Home » Dr c. ananda ramam » రేపటి మహిళ


    "నాతోపాటు మృదుల కూడా హాస్పిటల్ లోనే వుండాలి. నాకొక్కదానికి భయం" అంది నాంచారమ్మ.
    "నో! స్క్రీనింగ్ టెస్ట్ వరకూ కావాలంటే ఉండొచ్చు. ట్రీట్ మెంట్ సమయంలోగాని, ఆపరేషన్ థియేటర్ లోగాని మరెవ్వరూ ఉండడానికి వీల్లేదు మీకేలోటూ రాకుండా అన్నీ మేం చూసుకుంటాం" ఖచ్చితంగా చెప్పాడు ప్లెమింగ్. మృదుల, నాంచారమ్మా ఒకరి ముఖం మరొకరు చూసుకున్నారు.
    "సరే, ఒక్కదాన్నే ఉంటాను. కాని మృదుల ఒచ్చి నన్ను చూసిపోతూండొచ్చు కదా?"
    "మీరు మాట్లాడడానికి తగినస్థితిలో కొచ్చాక, అప్పుడు రావొచ్చు."
    "పోనీ స్క్రీనింగ్ టెస్ట్ వరకూ ఉండొచ్చన్నారు కదా!"
    "ఉండొచ్చు"
    "నేనిప్పుడే జాయినవుతాను."
    "సరే. లోపలికి రండి."
    లేచి తలుపుమీద చిన్నగా కొట్టాడు. లోపల్నించి వైట్ యూనిఫారంలో ఉన్న అసిస్టెంట్ తలుపు తెరిచాడు. మనసు లోపలి ఎగ్జయిమెంట్ అణచుకుంటూ నాంచారమ్మ చెయ్యి పట్టుకుని ప్లెమింగ్ వెంట లోపలి గదిలోకి నడిచింది మృదుల. దేవకి కూడా వాళ్ళవెంట వచ్చింది. ఏదో సీక్రెట్ లేబరటరీ చూస్తాననుకున్న మృదుల ఆశ నిరాశయింది. ఆ గదిలో లేబరటరీ చిహ్నాలేమీ లేవు. స్కీనింగ్ అక్విప్ మెంట్ మాత్రం ఉంది. ఒక బెడ్ వుంది.
    "మీరా బెడ్ మీద విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ రోజంతా ఏం తినాలంటే అది తినొచ్చు. కాలక్షేపానికి ముందు గదిలో టి.వి. ఉంది. రిలాక్స్."
    అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు ప్లెమింగ్. చాలా నిరుత్సాహపడింది మృదుల. దేవకి చటుక్కున మృదుల చెయ్యి పట్టుకుని లోగొంతుతో "ఎందుకొచ్చావు ఈ ఊబిలోకి? మళ్ళీ బయటపడగలవా?" అనేసి ఏదో పని ఉన్నట్లుగా ఖంగారుగా వెళ్ళిపోయింది.
    నాంచారమ్మ ఆయాసపడుతూ బెడ్ మీద పడుకుంది ఇద్దరూ కొంచెం సేపు అవీ, ఇవీ నెమ్మదిగా మాట్లాడుకున్నారు.
    "నువ్వెళ్ళు. రేపురా! నాకు భయం లేదులే" చెప్పింది నాంచారమ్మ. స్నేహంగా నాంచారమ్మ భుజం తట్టి ఇంటికి బయల్దేరింది. కాంపౌండులో ఫియట్ కారు ఆగివుంటే కుతూహలంగా చూసింది. డ్రైవింగ్ సీటులో రాజభూషణం. రెండు చేతులూ కట్టుకుని వినయంగా అతడితో ఏదో మాట్లాడుతున్నాడు ప్లెమింగ్. కళ్ళు చికిలించి మృదుల వైపు చూసాడు రాజభూషణం. అతడి పెదవులు వంకరగా నవ్వేయి.
                                                                                    *    *    *
    మహావీర్ కి ఫోన్ చేసి, "మీరు తీరుబడిగా ఉంటే మీ ఇంటికొస్తాను మీతో మాట్లాడాలి" అంది.
    "థాంక్యూ! మీకా శ్రమ దేనికి, ఇప్పుడే అయిదు నిమిషాల్లో నేనే ఒస్తున్నాను" పోన్ పెట్టేసాడు.
    భాగవతార్ ఇరిటేషను మృదులకి స్పష్టంగా అర్ధమౌతోంది. ఆ విషయం మరొకరికి చెప్పుకోడానికి లజ్జగా వుంది. భయపడటానికి ఆత్మాభిమానం గల వ్యక్తిత్వం ఒప్పుకోవడం లేదు. ఆ సమయంలో భాగవతార్ ఇంటిలో లేడు. అయినా అతనికి తెలియకుండా ఏదేనా చేసే ఉద్దేశం మృదులకి లేదు.
    పోనులో చెప్పినట్లుగా అయిదు నిమిషాల్లోనే మోటర్ సైకిల్ మీద వచ్చాడు మహావీర్. అతనిని కూర్చోమని కాఫీ ఆఫర్ చేసి, మింగియార్ చెప్పిన విశేషాలు నాంచారమ్మని ప్లెమింగ్ హాస్పిటల్ కి తీసుకువెళ్ళినప్పటి తన అనుభవాలు అన్నీ చెప్పింది.
    "ఈ వివరాలు మీకేమైనా ఉపయోగపడతాయో లేదో నాకు తెలియదు. అన్నట్లు నేను ప్లెమింగ్ హాస్పిటల్ నుంచి బయటికొస్తుంటే కాంపౌండ్ లో రాజభూషణంగారు తన కారులో కనిపించారు. ప్లెమింగ్ ఆయనతో ఏదో మాట్లాడుతున్నాడు."
    విజిల్ వేసాడు మహావీర్. అంతలో నాలిక్కరుచుకొని, "సారీ! చాలా ముఖ్యమైన విషయం చెప్పారు. ఆ సంతోషంలో ఈల వేసాను. ఏం అనుకోండి" అన్నాడు.
    "రాజభూషణం ప్లెమింగ్ తో కనపడడం అంత ముఖ్యమైన విషయమా?"
    "మీకు తెలియదు. ప్లెమింగ్ కి సంబంధించిన వివరాలు చాలా తెలుసుకోగలిగాడు. అమెరికాలో కూడా అతడిలాంటి ప్రయోగాలే చేస్తూ అరెస్ట్ అయ్యాడు. దేవకి డబ్బు విరజిమ్మి ఎలాగో వి.ఐ.పి.లతో కాంటాక్ట్స్ తెచ్చుకుని అతడ్ని విడిపించుకోగలిగింది. కాని అతడి డాక్టర్ డిగ్రీ కేన్సిల్ చేసేసారు. రీసెర్చి కొనసాగించడానికి పర్మిషన్ కూడా రద్దు చేసారు. అతడు అమెరికా నుంచి ఇండియాకి ఎలా రాగలిగాడో నా కర్ధం కాలేదు. ఇప్పుడు తెలిసిపోయింది. రాజభూషణం అండదండలుంటే సాధించలేనిదేముంది? చలపతీ అండ్ సన్స్ ఇంటర్ నేషనల్ ఫార్మక్యుటికల్స్ కి ప్రసిడెంటు శేషాచలపతి, కొడుకు భూషణం ఇక్కడ చక్కబెడుతూంటే తండ్రి విదేశాలు తిరిగొస్తూంటాడు. బహుశా ఎలాగో దేవకీ ప్లెమింగ్ లకి శేషాచలపతితో కాంటాక్టు ఏర్పడి వుంటుంది. అతడి సాయంతోనే ఈ దంపతులిద్దరూ లీగల్ గానో, ఇల్లీగల్ గానో ఇండియాకి చేరుకుంటారు. మనవాళ్ళకి "ఫారిన్" అనగానే చెలరేగే వ్యామోహం అందరికి తెలుసు. ప్లెమింగ్ అది ఎక్స్ ప్లాయిట్ చేసుకుంటూ, ఫారిన్ డాక్టర్ గా ఇక్కడ మళ్ళీ తన ప్రయోగాలు మొదలు పెట్టినట్టున్నాడు. ఆడ సంతానం ఒద్దనుకునే ఏనాటికీ మారని మనవాళ్ళ ధోరణి అతని ప్రయోగాలకి మంచి మెటీరియల్ గా తయారైంది. చలపతీ భూషణాల ప్రోత్సాహం, అండదండలూ కూడా ఉన్నాయి అతనికి."
    "ఇప్పుడేం చెయ్యగలం మనం? ప్లెమింగ్ నన్ను హాస్పిటల్లోకి రావడానికి వీల్లేదన్నాడే!"
    కొంతసేపు ఆలోచించాడు మహావీర్.
    "ఒక ఉపాయముంది, కొంత రిస్కు ఉందనుకోండి. మీరు సాహసిస్తానంటే నేనూ సహకరిస్తాను."
    "ఏమిటది? ఎంత రిస్కు ఉన్నా ఫరవాలేదు. ఈ అమానుష ప్రయోగాలు ఆపు చెయ్యవలసిందే"
    తన ప్లాన్ వివరంగా చెప్పాడు మహావీర్.
    "నేను చెప్పినట్లు చెయ్యగలరా?" అడిగాడు.
    "తప్పకుండా చెయ్యగలను. కాని మరో విషయం సమాజ శ్రేయస్సుకి అవసరమైనప్పుడు తప్ప మింగియార్ చెప్పిన రహస్యాలు బయటపెట్టనని అతనికి వాగ్దానం చేసాను. మీరు ఈ విషయాలన్నీ ప్రచురించాలనుకుంటున్నారా?"
    "గర్భస్థ పిండాలతో ప్రయోగాలు చేయడం కంటే సమాజానికి హాని కలిగించేదేముంటుంది? అయినా భయపడకండి. రుజువులు, సాక్ష్యాలు అన్నీ దొరికేవరకూ నేనేదీ ప్రచురించను. రాజభూషణంతో ఢీకొనడం మాటలుకాదు."
    "మీరు చెప్పినట్లు అంతా సిద్ధం చేసాకమీకు ఫోన్ చేస్తాను.
                              *    *    *
    ఢిల్లీలో పాటకచ్చేరి చేసి ప్రశంసలందుకుని ఆనందంగా ఫ్లయిట్ లో ఒచ్చాడు భాగవతార్. వచ్చేసరికి మృదుల ఇంట్లోలేదు. టీపాయ్ పైన ఫ్లవర్ వేజ్ కింద మృదుల రాసిన ఉత్తరం ఉంది.
    "డియర్ బి,
    నువ్వు వచ్చేసరికి ఇంట్లో లేకుండా వెళ్ళిపోతున్నాను. ఐయామ్ వెరీ వెరీ సారీ, ముఖ్యమైన పనిమీద వెళ్ళవలసివస్తోంది. తిరిగి వచ్చాక వడ్డీతో సహా నీ బాకీ తీర్చేస్తాను. ఏం? అనవసరంగా మనసు పాడుచేసుకుని ఆ వంకతో మందుకొట్టకు. నేను రేపటికే వచ్చేస్తాను. వివరాలన్నీ వచ్చాక.
                                                                                                                       నీ
                                                                                                                     యమ్."
    ఉత్తరం చదివి ఉసూరుమనిపోయాడు. తనకి కప్పిన కాశ్మీర్ శాలువా, బహుమతిగా వచ్చిన వెండి సరస్వతీ విగ్రహం, మృదులకి గర్వంగా చూపించాలని కలలుకంటూ వచ్చాడు. ఈ మృదుల ఎప్పుడూ ఇంతే. సంగీత కళాకారుడుగా తనకి ఉన్న అపాయిట్ మెంట్స్ కి మించిపోయి ఉంటాయి మృదుల అపాయింట్ మెంట్స్.
    ఉస్సూరుమంటూ తన పనులు కానిచ్చుకుని, ఏండెటో కి ఫోన్ చేశాడు.
    "ఏమిటి సార్! ఇవాళేగా వచ్చాం. అంతలోనే మళ్ళీ ప్రోగ్రామా?" విసుగ్గా- బద్దకంగా అన్నాడు ఏండెటో.
    "ప్రోగ్రాం ఏం లేదు. వెంటనే ఇక్కడి కొచ్చేయి. కొంతసేపు ప్రాక్టీసు చేసుకుందాం" అన్నాడు.
    "సారీ బాస్! నీ పాటకి మృదంగం వాయిస్తూ ప్రాక్టీసు చేయటం నాకు చాలా ఇష్టమేకాని ఇప్పుడు రాలేను బాస్. సంగీతం కంటె మరింత మధురమైన ప్రోగ్రాం దొరికింది. ఒదులుకోలేను సారీ!"
    "ఏమిటా మధురమైన ప్రోగ్రాం?"
    "మరీ అంత అమాయకంగా అడక్కండి సార్. నాబోటివాళ్ళకి_ప్రస్తుతానికి లోకంలో అన్నిటికన్నా మధురమైనది గాళ్ ఫ్రెండ్, ఈ మాత్రం ఊహించలేరా?"
    నిటారుగా అయ్యాడు భాగవతార్. రిసీవర్ పట్టుకున్న అతనిచెయ్యి వణికింది. మృదుల అర్జెంటుపని అంటూ వెళ్ళింది? ఏండెటో గాళ్ ఫ్రెండ్ అంటున్నాడు. ఏండెటో - మృదుల; మృదుల - ఏండెటో; ఎవరో సుత్తిపట్టుకుని మెదడుమీద ఎడా పెడా బాదుతున్నట్టుగా వుంది.
    "ఏమిటిసార్! మాట్లాడరు ఫోన్ పెట్టేయనా?" భాగవతార్ దగ్గిర్నుంచి సమాధానం రాకపోయేసరికి అట్నుంచి ఫోన్ డిస్కనెడ్ చేసేసాడు ఏండెటో.
    పి.ఏ. నక్షత్ర వచ్చాడు, భాగవతార్ ప్రోగ్రామ్స్ యిచ్చి హైదరాబాద్ వచ్చేసరికి అతడు సిద్ధంగా ఉంటాడు. పోస్టు - అపాయిట్ మెంట్స్- ఫోన్ కాల్స్ వగైరాలతో. రిసీవరు చేతిలో పట్టుకుని మతిపోయినవాడిలా కూర్చున్న భాగవతార్ ని చూసి ఖంగారుగా, "అదేమిటిసార్! అలా కూర్చుండిపోయారేం? ఏదేనా దుర్వార్త విన్నారా?" అన్నాడు. 

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra