Home » Mainanpati bhaskar » వేగు చుక్క



    అంతటి నిరుత్సాహాన్ని  కలిగించే ఆ దృశ్యాన్ని చూసి  కూడా, మొహంలో ఏ భావమూ కనబడకుండా నిర్వికారంగా నిలబడ్డవాడు సాగర్ ఒక్కడే.

    త్రవ్వేసి ఉన్న నిధిని చూడగానే కలిగిన  షాక్ నుంచీ కొద్దిగా తేరుకున్న తర్వాత నెమ్మదిగా  తల తిప్పి, సాగర్  వైపు  చూసింది అనూహ్య.

    ఆశ నిరాశలకు ఆతీతుడిలా స్థిరంగా నిలబడి ఉన్నాడతను.

    అతన్ని చూస్తున్న కొద్దీ, అతనితో సాన్నిహిత్యం పెరుగుతున్న కొద్దీ , అతనిమీద ఆరాధనా భావం పెరిగిపోతోంది అనూహ్యకి. మిన్నువిరిగి మీదపడ్డా తొణకడా ఇతను? మామూలు మనుషులకి సహజమైన నిరాశా నిస్పృహలూ, కోపతాపాలూ ఇతనిలో మచ్చుకైనా లేవా?

    ఇతను మెరైన్ లైన్ లోకి వచ్చి అతి సమర్ధుడైన కెప్టెన్ అయ్యాడు గానీ, ఒక వేళ యోగ మార్గాన్ని ఎన్నుకుని ఉంటే మహాయోగి అయిఉండేవాడా?

    ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా సరే  చలించకుండా, కొండలా నిలబడే ఇతని అండలో తనజీవితం నిశ్చింతగా, నిర్భయంగా గడిచిపోవడం కంటే వేరే పెన్నిధి ఎందుకు తనకి.

    నిధి దొరకలేదన్న నిరాశ మంత్రమేసినట్లు మాయమైపోయింది అనూహ్యకి. సాగర్ కి మరింత దగ్గరగా నిలబడింది ఆమె.

    భల్లూకంలా గోతిలోకి దూకాడు డ్రాకులా చాంగ్. అనుమాన  నివృత్తి కోసం మొక్కలను పక్కకు జరిపి చూశాడు.

    అక్కడక్కడా పడి ఉన్న నాణాలు కొన్ని దొరికాయి. రెండు బ్రిటిష్ సామ్రాజ్యానికి చెందినవి, మూడు ఢీల్లి పాదుషాకి చెందినవి.

    అంతే!

    ఎంత వెదికినా ఇంక వేరే  నాణాలు ఉన్న ఛాయలు గోచరించలేదు.

    చేతుల్లో ఉన్న నాణాలను  చూస్తూ నిలబడిపొయాడు చాంగ్. సూర్యుడు నడినెత్తిమీదకు వచ్చాడు. అంత వళ్ళంతా చెమటలు పట్టి చితచిత లాడుతోంది. చేతిలో పడ్డదనుకున్న సంపద చేయిజారిపోయినందుకు వెర్రెత్తి పోయింది అతనికి. శ్వాస బుసలాగ మారింది. కోపంతో నిప్పులా ఎర్రబడ్డాయి కళ్ళు, మొహం వికృతంగా మారింది.

    రొప్పుతూ గుంటలోనుంచి బయటికి వచ్చి అందరివైపూ ఉగ్రంగా చూశాడు.

    అతను కోపాన్ని కంట్రోలు చేసుకోలేడు. అది తక్షణం ఎవరి మీదనన్నా చూపించాలి. లేకపోతే రక్తం మరిగిపొతూ పిచ్చెక్కినట్లు ఉంటుంది అతనికి. ఆ సమయంలో అతనికి విచక్షణం ఉండదు.

    భూతద్దంలో నుండి ఫోకస్ చేసిన సూర్యరశ్మిలా తీక్షణంగా ఉన్న అతని దృష్టి సాగర్ మీద పడింది.

    అది గమనించాడు సాగర్. చాంగ్ తన మీదకు దాడిచేస్తే ఎదుర్కొనేందుకు రెడీగా నిలబడ్డాడు.

    అతన్నే చూస్తూ ముందుకొస్తున్నాడు చాంగ్.

    రెప్పవేయకుండా అతని కడలికలని అతి జాగ్రత్తగా గమనిస్తూన్నాడు సాగర్.

    ఉన్నట్లుండి అనుకోనిది జరిగింది.

