్!"    
    భవానీ శంకర్ ఉలిక్కిపడ్డాడు.    
    "ఆ విషయం నాకూ మా ఆవిడకే తెలుసు! ఇంకెవ్వరికీ తెలీదు. ఇప్పుడు హైద్రాబాద్ వెళ్ళిందికూడా ఆపనిమీదే బాబూ! టెస్ట్ లు చేశాక ఆ విషయం కన్ ఫర్మ్ అయింది. "భవానీ శంకర్ కి నమ్మశక్యం కావటంలేదు.    
    "మీరు నిజంగానే చెప్తున్నారాలేకపోతే ఇదికూడా సినిమా....."    
    "కన్న కూతురి గురించి ఇంత దారుణమయిన అబద్దాలు చెప్తానా?" అలా అంటూనే అతనిగొంతు దుఃఖంతో మూగవోయింది.    
    "మొదట్లో మాకు అనుమానం కలుగలేదు. బాగా దాహం వేయటం, సడెన్ గా కాళ్ళూ చేతులూ చల్లబడటం, ఉదయం సమయాల్లో తరచుగా తలనొప్పిరావటం, బరువు తగ్గిపోవటం, ఇవన్నీ చూసి మా ఆవిడగొడవ పెట్టేసరికి నేనే జయసుధకు డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాను. డాక్టర్ ఆమెను పరీక్షించి ఇ.సి.జి. టెస్ట్ రాశాడు. మేము ఆయన రూమ్ నుంచి బయటికొస్తుండగా చాలా కాజువల్ గా అడిగాడాయన.    
    "ఆ మెడమీదున్న నల్లమచ్చఏమిటి? కొత్తగా వచ్చిందా, ఎప్పటినుంచి ఉంది?" అప్పుడు చూశాను నేను ఆమెజడ వుండటంవల్ల సరిగ్గా కనిపించటం లేదది. పావలా బిళ్ళపరిమాణంలో వుందది! అది పుట్టుమచ్చేమోనన్న అనుమానం వచ్చింది నాకు. కానీ అంత పెద్ద పరిమాణంలో పుట్టుమచ్చ వుంటే అందరం గమనించి వుండేవాళ్ళం. జయసుధక్కూడా దాని విషయం తెలీదు.    
    "ఒకవేళ అది కొత్తగావచ్చినట్లయితే స్కిన్ స్పెషలిస్ట్ కి చూపించి తీయించేసుకోండి!" అన్నాడాయన.    
    ఆ తర్వాత వారం జయసుధను స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరకు తీసుకెళ్ళాను. అతను కొద్దిసేపు పరీక్షించి అప్పటికప్పుడే ఆపరేషన్ పూర్తి చేశాడు    
    "దీన్ని నేను పాథాలజీలాబ్ కి పంపుతున్నాను. ఎల్లుండి టెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఆరోజు కనిపించండి" అన్నాడతను.    
    అప్పుడు డౌట్ వచ్చింది నాకు.    
    రెండో రోజు జయసుధను తీసుకెళ్ళకుండా నేనొక్కడినేవెళ్ళాను.    
    "ఆమెకు చిన్న 'మెలనోమా'వుంది" అన్నాడతను.    
    నాకు గుండె పగిలిపోయినట్లయింది.    
    "మీరు గాభరాపడాల్సిన పనేమీలేదు. ఆ పార్టుని తీసేయవచ్చు. మంచి సర్జెన్ ని చూడండి" అన్నాడు.    
    నేనూ నా భార్యా రాత్రింబగళ్ళు ఏడుస్తూనే వున్నాము. గాభరా పడనక్కర్లేదని డాక్టర్ చెప్పినా మాకు నమ్మకం కలగలేదు. కాన్సర్ అంటే చావని మాకు తెలిసినవిషయం. హైదరాబాదు చేరుకొని మంచిసర్జెన్ ని కలుసుకున్నాం. ఏ పరిస్థితిలోనూ ఈ విషయం జయసుధకు తెలీకుండా జాగ్రత్తలు తీసుకొన్నాం.    
    "మెలనోమా 'మెటాస్టెసైజ్' అవకపోయినట్లయితే పూర్తిగా రికవరీ అవటానికి ఎనభై శాతం అవకాశాలున్నాయి. ఒకవేళ మెలనామా ఇప్పటికే విస్తరించి వుంటేమాత్రం బ్రతకటం కష్టం. సాధారణంగా ఈ మెలనోమా ఏం చేస్తుందంటే లింఫాటిక్ సిస్టమ్ ద్వారా ప్రయాణిస్తూ ఎటాక్ చేస్తుంది. అంటే వీపుమీద నుంచీ మొదలుపెట్టి భుజం కింద నుంచి మెడవరకూ అంటే సుమారు 46 సెంటీమీటర్ల పొడుగు భాగం తీసేయాల్సివస్తుంది. డక్ట్స్, గ్లాండ్స్, అన్నీ దాన్ని పాధాలజిస్ట్ పరీక్ష చేస్తేగాని కరెక్టు పిక్చర్ మనకు తెలీదు-" అని చెప్పాడు డాక్టరు. కనుకవచ్చే మంగళవారంనాడు ఆపరేషన్ జరుగబోతోంది. జయసుధ బ్రతుకుతుందా లేదా అనేది కేవలం ఆ ఆపరేషన్ తర్వాత రిపోర్టు మీద ఆధారపడి వుంటుంది. ఇవన్నీ తనలోపల డెవలప్ అయిన స్కిన్ డిసీజ్ గురించిన టెస్ట్ లు అనుకుంటోంది జయసుధ." అతను మాట్లాడటం ఆపేశాడు.    
    జయసుధ వచ్చి భవానీ శంకర్ కెదురుగాకూర్చుంది మళ్ళీ-    
    ఆయన మళ్ళీ పైబెర్తుమీద కెళ్ళిపోయాడు. భవానీశంకర్ మనసంతా జయసుధ మీదజాలితో ప్రేమతో నిండిపోయింది.    
    బాలక్ కూర్చునే నిద్రపోతున్నాడు.    
    "ఏమిటి? మా నాన్నగారేదోమాట్లాడుతున్నారు?" అడిగింది జయసుధ.  
    "అదే, మీరు అదేదో టెస్ట్ కోసం హైదరాబాద్ వెళ్ళారని చెప్తున్నారు-"    
    ఆమె పెదాలమీద అంతవరకూవున్న చిరునవ్వు ఎండిపోయింది. దాని స్థానంలో దైన్యం...    
    "మీకో విషయం చెప్పనా?" అడిగిందామె.    
    భవానీశంకర్ ఆశ్చర్యంగా ఆమెవేపు చూశాడు.    
    "ఏమిటది?"    
    "మనకు ఏది ఎంతవరకూ ప్రాప్తమో, అంతవరకే ఆశించాలి. ప్రాప్తం లేనివాటిగురించి పాకులాడటం, పరితపించటం అనవసరం! ఏమంటారు?"    
    "కరెక్టుగానే చెప్తున్నట్లున్నారుగానీ- ఆ మాటెందుకు చెప్తున్నారో అర్ధంకాలేదు.
    "మీరు సడెన్ గా మూడ్ మార్చుకుని కనిపించేసరికి ఆ మాట చెప్పాలనిపించింది". భవానీశంకర్ బలవంతంగా నవ్వాడు.    
    "నా మూడ్ మారిందని గారంటీ ఏమిటి?"    
    "అవన్నీ నేను చెప్పలేను! ఇంతకూ మానాన్నగారికే మేం చెప్పారు మీరు?"    
    "ఏవేవో- ఇంట్లోవి-బయటవి-"    
    "అబద్దం! మీరేం మా నాన్నకుబోసమ్ ఫ్రెండ్ కాదు-అలాంటివన్నీ చెప్పటానికి!"    
    "బోసమ్ ఫ్రెండ్ కాకపోవచ్చు గానీ, అల్లుడి పదవికి పోటీచేస్తున్న ఏకైక అభ్యర్ధిని కదా!    
    ఆమె నవ్వేసింది.    
    "ఇందాక నా మాటలు నిజంగా తీసుకున్నారా మీరు?"    
    "నేనెవరి మాటలయినా నమ్ముతాను! అది నా వీక్ నెస్!"    
    "అయితే తక్షణం డాక్టర్ కి చూపించుకోండి! చాలాచెడ్డ అలవాటది! రకరకాల మనస్తత్వాలవల్ల, రకరకాల కారణాలవల్ల రకరకాలుగా మాటలుచెప్తారు జనం! అవన్నీ నమ్మేస్తే ఎలా?"    
    "మీ మాటలు అలాంటివనినేననుకోను! అదీగాక మీరు ఏం చెప్పినా మీ మీద నాకేర్పడ్డ ప్రేమపోదు!"    
    "మీ మాటలు అలాంటివని నేననుకోను! అదీగాక మీరు ఏం చెప్పినా మీ మీద నాకేర్పడ్డ ప్రేమపోదు!"    
    "ఇంత సడెన్ గా ప్రేమ ఏర్పడుతుందా ఎక్కడయినా?"    
    "మనసు కోరుకుంటున్న వ్యక్తి తారసపడితే సడెన్ గా ప్రేమ మొదలవుతుంది!"    
    "అంటే- నిజంగా నేనన్ను మారేజ్ చేసుకోవాలనుకుంటున్నారా?"    
    "మారేజ్ కి నిజం- అబద్దం అని వుండవ్!"    
    "కానీ మా నాన్నగారు చెప్పిన మాటలు విని కూడా నన్ను పెళ్ళి చేసుకోవాలనే అనుకుంటున్నారా?"    
    భవానీశంకర్ కలవరంగా చూశాడు.    
    "ఆ మాటలకు, పెళ్ళికి ఏమిటి సంబంధం?"    
    "కాన్సర్ వున్న అమ్మాయిని ఎవరయినా పెళ్ళి చేసుకుంటారా?"    
    భవానీశంకర్ తృళ్ళిపడ్డాడు.   
    "సినిమా ఫామిలీ అవటంవల్ల అలా అయిపోయారు మీరు! బహుశా మీ అమ్మగారు తీసే సినిమాలో కాన్సర్ ఇతివృత్తం అయుంటుంది కదూ! హీరో హీరోయినూ ప్రేమించుకుంటారు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra