ప్రొద్దున్నే సర్వోత్తమరావు చిరంజీవిని మళ్ళీ కల్సుకున్నాడు.
"ఇంకా ఇరవైనాలుగ్గంటలు" అన్నాడు చిరంజీవి.
"కాదు __పడి గంటలే. రాత్రి ఎనిమిదింతికల్లా అంతా అయిపోతుంది. ఈ సాయంత్రం నాలుగింటికి ప్రెసిడెంటు ని కాల్సుకుంతున్నాను. ఎందుకైనా మమచిదని గవర్నర్ దగ్గర అప్పాయింట్ మెంట్ తీసుకున్నాను. సాయంత్రం అయిదింటికి అది."
"పత్రికల వాళ్ళూ?"
"ఒక పత్రికకి చెప్పాను అదీగాక ప్రెసిడెంట్ వూళ్ళో వున్నాడు. అందుకని పత్రికలవాళ్ళు అక్కడే వుంటారు. ఈ ఫోటోలూ, అవీ చూపించి నేను గొదువచేస్తున్నా సమయానికి, పత్రికా విలేఖర్లందరూ దీన్ని నోట్ చేసుకుంటారు. రేపు ఈ వార్తా ఎలాగూ పెద్ద పెద్ద అక్షరాల్తో పేపరు కేక్కుతుంది. మనం వెంటనే దీనిమీద చర్చ ప్రారంభించాలి. ఈ లోపులో ఇంకోవైపు నుంచి సంతకాల సేకరణ ప్రారంభించాలి. ఈ హత్య కేసులో బాగా కదలిపోయిన ప్రజలు, ఉరి రద్దుకోసం వెంటనే సంతాకాలు పెడతారు. ఎప్పుడు ఎమ్మెల్యేలూ, ఏమ్ పీలూ, మనకు సాయం చేయటానికి ముందు కోస్తారు. దేసహం. మొత్తం కదలటంతో ప్రభుత్వానికి చట్టాన్ని మార్చక తప్పదు."
చిరంజీవి నవ్వేడు. "చాలా పెద్ద యుద్ధం చేయవలసి వచ్చేతట్లు వుంది."
"దేశాన్ని కదలించాలి ! అంటే ఆ మాత్రం పాటుపడక తప్పదు గలావిడ__ ముసలమ్మనీ తీసుకెళ్ళండి."
"ఈ ఫోటోలు కాక, వీలయితే మీతోపాటూ దారాసింగ్ నీ, ఆ ఇంటి గలావిడ __ముసలమ్మానీ తీసుకెళ్ళండి."
"......వాళ్ళెందుకు? ఈ ఫోటోల సాక్ష్యం కన్నా బలమైన ఇంకొకటి లేదు. అయినా ప్రెసిడెంట్ వారందర్నీ కలవాడు. వాళ్ళు చెప్పింది కోర్టులో అతడికి తెలుసు__ వాళ్ళ శాక్ష్యం నిలవదని.
"ఈ ఫోటోలు మనం తరువాత కల్పించామని వాళ్ళు అనుకుంటే_"
"ఎలా అనుకుంటారు? జైల్లో వున్న నిన్ను, నూతి దగ్గర నేను పోటోలు ఎలా తీయగాలను? అదదీగాక ఇంకొక విషయం__ ఈ ఫోటో రీలు కొన్న తేదీ రసీదు బద్రపరిచాను. మనం పోటోలు తీసిన రాజే మరో స్టూడియోలో ఎన్ లార్జ్ చేయించి, రసీదూ, స్టూడియో ఎన్ లార్జ్ చేసిన రాసీదూ__ వీటన్నితికన్నా ఎక్కువుగా __ నా సాక్ష్యం." ఆయనే నవ్వేడు.
అవుండి నిజం. ఫోటోలు __ ప్రసిద్ధి క్రిమినల్ లాయర్ సర్వోత్తమరావు సాక్ష్యం __ ఈ రెండూ వుంటే ఇంకొకటి అనవసరం. "ఈయనది మాస్టర్ బ్రెయిన్" అనుకొన్నాడు చిరంజీవి. ఎంతదూరం ఆలోచించి, ఫోటో స్టూడియో రసీదులు తీసుకున్నాడు!
"ఎందుకైనా మంచిది. నేగితివ్స్ కూడా మీతో తీసుకెళ్ళండి ప్రెసిడెంట్ దగ్గరికి" అన్నాడు చిరంజీవి.
"తీసుకు వెళ్లనని ఎందుకనుకున్నావ్? నెగిటివ్ లూ__ రాసీడులూ__అన్నీ తీసుకేళ్తాను. అన్నీ తీసుకెళ్ళి __అదికారుల్ని అన్నివైపుల్నుంఛీ ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి చేయాలి. సాయంత్రం అక్కడో మంచి డ్రామా జరుగుతుంది. ఒక్కసారిగా సంచాలనం రేగుతుంది. అయితే వెంటనే జైలునుంచీ బైటకి వాడిలెయ్యటానికి అనుమతి ఇవ్వరు. మేమంతా, అంటే విల్లెఖర్లు, స్నేహితులతో సహా ఇక్కడికే వస్తాం. పూలదండలు కూడా ఏర్పాటు చేసెను. నవ్వకు.... మనకి ఎంత పబ్లిసిటీ వుంటే మంచిది. విల్లెఖర్లకిజైలు నుంచే నువ్వు మొదటి ఇంటర్యూ ఇవ్వ వలసివుంటుంది. అలా ఇస్తేనే మంచిది కూడా."
"అవును."
"చెప్పు నేనింకా చెయ్యవలసింది గానీ__ మర్చిపోయింది గానీ ఏమైనా వుందా?"
"ఉంది."
"ఏమిటి?"
"ఆ సాయంత్రం అర్చనని మీతో తీసుకురావటం."
అది తట్ట నందుకు నాలిక్కరుచుకుని, అంతలోనే బిగ్గరుగా నవ్వేస్తూ, "అప్పుడూ అమ్మాయితో మేడలో దండ వేయించు కోవాలని కోర్కెగా వుందేమిటోయ్ " అన్నాడు.
13
రేడియో వార్తల ప్రాకారం బంగాళాకాతంలో ఏర్పడిన వాయుగుండంతీరాన్ని చేరి గంటయింది. గంటకి మతఇరవై కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తూమ్ది.
మూడున్నరయింది.
సర్వోత్తమరావు రాష్ట్రాపతి వున్న గెస్ట్ హౌస్ కి ఫోన్ చేసేడు. అయన ఖాళీగా వున్నారనీ, విలేకరులతో ఇష్టాగోష్టి సాగిస్తూన్నారనీ పి. యస్. చెప్పాడు. అది మరీ మంచిది, విలేక్ఖర్లు అక్కడే వుండటం.
అయన ఫోన్ పెట్టేసి__ తన గదిలోకి వెళ్ళేడు. సూట్ తొడుక్కున్నాడు. అడ్డంముందు నిలబడి తలదువ్వుకొన్నాడు. కర్చీఫ్ జేబులో పెట్టుకున్నాడు.
కొద్దిగా తననోప్పిగా వున్నట్టు అనిపించింది. దాన్ని అంతగా పట్టించుకోలేదు.
డ్రాయర్ తెరచి అందులోంచి నేగితివ్స్ తీసుకున్నాడు. పూర్వంతీసిన పోజితివ్స్ లో అన్నీ లేవు. డార్క్ రూమ్ లోకి వెళ్ళి దేవలప్పుడు పాజిటివ్ పేపరు మీదకి ఫోటోలు ప్రింట్ చేసేడు. అన్నీ ఫోటోలూ చక్కగా వచ్చినయ్. ముందు గదిలో హీటరు దగ్గర కొచ్చాడు.