    మెరుపు వేగంతో దిశ మార్చాడు చాంగ్. చటుక్కున అనూహ్య వైపు వెళ్ళిపోయి, ఆమెని రెండు చేతులతో అమాంతం పైకి ఎత్తేసి, బాస్కెట్ బాల్ ఆటగాడు బంతిని ఒడుపుగా చేజిక్కించుకుని బాస్కెట్ వైపు పరిగెత్తినట్లు ముందుకి ఉరికాడు.

    ఊహించని ఆ పరిణామానికీ నివ్వెరపోయాడు సాగర్. మరుక్షణం తన కర్తవ్యం గుర్తుతెచ్చుకొని, చాంగ్ వెనక శరవేగంతో పరిగెత్తాడు.

    అంత మహాకాయుడైన చాంగ్ కొండ గోర్రెలా అడ్డుంకులు తప్పించుకుంటూ అవలీలగా పరిగెత్తిపోతున్నాడు. అప్పటికే మూడు వందల గజాల దూరం వెళ్ళిపోయాడు అతను.

    సాగర్ అతన్ని తరుముతున్నాడు. క్షణక్షణానికీ వాళ్ళిద్దరిమధ్యా దూరం తగ్గుతోంది.

    చాంగ్ తనకు ఇంకో పది గజాల దూరంలో ఉన్నాడనగా వంట్లోని శక్తినంతటినీ పాదాలలోకి తెచ్చుకుని పరిగెత్తాడు సాగర్. ఎక్కువ దూరం  కవరు చెయ్యవలసిన పరుగుపందేలలో ఎంతో కొంత శక్తిని రిజర్వులో ఉంచుకుంటారు స్పోర్ట్ మెన్. చివరి సెకెండ్లలో ఒక్కసారిగా దాన్ని  మొత్తం రిలీజ్ చేసి, మాగ్జిమం స్పీడ్ తో పరిగెత్తి గమ్యం చేరుకుంటారు.

    కానీ, పరుగుపందాలలో విజయాన్ని తెచ్చేది సెకెండ్ల తేడా కాదు. సెకెండ్లని చిన్న చిన్న  భాగాలు చేస్తే వచ్చే అల్పమైన యూనిట్ల తేడాయే జయన్నో అపజయన్నో తెలుస్తుంది.

    కనురెప్పపాటులో చాంగ్ ని చేరుకొని అతని వెనకనుంచి బలంగా వాతెసుకున్నాడు సాగర్.

     అదే సమయంలో చాంగ్ అనూహ్యని బాస్కెట్ బాల్ ని విసిరేసినట్లు విసిరేసాడు.

    సాగర్ చాంగ్ ని వాటేసుకోవటం, అతను అనూహ్యని విసిరెయ్యడం రెండూ ఒకే సెకెండులో జరిగాయి. కానీ రెండింటి మధ్యా అర్ధ సెకెండు తేడా వుంది.

    దాని ఫలితంగా, దూది కూరిన గుడ్డబొమ్మలా తేలిగ్గా గాలిలో పయనించి ఇరవై గజాల అవతల పడిపోయింది అనూహ్య.

    ఆ తాకిడికి ఆమె శరీరంలోని ప్రతి ఎనుకా పది ముక్కలుగా విరిగి ఉండవలసిందే అక్కడ నేలంతా బురదగా అయి ఉండకపోతే!

    కుండపోతగా వర్షాలుపడే ప్రదేశం అది.  ఎండ పోడ పడి అరె అవకాశం లేకుండా పైనంతా పందిరిలా దట్టంగా చెట్లకొమ్మలు వ్యాపించి ఉన్నాయ్. అందుకే నేల నాని నాని బురదగా అయి, స్పాంజిలా వుంది.

    అదే కాపాడింది అనూహ్యను.

    దీర్ఘంగా నిట్టూర్చాడు సాగర్.

    కానీ మరుక్షణంలో అదే నేల ఆమెను కొండచిలువలా కబళించడం మొదలెడుతుందని అతను అనుకోలేదు.

    విరిగిపోయిన బొమ్మలా పడిపోయిన అనూహ్య లేచి కూర్చునే ప్రయత్నం చేసింది. కానీ కుదరలేదు. మరింతగా బురదలో కూరుకుపోతోంది ఆమె.

    జరుగుతున్నదేమిదో ఆమెకు అర్ధంకాలేదు.

    సాగర్ మాత్రం గ్రహించాడు.

    అది ఊబి నేల అందులో కూరుకుపోయింది అనూహ్య.

     ఆమెని తక్షణం బయటికి తీసుకురావాలి తను. కానీ ఎలా ? ఎలా? పరిగెత్తి దగ్గరకు వెళ్ళాడు. ఉన్నట్లుండి అతని కుడి పాదం మెత్తటి బురదలో కూరుకుపోయింది. పైకి లాక్కోబోయాడు, రాలేదు. గజేంద్ర మోక్షంలో ఏనుగు కాలుని మొసలి పట్టేసుకున్నట్లు ఉంది అది.

    పళ్ళు గిట్టకరిచి, అతికష్టంమీద కాలుని బయటికి లాక్కోగలిగాడు అతను.

    ఉహూ! ఇది కాదు పద్దతి. ముందుకి వెళ్ళి తను కూడా చిక్కుకు పోవడం తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు.

    అంగుళం, అంగుళం చొప్పున నిలువునా ఊబిలో దిగబడిపోతోంది అనూహ్య భయంతో ఆమెకి నిలువుగుడ్లు పడ్డాయి. నోరు తెరిచి ఉంది. అందనిదేన్నో అందుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చేతులు గాల్లోకి లేచి ఉన్నాయి.

    క్షణాలు గడచిపోతున్నాయి ఆలోచించుకునే వ్యవధి కూడా లేదు.

    దగ్గరలోనే పెద్ద చెట్టు ఒకటి ఉంది. దాని కొమ్మ  ఒకటి కొద్దిగా ఊబివైపు వంగి ఉంది.

    గబగబ ఆ చెట్టు ఎక్కాడు సాగర్.

    చిత్రంగా, అతన్ని అడ్డగించే ప్రయత్నమేమీ చెయ్యలేదు చాంగ్. అనూహ్య ఆర్తనాదాలనీ,  సాగర్ ఆరాటాన్నీ వినోదంగా తిలకిస్తూ నిలబడ్డాడు.

    అనూహ్యని రక్షించడం దేవుడి తరం కూడా కాదని అతనికి తెలుసు. అనూహ్య అనుభవిస్తున్న బాధ, సాగర్ అనుభవిస్తున్నా మానసిక వ్యధా రెండూ కాకి టెయిల్ లా కలిసి అతని శాడిస్టు మనస్తత్వానికి కిక్ ఇస్తున్నాయి.

    త్వరత్వరగా, ఊబి మీదకు వాలిన కొమ్మమీదకు వెళ్ళిపోయాడు సాగర్.

    మరి కొంత దిగబడిపోయింది అనూహ్య. నడుము కింద భాగమంతా ఊబిలో ఇప్పుడు కాళ్ళకు గట్టిగా నేల తగలడంలేదు. మెత్తగా ఉన్న బురదను కొద్ది కొద్దిగా పక్కకు తిలగిస్తూ పాతాళానికి దారి తీస్తున్నాట్లుగా మరింత లోపలికి వెళ్ళిపోతున్నాయి పాదాలు.

    "సాగర్!" అంది అతనివైపు చేతులు జాస్తూ, దీనంగా.

    అతను తన కాళ్ళు కొమ్మకు మెలికవేసి, తలక్రిందులుగా వేళ్ళాడాడు. చేతులు జాచి, ఆమెని అందుకోబోయాడు.

    ఒక అర సెకండు క్రితం అయితే ఆమె చేతులు అతనికి అంది ఉండేవే. కానీ ఆ అర సెకండులో ఒక అంగుళం జారిపోయింది అనూహ్య.

    వాళ్ళ చేతులు కలుసుకోలేదు వాటి మధ్య అరంగుళం దూరం ఉండిపోయింది.

    చావుకీ, బతుక్కీ , మధ్య తేడా సరిగ్గా అర సెకెండూ, అంగుళం.

    అతి కష్టంమీద మరో అంగుళం కిందికి జారగలిగాడు సాగర్. ఇక అంతకంటే కిందికి వస్తే, అతని కాళ్ళు పట్టు తప్పిపోతాయి. అతను కూడా నిశ్చయంగా కింద పడిపోతాడు.

    ఆ కాస్త సమయంలోనే మరి రెండంగుళాలు ఊబిలో కూరుకుపోయింది అనూహ్య.

    ఇద్దరిమధ్యా ఇప్పుడు ఒకటిన్నర అంగుళాల దూరం  ఉంది.

    "సాగర్!" అంది అనూహ్య నిస్సహాయంగా.

    అప్పుడు వినబడింది ఉక్కు సమ్మెటతో ఇనప ఢంకా మీద  కొడుతున్నట్లు బరువైన గిట్టల చప్పుడు.

    అప్రయత్నంగా తల తిప్పి చూశాడు సాగర్.

    ఇనుముకో పోత పోసినట్లు నల్లగా, దృఢంగా యముడి వాహనంలా కనబడుతున్న అడవి దున్న ఒకటి, ముట్టేవంచి ముందుకు ఉరుకుతూ వస్తోంది. మడ్డుకత్తుల్లా ఉన్నాయ్ దాని కొమ్ములు. కళ్ళలో పొగరు కనబడుతోంది. మనుషులకంటే కూడా ఎత్తుగా ఉంది అది.

    దాని దోవకి సరిగ్గా అడ్డంగా ఉన్నాడు చాంగ్.

    "చాంగ్ తప్పుకో!" అన్నాడు సాగర్ బిగ్గరగా.

    ఉలిక్కిపడి, ఒక్కగెంతు గెంతి, పక్కకి తప్పుకున్నాడు చాంగ్.

    అతన్ని కుమ్ముబోతున్న అడవి దున్న తన వేగాన్ని ఆపుకోలేక, పరిగెత్తుకొచ్చి సాగర్ ఎక్కి ఉన్న చెట్టును బలంగా తాకింది.

    దున్న వేగాన్ని ఆపింది చెట్టు.

    ఆగి, తీవ్రంగా చెట్టును చూసింది దున్న ఆ క్షణంనుంచీ ఆ చెట్టే ప్రత్యర్ధిలా కనబడటం మొదలుపెట్టింది దానికి. మొరటు, మొండి మృగాలలో మొదటి జాతికి చెందినవి అడవి దున్నలు. అపారమైన బలంతో బాటు అసహనం కూడా ఎక్కువ వాటికి.

    నాలుగడుగులు వెనక్కి వేసి మళ్ళీ అతివేగంగా ముందుకు ఉరికి వచ్చి గభీమని గద్దింది చెట్టుని.

    చెట్టు అటూ ఇటూ ఊగిసలాడి, మళ్ళీ సరైన స్థానానికి  వచ్చి నిలచింది. అతి కష్టంమీద, తను పట్టు తప్పి కింద పడిపోకుండా ఆపుకో గలిగాడు సాగర్.

    చాంగ్ ఇబూకానీ, ఫకర్ నీ చెరో చేతితో లాక్కుంటూ దూరంగా  వెళ్ళిపోవడం కనబడుతోంది.

    మళ్ళీ వెనక్కి వెళ్ళి పరిగెత్తి వచ్చి విసురుగా చెట్టును ఢీకొంది అడవి దున్న.

    మళ్ళీ.......మళ్ళీ........మళ్ళీ........

    అలా అరడజను సార్లు.

    చెట్టు వేళ్ళు భూమిలో కదిలాయి. అవి పట్టు సడలింది. కొద్దిగా ఒరిగింది చెట్టు.

    మెల్లిగా లోపలికి వెళ్ళిపోతోంది అనూహ్య పక్షందాకా, మెడదాకా, గడ్డందాకా.....
   
    ఇంకొక్క అంగుళం జారితే నోట్లోకీ ముక్కులోకీ బురదపోయి ఊపిరాడకుండా అయిపోతుంది.

    ఇంకోసారి చెట్టుని గుద్దింది దున్న.

     చెట్టు వేళ్ళు భూమిలోనుంచీ పెకలించుకు బయటికి వచ్చాయి అమాంతం నేల మీదకు ఒరిగిపోయింది చెట్టు.

    ఆ పడటం పడటం ఊబికి అడ్డంగా , బ్రిడ్జిలా పడింది.

    మరిక్షణంలో అనూహ్యని అందుకుని, శరీరంలోని శక్తి అంతటినీ చేతులతో కేంద్రీకరించి ఆమెని చెట్టుమీదకి లాగేసుకున్నాడు సాగర్.

    దున్న ఆగలేదు. చెవులు చిల్లులు పడేలా రంకెవేసి, ఊబిలోకి దూకింది కాలు పట్టు దొరకక లోపలికి దిగబడిపోతూ ఉంటే, తేలకళ్ళువేసి మూలుగుతున్నట్లు రంకె వెయ్యడం మొదలెట్టింది.

    చాలా బరువున్న  దాని శరీరం  పూర్తిగా ఊబిలో మునిగిపోవడానికి ఒక్క నిమిషం కూడా పట్టలేదు.

    అనూహ్యని జాగ్రత్తగా పట్టుకుని, బ్రిడ్జిమీద నడుస్తున్నట్లు చెట్టు మీద నడుస్తూ, గట్టి నేలని చేరుకున్నాడు సాగర్. అక్కడ నిలబడి, గాఢంగా ఊపిరి  తీసుకున్నారు ఇద్దరూ.

    మరో ప్రమాదం తప్పింది. ఇప్పటికి బయటపడ్డారు.

    అభిమానంగా అనూహ్యవైపు చూశాడు సాగర్. జాలివేసింది అతనికి. ఫ్రెండ్సుతో ఆడుతూ పాడుతూ కాలేజీకి వెళ్ళి చదువుకునే ఈ  అందమైన అమ్మాయి, అంతు చిక్కని ఈ అడవుల్లో అనుక్షణం ఆపదలని ఎదుర్కుంటూ తమతో రావలసిన అవసరం ఎందుకు వచ్చింది అసలు?

    ఎక్కడి విశాఖపట్నం, ఎక్కడి అండమాన్స్?

    దీన్నేనా విధి అంటారు?

    "అన్యూహా!" అన్నాడు ఆర్ద్రంగా.

    కళ్ళెత్తి అతనివైపు చూసింది అనూహ్య. వళ్ళంతా బురద అంటుకుని ఉంది తనకి. ఊబిలోనుంచి బయటపడ్డ ఆనందంలో కళ్ళలో ఉబికిన అశృవులు చెదిపలమీదుగా జారుతూ, ఆ మెరకు బురదని కడిగేస్తున్నాయి.

    "నువ్వు చాలా బాగుంటావని నీకు తెలుసా అనూహ్యా?" అన్నాడు సాగర్.

    చురుగ్గా చూసింది అనూహ్య. "ఇలా మట్టి కొట్టుకుపోయి ఉంటే బాగున్నానా? మీరు  జోక్ చేస్తున్నారు అవునా?"

    "కాదు నువ్వు చెప్పలేనంత బాగుంటావు, ఇలా బురద అగటుకుని ఉన్నా మట్టిలో మాణిక్యంలా ఉన్నావు. నిజం."

    సంతోషంతో నవ్వొచ్చింది అనూహ్యకి.

    "ఎలా ఉన్నాసరే బాగున్నానని అనిపిస్తోందంటే దాని అర్ధమేమిటో తెలుసా?"

    "ఏమిటి?"

    "దృష్టి లోపం! అదెందుకు వస్తుందో తెలుసా?"

    "ఎందుకు వస్తుంది?"

    "ప్రేమరోగం ముదిరితే."

    "అలాగే ఉంది చూడబోతే."

    ఇద్దరూ నవ్వుకుని ఒకళ్ళ చుట్టూ ఒకళ్ళు చేతులు వేసుకుని నడవడం మొదలెట్టారు.

    ఒక చెట్టుమీద చిటారు కొమ్మమీద కూర్చున్న చిన్న పిట్ట ఒకటి వీళ్ళని పలకరిస్తున్నట్లు చిన్నగా కూయడం మొదలెట్టింది. తీక్షణంగా ప్రకాశిస్తున్న సూర్యుడికి అడ్డంగా ఒక మబ్బుతునక వచ్చి నీడను పరిచింది. దగ్గర లోని సెలయేటి మీద నుంచి వీస్తున్న పిల్ల తెమ్మరలు చల్లగా ఉన్నాయి తనలో తనే మృదుమధురంగా గీతాలాపన చేసుకుంటున్నట్లు చిరుసవ్వడితో గలగల ప్రవహిస్తోంది సెలయేరు.

    అనూహ్యా కాళ్ళు అక్కడ ఆగిపోయాయి.

    "నేను తక్షణం స్నానం చెయ్యాలి. లేకపోతే ఈ బురద ఇలా వంటి మీదే గడ్డకట్టేస్తుంది."

    "ఎవరోద్దన్నారు? చెయ్యి!"

    "కానీ నాకు ఇలా పరిగెత్తే నీళ్ళని చూస్తే భయం. అవి కదలిపోతుంటే కళ్ళు తిరిగి నేనూ కొట్టుకుపోతున్నాట్లు భ్రమ కలుగుతుంది."

    "నేను పట్టుకోనా?"

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra