ఉత్తరం చదివి సాలోచనగా తలపైకెత్తిన రతి "డ్రైవర్! కారాపు" అంది.

 

    నానీ నిస్మయంగా చూస్తున్నాడు ఆమెనే.

 

    అక్కడికి వూరు మరో కిలోమీటరు దూరముంది.

 

    కొన్ని నిముషాలపాటు ఆలోచనల్లో మునిగిపోయింది. తర్వాత వేలేట్ లోనుంచి పెన్నుతీసి ఆ ఉత్తరానికి వెనుకగా చకచకా రాసింది.

 

    నానీని చూస్తూ "ఈ ఉత్తరాన్ని అంకుల్ కిచ్చెయ్" అంది.

 

    "నాకిల్లు తెలీదుగా" అమాయకంగా అన్నాడు.

 

    నానీ ఎవరూ అన్న వివరాలు అడగలేదు. "నేను ఊరిలోకి వెళ్ళగానే చూపిస్తాను... సరేనా" అంది.

 

    మరో అయిదు నిముషాలలో ఊళ్లోకి కారు ప్రవేశించగానే కారాపించి దూరంగా పోస్టాఫీసు పక్కనేవున్న పెంకుటిల్లు చూపించింది.

 

    కారుదిగి నానీ ఆ యింటిలో అడుగుపెట్టేసరికి అక్కడ మంచంపై నీరసించిన అమ్మలాంటి ఓ స్త్రీ కనిపించగానే "అంకులింకా రాలేదా" అన్నాడు.

 

    నిస్త్రాణగా తలతిప్పిన ఆమెకు అర్థంకాలేదు.

 

    "ఎవరిబాబువి నాన్నా? నీకెవరు కావాలి?" నిస్సత్తువగా అడిగింది.

 

    "నేనేమో మా తాతయ్యున్నాడు కదా... వాళ్ళ మనవడ్ని." అంతకంటే తనగురించి ఎలా చెప్పాలో నానీకి తెలీలేదు. పైగా తాతయ్య అంటే అందరికీ తెలిసేవుంటుందన్నంత నమ్మకం. "అంకులే మందుకెళ్ళాడు" చెప్పి అరుగుమీద కూర్చుందామని బయటకు రాబోతూ టక్కున ఆగిపోయాడు.

 

    అక్కడ దూరంగా చెట్టుకింద నిలబడ్డ ముగ్గురు వ్యక్తులు నానీనే చూస్తున్నారు.  

 

    అది కాదు నానీని కంగారుపెట్టింది.

 

    ఆ ముగ్గురిలో రాజారావు కూడా వున్నాడు.

 

    భయంతో ఒక్క ఉదుటున లోపలికొచ్చేసి వణికిపోతూ నిలబడ్డాడు.

 

                                     *    *    *

 

    కోర్టులో ఛార్జిషీటు ఫైల్ చేసిన యశస్వి ఆరోజే మొత్తం దోషుల్ని చట్టరీత్యా నేరస్తులుగా నిరూపించడానికి చాలా బలమైన పథకం వేశాననుకున్నాడు.

 

    కాని అతడు కోర్టుకి బయలుదేరబోతూండగా చంద్రం స్టేషనుకొచ్చి నాని కనిపించడంలేదని కంప్లయింట్ ఇవ్వడంతో షాక్ తిన్నాడు.

 

    ఇలాంటి ప్రమాదాన్ని ఊహించే చాలా రహస్యంగా కథ నడిపించాలనుకొన్నాడు, నడిపించాడు కూడా. కానీ యిలాంటి పరిణామానికి దారితీస్తుందని ఊహించలేకపోయాడు.

 

    ఆవేశాన్ని నిభాయించుకోలేక ఉద్రేకంగా చంద్రం కాలరుని పట్టుకున్నాడు.

 

    రఘునాథరావు రావడం ఒక్కక్షణం ఆలస్యమైవుంటే చంద్రం దవడ కండరాలు చిట్లిపోయేవి.

 

    "బాస్టర్డ్... టెల్ మి... నానీనేం చేశారు" ఉద్వేగంతో చంద్రం మెడపట్టుకొని కుదిపేశాడు.

 

    "మిష్టర్ యశస్వి" రఘునాథరావు వారించాడు.

 

    "మీరు వెళ్ళొచ్చు" చంద్రాన్ని పంపి "ఇప్పుడేం చేద్దామనుకొంటున్నావు" యశస్విని చూస్తూ అన్నాడు.

 

    నిస్సహాయంగా కదిలిపోతూనే "సమ్ థింగ్ హేపెండ్... హేపెండ్ సర్... నాని మూలంగా ప్రమాదాన్ని ఊహించి వాళ్ళే రహస్యంగా దాచేసైనా వుండాలి లేదా ప్రాణాలైనా తీసుండాలి" తనకుతానే సమాధానపరుచుకోలేకపోతున్నాడు. "సర్... ఒకవేళ నానికేమన్నా జరగడమే నిజమైతే వీళ్ళందర్నీ ఉరికంబమెక్కించేవరకూ నేను నిద్రపోను..."

 

    "ఇట్స్ ఓకే యశస్వీ... ఈరోజు కోర్టుకి హాజరు కమ్మని వాళ్ళకి సమన్స్ అందాయిగా... వాట్ విల్ బి యువర్ నెక్ట్స్ స్టెప్."

 

    "సర్" దృఢంగా పలికింది యశస్వి కంఠం "ఐ విట్ నెస్ లేకపోవడం మూలంగా కేసు పదిరోజులు, ఒక్క పదిరోజుల వాయిదా వేసేట్టు చూడమని ప్రాసిక్యూటర్ ని రిక్వెస్ట్ చేసాను. ఈలోగా నానీ ఆచూకీ తెలుసుకుంటాను."

 

    "ఓకే... కేస్ ఎడ్జార్న్ చేయడమన్నది అసంభవంకాదు. కోర్టుకి అటెండై  వాయిదా అడుగు" ఓ క్షణం ఆగి "అది పూర్తి చేసుకుని వెంటనే వస్తే నీతో ఓ ముఖ్య విషయం మాట్లాడాలి" అన్నాడు టేబుల్ పైనున్న పేపర్ వెయిట్ ని సాలోచనగా తిప్పుతూ.

 

    "సర్" అనుమానంగా చూశాడు యశస్వి.

 

    "మిష్టర్ యశస్వీ" దీర్ఘంగా నిట్టూర్చాడాయన.  

 

    "ఒక నిజాయితీగల పోలీసాఫీసరుగా కర్తవ్యాన్ని ఖాకీడ్రెస్ కేకాక దాని వెనుకవున్న మనసుకు తీసుకునే నీలాంటి వాళ్ళంటే నాకు చాల యిష్టం. కాని నువ్వింకా పెద్దగా  ఎదురుదెబ్బలు తినడం అలవాటులేని వ్యక్తివి... కాబట్టే ఇంతలా ఆవేశపడుతున్నావు."

 

    "నాకు అర్థం కావడంలేదు సర్."

 

    "పూర్తిగా కావాలీ అంటే ఇంకా నీ అనుభవం చాలదు యశస్వీ. ఎనలైటికల్ గా ఆలోచిస్తే వాళ్ళు పావనిని హత్య చేశారన్నది నిజం కాబట్టే నానీని మిస్ చేశారు ఇప్పుడు..." ఒక బాధాకరమైన వాస్తవాన్ని చెప్పడానికి ఆయనగొంతు పెగలడంలేదు. "కేసును తిరగతోడుతున్నావని నీమీదా కక్షగట్టి నిన్ను ట్రాన్స్ ఫర్ చేయించే ప్రయత్నం చేయగలిగారు."

 

    "సర్" యశస్వి భృకుటి ముడిపడింది.

 

    "అవును యశస్వీ... బహుశా ఈరోజు మధ్యాహ్ననికల్లా నీ ట్రాన్స్ ఫర్ ఆర్డరు నా చేతికందొచ్చు. ఇది వైజాగ్ యస్.పి. ఆఫీసునుంచి నాకు అనధికారికంగా అందిన వార్త."

 

    మనసుకీ- చట్టాన్ని పరిరక్షించాల్సిన నైతిక బాధ్యతకీ మధ్య జరిగే సంఘర్షణలో యశస్వి పాలభాగం అప్పటికే స్వేదంతో నిండిపోయింది.

 

    కసిగా బయటకు కదిలాడు.

 

    మరో అరనిముషంలో స్టార్టయిన బుల్లెట్ తూటాలా దూసుకుపోతూంది.  

 

                                             *    *    *

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra